*పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం - కాలాడూంగర్ - రాన్ ఆఫ్ కచ్*
Source : దత్త లీలలు
దత్తాత్రేయుడు యోగి – కాని పెద్ద భోగి, స్మర్తృగామి – అదే సమయంలో ఒకపట్టాన కరుణించడు. పిలిస్తే పలకడు, నిర్గుణుడు – కాని సగుణ రూపంలో కనిపిస్తాడు. మౌన ప్రియుడు – కానీ ఉన్మత్తుడు. బండ బూతులు తిడతాడు… ఈ విధంగా అనేకానేక వైవిధ్యభరితుడు దత్తాత్రేయుడు. కాని ఒక విషయంలో మాత్రం దత్తాత్రేయుడి దగ్గర ఎటు వంటి విభిన్నతలేదు, అదే “దత్తాత్రేయుడు అన్నదాన ప్రియుడు. ఆకలిగా ఉన్న జీవులకు ఆహారం పెడితే వెను వెంటనే సంతోషించే అల్పసంతోషి” అందువల్లే దత్తా త్రేయంలో అన్నదానానికున్న ప్రాముఖ్యత మరిదేనికి లేదు. అలనాడు శిబి చక్రవర్తిని ఇంద్రుడు, అగ్నిదేవుడు ఆయన దాతృత్వాన్ని పరీక్షింపదలచి. ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్నిదేవుడు పావురం రూపాన్ని ధరించి శిబి చక్రవర్తిని పరీక్షించారు. ఆఖరుకి శిబి చక్రవర్తి తనని తాను మొత్తంగా ‘డేగ’ కి అర్పించుకున్నాడు. శిబి చక్రవర్తి కథ, దాతృత్వానికి సంబంధించినదైతే, పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్ర సంఘటనలు అన్నదానానికీ, అన్నదాన గొప్పదనానికీ సంబంధించినది. మూగజీవుల (Jackals-నక్కలు) ఆకలి కేకలను, వాటి దీన ప్రార్ధనలను విన్న దత్తాత్రేయు డు తన శరీర భాగాలను ఆహారంగా విసిరివేసి, మూగ జీవుల ఆకలి బాధలను తీర్చడం కోసం తనకి తానుగా తన దేహాన్ని అర్పించిన అతి గొప్ప రహస్య దత్త క్షేత్రమిది. పరిశోధించి చూడగా ఈ ప్రదేశం అనేక రకాలైన విశిష్టత లకు కొలువైఉన్నట్లుగా తెలియవచ్చింది.
విశిష్టత-1: ఈ క్షేత్ర ప్రాంతంలో గల నక్కల ఆకలిని తీర్చ డం కోసం “లోఆంగ్ – లేఅంగ్” పేరుతో దత్తాత్రేయుడు తన శరీర భాగాలను ఆహారంగా విసిరివేసిన క్షేత్రమిది. గత 500 సంవత్సరాల నుండీ నేటివరకు (ఇక ముందు కూడా) ఇక్కడ అదే కార్యక్రమం జరుగుతుండడం, నక్కలు రెండు పూటలా వచ్చి (12:00 PM & 06:30 PM) ‘లోఆంగ్ ప్రసాదం’ తినడం వింతలలోకెల్లా వింత.
విశిష్టత-2: ప్రపంచంలోని ఏకైక ‘ఆదిత్య దత్తాత్రేయ’ క్షేత్రం. ఈ విషయాన్ని Symbolic గా Represent చెయ్యడం కోసం దత్తాత్రేయ విగ్రహం వెనుక సూర్య భగవానుడు ఉన్నట్లుగా చిత్రపటాన్ని దేవాలయంలో ఏర్పాటు చేసారు.
విశిష్టత-3: ప్రతీ రోజు ఉదయం సూర్యోదయం అయిన కొద్ది నిముషాల తరువాత ఇక్కడ గల దత్తాత్రేయునికి ‘సూర్యకిరణాభిషేకం’ జరుగుతుంది. ఈ సూర్యకిరణాభిషేకం సన్నివేశం కొద్దినిముషాలపాటు ఉంటుంది. చూసి తీరవలసిన ఘట్టమిది.
విశిష్టత-4: పూజలూ, అర్చనలు, కొబ్బరికాయలు కొట్టడం మొదలైన ఆర్భాటాలు లేకుండా నిత్యం "హరి ఓం తత్సత్ - జై గురుదత్త"... అనే నామస్మరణ వినిపించే క్షేత్రం.
విశిష్టత-5: సూర్య భగవానుడు తనకిరణాలతో ప్రతీ రోజూ సూర్యకిరణాభిషేకం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా కట్టబడిన విమాన గోపురం కలిగిన దత్తక్షేత్రమిది. ఇటు వంటి విమాన గోపురం మరెక్కడా కనిపించదు.
విశిష్టత-6: ఇక్కడనుండి (కాలాడూంగర్) గిరిరాజ్ - గిరినార్ శిఖరం 9000వ మెట్లవద్దకు నేరుగా చేరుకునే గుహ మార్గం ఉండడం.
విశిష్టత-7: దత్తాత్రేయుడు రాజేసిన నిత్యధుని నేటికీ ఇక్కడ వెలుగుతుండడం, ఈ ధుని ఊదిలో దత్తపాదుకా ముద్రలు పడుతుండడం ఇక్కడి విశేషం.
విశిష్టత-8: భూమి ఏటవాలుగా 23.5 డిగ్రీల కోణంలో తిరిగి ఉన్న ప్రదేశంలో గల ఏకైక దత్త క్షేత్రం ఇది.
(“ప్రియమైన నక్కలారా! నా అంగాలను ఆహారంగా తీసుకోండి!”)
దత్తాత్రేయుడు దత్తాత్రేయుడే! వారి లీలలు ఊహాతీతాలు. వారిగురించిన తలపు ఒకరకంగా ఉంటే ఆయన మరో రకంగా ఉంటారు. వారుచేసే అద్భుతాలు వేదాలు కూడా వర్ణింపలేవు. దత్తాత్రేయుని గురించి చెప్పడానికి భాష, లిపి, ఊహ , జ్ఞానం, ఎరుక మొదలైనవేవి కూడా సరిపోవు. అందుకే మౌనంగా ఆయన దగ్గర చేతులు కట్టి , ఆయన చేసే పనులు చూస్తూ ఉండడమే సరైన ప్రతిస్పందన. ఆయన చేసే పనులకు (క్రియలనండీ, లీలననండీ... లేదా మరేదైనా అనండి) నిలువెత్తు సాక్ష్యం కాలాడూంగర్ లోని పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం. అక్కడ పూజలులేవు, అర్చనలు లేవు…ధనప్రవాహం అసలే లేదు! స్వాములు లేరు..బాబాలు లేరు..’పెద్ద స్వామి పాద నమస్కారా ని కింత…చిన్నస్వామి పాద నమస్కారాని కింత అనే ధరల పట్టీ వేళాడదీసి లేదు! “భక్తుడా ఇంతమొత్తం కడితేనే ఇక్కడ నృసింహ సరస్వతి స్వామి వారు నిన్ను చెయ్యెత్తి ఆశీర్వదిస్తాడు, లేకపోతే చెయ్యేత్తడు” అనే మధ్యవర్తులు, పూజారులు లేరు. అయినవారికి ఆకులు (VIPs, NRIs) కానివారికి కంచాల పద్ధతి లేదు.
విశిష్టత-9: Tropic of Cancer (కర్కటరేఖ) పైన గల ఏకైక దత్త క్షేత్రం.
విశిష్టత-10: ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో దత్తాత్రేయ హారతి జరుగుతున్నప్పుడు ఒక కాంతిగోళం (సిద్ధగోళం) విధిగా వచ్చి సూర్యుని చుట్టూతిరిగి తదుపరి దత్త శిఖరం చుట్టూ తిరిగి (సూర్యహారతి కార్యక్రమం) వెళ్ళడం.
కంచాలు (సామాన్యుడు) ఉండవిక్కడ. ఇక్కడ జంతువు లే దత్తుడి స్వరూపాలు, VIPలు. ఈ ప్రదేశం భూమిపై న ఉన్న అసలైన దత్తదేశం. ‘పంచభూతదయ’ ఇక్కడ తాండవిస్తూ ఉంటుంది. ప్రకృతి మనల్ని పలకరించి దత్తాత్రేయం అంటే ఏంటో, ఎలాఉంటుందో మనకు తెలిసేలా జీవితాంతం గుర్తుండిపోయేలా Practical గా చూపిస్తుం ది. ఇక్కడ దత్త హోమం చేసుకోవాలన్నా లేదా దత్తాత్రేయునికి హారతి పట్టాలన్నా ఎవరికివారు, వారు ఎంతటి వారైనా… వారి వారి ఏర్పాట్లు వారు చేసుకోవల్సిందే! ఈ క్రమంలో అక్కడి ప్రశాంతతకు ఎటువంటి భంగం కలిగిం చరాదు.
దాదాపుగా 500 సంవత్సరాల క్రితం మాట. భరతఖండానికి పశ్చిమ దిక్కున సహ్యాద్రి పర్వతశ్రేణి సముదాయం లోని నల్లటి కొండల (Black Hills -కాలాడూంగర్) పై సూర్య భగవానుడు నడి నెత్తిన ఉన్నాడు.ఆరోజు మాస శివరాత్రి. అప్పుడు సూర్యుడిలో నుండి గురు దత్తాత్రేయుల వారు సహ్యాద్రి శ్రేణి లోని కాలాడూంగర్ పై తమ ఎడమ కాలు పెట్టి భూమి మీదకు దిగారు. తదుపరి వారి కుడి కాలు అక్కడకి 80 KMs దూరంలో గల పురాణేశ్వర మందిరం లో కాలు పెట్టవలసి ఉంది. ఎందుకంటే, పురాణేశ్వర మందిరంలోగల ‘పురాణేశ్వరుడు’ పేరుకు తగ్గట్టే అతి ప్రాచీనుడు. దేవి-దేవతా గణాలు పుజచేసుకోవడం కోసం శివుడు వేల సంవత్సరాల క్రితం అక్కడ లింగ రూపంలో వెలిసాడు. ప్రతీ మాస శివరాత్రి రోజున మధ్యాహ్నం అక్కడకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చి ఆ లింగాన్ని పూజించడం ఆనవాయితి, శివుడు శివుడినే (లింగ రూపంలో ఉండే) పూజించడం ఇక్కడి విశేషం. ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో ఉన్న రాజుల ద్వారా కొంత వరకు ఆధునీకరించబడినది.
స్థల పురాణం : దాదాపుగా 500 సంవత్సరాల క్రితం మాట. భరతఖండానికి పశ్చిమ దిక్కున సహ్యాద్రి పర్వతశ్రేణి సముదాయం లోని నల్లటి కొండల (Black Hills -కాలాడూంగర్) పై సూర్య భగవానుడు నడి నెత్తిన ఉన్నాడు.ఆరోజు మాస శివరాత్రి. అప్పుడు సూర్యుడిలో నుండి గురు దత్తాత్రేయుల వారు సహ్యాద్రిశ్రేణి లోని కాలాడూంగర్ పై తమ ఎడమ కాలు పెట్టి భూమి మీదకు దిగారు. తదుపరి వారి కుడి కాలు అక్కడకి 80 KMs దూరంలో గల పురాణేశ్వర మందిరం లో కాలు పెట్టవలసి ఉంది. ఎందుకంటే పురాణేశ్వర మందిరం లోగల ‘పురాణేశ్వరుడు’ పేరుకు తగ్గట్టే అతి ప్రాచీనుడు. దేవి-దేవతా గణాలు పూజ చేసుకోవడం కోసం శివుడు వేల సంవత్సరాల క్రితం అక్కడ లింగరూపంలో వెలిసాడు. ప్రతీ మాస శివరాత్రి రోజున మధ్యాహ్నం అక్కడకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చి ఆ లింగాన్ని పూజించడం ఆనవాయితి, శివుడు శివుడినే (లింగరూపంలో ఉండే) పూజించడం ఇక్కడి విశేషం. ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో ఉన్న రాజుల ద్వారా కొంత వరుకు ఆధునీకరించబడినది. ఈ చర్యలో భాగంగానే దత్తాత్రేయుడు పురాణేశ్వర మందిరానికి పయనమవ్వడం కోసం సూర్యమండలం నుండి భూమండలానికి ‘కాలాడూంగర్’ పై ఎడమ కాలుపెట్టి దిగాడు. గురు దత్తాత్రేయుల వారు పురాణేశ్వర మందిరం వెళ్ళడం కోసం సూర్యమండలం నుండి భూమండలానికి దిగేటప్పుడు కాలాడూంగర్ పైనే ఎందుకు దిగాల్సి వచ్చిందంటే భూమి 23.5 డిగ్రీల కోణంలో ఏటవాలుగా ఉంది. అలాగే కాలాడూంగర్ కుడా Tropic of Cancer మీద 23.5 డిగ్రీల కోణంలో ఉంది. ఫలితంగా సూర్య మండలం నుండి భూమండలానికి ఎవరు దిగాలన్నా Tropic of Cancer మీద మాత్రమే దిగవలసి ఉంటుంది. కాలాడూంగర్ ప్రాంతం ఎడారి ప్రాంతం. ఎడారి జీవనంలో అన్ని జంతువులకు ఒత్తిడి (Stress) అధికంగా ఉంటుంది. అప్పటికే అక్కడి ఎర్రటి ఎండలో కొద్ది వారాలుగా తినడానికి తిండి లేక ఆకలితో నకనక లాడుతున్న నక్కల గుంపొకటి ఏదైనా జంతువు కనబడకపోతుందా....అని అన్నిటికి తెగించి వెతుకుతున్నాయి. సరిగ్గా ఆ సమయంలో అదే ప్రాంతంలో దత్తాత్రేయుడు దిగాడు. అంతే దత్తాత్రేయుడిని చూసిన నక్కల గుంపు ఆహారం దొరికిందని ఒక్కసారిగా ఆయన మీదకు ఉరికాయి. వచ్చింది ఆహారం కాదు దేవాది దేవుడని గ్రహించి తోకలు ముడిచి కాళ్ళు పైకి లేపి వాటి నేత్రాలతోనే దత్తాత్రేయుడిని క్షమించమని వేడుకున్నాయి. అప్పుడు దత్తాత్రేయుల వారికి నక్కల కి మధ్య ఈ విధంగా ‘నేత్ర సంభాషణ’ జరిగింది.
నక్కల గుంపు / నక్కల రాజు :
మమ్మల్ని క్షమించాలి ఆకలిగా ఉండడం వల్ల విచక్షణ కోల్పోయి దేవాధి దేవులైన మీమీదికి ఉరికాము. ఇక్కడ మాకు గత కొద్ది వారాలుగా తిండి లేదు. ఎండలకి ఇక్కడున్న చిన్న జంతువులన్నీ చచ్చి పోయాయి. నక్కల రాజుగా నేను చనిపోయినా పరవాలేదు, మా పిల్ల సంతతికి చంపి తినడానికి జంతువులేవైనా ఉంటే చూపించండి.
దత్తాత్రేయుడు: ఆకలిగా ఉండే జీవుల ఆకలి తీర్చడమే నా ముఖ్య తత్వము. అదే నా మూల తత్వము. అదే దత్తరీతి! దత్తసారము. దానికి వేరొక జాతి జంతువులను చంపడమెందుకు? నేనుండగా?..తినండి.. కడుపు నిండా తినండి.....
లోఆంగ్ – లేఅంగ్..
లోఆంగ్ – లేఅంగ్....
లోఆంగ్ – లేఅంగ్....
నా అంగాలను ఆహారంగా తినండి....
అని దత్తాత్రేయుడు ఆయన చేతులకు, తొడలకు, వక్ష స్థలానికి ఉన్న శరీర కండలను పెరికి వాటికి విసిరారు. దత్తాతేయుడు తన కండలను పీకిన చోటల్లా తిరిగి మాంసం రావడం మళ్లీ దానిని పీకి నక్కలకు వేయడం.. ఇలా పలు మార్లు చేసి అక్కడ గల అన్ని నక్కలకు కడుపునిండేటట్టు భోజనం పెట్టారు.
తదుపరి పశువుల కాపరి నక్కలను చూసిన ప్రదేశానికి వెళ్లి అక్కడ అన్నం మూటను విప్పి దులిపి అరవగానే ఆ మూట లోంచి గుప్పుగుప్పుమని మాంసం వాసన వచ్చిందట. ఆ అరుపుకీ, ఆ మాంసపు వాసనకీ తిండి కోసం ఎదురు చూస్తున్న నక్కలు ఒక్కసారిగా వచ్చి ఆవురావురంటూ తిని వెళ్ళిపోయాయి. తిరిగి మట్టి గుడిసెకి చేరుకున్న పశువుల కాపరి ఆనంద భాష్పాలతో దత్తాత్రేయుని కాళ్ళ మీద పడి
పశువుల కాపరి: ఈ జీవితానికి మీదర్శనం వల్ల లభించిన ఈపుణ్యం చాలు దేవా. ధన్యుడిని.
దత్తాత్రేయుడు: నువ్వు ఇప్పుడు వండినట్టుగానే ప్రతీ రోజూ రెండు పూటలా వండి నక్కలకి ప్రాసాదం పెట్టు. మీ వంశంలోని ప్రతీ తరంలో ఒకరు ఈ పనికి నియమింపబడతారు. గుర్తుపెట్టుకో... ఎప్పటికీ అలసత్వం చూపకు. నేను దత్తాత్రేయుడను. నావల్ల కాని కార్యమే ఈ విశ్వంలో లేదు. అలాంటి నేను ఇక్కడ పుట్టే ఈ నక్కలకి ఋణగ్రస్తుడను. నా శరీర భాగాలు వాటికిచ్చి, వాటి ఆకలిని తీర్చి, నా మూలతత్వాన్ని నిలబెట్టుకుంటున్నాను. ఆ విధంగా నా ఋణాన్ని తీర్చుకుంటున్నాను. ఇక్కడ పుట్టి, నా శరీర అంగాలను ఆహారంగా తినే నక్కలు అత్యంత అదృష్టవంతమైనవి. వాటికి సాటిరాగలవి మరేవి లేవు. నక్కలే కాదు వాటితో పాటు ఈ ఆహారాన్ని తినే పక్షులు, ముంగీసలు, కుక్కలు మరియు ఇతర జీవులు కుడా అదృష్టమైనవే!
పశువుల కాపరి: తప్పకుండా స్వామి. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. తదుపరి దత్తాత్రేయుడు, పశువుల కాపరి ఇరువురూ గుడిసె బైటకు వచ్చి…
దత్తాత్రేయుడు: ఇదిగో పశ్చిమ దిక్కుగా తూర్పు ముఖంగా ఇక్కడ ఉన్న ఈ బండ మీద పడిన నా నీడ శాశ్వతంగా ఉండిపోతుంది. నువ్వు దీనిని పూజించుకోవచ్చు. ఇక్కడ ఈ బండ మీద పడిన నా ప్రతిబింబానికి (నీడ) ప్రతీరోజూ సూర్యోదయ సమయంలో సూర్యకిరణాభిషేకం జరుగుతుంది. సాయంత్రం సుర్యాస్తమయ సమయంలో ఇక్కడ సూర్య భగవానుని అంశ నాకు హారతి ఇస్తుంది. ఇది "పశ్చిమ పీర్ ఆదిత్యదత్త క్షేత్రంగా"... మారుతుంది. మరి జాగ్రత్త....!
పశువుల కాపరి: స్వామి!.. మరి మిమ్మల్ని ఎప్పుడైనా చూడాలంటే?…చూడాలనిపిస్తే?....
దత్తాత్రేయుడు: వారు చూపుడు వ్రేలుతో నేల పై చిన్నగుంత చేసి, “కొద్ది నిముషాలలో ఇక్కడ ఒక గుహ ఏర్పడుతుంది, ఈ గుహ మార్గం గిరినార్ లో నేను ఉండే ప్రదేశానికి దగ్గర వరకు నిముషాలలో తీసుకెళుతుంది. అక్కడ నువ్వు నన్ను కలవవచ్చు” అనిచెప్పి ఒక్క అడుగులో అచ్చట నుండి తిరిగి సూర్యమండలానికి చేరారు.
పశువుల కాపరి: జై పశ్చిమ పీర్ ఆదిత్య దత్త భగవాన్.. జై జై ఆదిత్యదత్త భగవాన్..
చదవడానికి..... ఇదేదో మంచి కథలాగ ఉన్నా.. గత 500ల సంవత్సరాలనుండి నేటి వరుకు ఇక్కడ జరుగుతున్నది ఇదే!.
నక్కల గుంపు / నక్కల రాజు : దేవా.. దత్తాత్రేయ! ధన్యవాదములు. అద్భుతం…మీ మాసం ఎంతో తియ్యగా రుచికరంగా ఉంది. ఇలాంటి రుచి ముందెన్నడూ ఎరగము. మీరు మరోలా అనుకోక పోతే మాదో చిన్న విన్నపము..
దత్తాత్రేయుడు: చెప్పండి. ఏంకావాలి?
నక్కల గుంపు / నక్కల రాజు : మీ రుచికరమైన మాంసంతో ఇవాల్టికి ఆకలి తీరింది సరే.. మరి రేపటి నుండి మా పరిస్థితేంటి? దేవా!..
దత్తాత్రేయుడు: నా శరీరాన్ని తిన్నా.... మీ నక్క బుద్ధి పోనించుకున్నారు కాదు.. సరే ఇటువంటి భోజనమే ఎప్పటికి మీకు అందేలా ఏర్పాటు చేస్తాను. రెండు పూటలా…మద్యాహ్నం, సాయంత్రం పిలవగానే రండి, తిని వెళ్ళండి… అని అభయమిచ్చి, ఒక్క అడుగులో పురాణేశ్వర మందిరాన్ని చేరారు.
నక్కల గుంపు / నక్కల రాజు : ధన్య వాదములు దేవా..దత్తాత్రేయ
తదుపరి దత్తాత్రేయుల వారు మిట్ట మధ్యాహ్నం అక్కడకి దగ్గరలో గల ఒక పశువుల కాపరి (ఒంటెల కాపరి) మట్టి గుడిసె లోకి వెళ్లి, గుడిసె లో గాఢనిద్రలో ఉన్న పశువుల కాపరిని నిద్రలేపి ఇలా మాట్లాడారు.
దత్తాత్రేయుడు: ఓ! మాడు.. ఓ! మాడు.. (ఓ మనిషి!)..లే.. మధ్యాహ్నం ఈ నిద్రేంటి? తొందరగా లే! నీకు ఇవాళ వంట నేర్పించాలి. చాలా పనులున్నాయి.
పశువుల కాపరి: ఎవర్నువ్వు? బాగా తెలిసిన వాడిలా పిలుస్తున్నవే?!?
వంటేంటి? నేనెందుకు వంట నేర్చుకోవాలి?!
దత్తాత్రేయుడు: అతిగా నిద్ర పోవడం వల్ల నీకు మతి పోయినట్లుగా ఉంది. అదిగో అక్కడ ఆకొండ మీద బండ వెనుక ఆకలిగా ఉన్న నక్కల గుంపు ఉంది వాటికి వండి వేడివేడిగా తిండి పెట్టాలి. కావాలంటే వెళ్లి చూసిరా..
పశువుల కాపరి: ఏంటి ? నక్కలకి వేడివేడిగా వండి పెట్టాలా?.. నాకు కాదు నీకు పోయింది మతి..
దత్తాత్రేయుడు: వెళ్లి చూసి, వచ్చి మాట్లాడు.
పశువుల కాపరి: సరే.. చూద్దాం.. నిజమెంతో… అనుకుంటూ వెళ్లి చూసే సరికి అక్కడ నక్కలు పడిగాపుల కాయడం చుసిన పశువుల కాపరి పరిగెత్తు కుంటూవచ్చి..
బాబోయ్.. ఎన్ని నక్కలో! ఇంతకి మీరెవరో చెప్పండి దయచేసి..
దత్తాత్రేయుడు: చిరునవ్వు నవ్వి చూపుడు వ్రేలుతో పశువుల కాపరి భౄమధ్యాన్ని తాకగానే పైన జరిగిన వృత్తాంతమంతా ( దత్తాత్రేయుడు సూర్యమండలం నుండి భూమండలానికి దిగిన వృత్తాంతం) అతనికి కనిపించింది (అతని ద్వారానే ఈ వృత్తాంతమంతా ప్రపంచానికి తెలిసింది).
పశువుల కాపరి: క్షమించండి దత్త దేవా. తెలియక ఏదేదో వాగాను. చెప్పండి స్వామీ నన్నేంచేయమంటారు?
దత్తాత్రేయుడు: త్వరగా ఒంటె కట్టుకొని ‘ఖావడా’ సేటు దగ్గరకి వెళ్లి ఎనిమిది సోలల బియ్యం, ఎనిమిది ముంతల బెల్లం, పావు ముంత చితపండు, అరసోల పెసరపప్పు, రెండు వెన్న ముద్దలు (నెయ్యి) తీసుకురా....
పశువుల కాపరి: క్షమించండి, నేను సేటుకి చాలా రోజులుగా బాకీ ఉన్నాను. నేను వెళితే సరుకులు ఇవ్వకపోగా గొడవ చేస్తాడు. ప్రస్తుతం నాదగ్గర రొక్కం కుడా లేదు .
దత్తాత్రేయుడు: పరవాలేదు, నువ్వెళ్ళు.. మిగతాది నేను చూసుకుంటాను.
ఆవిధంగా ఖావడా సేటు దగ్గరకి వెళ్ళగానే సేటు అతనిని కూర్చోపెట్టి ‘చల్లటి చాస్’ (మజ్జిగ) ఇచ్చి సరుకులన్నీ ఒంటె మీదకు చేర్చాడట. ఆపై సేటు పశువుల కాపరితో “మికివ్వవలసిన పైకం ఇంకా అందలేదు. దానికి తగ్గ మైనం సరుకులు తీసుకెళ్ళమని” చెప్పాడట. అంటే పశువుల కాపరి సేటు దగ్గరకు వెళ్ళేలోపే సేటు పశువుల కాపరికి బాకీ పడేటట్లుగా దత్తాత్రేయుల వారు కాలాన్ని మార్చారన్నమాట.
పశువుల కాపరి, తిరిగి కాలాడూంగర్ లోని మట్టి గుడిసె లోకి వెళ్ళేటప్పటికి, అక్కడ దత్తాత్రేయుల వారు మట్టి నేలమీద మఠమేసుకొని కుర్చుని ఉన్నారట. పశువుల కాపరిని చూసిన దత్తాత్రేయుల వారు ఇలా అన్నారట.
దత్తాత్రేయుడు: ఆ ‘సేటు’ ఏమన్నాడు? సరుకులన్నీ ఇచ్చాడా?
పశువుల కాపరి: మీరు కాలస్వరూపులు. కాలం మీ రూపంలో అక్కడ విషయాల నన్నింటినీ తారుమారు చేసిన ఫలితంగా ఇప్పుడు సేటే నాకు బాకిగా ఉన్నాడని చెప్పాడు… దేవా! ఎంత చమత్కారివయ్యా నువ్వు! సరుకులన్నీ తనే దగ్గరుండి కట్టి ఒంటెకెక్కించాడు.
దత్తాత్రేయుడు: నవ్వుతూ.. పద పద నీకు ఇవాళ ‘దత్తమాంసపు తాళి (Loaung Prasad)’ ఎలా వండాలో నేర్పిస్తాను.
పశువుల కాపరి: తెచ్చింది పప్పు-బెల్లాలు.. వండేది మాంసం, అంటే.. మీయొక్క మరొక చమత్కారాన్ని చూడబోతున్నానన్నమాట. జైదత్తదేవా.. జై జై దత్తదేవా.. తదుపరి తెచ్చిన సరుకులతో ‘దత్తమాంసపు తాళి’ ఎలావండాలో పశువుల కాపరికి నేర్పించారు.
దత్తాత్రేయుడు: వెళ్ళు ఈ అన్నానంతా గుడ్డలో మూటకట్టుకుని ఇందాక నక్కలను చుసిన ప్రదేశానికి వెళ్లి అక్కడ మూటదులుపు. దులిపి మూడు సార్లు “లోఆంగ్ – లేఅంగ్” అని కేకపెట్టు.
పశువుల కాపరి: అలాగే స్వామి. కానీ నక్కలు శాఖాహారం తినడం…అందులోనూ ఇటువంటి నెయ్యి దట్టించిన తియ్యటి ‘బెల్లపన్నం’ తినడం నాజీవితంలో చూడలేదు సరికదా, కనీసం వినలేదు కూడా! కానీ మీరు మరో చమత్కారానికి తెరతీస్తున్నారని మాత్రం గ్రహింపగలను.
No comments:
Post a Comment