నారద భక్తి సూత్రములు
74 వ సూత్రము
"వాదో నావలాంబ్యః"
భక్తులు భక్తి మరియు ప్రాపంచిక వ్యవహారాలగూర్చి వాద వివాదాలకు దిగరాదు,భక్తి అనేది అంతరంగిక విషయం,అది భక్తులకు అనుభవైక వేద్యం,భక్తి అనేది బాహ్య హేతువులకు అందేది కాదు.
భక్తులకు ఈ సూత్రం చాలాఅవసరం,భక్తుడు అనుక్షణం భగవత్ సేవలో లీలామై ఉండాలి.అన్య విషయాలపై అనాసక్తకల్గి వాటిపై చర్చలు తగ్గించాలి లేదంటే వివేకం భ్రష్టమై వివాదం పెరిగి క్రోధం/అహంకారం జనిస్తుంది భక్తి మార్గం చెడుతుంది. అందరిలోనూ అన్నిటిలోను పరమాత్మని వీక్షించాలి, అప్పుడు వేటిమీద భిన్నాభిప్రాయాలు కలుగక వాదవివాదాలు దూరమవుతాయి.
సృష్టి గుర్చికాని,సృష్టి పరిమాణం గుర్చికాని,ప్రాపంచిక వ్యహారాలుగాని విచారించవాల్సిన అవసరం భక్తునికి లేదు.దీనికి మూలం ఆపరమేశ్వరుడే, కర్త క్రియ కర్మఆపరమాత్మునిదే,భక్తునికి సంబంధం లేనివాటి గూర్చి భక్తుడు ఆందోళన మాని భగవత్ నామం లో లీలామవ్వాలి. అవసరమైతే సమయం వచ్చ్చినప్పుడు భగవంతుడే భక్తునికి వాటిని గూర్చి తెలియపరుస్తాడు. తర్కంవల్ల,వాదనవల్ల,అన్యవిషయ సంపర్కంవల్ల తత్వం ఉపలబ్ధికాదు.
వాదంవల్ల వైరాగ్ని ప్రజ్వలిస్తుంది,కనుక భక్తుడు వాదనలకు అవకాశం ఇవ్వరాదు,తప్పనిసరి అయితే ఎదుటివారి వాదన విని మౌనం వహించుట మంచిది, అగ్నికి సమిధలు వేస్తె మంటవేస్తుంది లేక పొతే అది ఆరిపోతుంది,ఎదుట వ్యక్తికి బదులు చెప్పకపోతే వాడే వాగి వాగి చల్ల బడతాడు.మాటకు మాట భక్తి మార్గానికి తెగులు, నీటికి నాచువలె.
75 వ సూత్రము
"బాహుల్యావకాశా దనియ తత్వాచ్చ"
తర్కం అంతులేనిది,ఇందులో అసలు చర్చ దారితప్పి వివిధ విషయాలు(భక్తేతర) చర్చికి వచ్చి వివాదగ్రస్తం అవడానికి అవకాశం ఎక్కువ.
దీనివల్ల తత్వప్రయోజనం శూన్యం,వ్యక్తిగత అహంభావ సమర్ధనీయతకోసం,సూక్తులకోసం,సూత్రాలకు మేధాశక్తి విపరీత పద్ధతుల్లో పనిచేస్తుంది,ఇందు పాండితీప్రకర్షన ప్రదర్శించడమేగాని,బ్రహ్మ జ్ఞానం అణుమాత్రం కూడా లభించదు.
పరమాత్మ ఇచ్చిన అమూల్యమైన,విలువైన సమయాన్ని వాదవివాదాలతో వ్యయ పరచడం తెలివితక్కువ పని. అది భక్తి మార్గానికి,భగవత్ అనుగ్రహణకు చేటు.
రామకృష్ణ పరమహంస ఒకరోజు ఉదయం తల నేలకేసుకొని రక్తం వచ్చేలా కొట్టుకుంటున్నారు,అప్పుడు వారి మేనల్లుడు వచ్చి ఏమైందని అడగగా " నా జీవితం లో మరో రోజుకూడా నాకు దైవదర్శనం కాకుండా వ్యర్థమైందని" కొట్టుకుంటున్న అన్నారు.
సమయాన్ని వ్యర్థ పరచక ఈక్షణమే జీవితానికి ఆఖరి క్షణం గా భావించి అనన్య భక్తి సాధన లో మునిగి తేలాలి భక్తుడు.
No comments:
Post a Comment