*ధ్యాన మార్గ*
నిజమైన ఆత్మసమర్పణ, భగవంతునిపై ఆధారపడటం అనేవి పురుషార్థానికి తుదిమెట్టు అని శాస్త్రాలలో సూచించ బడింది. కాని భగవదిచ్ఛ', లేక 'దైవేచ్ఛ' అని ఈ రోజులలో జనులు చెప్పే పద్ధతి మృత్యు చిహ్నమై ఉంది. ఇది వట్టి పిరికితనం; సోమరితనం యొక్క ఫలితం.
🕉️❤️🕉️
యువకులై, ఉత్సాహవంతులై బుద్ధిమంతులై, ధీరులై మృత్యువును
సైతం పరిహసించగలిగి, సముద్రాన్నైనా ఎదురీదడానికి సంసిద్ధులైన
కొద్దినుంది శిష్యులు మనకు కావాలి. తెలిసిందా? అటువంటి
పురుషులు మునకు వందల కొద్దీ అవసరం.
❤️🕉️❤️
పిరికిపందలకు నేనేం సలహా ఇవ్వాలి? వాళ్ళకు నేను చెప్పేదిఏమీ లేదు.... నా ఉద్దేశంలో భయంతో ముడుచుకుపోయి, బానిసను మనసుతో, గొణుగుతూ, ప్రతీదీ కష్టంగా భావిస్తూ, పతనమొనర్చే అలసత్వం... నరకం... ఈ రెండూ ఒక్కటే!
❤️🕉️❤️
సూక్ష్మమైన జ్ఞాన దృష్టి కలవానితోనే కాని సామాన్యుని దృష్టితో దీనినిచూడబడదు. ఈ శరీరంలో ఆత్మ ఉంది. మనం చనిపోయినప్పుడు ఆత్మ ఉండి
పోతుంది. 'ఉత్థామంతం' శరీరం నుంచి విడిపడి ' స్థితం వాపి' శరీరంలో పనిజేస్తున్నప్పుడు ' భుంజానం వా గుణాన్వితం' సత్త్వ, రజో, తమో గుణాలు
శరీరంలో నుండి అనుభవిస్తూ విమూఢాన అను పశ్యంతి' మూఢులు ఈ ఆత్మ
సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. 'పశ్యంతి జ్ఞాన చక్షుషః' జ్ఞాన చక్షువులుకలవారు ఇప్పుడు కూడా ఆత్మ ఉందని చూడగలుగుతారు. శరీర, మనస్సులతో
ఎల్లవేళలా అన్నిటినీ చూస్తూ జీర్ణావస్థకు వచ్చిన శరీరాన్ని పనికి రాదని వదలివేసి
ఒక చుక్క కూడా కన్నీటిని కార్చకుండా కొత్త శరీరాన్ని పొంది మరల జీవితం ఆరంభిస్తారు. మనదేశంలోనే అద్భుతమైన ఈ విషయం చెప్పబడింది. ప్రపంచంలో మరెక్కడా దీనిని వినలేదు. --స్వామి వివేకానంద
No comments:
Post a Comment