Wednesday, December 11, 2024

 नमस्सर्वेभ्यः 🙏

700 శ్లోకాలు వున్న భగవద్గీత లో గీతా చార్యులు బోధించిన 574 శ్లోకాలను మనం అర్థం చేసుకోగలిగితే దుఃఖం మన దరిదాపులకు రానే రాదు.  భగవద్గీత విన్న అర్జునుడు 'కరిష్యే వచనం తవ' అంటూ యుద్ధం చేసి విజయం సాధించారు.
చతుర్విధపురుషార్ధలలో (ధర్మ, అర్ధ, కామ, మోక్షం) మోక్షం చివరిది అలాగే భగవద్గీత లోనూ కర్మ, భక్తి, జ్ఞాన, మోక్షం అనే 4 సోపాన మార్గాలు వున్నాయి. మోక్షం కావాలి అంటే కర్మ తప్పనిసరిగా చేయాలి ఎందుకనగా మోక్షం సాధించడానికి కర్మ నే మొదటి సోపాన మార్గం. 
మనిషి యొక్క జీవిత లక్ష్యం అయిన పరమాత్మ ప్రాప్తి పొందడానికి గీతా చార్యులు అనేక మార్గాలు సూచించారు. అందులో కొన్ని 
'అంతకాలేషు మామేవ...'
'తస్మాత్సర్వేషు కాలేషు...'
'జన్మకర్మ చ మే దివ్యం...'
'మన్మనాభవ మద్భక్తో...'
'సర్వ ధర్మాన్ పరిత్యజ్య...'
పై శ్లోకాలను అర్ధం చేసుకోవాలి.
భగవద్గీత కేవలం పారాయణ గ్రంధము కాదు. ఆచరణ గ్రంధం. 
కావ్యం లో అనుబంధ చతుష్టయం (విషయం, అధికారి, సంబంధం, ప్రయోజనం) వున్నట్లే,
భగవద్గీత లో అధ్యయనం, అభ్యాసం, ఆచరణం, ప్రయోజనం అనే 4 వుంటాయి. 
ప్రయోజనం (మోక్షప్రాప్తి) సిద్ధించాలి అంటే భగవద్గీత శ్లోకాలను అధ్యయనం, అభ్యాసం, ఆచరణం ఖచ్చితంగా చేయాలి అని నా అభిప్రాయం.

*"శ్రీకృష్ణం వందే జగద్గురుమ్"*

Sekarana

No comments:

Post a Comment