Saturday, December 21, 2024

 *✅తెలుసు కుందాం✅*


*🟥పొటాషియం సైనైడు తో ఎందుకు చనిపోతారు?*

🟢పొటాషియం సైనైడు నీటిలోను, రక్తంలోను బాగా కరుగుతుంది. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే దీన్ని మింగగానే అది రక్తంలోని హీమోగ్లోబిన్‌లో ఉండే ఇనుము కేంద్రానికి అనుసంధానించుకుంటుందని, తద్వారా శ్వాసక్రియలో ఆక్సిజన్‌ సరఫరా కణాలకు అందకపోవడం వల్ల మరణం సంభవిస్తుందని అనుకుంటారు. నిజానికి పొటాషియం సైనైడుకు, హీమోగ్లోబిన్‌కు మధ్య రసాయనిక ప్రక్రియ ఏమీ లేదు. నోటిలో వేసుకోగానే ఇది జీర్ణవాహిక ద్వారా త్వరగా రక్తంలో కలుస్తుంది. వెంటనే పొటాషియం, సైనైడు అయాన్లుగా విడివడుతుంది. 

ఇది కణాల్లో ఉండే 'సైటోక్రోమ్‌-సి-ఆక్సిడేజ్‌' అనే ఎంజైముతో బంధించుకుంటుంది. ఈ ఎంజైము రక్తం ద్వారా వచ్చిన గ్లూకోజ్‌ నుంచి ఎలక్ట్రాన్లను గైకొని, వాటిని శ్వాసద్వారా వచ్చే ఆక్సిజన్‌కు బదలాయించే ప్రక్రియలో ప్రధాన సంధాన కర్త. అయితే సైనైడు అయానులో బంధించుకున్నప్పుడు ఈ ప్రక్రియ జరగదు. దాంతో కణాల్లోని ఆక్సిజన్‌, గ్లూకోజ్‌ పరస్పరం వృథా అయిపోతాయి. ఫలితంగా కణాలకు శక్తి అందదు. శక్తిలేని కణాలు చేష్టలుడిగిపోవడం వల్ల మరణం త్వరగా వస్తుంది.

No comments:

Post a Comment