*ప్రస్తుతం బెంగళూరు రోడ్లపై అడుక్కుంటున్న ఓ యాచకుడి కథ వింటే కన్నీళ్లు రాక మానవు. అతడికి సంబంధించిన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్లపై అడుక్కుంటున్న అతడి గెటప్, మాట్లాడే భాష చూస్తే అస్సలు యాచకుడిలా కనిపించడు. కానీ, రోడ్లపై తిరుగుతూ ఆహారం కోసం భిక్షాటన చేస్తుంటాడు.*
*ఆర్థిక కష్టాలు ఎదుర్కొనేవారు, అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబాలకు దూరమైన వారు రోడ్లపై అడుక్కుంటూ (Beggar) ఉంటారు. సిగ్నల్స్, జంక్షన్స్ దగ్గర, గుళ్ల దగ్గర కనిపిస్తూ ఉంటారు. అయితే చాలా కొద్ది మంది మానసిక సమస్యలతో బాధపడుతూ, డిప్రెషన్‌కు గురై ఒంటరి వాళ్లు అయిపోతారు. వాళ్లు మతి స్థిమితం కోల్పోయి భిక్షాటన చేసి కడుపు నింపుకుంటారు.*
*ప్రస్తుతం బెంగళూరు (Bengaluru) రోడ్లపై అడుక్కుంటున్న ఓ యాచకుడి కథ వింటే కన్నీళ్లు రాక మానవు. అతడికి సంబంధించిన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.*
*రోడ్లపై అడుక్కుంటున్న అతడి గెటప్, మాట్లాడే భాష చూస్తే అస్సలు యాచకుడిలా కనిపించడు. కానీ, రోడ్లపై తిరుగుతూ ఆహారం కోసం భిక్షాటన చేస్తుంటాడు. ఆ యాచకుడిని చూసిన ఓ యువకుడు అతన్ని పలకరించాడు. ఫుడ్ పెట్టి అతడి బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అతడు చెప్పిన వివరాలు విని షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి అమెరికాలోని ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశాడు. మైండ్ ట్రీ కంపెనీలో ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరి సంతోషంగా జీవితం గడిపాడు. అయితే ఓ విషాద ఘటన ఈ ఇంజనీర్ జీవితాన్నే మార్చేసింది. ఆ వ్యక్తి అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, అతడి తల్లిదండ్రులు ఇండియాలో ఉంటున్నారు.*
*అతడి తల్లిదండ్రులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి చనిపోయారు. దీంతో అతడు తీవ్రి విషాదంలో కూరుకుపోయాడు. ఈ బాధలో ఉండగానే తాను ఎంతోగానో ప్రేమంచిన ప్రేమికురాలు బ్రేకప్ చెప్పేసింది. ఇలా దెబ్బ మీద దెబ్బ పడేసరికి కోలుకోలేకపోయాడు. లో లోపల కుమిలిపోవడంతో ఆందోళన, డిప్రెషన్ పెరిగి మానసిక అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటినుంచి ఉద్యోగం వదిలేసి ఇలా బెంగళూరు రోడ్లపై అనామకుడిలా తిరుగుతున్నాడు. అయితే అతడు యాచకుడిగా మారిపోయినా, అతడి మాటలు వింటే అతడు ఎంత ఉన్నత విద్యావంతుడో అర్థమైపోతుంది. అతనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. పాశ్చాత్య రచయితలు, ఫిలాసఫర్ల పేర్లు, వారు రాసిన పుస్తకాల గురించి ఎంతో క్లారిటీతో వివరించాడు.*
No comments:
Post a Comment