Wednesday, December 11, 2024

 *_గీత.. నరనారాయణం.._*
*_నిత్యపారాయణం..!_*

🌸🌸🌸🌸🌸🌸🌸

   *నేడు గీత జయంతి*

###############

_యుగాలు మారినా.._
_తరాలు తరలినా.._
_మారని జీవన వేదం.._
_ప్రణవనాదం.._
_కురుక్షేత్ర సంగ్రామ వేళ_
_అర్జునుని ఖేదం..._
_కృష్ణార్జునుల సంవాదం.._
*భగవద్గీత..!*

_*జాతస్య ధృవో మృత్యు*_
_*ధృవం జన్మ మృతస్యచ..*_
_అని నొక్కి వక్కాణించిన పరమాత్మ_
_జనన మరణాల_ 
_గుట్టు విప్పి_
_ఎన్నో సందేహాలను_ 
_గట్టున పడేసిన_ 
_పరమ సత్యం.._
_ద్వాపర యుగం_ 
_చివరిలో పుట్టి_ 
_కలియుగానికి మార్గనిర్దేశనం చేసిన_ _*మహాకావ్యం..*_
*_మనుష్య జాతి భవితవ్యం..!_*

_కర్మల యందే నీ ఆసక్తి.._
_వలదు కర్మ ఫలములందు అనురక్తి_
_భగవంతుడు చెప్పిన_ 
_ఈ ఒక్క మాట.._
_ఆచరిస్తే అనుసరిస్తే.._
_కలికాలం ఇలా_ _ఆకలికాలమయ్యేనా.._
_*అదే వేదమైతే*_ *_మానవజీవితమిలా_*
*_నిర్వేదమయ్యేనా..!?_*

_పద్దెనిమిది అధ్యాయాలు.._
_ఏడు వందల శ్లోకాలు.._
_దేవుని తత్వం.._
_నీ ఆత్మతత్వం.._
_సాక్షాత్తు నారాయణుడే_
_ఆచార్యుడై ప్రబోధించిన_ 
_వేదవేదాంత_ _జ్ఞానవిజ్ఞానయోగం.._
_ఏ యుగమునందైనా_ 
_చేయదగిన మహాయాగం.._
_గీత ఉనికితోనే_ 
_తరించింది ఈ జగం..!_

_భగవద్గీత_ 
_నిను నడిపే నావ_
_నీ త్రోవ.._
_నడిసంద్రంలో_
_ఆ త్రోవ చూపే దిక్సూచి.._
_నీ విరించి..విపంచి.._
_గీత నీ తలరాత.._
_నీ జీవిత పర్యంతం_ 
_వెంట ఉండి_ 
_నడిపించే తోడు.._
_మరణానంతరం_ 
_నిన్ను సద్గతులకు చేర్చే_ 
నీ పుణ్యఫలం..!
*_పఠిస్తే పాఠం.._*
*_స్పృశిస్తే పుణ్యం.._*
*_తన ఉనికితోనే నీ ఇంటిని.._*
*_జీవితాన్ని కాచే మహాగ్రంధం_*
*_పవిత్రతను వెదజల్లే సుగంధం!_*

🌸🌸🌸🌸🌸🌸🌸

*గీత జయంతి* *శుభాకాంక్షలతో..*
   
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
        9948546286

No comments:

Post a Comment