Sunday, December 22, 2024

 *🌸మనస్సుతో కుస్తీ పడకండి* 
  🕉️🌞🌎🏵️🌼🚩

 *🍁మనస్సు... ఆలోచనలు..... మీ మనస్సు ఎక్కడికీ వెళ్ళదు. అది ఇక్కడే ఉండి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. మీరు కేవలం మీ ఆలోచనల వల్ల అలా మోసగింపబడుతున్నారు. అది ఇక్కడే ఉంది. దేని గురించో ఊహించుకుంటోంది. అది ఎక్కడికీ వెళ్ళడం లేదు. మీరు దానితో ఎంతగా మమేకం అయిపోయారంటే మీరు మీ మనస్సు మరెక్కడో ఉంది అని అనుకుంటున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీ మనస్సు మీరు నియంత్రణ చేయలేని విధంగా అంతులేని ఆలోచనలతో నిండి ఉంది. వీటితో మిమ్మల్ని మీరు గుర్తించు కుంటున్నారు. అంటే.. మీరు కాని విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకుంటున్నారు. మీరు కాని వాటితో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నప్పుడు. మీ మనస్సు అన్నది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది.* 

 *మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకుని మీ మనస్సుని ఆపాలని చూస్తున్నారు. మీరు ఒక లక్ష సంవత్సరాలు తీసుకున్నా సరే.. ఇది జరగదు. మీరు తప్పుడు గుర్తింపులన్నిటినీ విడిచి పెట్టన క్షణాన మీ మనస్సు ఒక అద్దంలా మారిపోతుంది. అప్పుడది ఏమీ చేయదు. అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఒక యంత్రాంగం. దానిలో స్పష్టత ఉన్నప్పుడే అది బాగా పని చేస్తుంది.*
*కానీ.. ఇప్పుడు మీ మనస్సు ఒక పెద్ద గందరగోళం. ఎందుకంటే.. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీరు మీ శరీరంతో.. మీరు వేసుకొన్న దుస్తులతో.. మీ జుట్టుతో.. ఎన్నో విషయాలతో.. మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు.* 

 *ఇప్పుడు మీ పొట్టలో గ్యాస్ చేరినప్పుడు, దానిని మీరు ఆపుకోలేరు కదా.. మీరు సరైన ఆహారం తినలేదు కాబట్టి, ఇది దానికి ప్రతి చర్య. అలానే.. మీరు ఎన్నో విషయాలతో గుర్తించుకున్నారు. ఇప్పుడు మీ మనస్సు అంతు లేనట్లుగా, అలా వెళ్లిపోతూనే ఉంటుంది. మీరు దానిని ఆపలేరు. మీరు ఇక్కడ కూర్చొని, ధ్యానం చెయ్యాలనుకుంటూ ఉన్నారు. మీరు ఏ బయటికి వెళ్ళడం గురించో, సినిమా గురించో, స్నేహితుడి గురించో, మరో దాని గురించో ఆలోచిస్తారు. మీకు అందరూ ఏమి చెప్పారంటే భగవంతుడి గురించి ఆలోచించండి, అన్నీ సరిగ్గానే ఉంటాయి. అని.* 

 *మీరు రాముడి గురించో, కృష్ణుడి గురించో ఆలోచించినప్పుడు మీరు రాముడితో మరియు కృష్ణుడితో కలిసి జీవిస్తున్నట్లుగా అనుభవం చేస్తారు. మనస్సు యొక్క తత్త్వం అలాంటిది.. రాముడే వచ్చి స్వయంగా మిమ్మల్ని మాట్లాడిస్తాడు. రాముడే వచ్చి మిమ్మల్ని తన రాజ్యానికి తీసుకు వెళ్తాడు. దీనిని మీరు ఆపలేరు.* 

 *కానీ, మీ మొట్ట మొదటి గుర్తింపు మీ శరీరం. మీరు మీ శరీరంతో, మీరు వేసుకొన్న దుస్తులతో, మీ జుట్టుతో, ఎన్నో విషయాలతో.. మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీ భార్యా, మీ పిల్లలూ, మీ కుటుంబం, మీ విద్యా, మీ మతమూ ఇవన్నీ అంతులేనన్ని గుర్తింపులు.. ఇన్ని గుర్తింపులతో మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అది అలా కుదరదు.* 

 *ఎందుకంటే, మీరు ఏవైతే కాదో అటువంటి విషయాలతో, మిమ్మల్ని మీరు, గుర్తించుకున్నారు. ఇక్కడ మనం మీ మనస్సుని నియంత్రించడం గురించి మాట్లాడడం లేదు. మీరు ఏది కాదో, అన్న దాని పట్ల అవగాహన పెంచుకోవాలి.* 

 *అందుకనే, నేను ప్రేమ ప్రకాశాన్ని, ఆనందమైన ఆత్మను, చైతన్య శివ శక్తిని అని ఒక చిన్న, సరళమైన సాధన చేయాలి. దీని ద్వారా మీరు మీకూ, మీ మనస్సుకీ కొంత దూరం ఏర్పరచుకోవచ్చు. ఈ దూరం ఏర్పడిన తరువాత, అది గోల చేసే మనసైనా సరే.. పర్వాలేదు. మీరు, దాని నుంచి విడవగలరు. ఒకసారి మీరు, మీ మనసు నుంచి విడిపడిపోయిన తరువాత మీరు, మీ గుర్తింపులన్నింటి నుంచీ విడవగలరు. ఎందుకంటే, ఈ మనస్సే మీలో ఈ గుర్తింపులని తయారు చేస్తూ ఉంది. అందుకని అన్ని రకాల విషయాలనూ ఆలోచించకండి. కేవలం ఈ పనిముట్టుని వాడండి. ప్రతిరోజూ రెండుసార్లు, పదిహేను నిమిషాల పాటూ, మీ గందరగోళాన్నంతా ప్రక్కన పెట్టి కూర్చోండి. మొదట మీ ఆలోచన ప్రవాహాన్ని తగ్గించుకోవడానికి ఓంకార శివ ధ్యానం (ఓంకారాన్ని) చేయండి.. తరువాత కేవలం కూర్చోండి, జరగాల్సినవి అవే జరుగుతాయి. మీరు ఏవైతే ఊహించనే లేదో అటువంటివి కూడా జరుగుతాయి...* 

 *ఏది జరిగినా మీరు దేనిని ఆపకండి, అలాగే ఆహ్వానించకండి, ఇలాంటి సాధనతో తొందరలోనే మీరు మీ మనస్సు అనే గుఱ్ఱం యొక్క కళ్ళెం అందిపుచ్చుకుని, దానిని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు, అప్పుడిక మీ మనసుతో మీరు కుస్తీ పట్టాల్సిన అవసరం ఇకముందు రాకుండా ఉంటుంది*

 *🍀సేకరణ 🌹*

🕉️🌞🌎🏵️🌼🚩

No comments:

Post a Comment