Vedantha panchadasi:
చిత్సన్నిధౌ ప్రవృత్తాయాః ప్రకృతేర్హి నియామకమ్ ౹
ఈశ్వరం బ్రువతే యోగః స జీవేభ్యః పరః శ్రుతః ౹౹102౹౹
102. యోగులు ఈశ్వరుని గూర్చి చెప్పుదురు.చిత్సాన్నిధ్యమున ప్రవర్తించు ప్రకృతిని నియమించునది ఈశ్వరుడే. ఈశ్వరుడు జీవులకంటే శ్రేష్ఠుడు.
వ్యాఖ్య: ఆత్మను గూర్చిన భేదాభిప్రాయములను వివరించి ఈశ్వరుని గూర్చిన అభిప్రాయములను వివరించుచున్నారు.
విభువు అంటే వ్యాపకమయిన చైతన్యము.
దానినాశ్రయించి దానినే కప్పినది మాయ.అది సదసద్విలక్షణమయిన
అద్భుత శక్తి రూపమయిన అజ్ఞానము.మాయా యుక్త చైతన్యం ఈశ్వరుడు.ఈయన జగద్ధేతువు.కనుక జగత్కర్త ఈశ్వరుడు.
జడపదార్ధము కర్త లేకుండా పుట్టదు.కర్తకు తాను చేయదలచిన కార్యమునకేది ఉపాదానమో తిలిసి యుండును.కుమ్మరికి మట్టి తెలియును గదా!కనుక అతడు ఘట సర్వజ్ఞుడు.
అలాగే ఈశ్వరుడు విశ్వసర్వజ్ఞుడు.ఆయనకు ప్రపంచోపాదానమయిన మాయ తెలుసు.ఆయన సర్వ శక్తిమంతుడు.ఆయన సర్వజ్ఞుడు.
అందుకు మాయ కారణము. అందుకు సాక్షమీ అద్భుత విచిత్ర విశ్వమే.ఆయన స్వతంత్రుడు.సర్వశక్తిమంతుడు.
కనుక ఆయన పరాధీనుడుకాడు.
ఇందుకు భిన్నంగా జీవుడు. అల్పశక్తిమంతుడు,
అల్పజ్ఞుడు,
పరతంత్రుడు,
అల్ప కార్యకర్త ఇందుకు కారణం అవిద్య.అందువలననే అతడు జీవుడని విలక్షణ నామం సంపాదించాడు.కనుక జగత్కర్త ఈశ్వరుడే.
జీవుడు కాదు.
క్షరమనగా నశించునది.ప్రధానమే క్షరము,మాయ.
హరుడనగా అవిద్యను హరించువాడు గావున పరమేశ్వరుడు.
వ్యక్తా వ్యక్తములను,
క్షరము అక్షరముగా చెప్పెదరు. ఈశ్వర భిన్నుడగు జీవుడు భోక్తృభావము వలన బద్ధుడగుచున్నాడు.పరమేశ్వరుని తెలుసికొని ముక్తుడగుచున్నాడు.
ఈ నిర్వి శేషమగు బ్రహ్మము శ్రేష్ఠమని చెప్పబడినది.బ్రహ్మము అక్షరము గూడ అయియున్నది.ఈ దేహమునందు(ప్రపంచమునందు)బ్రహ్మమును బ్రహ్మవేత్తలు అంతర్యామిగా తెలిసికొనుచున్నారు.
జ్ఞుడనగా సర్వమును తెలిసిన ఈశ్వరుడు.అజ్ఞుడనగా అల్పజ్ఞుడగు జీవుడు.ఈ జీవేశ్వరు లిద్దరును అజులు.జన్మాది వికారములు లేనివారలే.బ్రహ్మమే మాయవలన జీవేశ్వర రూపములతో గోచరించుచున్నది.
పరబ్రహ్మమునందు లీనమై,
ఆ బ్రహ్మమునందే సమాధిగలవారు జననమరణ రూప సంసారము నుండి విముక్తులగుచున్నారు.
క్షరమనగా నశించునది.ప్రధానమే క్షరము,మాయ.
హరుడనగా అవిద్యను హరించువాడు గావున పర మేశ.
వ్యక్తా వ్యక్తములను,
క్షరము అక్షరముగా చెప్పెదరు. ఈశ్వర భిన్నుడగు జీవుడు భోక్తృభావము వలన బద్ధుడగుచున్నాడు.పరమేశ్వరుని తెలుసికొని ముక్తుడగుచ.ున్నాడు.
ఈ నిర్వి శేషమగు బ్రహ్మము శ్రేష్ఠమని చెప్పబడినది.బ్రహ్మము అక్షరము గూడ అయియున్నది.ఈ దేహమునందు(ప్రపంచమునందు)బ్రహ్మమును బ్రహ్మవేత్తలు అంతర్యామిగా తెలిసికొనుచున్నారు.
జ్ఞుడనగా సర్వమును తెలిసిన ఈశ్వరుడు.అజ్ఞుడనగా అల్పజ్ఞుడగు జీవుడు.ఈ జీవేశ్వరు లిద్దరును అజులు.జన్మాది వికారములు లేనివారలే.బ్రహ్మమే మాయవలన జీవేశ్వర రూపములతో గోచరించుచున్నది.
పరబ్రహ్మమునందు లీనమై,
ఆ బ్రహ్మమునందే సమాధిగలవారు జననమరణ సంసారము నుండి విముక్తులగుచున్నారు.
No comments:
Post a Comment