Saturday, December 28, 2024

 *నారీ శిరోమణి కణ్ణకి..*

🌸తమిళ సాహిత్యం లో సంగం కాలంనాటి 'శిలప్పదికారం' కావ్యానికి ఒక ప్రత్యేక స్థానం వుంది. ఆ కావ్య నాయిక కణ్ణకి అంటే తమిళనాట విపరీతంగా గౌరవించి ఆరాధిస్తారు.

🌿అలాటి కణ్ణకి కి పశ్చిమకనుమలలో తమిళనాడు.. కేరళ సరిహద్దుల్లో విణ్ణేట్రిపారై శిఖరాన ఒక ఆలయం కూడా నిర్మించారు.
సముద్ర మట్టానికి 5,500 అడుగుల ఎత్తున ప్రకృతి సౌందర్యాలతో అలరారే కొండలమధ్య 
దర్శనమిస్తుంది యీ ఆలయం.

🌸ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమినాడు
కణ్ణకి దేవికి ప్రత్యేక పూజలు జరుపుతారు.

🌿మదురై రాజాస్థానంలో తనకు జరిగిన అవమానానికి తీవ్ర ఆగ్రహం చెందిన కణ్ణకి మదురైని భస్మీపటలం చేసిన కణ్ణకి యీ అడవీ ప్రాంతానికి వచ్చి చేరింది.

🌸అక్కడ ఒక వేంగై చెట్టు  (Pterocarpus  marsupium, ఏగిస) కింద కూర్చుని తనకి కలిగిన కష్టానికి దుఃఖిస్తూ కూర్చుంది. ఈవిధంగా 14 రోజులు విచారంగా, అన్యాక్రాంతంగా గడిపిన కణ్ణకిని యీ ప్రాంతంలో నివసించే కోయవారి ఆదరాభిమానాలు, ఆటపాటలు కణ్ణకి 
దుఃఖాన్ని మరిపించాయి.

🌿14వ రోజున సాయంకాలం గగనవీధుల నుండి పుష్పక విమానంలో కణ్ణకి భర్తయైన కోవలన్ మరల మంగళ సూత్రం కట్టి తనతోపాటు తీసుకుని వెళ్ళేడు.

🌸అందుకే కావ్యరచయిత ఇళంగోవడిగళ్
కణ్ణకిని "సుమంగళి" గా వర్ణించారు.
ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన ఆ ప్రాంత
ప్రజలు కణ్ణకి పాతివ్రత్య మహిమకు ఆశ్చర్యపోయారు.

🌿ఈ అపూర్వ సంఘటనను చేరన్ చక్రవర్తి శెంగుట్టవన్ కి తెలియజేశారు. కణ్ణకి పాతివ్రత్య మహిమ, సౌశీల్యం, కీర్తిప్రతిష్టలు కలకాలం మహిళలందరికీ ఆదర్శప్రాయం కావాలనే ఆశయంతో..

🌸ఆ చక్రవర్తి ఉత్తరదేశం నుండి ప్రత్యేకమైన శిలలను తెప్పించి ఇప్పుడు ఆలయమున్న చోట కణ్ణకి దేవికి ఒక ఆలయం నిర్మించాడు. ఈ ఆలయంలోని కణ్ణకి మూర్తికి మంగళదేవి అని పేరు.

ఇది కణ్ణికి ఆలయ స్థల చరిత్ర...!!

🌿బ్రిటీష్ వారి కాలంలో  మంగళ దేవి కణ్ణకి 
ఆలయంలో పౌర్ణమి, నవరాత్రి, శివరాత్రి, తమిళ సంవత్సరాది, కేరళ సంవత్సరాది మొదలైన  24 ఉత్సవాలు జరిగేవి.

🌸ఇప్పుడు కేవలం చైత్రపౌర్ణమినాడు మాత్రమే అక్కడికి వెళ్లి యీ ఉత్సవం జరపడానికి భక్తులకు అనుమతి లభించింది. ఈ ఉత్సవాలకి రెండు రాష్ట్రాల నుండి అనేకమంది భక్తులు వస్తారు.

🌿శ్రీవిల్లిపుత్తూర్, మేఘమలై మార్గాలగుండా
సుమారు 40,000వేల మంది భక్తులకు
పైగా వచ్చి యీ మంగళ దేవిని దర్శించి
పూజిస్తారు.

🌸ఆ పర్వదినాన కణ్ణకిదేవి ఆకుపచ్చని పట్టు చీర ధరించి, చల్లని కృపా వీక్షణాలతో  భక్తులకు
దర్శనాన్ని అనుగ్రహాన్నిస్తున్నది.

🌿మంగళాదేవి ధర్మసంస్థ ద్వారా వచ్చిన
భక్తులకు  ఉచిత భోజన ఏర్పాట్లు జరుపుతున్నారు. ఒక కావ్యనాయికకు ఇంతటి విశిష్ట గౌరవం, మర్యాద దక్కడం అపూర్వం...        

No comments:

Post a Comment