Youtube video link - https://youtu.be/GlvO2OACKFo
It is part 2, part 1 is available in previous post :
https://vamshikrishnag.blogspot.com/2024/11/most-controversial-topic-in-telugu.html?m=0
Transcript:
పునర్జన్మని నమ్మని వారు ఉంటే ఆ కుర్రవాడిని ప్రశ్నించి పరిశీలించి విషయం తెలుసుకోవచ్చు చనిపోయిన కల్పనా చార్ల గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటాను కొలంబోలో సెరూనా వీరసింహే అనే పిల్లవాడు పుట్టాడు తన పేరు కల్పనా చార్లా అని తను వ్యోమగామినని అంతరిక్షాన్ని గురించి చెప్పడమే కాకుండా సింహల భాష తప్ప వేరే భాషే తెలియని ఆ కుర్రవాడు ఇంగ్లీష్ హిందీ భాషలో అలోకగా మాట్లాడు గురుప్రసాద్ రైదాస్ అనే ఆయనకు నరేష్ కుమార్ రైదాస్ జన్మించాడు ఆ పిల్లవాడు తరచుగా కాకోరి కాకోరి అంటూ అరిచేవాడు ప్రతి గురువారం ఒక ఫకీరు నరేష్ ఇంటికి భిక్షకు వచ్చేవాడు యాదృచ్చికంగా ఈ ఫకీరు కూడా కాకోరికి సంబంధించిన వాడు కావడం విశేషం ఒకరోజు నరేష్ ఈ ఫకీర్ చూడగానే నన్ను గుర్తుపట్టలేదా అని అడిగాడు ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మన మదన్ గుప్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు కూడా మన మదన్ గుప్త ఛానల్ ను పరిచయం చేయండి నమస్తే సదా వత్సలే మాతృభూమి నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త పునర్జన్మ పైన పరిశోధనలు చేసిన కొందరు పాశ్చాత్య సైంటిస్టుల గురించి కూడా తెలుసుకున్నాం కొన్ని రికార్డు అయిన పునర్జన్మ కేసుల గురించి కూడా తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్ లో ఒక ముస్లిం బ్రాహ్మణ బాలకుడుగా జన్మించినటువంటి సంఘటన తెలుసుకుందాం ముస్లింలు క్రిస్టియన్లు నమ్మనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు కొన్ని విశ్వ సిద్ధాంతాలు నియమాలు అలానే ఉంటాయి అవి మీ నమ్మకాలకు మీ అపనమ్మకాలకు అతీతంగా ఉంటాయి అనేది వాస్తవం అలాంటి సిద్ధాంతాలే మన సనాతన ధర్మంలోని కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం ఈ సిద్ధాంతాల వల్ల ఉన్న ఉపయోగం ఏమిటంటే నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది నువ్వు చెడు చేస్తే నీకు చెడే ఎదురవుతుంది విత్తనం ఒకటి నాటి చెట్టు మరొకటి వస్తుందా బంతిని గోడకు కొడితే అది తిరిగి నీ దగ్గరికే వస్తుంది కాబట్టి జీవితాన్ని మంచిగా జీవించమని చెప్పే సిద్ధాంతం కర్మ సిద్ధాంతం నీవు మంచి చేస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ మోక్ష సాధనకు కృషి చేయాలి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉంటారు నీవు చేసిన కర్మ నిన్ను ఉన్నత జన్మకో లేక నీచాతి నీచమైన జన్మకో బాటలు వేస్తుంది కార్యకారణ సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుంది నువ్వు సత్కర్మలు చేస్తే మంచి జన్మలలో జన్మిస్తావ్ మోక్ష పదంలో ముందుకు సాగుతావు దుష్కర్మలు చేస్తే నీచమైన జన్మలలోకి వెళ్లి పతనం అవుతావు ఇది సనాతన ధర్మం చెప్పే సిద్ధాంతం ఇక పునర్జన్మ ఉన్నది అనే విషయం అర్థం చేసుకుంటే ప్రకృతితో కలిసి జీవించే మనస్తత్వం అలవడుతుంది దేనికి భయపడని మనస్తత్వం అలవడుతుంది వేదాలు ఉపనిషత్తులు చెప్పే అద్భుత సిద్ధాంతం ఒక్కటే నిర్భయంగా ఉండు నీవు చేసే ధర్మ కార్యాల ఫలితాన్ని మరో జన్మలో అనుభవిస్తావు ఈ శరీరం నీవు ధరించే వస్త్రం లాంటిది వస్త్రం చిరిగితే ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తావో జీర్ణమైన ఈ శరీరాన్ని వదలి నీవు కూడా నీవు చేసిన కర్మల ఫలితాలను అనుభవించడానికి 64 లక్షల జీవరాశులలో ఏదో ఒక జీవిగా పుడతావు మానవ జన్మ ఎత్తాలి అంటే ఖచ్చితంగా నువ్వు సత్కర్మలు ఆచరించి తీరవలసిందే కాబట్టి మానవ జన్మ ఎత్తినందుకు సత్కర్మలు చేస్తూ మోక్ష మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే మోక్ష మార్గం సుగమం అవుతూ ఉంటుంది సరే ఇప్పుడు ఒక ముస్లిం బ్రాహ్మణ బాలకుడిగా జన్మించిన సంఘటనను చూద్దాం ఈ కేసు జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ అనే సైంటిఫిక్ జర్నల్ వాల్యూమ్ నెంబర్ 14 నెంబర్ టు 1990 1990 వర్జినియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఆంటోనియో మిల్ చేత వ్రాయబడింది ఫకీర్ అలీ షా పెద్ద కుమారుడు ముషీర్ అలీషా ఫకీర్ అలీ షా రెండవ భార్య నజీమా ద్వారా జన్మించాడు వీరు లక్నోకు దగ్గరలోని కాకోరిలో నివసించే వాళ్ళు ముషీరు గుర్రంపు బండి తోలేవాడు కాకోరి నుండి లక్నో వరకు పండ్లు తన గుర్రపు బండిలో తీసుకువెళ్లేవాడు 306 1980 న అతని బండిని ఒక ట్రాక్టర్ వచ్చి గుద్దింది ఈ యాక్సిడెంట్ లో ముషీర్ అక్కడికక్కడే మరణించాడు 1981 ఏప్రిల్ లో లక్నో కు దగ్గరగా ఉన్న బజ్జి నగర్ లో గురుప్రసాద్ రైదాస్ అనే ఆయనకు నరేష్ కుమార్ రైదాస్ జన్మించాడు నరేష్ రెండేళ్ల వయసులో మోకాళ్ళ మీద కూర్చొని నమాజ్ చేసే విధానంలో చాప పైన వంగేవాడు ఎవరైనా చూడగానే చటుక్కుని పైకి లేచేవాడు ఆ పిల్లవాడు తరచుగా కాకోరి కాకోరి అంటూ అరిచేవాడు ప్రతి గురువారం ఒక ఫకీరు నరేష్ ఇంటికి భిక్షకు వచ్చేవాడు నరేష్ ఫకీర్ అలీని అబ్బా అని పిలిచేవాడు మామూలుగా ఫకీర్లను బాబా అని పిలుస్తారు ముస్లిం ట్రెడిషన్ లో తండ్రిని ఉర్దూలో అబ్బా అని పిలుస్తారని మనందరికీ తెలుసు నరేష్ తండ్రి గురుప్రసాద్ అనేకసార్లు ఫకీర్ ను బాబా అని పిలవాలి అబ్బా అని కాదు అని చాలాసార్లు చెప్పాడు యాదృచ్చికంగా ఈ ఫకీరు కూడా కాకోరికి సంబంధించిన వాడు కావడం విశేషం ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నరేష్ తన పూర్వజన్మ గురించి వివరాలు చెప్పడం మొదలు పెట్టాడు తాను కాకూరికి చెందిన ఒక ముస్లిం అని ఒకరోజు నరేష్ ఈ ఫకీర్ చూడగానే నన్ను గుర్తుపట్టలేదా అని అడిగాడు మా ఇంట్లో ఐదు వేప చెట్లు ఉండేవి నన్ను ఒక ట్రాక్టర్ గుద్దింది నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళమని ఫకీర్ ని కోరాడు కానీ ఫకీర్ అంగీకరించలేదు ఈ సంఘటన తర్వాత ఫకీర్ చాలా ఇబ్బందికి గురైనాడు ముస్లిం ట్రెడిషన్ లో పునర్జన్మ అనేది లేదు ఇంటికి వెళ్ళిన ఫకీర్ అల్లా ఏమిటి విచిత్రం అని ప్రార్థించాడు నరేష్ తన తల్లిని కాకోరికి తీసుకువెళ్ళమని బలవంతం చేశాడు తన తల్లికి కాకోరికి వెళ్ళే మార్గం నరేషే చూపించాడు ఆమె ఎప్పుడూ ఆ దారిలో ప్రయాణించి ఉండలేదు ఆమెకు ఆ దారి కూడా తెలియదు కాకోరి చేరగానే నరేష్ ఫకీర్ ను చూపించి ఇతను నా తండ్రి అని నజీమాను చూపించి ఈమె నా తల్లి అని చెప్పాడు నరేష్ ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచాడు అతని తమ్ముళ్ళు చెల్లెళ్లు అందరిని వాళ్ళ పేర్లతో పిలవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది నీకు ఎంతమంది సోదరులు ఎంతమంది చెల్లెళ్లు అని అడిగిన ప్రశ్నకు తనకు ఐదుగురు తమ్ముళ్ళు ఆరుగురు చెల్లెళ్లు అని సమాధానం ఇచ్చాడు నజీమా తన ఆరు సంవత్సరాల కూతుర్ని చూపించి ఈమె ఎవరో అని అడిగింది నరేష్ ఆ ఆరు సంవత్సరాల సబీహాను గుర్తుపట్టలేకపోయాడు సబీహా ముషీరా అలీ చనిపోయిన మూడు నెలల తరువాత పుట్టింది నేను చనిపోయే నాటికి నువ్వు ఆరు నెలల గర్భంతో ఉన్నావు అని నరేష్ సమాధానం చెప్పాడు అక్కడ ఉన్న ఐదు ట్రంక్ పెట్టెలలో నరేష్ తన పూర్వజన్మలోని తన ట్రంక్ పెట్టెను గుర్తించాడు అంతేకాకుండా ఆ ట్రంకు పెట్టెలో ఏమేమి వస్తువులు ఉన్నాయో ఖచ్చితంగా చెప్పాడు నరేష్ కాకోరిలోని అనేకమందిని పేరుతో సహా గుర్తించాడు నరేష్ ఒకాయన భార్య ఆమె పేరు జహీదా ఆమె దగ్గరకు వెళ్లి నేను నీ దగ్గర దాచుకున్న 300 తిరిగి ఇచ్చావా అని అడిగాడు జహీదా ముషీరాలి తన దగ్గర 300 దాచుకున్న విషయం నిజమే అని నిర్ధారించింది నరేష్ తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళని అడిగాడు నాకు టీ గుడ్లు ఇవ్వరా అని అడిగాడు ముషీర్ కు టీ గుడ్లు అంటే చాలా ఇష్టం అని ప్రతిరోజు ముషీర్ ఉడికిన గుడ్లు తిని టీ తాగేవాడని వాళ్ళు చెప్పారు ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి నరేష్ ఇంటి వారు పూర్తిగా శాఖహారులు గుడ్లు తినే అవకాశమే లేదు అటువంటిది ఆ ఇంట్లో పుట్టిన నరేష్ గుడ్లు ఇవి అడగడం అనేది పూర్వజన్మ వాసనే కొంతమంది అనొచ్చు హిందువుల్లోని పునర్జన్మ సిద్ధాంతాన్ని నిరూపించడం కోసం ఈ అబద్ధం ప్రచారం చేస్తున్నారు అని ఇది నేను చెప్పింది కాదు ముందే చెప్పాను వర్జినియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఆంటోనియో మిల్స్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ అనే సైంటిఫిక్ జర్నల్ లో రాసిన తన రీసెర్చ్ కి సంబంధించిన వ్యాసం కాబట్టి దీనికి కాషా రంగు పొలంకండి ఓకే ఎప్పుడో ఎక్కడో ఏవో జరిగాయి ఏవో పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలు రాసిన వాడు మాత్రం కరెక్ట్ అనేటటువంటి నమ్మకం ఏంటి మనకు తెలిసేది ఎలా మనం నమ్మేది ఎలా ఇప్పుడు మీకు మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి జరుగుతున్నటువంటి ఒక సంఘటనను గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను చనిపోయిన కల్పనా చావ్లా గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటాను మన దేశం చెందిన అమ్మాయి ఆస్ట్రోనాట్ హర్యానాలో చిన్న గ్రామంలో పేరు కర్ణాల గ్రామం పేరు 1962 మార్చ్ 17న పుట్టింది 2003 లో నాసావారి ఏటిఎస్ 107 అనే వ్యోమ నౌకలో అంతరిక్ష ప్రయాణం చేసి తిరిగి వస్తుండగా ఆ నౌక ఒక ఎడారి ప్రాంతంలో క్రాష్ అయింది కల్పనా చావ్లా తో పాటు మరో ఆరు మంది వ్యోమగాములు మరణించారు కొలంబోలో ఒక సాధారణ కుటుంబంలో సెరూనా వీరసింహే అనే పిల్లవాడు పుట్టాడు అతను ఇప్పుడు ఏడు సంవత్సరాల వయసు ఈ వయసులో ఆ కుర్రాడు తన పేరు కల్పనా చాల అని తను వ్యోమగామినని అంతరిక్షాన్ని గురించి చెప్పడమే కాకుండా సింహల భాష తప్ప వేరే భాషే తెలియని ఆ కుర్రవాడు ఇంగ్లీష్ హిందీ భాషలో అలవోకగా మాట్లాడుతాడు అనేకమంది అతన్ని పరిశీలించి అతను చెబుతున్నది నిజమే అని నిర్ధారించారు పునర్జన్మని నమ్మని వారు ఉంటే మీరు కూడా వెళ్లి ఇప్పుడు ఆ కుర్రవాడిని ప్రశ్నించి పరిశీలించి విషయం తెలుసుకోవచ్చు అసలు కొందరు పిల్లల్ని మీరు గమనిస్తూనే ఉంటారు వాళ్ళ కుటుంబంలో ప్రస్తుతం వాళ్ళ కుటుంబంలో ఎవరికీ లేని ప్రత్యేక లక్షణం లక్షణాలు ఆ పిల్లలకు ఉంటాయి ఆ పిల్లలకు ఆ ప్రత్యేక లక్షణాలు ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నారు దానికి ఏమైనా ఒక రీసన్ ఉందా చాలా చిన్న వయసులోనే అసాధారణమైనటువంటి ప్రజ్ఞను ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళు సరే అలాంటి పిల్లవాడిని ఒకడిని నాకు తెలిసినటువంటి పిల్లవాడిని ఒకడి గురించి మీకు చెప్తాను 1969 ఫిబ్రవరి 28న పుట్టాడు ఉప్పలపు శ్రీనివాస్ ఆ కుర్రవాడు తన ఏడవ ఏట సంగీతకి చేశాడు త్యాగరాజ కృతులు మాండలిన్ పై వాయించాడు మహా మొహులు ఉద్దండులైనటువంటి సంగీత విద్వాంసుల చేత ప్రశంసలు అందుకున్నాడు ఏడేళ్ల వయసు మామూలుగా సంగీత సాధన చేసే వాళ్ళని అడిగితే ఏడేళ్ల వయసులో సరిగమ నేర్చుకోవడం కూడా కష్టమే అటువంటి వయసులో సంగీత కచేరి అందులో మన భారతీయ భాజ్యం కాదు అది మ్యాండలిన్ మ్యాండలిన్ మీద త్యాగరాజ కృతులు వినిపించి పెద్దలను మెప్పించాడు అని అంటే ఆ కుర్రవాడి అసాధారణ ప్రజ్ఞ ఆ ఏడేళ్ల వయసులో ఆ కుర్రాడికి ఎలా వచ్చింది అతన్ని మాండలిన్ శ్రీనివాస్ అని పిలిచేవాళ్ళు మాండలిన్ శ్రీనివాస్ గా అతను ప్రసిద్ధి చెందాడు సరే ఇంకొక చిన్న సంఘటన కూడా చూద్దాం ఈయన మనందరికీ తెలిసినటువంటి వాడు సుపరిచితుడు ఉదయాన్నే కొంచెం సంగీతం అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఉదయాన్నే ఈయన సంగీతాన్ని వింటూ ఉంటారు ఆయన పేరు మంగళంపల్లి బాలమురళి కృష్ణ ఆయన చాలాసార్లు చాలా సభల్లో చెప్పాడు తన 10 సంవత్సరాల వయసులోనే సంగీత కచేరీలు చేసేవాడిని అని సరే ఆయన సంగతి కూడా అటు పక్కన పెడితే హ్యూమన్ కంప్యూటర్ గా అతి చిన్న వయసులోనే అతి పెద్ద మ్యాథమెటిక్స్ థియరంస్ ని సాల్వ్ చేసిన వారు చేస్తున్న వారు ఉన్నారు అంత చిన్న వయసులో వాళ్ళకి అంత ప్రజ్ఞ ఎలా వచ్చింది సంవత్సరాల తరబడి సాధన చేసిన సాధించలేనటువంటి విషయాలను అంత చిన్న వయసులో ఎలా సాధించగలిగారు అనే విషయం మనం ఒక్కసారి ఆలోచిస్తే వారి పూర్వజన్మ వాసనలు అవి అని అర్థం ఉంటాయి అదొక్కటే సమాధానం మనం చెప్పుకోగలం ఈనాటికి ఈ రోజుకి అటువంటి ప్రతిభ ఉన్న పిల్లలను మనం చూస్తూనే ఉంటాం వాళ్లకు పూర్వజన్మ స్పృహ లేకపోవచ్చు కానీ ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి జ్ఞానం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఇప్పటివరకు మీతో పంచుకున్న సంఘటనలన్నీ భారతీయులు వ్రాసినవి కావు అన్ని పాశ్చాత్యులు రీసెర్చ్ చేసి వ్రాసినవే ఇంకా పునర్జన్మ సిద్ధాంతం తప్పు అని మీకు అనిపిస్తే ఇక మీ కర్మ మిమ్మల్ని దేవుడు కూడా ఒప్పించలేడు కాబట్టి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మన మదన్ గుప్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు కూడా మన మదన్ గుప్త ఛానల్ ను పరిచయం చేయండి మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవ మరి జై హింద్ జై మా భారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్త [సంగీతం]
No comments:
Post a Comment