Tuesday, December 10, 2024

 *అనవసరమైన, వ్యర్థమైన విషయములకు దూరంగా ఉండండి, మీలో ఉన్న జ్ఞాన జ్యోతిని, జ్ఞాన సూర్యున్ని వెలిగించండి.*

*మౌనం పాటించండి,  ఓంకార ధ్యానం చేయండి., సమాజానికి నిస్వార్థంతో సేవ చేయండి...*

*ప్రేమతత్వం కరుణాతత్వం సేవాతత్వం అను ఈ దివ్య గుణాలను పెంచుకోండి...*

*లోక కళ్యాణార్థం మీరు తెలుసుకున్న ఈ సత్యాన్ని సమాజ శ్రేయస్సు కొరకు పంచండి...*

*మనం భగవంతునికి (పరమాత్మునికి) మరియు ప్రకృతికి శరణాగతి అయి, మనలను మనం సమర్పించుకుంటే, అందుకు ప్రతిగా భగవంతుడే మనకు లభిస్తాడు...*

*ఇది ప్రకృతి నియతి... నియమం...*

*ఈ పుడమినందు, ఈ సృష్టి నందు సమస్తము ఓంకార శక్తి స్వరూపమే...*

*సృష్టి లెక్క ఎప్పుడూ సరిగానే ఉంటుంది, భగవంతుని సృష్టిలో ఏ లోపము లేదు మిత్రమా., మన బుద్ధి ఆలోచనలే నిలకడను కోల్పోయి చిందర వందరగా  ఉన్నాయి., మన ఆలోచనలోనే లోపం ఉంది.,*

*బుద్ధిని నియంత్రించి సరైన మార్గాన్ని నిర్దేశించడానికి “ ఓంకార ధ్యానం సాధన” ఉపయోగపడుతుంది మిత్రమా...*

*ఓంకార ధ్యానం అంటే  పరమాత్ముని (పరమేశ్వరుని), ప్రకృతిని ప్రేమించడం, స్వయాన్ని (ఆత్మని) ప్రేమించడం,  మనస్సును సదా సంతోషంగా, సంతృప్తిగా ఉంచుకోవడం... మరియు మనము సదా అందరి పైన ప్రేమ భావంతో ఉండడం... ఈ పూర్తి ప్రపంచానికి (విశ్వానికి) పరమాత్ముని ప్రేమను అందించడం... మరియు కలిసి ఉండటం.!!*

 *అందువలననే “ఈ విశ్వమంతయును " శివశక్తి స్వరూపమే, ఓంకార శక్తియే" అని అన్నారు “యోగులు మహర్షులు, ఋషులు, దేవతలు, గురువులు సాధకులు...”*

*గ్రహించినవాడు యోగి...*
*గ్రహించనివాడు రోగి...*

*ప్రతిరోజు పది నిమిషాలు శుభ సంకల్పంతో, శుభ భావనతో, ప్రేమతో ఓంకారం చేద్దాం, ఓం నమః శివాయ*

*సర్వేజనా సుఖినోభవంతు.*
*లోకా సమస్త సుఖినోభవంతు.*
💥🌈🧘‍♂️ 🙏🕉️🙏 🧘‍♂️🌈💥

No comments:

Post a Comment