🔱 అంతర్యామి 🔱
# ఆత్మశుద్ధికి ...ధ్యానం.
🍁బయట ప్రపంచం ఇంద్రియాల ద్వారా మనసు మీద చేసే వరస దాడులనే మనం ఆధ్యాత్మిక పరిభాషలో వృత్తులు అంటాం. మనసు తెరపై ప్రదర్శితమయ్యే ఈ స్పందనలను నిరోధించడం సాధ్యమా? ఒకరోజులో మనలో అనేక వైవిధ్యభరితమైన స్పందనలు వస్తాయి. కోపం, చిరాకు, నవ్వు, అసూయ... ఇలా ఎన్నో భావాలను నిత్యం అనుభవిస్తాం. కొన్ని మనసుకు ఉల్లాసం కలిగిస్తే మరికొన్ని కల్లోల పరుస్తాయి. మన జీవితాల్లో రెండోవే ఎక్కువ. అలాంటి సమయంలో చిత్తవృత్తి నిరోధించడం అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే మళ్లీ మళ్లీ సంకల్పించడం, సాధన చేయడం.
రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒకేలా చూడటం అలవరచుకోవాలి. అక్కర్లేనివి పట్టించుకోకుండా, అవసరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
🍁మనం ఎప్పుడూ ఎదుటి వ్యక్తి స్వభావానికి అనుగుణంగా ఉంటాం తప్ప మన స్వభావం ప్రకారం నడచుకోం. రోజులో మనం ఎంతమందితో మాట్లాడితే అంతగా మన స్వభావాన్ని అణచిపెట్టుకుంటాం. అంటే మనల్ని మనం పోగొట్టుకుంటాం. ఎదుటి వ్యక్తి మనసెరిగి వారికి నచ్చిన మాటలే చెబుతాం. వ్యతిరేకిస్తే వారితో శత్రుత్వం ఏర్పడుతుందని భయపడతాం. అలా చేయాల్సి వచ్చినందుకు లోపల బాధపడిపోతాం. ఇది ఆరోగ్యానికి హానికరం. మన చిత్తవృత్తిని మనం దృఢం చేసుకుంటే అవతలివారివల్ల వచ్చే కోపం, ఆవేశం, విసుగు, అశాంతి... ఇవేవీ ఉండవు.
🍁ఇద్దరు మిత్రులు హోటల్ కి వెళ్లారు. కావాల్సిన పదార్థాలు వచ్చాయి. ఇంతలో మరొక వ్యక్తి అటుగా వచ్చాడు. మిత్రుల్లో ఒకరు అతడికి డబ్బు బాకీ ఉన్నాడు. అతడెక్కడ అప్పు తీర్చమని. అడుగుతాడోనని ఆందోళనతో ఇతడు సరిగా తినలేకపోతున్నాడు. అప్పు ఇచ్చినవాడికి కనిపించకూడదని మనసులో దండాలు పెట్టుకుంటున్నాడు... ఇటువంటి చిత్త వృత్తి వ్యాకులత్వాన్నే మనం జయించాలి. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడు అలలు ఉండవు. అలాగే మనం ధ్యాన నిమగ్నులమై ఉంటే ఆలోచనలుండవు. నీళ్లలోంచి లేస్తున్న అలల వంటివి మన ఆలోచనలు, అభిప్రాయాలు. అలలు ఉన్నంత సేపు నీటిలో సూర్యబింబం కూడా ముక్కలుగానే కనిపిస్తుంది.
🍁మనకు కనిపించే ప్రపంచం- మన భావాలూ అభిప్రాయాల ప్రతిరూపమే. మన మనసు కాలం, స్థలం అనే రెండద్దాల కళ్లజోడు తగిలించుకొంటుంది.
ఆ అద్దాల్లోంచి చూసి వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అనుకుంటూ ఉంటాం. అలాంటపుడు ప్రపంచమంతా మిత్ర శత్రు సమూహంగా కలగాపులగంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ప్రతిబింబించిన మన బింబాన్నే మనం చూస్తున్నాం. నీటిలో అలలు ఆగితే సూర్యబింబం చక్కగా కనిపిస్తుంది. అలాగే మనం చిత్తవృత్తుల క్లేశాలను దాటి ఎంత నిశ్చలత్వం పొందగలిగితే అంత సుందరమైన ఆత్మ కనిపిస్తుంది. అంతరంగ అవలోకనానికి, ఆత్మశుద్ధికి ధ్యానమే ఔషధం.🙏
✍️- శివలెంక ప్రసాదరావు
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
# Meditation for self-purification.
* In spiritual parlance, we call the successive attacks on the mind by the outside world through the senses. Is it possible to block these responses displayed on the screen of the mind?
We have many different reactions in a day. Anger, frustration, laughter, jealousy... we experience many emotions all the time. Some are mind-blowing while others are disturbing. The latter is more common in our lives. At such times one should practice restraint. Practicing means practicing again and again. One should get used to seeing everyone as the same, regardless of hatred. Ignore the unnecessary and be careful about the essentials.
We should always conform to the nature of the other person and not act according to our nature. The more people we talk to in a day, the more we suppress our nature. That means we lose ourselves. We say whatever the other person thinks and likes to them. If we oppose it, we fear that it will create enmity with them. We feel bad inside for having to do that. It is harmful to health. If we strengthen our will, there will be no anger, rage, boredom, restlessness caused by others.
* Two friends went to the hotel. The required materials have arrived. Meanwhile another person came by. One of the friends owed him money. Ask him to settle the debt. He is not able to eat properly because he is worried that he will ask. He is putting rods in his mind not to be seen by the person who gave the loan... We have to overcome this kind of mental and professional depression. When the water is still, there are no waves. Also if we are engaged in meditation there are no thoughts. Our thoughts and opinions are like waves rising from water. As long as there are waves, even the image of the sun is visible in the water in pieces.
The world we see is a reflection of our feelings and o
No comments:
Post a Comment