🦚🌻🌹💎🦢💜🌈
*🍁మనకు ఏనుగు,మొసలి గురించి తెలుసు కదా!భూమి పైన ఏనుగు కన్నా బలమైన జంతువు లేదు.పెద్ద పేద్ద చెట్లనూ నేలకూల్చ గలదూ.అది దాని స్థాన బలిమి.మరి ముసలి కన్నా బలమైన జంతువు నీటిలో ఉన్నదా?అలాంటి ముసలి భూమి పైకి వస్తే ఏమి జరుగుతూంది.మరి ఈ ఏనుగు నీటిలోకి దిగినప్పుడు తన శక్తి అలాగే ఉంటుందా?ఆలోచించండి.ఒకవేళ ఈ రెండు జంతువులు భూమి పైన,నీటి పైన పోరాడితే ఏది గెలుస్తుందో మనకి తెలుసు అలాగే మనం ఎంత సమర్థులమైనా మన మాట చెల్లుబడి కాదు అని అనిపించిన చోట మన ప్రజ్ఞ చూపించగూడదు.ఒకరు గుర్తించక పోయినా మనకు ఒరిగేదేమీ లేదు.అలాంటి చోట ఎరగనట్టు ఉండడమే మేలు.మూర్ఖుడు మంచి వినడు.పైపెచ్చు అవమానిస్తాడు.ఈ సంగతులు తెలిసి వేమన చక్కగా చెప్పాడు.*
*కొండ అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది..అంత మాత్రాన అది చిన్నదై పోతుందా ?అలాగే గౌరవంగా బతకాలంటే అడగందే అలాంటి వాళ్లకు సలహాలివ్వ గూడదు..ఒకరికి చాలా ఉంది.మనకు చాలినంత ఉంది అయితే వాడేమీ బంగారం తినలేడు.మనం తినేదే.. ఏదైనా ఆకలి తీరడానికే..నాకింత ఉంది అన్నా నువ్వు తినేది అదే.అంతే.అందుచేత కొంచెముండుటెల్ల కొదువగాదు అన్నాడు.సంతోషం ప్రధానం.అది ఉంటే ఇంద్రుడే..అది ప్రాప్తం లేక పోతే ఎంత ఉన్నా వేరే వాళ్లు తినడానికే.నీవు దిగులు గడుస్తూ ఉండాల్సిందే..కాబట్టి ఉన్నదాంట్లో సంతోషంగా ఉండు నాకు లేదు వాడికి ఉందని నీకున్న కొద్దీ సంతోషం కూడా పాడుచేసుకోకు..*
*🌄శుభోదయం 🌞*
🦚🌻🪷🌹🦢💎🌈
No comments:
Post a Comment