Saturday, November 23, 2024

 🌸Ayyappa💞:
🎻🌹🙏శబరిమల ధ్వజస్థంభంపై గుర్రపు బొమ్మ రహస్యం ?

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿శబరిమల పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో యాత్రకి బృందాలుగా వెళ్ళటం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ అయ్యప్ప భక్తులు అలానే చేస్తున్నారు. పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసేవారు.

🌸ఇపుడైతే శబరిమల వెళ్లిరావటం నీళ్లు తాగినంత ఈజీ. కానీ ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయం భయంగా వెళ్లేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. 

🌿అప్పట్లో శబరిమల వెళ్ళటానికి ఎరుమేలిమార్గం అనే ఒక్క దారినే ఉపయోగించేవారట. ఈ దారి గుండానే పూజారులు, సిబ్బంది ఆలయానికి వెళ్లివచ్చేవారు. 

🌸పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసేవారు. వీరు ఎప్పుడువెళ్ళినా గుంపులు గుంపులుగా, బృందంగా వెళ్లేవారట. శబరిమల పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో యాత్రకి బృందాలుగా వెళ్ళటం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది.

🌿 ఇప్పటికీ అయ్యప్ప భక్తులు అలానే చేస్తున్నారు.
రెండువందల సంవత్సరాల క్రితం 70 మంది శబరిమల యాత్ర కు వెళ్లారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని రికార్డ్ లలో పేర్కొనబడింది. 

🌸1907 లో శబరిమల గర్భగుడి పైకప్పు ఎండుగడ్డితో, ఆకులతో కప్పబడివుండేది. అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహానికి పూజలు చేసేవారు. 1909 లో దేవాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

🌿1909-10 నా 
దేవాలయాన్ని మరలా  అదే సంవత్సరంలో పునఃనిర్మించారని తెలుస్తుంది. అప్పుడు శిలా విగ్రహానికి బదులు, పంచలోహాలతో తయారుచేసిన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు.

🌸అప్పటి నుండి పంచలోహ విగ్రహానికె పూజలు చేస్తుండటం గమనార్హం. 1935 తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగటంతో మకరజ్యోతి దర్శనానికే కాకూండా మండల పూజ కొరకు కూడా భక్తులను లోనికి ఆహ్వానించారు.

🌹వడిపెరియారు మార్గం🌹

🌿చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడటంతో శబరిమల యాత్రకు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది.

🌹ఆలయ ద్వారాలు🌹

🌸కేవలం మకరజ్యోతి సమయంలోనే కాక విషు, పంకుని ఉత్తారం, ఓనం వంటి పండుగల సమయాలలో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉంచేటట్లు 1945 వ సంవత్సరంలో ఆలయ బోర్డు తీర్మానించింది.

🌿పండితుల మంత్రోచ్చారణ ల మధ్య
1950 వరకు పరుశురామ నిర్మితమైన దేవాలయం మూడు సార్లు అగ్నికి ఆహుతైంది. మరలా 1951 లో పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు నుండి తెప్పించి వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య ప్రతిష్టించారు.

🌹భూతళీకేళీ విగ్రహం🌹

🌸అప్పటి వరకు కేరళీ కేళీవిగ్రహంగా కిర్తించబడ్డ అయ్యప్ప స్వామి భారతీకాళీ విగ్రహంగా, నేడు భూతళీకేళీ విగ్రహం గా కీర్తించబడుతున్నది

🌹స్వర్ణ దేవాలయం🌹

🌿బెంగళూరు భక్తుడొకాయన గర్భగుడి పైన, దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయటానికి పూనుకోవడటంతో 2000 వ సంవత్సరంలో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారిపోయింది.

🌸1984 కు పూర్వం పదునెట్టాంబడి ఎక్కటానికి భక్తులు పరుశురామ నిర్మితమైన రాతిమెట్లనే వాడేవారు. మెట్లను ఎక్కేటప్పుడు ప్రతి మెట్లుపై కొబ్బరికాయను కొట్టేవారు.

🌿దాంతో భక్తులు మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడేవారు. ఇది దృష్టిలో పెట్టుకొని బోర్డు వారు 1985 లో పదునెట్టాంబడికి పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పేశారు.

🌹మకరసంక్రాంతి🌹

🌸స్వామి వారి ఆభరణాలను పందళం లో భద్రపరిచి ఉంచుతారు. అక్కడి నుండి ప్రతి ఏటా మకరసంక్రాంతి తారీఖున మూడు పెట్టలలో భద్రపరిచిన ఆ ఆభరణాలను 11 మంది మూడురోజుల పాటు మోసుకుంటూ వచ్చి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమల చేరవేస్తారు

🌹పొన్నంబలమేడు🌹

🌿తెచ్చిన ఆభరణాలను స్వామి వారికి అలంకరించి, కర్పూరహారతి గుళ్లో ఇవ్వగానే తూర్పుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు మకరజ్యోతి దర్శనం కానవస్తుంది.

🌸ఆభరణాల వెంట పందళం రాజ వంశస్థులలో ఒకరు(పెద్దవాడు) కత్తి పట్టుకుంటూ నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరిగి జనవరి 20 వ తేదీన ఆభరణాలను వెంట పందళం వరకు వెళ్లి వాటిని చేరవేరుస్తాడు.

🌹శబరిమల ధ్వజస్థంభంపై గుర్రపు బొమ్మ రహస్యం ?🌹

🌹స్వామి తురగ వాహన ప్రియుడు🌹

🌿స్వామివారు తురగ వాహన ప్రియుడు. దీనిని వాజి వాహనము అని కూడా అంటారు

🌸శ్రీ అయ్యప్పస్వామి వారు రాత్రిపూటల ఈ హయామునెక్కి పరిసరప్రాంతమంతయూ తిరిగి ద్రుష్ట గ్రహములు ఆయా గ్రామములందు ప్రవేశించకుండా కాపలాకాస్తారట.

🌿అయ్యప్ప స్వామివారు తెల్లని అశ్వమెక్కి వనప్రాంతమంతయూ తిరుగుతూ నడిచివచ్చే తన భక్తులకు వన్యమృగములచే, దుష్టగ్రహములచే ఎట్టి ఆపదలూ కలగనీయక అదృశ్యరూపుడై వారిని శబరికి చేరుస్తాడట.

🌸దీనినే హరివారాసనం పాటలో తురగవాసనం స్వామీ సుందరాసనం అని వర్ణించియున్నారు.

🌹ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే..🌹

🌿 అయ్య‌ప్ప‌స్వామి వాహ‌నం ఏంటి..? అని అడ‌గ‌గానే ట‌క్కున పెద్ద పులి అని చెప్పేస్తారు. కానీ, అయ్య‌ప్ప‌స్వామి వాహ‌నం పులి కాదు. అవును! మీరు విన్న‌ది నిజ‌మే. అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద ‘వాజి’ వాహనం అంటే ‘గుర్రం’ వాహనం ఉంటుంది.🌸ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనం గుర్రం. అంతేకాని పులి కాదు.

పులి పాలు తేవాలన్న తల్లి కోరిక మేరకు అడవుల్లోకి అయ్యప్ప వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు పులి రూపంలో వస్తారు. పులి మీద ఆయన ఎక్కి పందళ రాజ్యం చేరుకుంటారు. కేవలం ఆ సందర్భంలోనే అయ్యప్ప స్వామి పులిని వాహనంగా చేసుకున్నాడు... స్వస్తి...🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments:

Post a Comment