Thursday, November 7, 2024

 Vedantha panchadasi:
తత్తేదంతే అపి స్వత్వమివ త్వమహమాదిషు ౹
సర్వత్రానుగతే తేన తయోరప్యాత్మతేతి చేత్ ౹౹47౹౹

47.(ఆక్షేపము)స్వత్వశబ్దము వలె ఇది,అది అనే శబ్దములు కూడా నీవు,నేను,అతడు అనే మూడు పురుషుల యందూ అన్వయించుటచే అవి కూడా ఆత్మార్థకములగును కదా.

తే ఆత్మత్వేఽ ప్యనుగతే తత్తేదంతే తతస్తయో ౹
ఆత్మత్వం నైవ సంభావ్యం సమ్యక్త్వాదేర్యథాతథా౹౹48౹౹

48.(సమాధానము)ఇది,అది అనే పదములు మూడు పురుషుల యందు మాత్రమే గాక ఆత్మయందు కూడా అన్వయించును.కనుక అవి సమీచీనత్వము వలె విస్తృతతరమైన అర్థము గలవి. అందుచే అది ఇది అనే పదములు ఆత్మార్థకములు కావు.

తత్తదంన్తే స్వత్త్వన్యత్వే త్వన్తాహన్తే పరస్పరమ్ ౹
ప్రతిద్వంద్వితయా లోకే ప్రసిద్ధే నాస్తి సంశయః  ౹౹49౹౹

49.  అంతేగాక ఇది-అది,
ఆత్మ-ఇతరము,నీవు-నేేను, అనునవి పరస్పర వ్యతిరేక పదములని లోకమున ప్రసిద్ధమే. అందు సంశయమేమియు  
లేదు.

అన్వతాయాః ప్రతిద్వంద్వీ స్వయం కూటస్థ ఇష్యతామ్ ౹
త్వన్తాయాః ప్రతియోగ్యేషోఽ హ మిత్యాత్మని కల్పితః ౹౹50౹౹

50. అన్యత యొక్క ప్రతిద్వంద్వి స్వయంత.అదే కూటస్థము. త్వంత("నీవు" అనేె భావము) యొక్కప్రతిద్వంద్వి అహంత.అదే అహంకారము,జీవుడు.ఇదే కూటస్థముపై ఆరోపింపబడినది.

అహన్తా స్వత్వయోర్భేదే రూప్యతేదన్తయోరివ ౹
సృష్టేపి మోహమాపన్నా ఏకత్వం ప్రతిపేదిరే ౹౹51౹

51. వెండికి"ఇది"కి గల వ్యత్యాసము స్పష్టమైనట్లే, అహంతకును ఆత్మకు గల భేదము స్పష్టమే.కాని మోహగ్రస్తులైన జనులు అహంకారమునే ఆత్మగా భావింతురు.

ఇది,అది అనే పదములు ఆత్మార్థకములు కావనుట ప్రాసంగికముగ చెప్పబడినవి.ఇవి ముఖ్యాంశమగు విక్షేపశక్తి.

ఆత్మ అనగా రెండు విధములుగ అర్థమగును.అవి కార్యము కూటస్థమగు ఆత్మ,వ్యవహారము నడుపు అహంత,జీవుడు.

ముత్యపుచిప్పను చూచి భ్రాంతితో"ఇది వెండి" అనుకొనునపుడు"ఇది"అనగా చూడబడిన వస్తువును ఉద్దేశించును."వెండి"అనే భావం పొరపాటు.
ఇట్టి పొరపాటు వలననే జనులు అత్మను అహంకారముగా భ్రమింతురు.ఇదే అహంకారము,జీవుడు.ఇదే కూటస్థముపై ఆరోపింపబడినది.

జనకునివలె హృదయమునందలి అహంబుద్ధిని తొలగించినప్పుడు ఆత్మజ్ఞానమను  పరమజ్యోతి నిశ్చితముగా  హృదయములో ప్రకాశించును.ఈ అహంబుద్ధి మాత్రమే అతిగాఢమగు అంధకారరూపము.ఇది తొలగినప్పుడు ఆంతరజ్యోతి స్వయముగా ప్రకాశించును.

"నేనులేను",అనియు,
"అన్యుడుకూడాలేడు"అనియు,
"అస్తిత్వరాహిత్యముగూడ లేదు"
అనియు తెలిసికొని ఆ విధముగా నిశ్చలమగు మానసికవ్యాపారము కలవాడు సంపాదనశీలములో నిమగ్నుడు కాడు.

సంపాదన,నిరాకరణ అను రెండు ప్రేరణలు నశించిన వారు దేనిని కోరరు,దేనిని గూడ పరిత్యజింపరు.
సంపాదన,నిరాకరణ అను రెండు ప్రేరణలు నశించనంత కాలము మనస్సు సంపూర్ణశాంతిస్థితిని పొందదు.

అదేవిధముగా వ్యక్తి
"ఇది సత్యము","ఇది అసత్యము" అని భావించునంతకాలము మనస్సు శాంతిని,సమత్వమును అనుభవించదు."ఇది మంచిది", "ఇది చెడ్డది","ఇది లాభము",
"ఇది నష్టము"అను భావనలకు వశమయినవాని మనస్సులో సమభావము,నిర్మలత్వము లేక వైరాగ్యము ఎట్లు ఉదయింపగలదు?

ఎల్లప్పుడు ఏకము అనేకమునయిన బ్రహ్మము ఒక్కటి మాత్రమే ఉన్నప్పుడు ఏది మంచిది,ఏది చెడ్డది-అని చెప్పగలము?

వాఛారాహిత్యము
(అన్ని విధములగు నిరీక్షణలు లేకపోవుట),నిర్భయత్వము,
మారని స్థిరత్వము,సమత్వము, జ్ఞానము,సంగరాహిత్యము,అకర్మ,మంచితనము,సంపూర్ణమగు వికారరాహిత్యము,ధైర్యము,
సహనము,మైత్రి,ప్రజ్ఞ,తృప్తి,
సాధుత్వము,మధుర భాషణము-ఈ గుణములన్నియు సంపాదన,
నిరాకరణ అను అంతర్గత స్వభావములు లేనివానికి సహజములు.ఈ గుణములు గూడ ఉద్దేశ పూర్వకములు కావు,యాదృచ్ఛికములే.              

No comments:

Post a Comment