Friday, December 20, 2024

 🌹 *గంధర్వ వాహనం...!!*

🌿భారతదేశం లోని దేవాలయాలలో జరిగే వార్షిక , త్రైమాసిక , మాసిక , నిత్యోత్సవాలలో , దేవుని ఉత్సవ మూర్తులు  పలురకాలైన అలంకరణ
వాహనాలలో  ఊరేగి రావడం ఒక ఆచారంగా వస్తున్నది. 

🌸ఈ విధమైన ఊరేగింపులు ప్రజలకు కన్నులపండువ చేయడంతోపాటు ,
వారిలో ఆధ్యాత్మిక చింతనను , ధార్మిక ప్రవృత్తిని పెంపొందిస్తుంది.

🌿ఆలయ ఊరేగింపు వాహనాలు ఆగమ శాస్త్ర ప్రకారమే తయారు చేస్తారు.  'సకలాధికారం, 'మనసారం,' కాశ్యప శిల్పం' మరియు 'బ్రహ్మేయ చిత్రకర్మ శాస్త్రం' మొ.శాస్త్రాలలో పాండిత్యం గలవారితో వాహనాలు తయారుచేయిస్తారు. ఈ ఉత్సవ వాహనాలకు రకరకాల పేర్లున్నాయి.

🌹గంధర్వ వాహనం :🌹

🌸గంధర్వ వాహనం నిర్మాణానికి  అనువైన కలపను సేకరించడం దగ్గర నుండి అంచెలంచెలుగా, ఒక్కొక్క భాగం తయారు చేసుకొని , 

🌿నగిషీలు చెక్కి వాటిని రధాలు లేదా పల్లకీలకు అతకడం  వరకూ  వాహనాలు తయారుకావడానికి ఎన్నో 
పనులు వుంటాయి.

🌸వాహన నిర్మాణం పూర్తి చేసి పండితులచే శుభముహుర్తం నిర్ణయించిన రోజున ఆ నూతన వాహనాన్ని బయటికి తీసుకు వచ్చి పరిక్షిస్తారు.

🌿ఆ క్రొత్త వాహనం మీద
ఉత్సవమూర్తులను ఆశీనులనుచేసి , ఊరేగిస్తారు.ఆ వాహనం ఉత్సవ విగ్రహాల భారాన్ని ఎంతవరకు మోయగలదనే లేదా విషయాన్ని పరిక్షిస్తారు. 

🌸ఈ కార్యక్రమానికి ముందుగా  ముఖ్య స్ధపతి శిల్పం యొక్క కనులను  తెరచి సంప్రదాయానుసారంగా
ఆ విగ్రహాలకు జీవకళను ఇస్తాడు.

🌿 అన్నీ సక్రమంగా నిర్వహించిన  పిదప, శిల్పాలు చెక్కిన  స్ధపతిని
మాతృమూర్తి గాను, 
శిల్పానికి పూజలు చేసే
అర్చకులను  పితృసమానులుగాను
గౌరవించి సత్కరిస్తారు. 

🌸ఆ తరువాతే  ఆ వాహనం ఆలయ సంపదగా భావించబడుతుంది.
పాత వాహనాలతో కలిపి
నూతన వాహనాన్ని కూడా ఉత్సవ కాలాలలో ఉపయోగిస్తారు. 

🌿 ఉత్సవ వాహనాలన్నీ ఒక పెద్ద మండపంలో భద్రపరుస్తారు. 
ఆలయ ఉత్సవ వాహనాల తయారీ ద్వారా అనేక మంది వృత్తి కళాకారులకు జీవన భృతి కల్పిస్తున్నది.

🌸శిల్పులకు ,వడ్రంగులకు ,  కమ్మరులకు , జీవనోపాధి కలుగుతున్నది.
అన్ని ఆలయ వాహనాలు ఒకే పధ్ధతిలో  నిర్మించాలనే నియమంలేదు.

🌿ఆలయానికి ఆలయానికి
 వాహన నిర్మాణ విధానాలు మారుతాయి. 
'మయిలై కపాలేశ్వరుని'
ఆలయంలో  మనం చూసే వాహనాలు గంధర్వ,  గంధర్వి వాహనాలుగా చెపుతారు.

🌸దేవలోకాని కి చెందిన గంధర్వులు  కశ్యప ప్రజాపతికి అతని భార్య
అరిష్ట కి  జన్మించిన వారని పురాణాలు చెపుతాయి.

🌿 బ్రహ్మ నాసిక నుండి
 గంధర్వులు ఉద్భవించారని  
మరొక పురాణంలో వుంది.
శిల్ప మూర్తులుగా ఎక్కువ  గంధర్వుడు
కనిపిస్తాడు. 

🌸స్త్రీ గంధర్వులు అప్సరసలుగా
పిలవబడుతున్నారు .
ఈ దేవలోక గంధర్వులు
బ్రహ్మ దేవుని, చంద్రుడి ని
పూజిస్తారు. 

🌿గంధర్వులు అతీతశక్తులు కలవారు.  ఆకాశంలోఎగిరే శక్తి కలవారు.
వారు ఎక్కువ కాలం ఆకాశంలోనే విహరిస్తూ వుంటారు. 

🌸వీరు  దేవతలకు సోమరసం తయారు చేసిఇస్తూవుంటారు.
దేవలోకంలో జరిగే విందులు , వినోదాలలో  వీరు తమ నృత్యగానాలతో  ఆనందింపచేస్తారని చెప్పబడుతోంది.

🌿శిల్పులు చెక్కే గంధర్వ వాహనంలో గంధర్వశిల్పాల 
చేతులలో వీణను కలిగివుండడం
యీ విషయాన్ని ధృవ పరుస్తోంది. 

🌸గంధర్వులకు నాయకుడు
చిత్రరధుడు. పాతాళలోక వాసులైన
నాగులనే రాక్షసులు గంధర్వులకు శతృవులు. గంధర్వులను,  
అప్సరసలను చాలా సుందరాకారులుగా 
చిత్రీకరిస్తారు.

🌿ప్రాచీనకాలంలో , పెద్దల అనుమతిలేకనే , వారి ప్రమేయం లేకుండానే ప్రేమలో వున్న యువతీ, యువకులు
ఎవరికి  వారే స్వయంగా  చేసుకునే వివాహాన్ని   'గాంధర్వ వివాహం' అని అంటారు. 

🌸పురాణేతిహాసాలతోపాటూ , మన దేవాలయ శిల్పకళల ద్వారా కూడా  గంధర్వుల గురించి మనం తెలుసుకో గలుగుతున్నాము.

No comments:

Post a Comment