🙏\|/🙏 తిరుమల శ్రీవారికి నైవేద్యాలు-రకాలు🙏\|/
🌼🌹🌼 "శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు ఏమిటి? వాటిని ఎలా స్వామికి నివేదిస్తా రు?
🌼🌹🌼 తిరుమల అంటేనే అందరికీ ల డ్డూప్రసాదం గుర్తొస్తుంది. ఆయా సేవలను బట్టి చక్కెరపొంగళి, పెరుగన్నం సమర్పిస్తా రు. వెంకన్నకు కమ్మని దోసెలు, ఘాటైన మి రియాలన్నం వండి వడ్డిస్తారు. ఇవి మాత్ర మేనా? ఏడుకొండలవాడికి పూటపూటకూ ఒక రకం నైవేద్యం .కాలాన్ని బట్టి నైవేద్యం ఉంటుంది.
🌼🌹🌼 సర్వజగద్రక్షకుడైన ఏడుకొండల వాడికి నైవేద్యం ఎప్పుడు, ఏమేమి, ఏ పదా ర్థాలు, ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వం డాలి, ఎలాపెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివ న్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా ఉంది. దాని ప్రకారమే తిరుమల్లో ప్రసాదాలతయారీ, సమర్పణ జరుగుతుంది.
🌼🌹🌼 ప్రసాదాల తయారీకోసం మామి డి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండుకొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్లకొమ్మలు, ముళ్లచెట్లుగానీ వంటకు వినియోగించరు. ప్రసాదం వండేవారు వంట సమయంలో గానీ, తర్వాతగానీ వాసనచూడరు. వాసన సోకకుండా ముక్కుకు, నోటికీ అడ్డుగా వ స్త్రం కట్టుకుంటారు. శ్రీవారికి సమర్పించే దాకా బైటివారెవరూ చూడరాదు.
👉🏻మీకు స్వచ్ఛమైన తేనె కావాలంటే మేము వేప నిమ్మ చెట్ల వద్ద తేనే ఈగలు పెంపకం ద్వారా స్వచ్ఛమైన తేనెను అందిస్తున్నాం మీకు కావాల అయితే ఇప్పుడే కాల్ చేయండి 📞📞8341892985
*🙏నేవైద్య సమర్పణ 🙏*
🌼🌹🌼 ప్రసాదం సమర్పించడానికి ముం దు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధిచేస్తారు. గాయత్రీమంత్రం జపిస్తూ నీళ్లుచల్లుతారు. వండిన ప్రసాదాలను మూతపెట్టిన గంగా ళాల్లో స్వామివారి ముందుంచుతారు. స్వా మికి ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చ కుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గ ర్భాలయం తలుపులు మూసేస్తారు. విష్ణు గాయత్రిని పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసిఆకులు చల్లుతారు.
🌼🌹🌼 కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదా న్ని తాకిన అర్చకుడు స్వామి కుడిచేతికి దాన్ని తాకించి, నోటి దగ్గర పెడతారు. (స్వా మికి గోరుముద్దలు తినిపించడమన్నమాట) పవిత్రమంత్రాలుచ్ఛరిస్తూ అన్నసూక్తం నిర్వ ర్తిస్తారు. చరాచరసృష్టికర్త అయిన స్వామికి నైవేద్యంసమర్పించడమంటే, సృష్టిలో ఆక లితోనున్న సమస్తాన్నీ సంతృప్తిపరచడమే.
🌼🌹🌼 ఈ విధంగా స్వామిని వేడుకుం టూ, ముద్దముద్దకూ మద్య ఔషధగుణాలు న్న తులసాకులు కలిపిన నీటిని సమర్పిస్తా రు. నైవేద్యం సమర్పించేంతవరకూ ఆల యంలో గంటమోగుతూనే ఉంటుంది. ఘం టానాదం అంటే స్వామివారిని భోజనానికి పిలుస్తున్నట్టు గుర్తు.
🌼🌹🌼 రోజుకు 3 పూటలా స్వామికి నై వేద్యం సమర్పిస్తారు. ఉదయం 6.00 నుండి 6.30 గంటలమధ్య బాలభోగం ; 10.00 నుం డి 11.00 గంటలమధ్య రాజభోగం ; రాత్రి 7.00 నుండి 8.00 గంటలమధ్య శయనభో గం సమర్పిస్తారు.
🌼🌹🌼 తిరుమల గర్భగుడిలోని స్వామి వారి మూలవిగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికనుగుణంగానే స్వామికి ఏపూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూ డా శాస్త్రంలో నిర్దేశించారు. నైవేద్యం సమ ర్పించిన తర్వాత భక్తులకు ప్రసాదంగా పం చుతారు. ప్రత్యేకరోజుల్లో ప్రత్యేక నైవేద్యా లు కూడా సమర్పిస్తారు.
*🙏ఉదయం బాలభోగం🙏*
🥀🌿 మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహో ర, దద్దోజనం, చక్కెరపొంగలి, శాకాన్నం, రవ్వకేసరి
*🙏 మధ్యాహ్నం రాజభోగం 🙏*
🥀🌿 శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం
*🙏రాత్రి శయనభోగం🙏*
🥀🌿 మిరియాలన్నం, దోసె, లడ్డు, వడ, శాకాన్నం (వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం)
*🙏🙏అల్పాహారాలు 🙏🙏*
🥀🌿 లడ్డు, వడ, అప్పం, దోసె... యిదే స్వామివారి Menu.. ఉదయం సుప్రభాతం తో స్వామిని మేల్కొల్పిన తర్వాత అప్పుడే తీసిన చిక్కనివెన్న, నురుగుతేలే ఆవుపాలు సమర్పిస్తారు.
🥀🌿 తోమాల, సహస్రనామార్చన సేవల తర్వాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు. ఆ తర్వాత బాల భోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆ రాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొద లౌతుంది. అష్టోత్తరశతనామార్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలౌతుంది.
🥀🌿 సాయంకాలారాధన తర్వాత గర్భా లయం శుద్ధిచేసి, స్వామిని తాజాపూలతో అలంకరిస్తారు.
🥀🌿 అష్టోత్తర శతనామార్చన తర్వాత శయనభోగం సమర్పి స్తారు. అంతటితో అయిపోయినట్టుకాదు! అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపన్నం (గూడాన్నం) పెడతారు.
🥀🌿 ఇక పవళించే సమయం దగ్గరౌతుం ది. ఏకాంతసేవకు నేతిలో వేపిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పం డ్లముక్కలు, వేడిపాలు స్వామికి సమర్పి స్తారు. క్లుప్తంగా ఇది శ్రీవారి నైవేద్యాలు .
No comments:
Post a Comment