Vedantha panchadasi:
తథాపి పుంవిశేషత్వాద్ఘటతేఽ స్య నియంతృతా ౹
అవ్యవస్థౌ బంధమోక్షావాపతేతామిహాన్యథా ౹౹106౹౹
106. విశిష్టపురుషుడగుటచే ఈశ్వరుని నియంతృత్వము సంభవమగును.అట్టి నియామకుడు లేనిచో ఎవరు బంధమున ఉండవలెనో ఎవరు మోక్షమును పొందవలెనో ఎట్లో అనే వ్యవస్థ సిద్ధింపదు గదా!
శ్వే. ఉప.6..16-17.
ఈ అనంత విశ్వసృష్టికి, కొందరు పండితులు స్వభావము కారణమని చెప్పుచున్నారు. కొందరు అజ్ఞానులు కాలము కారణమని చెప్పుచున్నారు.
ఈ బ్రహ్మచక్రము ఎవని వలన భ్రమింపజేయ బడుచున్నదో ఆ మహిమగలవాడు ఆత్మదేవుడొక్కడే.
ఏ పరమేశ్వరుని చేత ఈ విశ్వమంతయు నియమముగా వ్యాప్తమయి యున్నదో ఆ పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడు, కాలమునకు గూడ కర్త; దోషరహితుడు, మంగళస్వరూపుడు,
మరియు సర్వజ్ఞుడు.ఆ పరమేశ్వరుని వలన శుభాశుభ కర్మలు ప్రేరితములై జగద్రూపముగా వివర్తమును పొందుచున్నది.
కాలముతోను,సూక్ష్మములగు అంతఃకరణములతోను,
త్రిగుణ సహితమగు సకల వస్తువులతోను సృజించెను.ఈ సృజించిన సకల భావనలను ఎవడు పరమేశ్వరునికే తిరిగి సమర్పించునో అతను కర్మరహితుడగుచున్నాడు.
అట్టి కర్మ క్షయము గలవాడు, పంచభూత తత్త్వములకంటే పరుడగు పరమాత్మను పొందుచున్నాడు.
జీవుడు అనుభవ సంస్కారములతో,స్థూలములును,సూక్ష్మములును అయిన అనేక రూపములను ఆవరించుచున్నాడు.స్థూల సూక్ష్మ రూపము యొక్క క్రియాగుణములచేతను,స్వరూపగుణములచేతను చూడబడుటయేగాక,దేహాంతర సంయోగమునకు కారణుడుగా గూడ చూడబడుచున్నాడు.
ఈ జీవుడు,
ఆద్యంతరహితుడును, మాయామయ సంసార సాగరమునకు సృష్టికర్తయును,వివిధ రూపములతో కనిపించువాడును సర్వవ్యాపియైయుండు వాడునునగు పరమాత్మను తెలుసుకొని విముక్తుడగు చున్నాడు.ఆత్మని
"అహమస్మి"అని తెలిసికొనినవారు దేహాభిమానమును వదలి ముక్తులగుచున్నారు.
No comments:
Post a Comment