Saturday, December 21, 2024

 *శ్రీకృష్ణ లీలామృతం*

దేవాదిదేవేడు, అఖిల లోకేశ్వరుడు భగవానుడూ అయిన శ్రీమన్నారాయణుడే వాసుదేవ్ఞడుగా కృష్ణావతారంతో భూమిమీద అవతరించాడని భాగవతం, భారతం తెలుపుతున్నాయి. ధర్మరాజు అయిన యుధిష్టిరుడు రాజసూయ యాగం చేసినప్పుడు అందులో పాల్గొనడం కోసం నారదుడు మహారాజులు ఎందరో విచ్చేశారు. వారితో పాటు శ్రీకృష్ణుడు కూడా సభా మండపాన్ని అలంకరించి ఉండడం చూసి భగవానుడైన శ్రీమన్నారాయణుడు భూమండలం మీద ఆ రూపంలో అవతరించాడు. అతడు పుండరీకాక్షుడై శ్రీహరిని మనసులో స్తుతించడం మొదలు పెడతాడు. అప్పుడు కురు కులవృద్ధుడు మహాత్ముడు అయిన భీష్ముడు లేచి నిండు సభలో శ్రీకృష్ణుడే మొట్టమొదటిసారిగా పూజలు అందుకొనేవాడని ప్రకటిస్తాడు. ఇందుకు సంబంధించి సభాపర్వంలో ఉంది. ప్రత్యక్షంగా శ్రీకృష్ణుని బాల్య చరిత్ర వర్ణన మహాభారతంలో లభించదు. అయినను ప్రాసంగికంగా మహాభారతానికి చెందిన వివిధ పాత్రల ద్వారా శ్రీకృష్ణుని బాల్యలీల చరిత్ర అక్కడక్కడ వివరించదగింది. భీష్ముడు శ్రీకృష్ణున్ని ప్రప్రథమ పూజకు ప్రతిపాదించగా శ్రీకృష్ణుని బాల్యవిరోధి అయిన శిశుపాలుడు వ్యతిరేకిస్తాడు. రుక్మిణీ హరణం అయిన నాటి నుంచి అతడు కృష్ణుని మీద ద్వేషం పెంచుకుని ఉన్నాడు.

శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడే.
అది ఎలా అనగా దుష్టుడు అయిన దుశ్శాసనునిచే అవమానించబడేవేళ ద్రౌపది శ్రీకృష్ణుని ”గోవింద ద్వారకావాసిన్‌ కృష్ణ గోపిజనప్రియ, హే నాథ! హే రమానాథ ప్రజనాథార్తి నాశన అని స్మరిస్తుంది. ఈ సంబోధన వల్ల బృందావనంలో ద్వారకా కృష్ణుడు ఒక్కడే అనే విషయం స్పష్టం అవ్ఞతుంది. ద్రౌపది ఆర్తనాదాన్ని వినినంతనే శ్రీకృష్ణుడు ద్వారక నుంచి పరుగెత్తుకొని వచ్చి బ్రహ్మరూపంలో ఆమె వస్త్రంలో దాగియుండి ఆమె గౌరవాన్ని కాపాడుతాడు. పాండవ్ఞలు జూదంలో తమ సర్వస్వం కోల్పోయి కష్టాలు అనుభవిస్తున్న సమయంలో కూడా శ్రీకృష్ణుడు వారి వద్దకు వచ్చాడు. భగవద్గీత భీష్మ పర్వం నుంచి తీసుకోబడింది. అందులో శ్రీకృష్ణ భగవానుని మహత్యం వర్ణించబడింది.

తాను అజన్ముడనని, వినాశరహితుడైన ఈశ్వరుడనని, దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మసంస్థాపన కోసం, అప్పుడప్పుడు భూమి మీద అవతరిస్తానని అర్జునునకు శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు. తన జన్మ-కర్మలు దివ్యములైనవని తాత్వికముగా తెలుసుకొన్నవారు జనన మరణ వలయాల నుంచి విముక్తి పొందుతారని భగవద్గీతలో వెల్లడించాడు. మాటిమాటికి పుడుతూనే మరణిస్తూ ఉండే మామూలు మానవ మాత్రుల జన్మ రహస్యాన్ని తెలుసుకొన్న వారికి ఆవిధంగా జనన మరణ వలయం నుంచి విముక్తి కలుగుతుందా? కలుగదు కదా! భగవద్గీతలో భగవానుడు తన వలననే సమస్త జగత్తు అవతరించిందని తనలోనే లీనం అయిపోతుందని తనకంటే భిన్నమైనది ఏదీ లేదని ఉద్భోదిస్తాడు.

శ్రీకృష్ణుడు దివ్యశరరీంతో భూమిపై అవతరించి ఉన్న కాలంలో కంసుడు, జరాసందుడు, శిశుపాలుడు మొదలైనవారు ఎందరో ఆయనను సామాన్య మానవ్ఞడనుకొని అవహేళనము చేసేవారు. శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని అర్జునుడు కన్నులారా చూస్తాడు. ఆయన దివ్యదేహము నుంచి వేలాది సూర్యులు వెలువడుతుంటారు. సమస్త దేవతలు, మహర్షులు, ఇతర జీవ్ఞల సముదాయాలు ఆ స్వామి శరీరంలో విరాజిల్లుతాయి. అతనికి ఆది, మధ్యము, అంతము ఏదీ ఉండదు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన కౌరవ పక్ష మహనీయుడు పరమ పురుషుని కోరలో చిక్కి నలిగిపోతుండగా అర్జునుడు చూస్తాడు. లోకాలన్నీ ఆ స్వామి ముఖంలో విలీనం కావడం కూడా అతడు చూస్తాడు. శ్రీకృష్ణుని కళారూపాన్ని చూసి భయకంపితుడై అతన్ని ప్రార్థించడం ప్రారంభిస్తాడు. అప్పటివరకు మిత్రుడన్న భావంతో తన సాటివానిగా తలచి అతనితో వ్యవహరించిన విధమును గూర్చి అతనిని క్షమాభిక్ష వేడుకుంటాడు. అర్జునుడు భయకంపితుడు కాగా భగవానుడు తన విశ్వరూపాన్ని ఉపసంహ రించుకుంటాడు. ఈవిధంగా శ్రీకృష్ణ భగవానుడు తానే త్రిభువన మోహనకారుడై తానే జగద్రూపంలో వెలుగొందుచున్నాడు. సృష్టి సంహార క్రియలను సాగించువాడనని అర్జునునకు ప్రత్యక్షంగా చూసి హృదయంగమం చేస్తాడు. ఈవిధంగా శ్రీకృష్ణుడు తన దివ్యలీలలను భక్తులకు వివరించాడు.         

No comments:

Post a Comment