తండ్రి ఈశ్వరా! నాశరీరంలో ఆత్మ అనే పక్షి ఎగురుతున్నంత వరకు నా యోగ క్షేమాలు అడిగెదరు అందరూ...నాపై అతి ప్రేమ మమకారం కురిపించేదరు,
అదంతా నాహృదయంలో ఉన్న ప్రాణం ఉన్నంతవరకే!
ఒక్కసారి ఉఛ్వాస, నిశ్వాస ఆగి పోయిన తర్వాత విగత జీవుడిగా ఉంటే కట్టుకున్న భార్య, పెంచి పోషించిన పిల్లలు కూడా దరి చేరరు. కనీసం శరీరం తాకను గూడ తాకరు!
శరీరం చాలించిన కొద్ది క్షణాలవరకే శోకము ప్రదర్శించేదరు.
పరమేశ్వరా! అందమైనది అని ఉహించుకునే ఈ శరీరం రోగముతో రోతతో భూయిష్టమగును.
శరీరంలో ప్రాణ వాయువు ఉన్నంత వరకే! ఆగిపోగానే పనికిమాలినది అయిపోవును కదా!
పంచభూతాలతో నిర్మించబడిన ఈ శరీరం తిరిగి మళ్లీ పంచభూతాలలోనే కలిసి పోవును, బంధు ప్రీతిని తగ్గించి, నీపై ప్రీతిని పెంచు!
ఏది శాశ్వతమో అది ప్రసాదించి నీ కడకు చేర్చుకో! హీనమైన శరీర బాంధవ్యాల కోసం మమతను తొలగించి, వస్తువులపై వ్యామోహం వదులుకొని నా మనస్సు పూర్తిగా దేవదేవా నీ యందే లగ్నం చేయునట్లును,
నిత్యం నీ స్మరణ, నీ ధ్యానం తప్ప ఇతరములు, నా దరి చేరనివ్వకు!
ఓ పరమేశ్వర ... నాకు మంచి సద్బుద్ధిని ప్రసాదించి, మంచి చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించు, నా లోపలి అరిషడ్వర్గాలు అరికట్టి నీ దరికి చేర్చుకో... నీ సన్నిధిని మించిన ఆనందం సుఖం మరొకటి లేదని నాకు నిత్యము తెలియచేసి ఈ చేయిపట్టి నడిపింపు సర్వేశ్వరా, జగదీశ్వరా!”.
No comments:
Post a Comment