Friday, December 20, 2024

 🎻🌹🙏దేవుడికి కృతజ్ఞతలు ..!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿పూర్వం ఒక గ్రామంలో ఒకానొక ఆధ్యాత్మిక గురువు ఉండేవాడు.ఇద్దరు శిష్యులు ఎప్పుడూ ఆయన వెంటే ఉంటూ.. గురువుగారి సేవ చేస్తూ ఉండేవారు.

🌸ఒక రోజు గురువు తన ఇద్దరు శిష్యులతో దూరంలో ఉన్న ఒక పట్టణానికి బయల్దేరాడు.అడవి గుండా వెళ్లసాగారు వాళ్లు.అది శిశిర రుతువు. అడవిలో చెట్లన్నీ మోడుబారి ఉన్నాయి.ఉదయం శీతల గాలులతో శిష్యులు వణికిపోయారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రత పెరిగిపోయింది.

🌿ఇవేవీ పట్టించుకోకుండా నడుస్తూనే ఉన్నాడు గురువు. చీకటి పడే సరికి అడవి మార్గం దాటాలనే ఆలోచనలో ఉన్నాడాయన.శిష్యులకు మాత్రం నడవడం నరకంగా అనిపించింది. ఒకవైపుఆకలి.. మరోవైపు ఎండ.. భారంగా అడుగులు వేస్తున్నారు.

🌸కాసేపు విశ్రాంతి తీసుకుందామంటే.. క్రూరమృగాల బారిన పడతామనే ఆందోళన.ఏం చేయలేక మౌనంగా గురువు వెంటే సాగిపోయారు.చీకటి పడింది. ...అడవి మార్గం అయిపోయింది. ఒక గ్రామ శివారులో ఉన్న ఆలయానికి చేరుకున్నారు.ముగ్గురూ అక్కడ కూర్చున్నారు.

🌸అక్కడే ఉన్న బావిలో నీళ్లు చేదుకొని తాగారు. శిష్యులను పడుకోమన్నాడు గురువు.ఆయన కూడా విశ్రాంతి తీసుకోవాలని భావించాడు. పడుకోబోయే ముందు‘‘హే భగవాన్! ఈ రోజు నీవు చూపించిన ప్రేమకు కృతజ్ఞుడిని. ఇలాగే నీ దయ మాపై ప్రసరించుగాక’’ అని ప్రార్థించాడు.

🌿గురువు ప్రార్థన విన్న శిష్యులకు మతిపోయినంత పనైంది.ఆగ్రహంతో.. ‘‘గురువు గారూ! ఈ రోజు దేవుడు మనకేం మేలు చేశాడని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు?ఎంత కష్టపడ్డామో చూశారు కదా! కనీసం తినడానికి తిండి కూడా దొరకలేదు.ఈ కష్టాలను దేవుడు చూపించిన ప్రేమ అంటారే’ అని ప్రశ్నించారు. 

🌸దానికి గురువ
నవ్వుతూ..‘‘నాయనలారా! ఈ రోజు దేవుడు మనకు కొత్త పాఠం చెప్పాడు.కష్టాల్లో ఎలా ఉండాలో చూపాడు.సహనంతో ఉండటం నేర్పించాడు.అందుకే కృతజ్ఞతలు తెలియజేశాను’’ అన్నాడు. క్రూర మృగాల భారి నుండి కాపాడారు...
ఒక గూటికి చేర్చి సేద తీరడానికి చోటు ఇచ్చారు.

🌿ఇంతకన్నా ఏమి చేయాలి.,?
గురువు మాటలు శిష్యుల్లో పరివర్తన తెచ్చాయి. వాళ్లు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలిపి హాయిగా నిద్రపోయారు.....🚩🌞🌹🙏🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment