Monday, December 16, 2024

 *శుభ ధనుర్మాసం….*


*తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై.*🙏
           

శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు.

*1. ఆండాళ్ అని ఎవరికి పేరు?    
     = గోదాదేవి.

*2. తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?
=  సుప్రభాతం బదులుగా.

*3. ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?
= ‘భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే’ మంచిరోజు.

*4. గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?
   =  శ్రీ విష్ణు చిత్తులు.(పెరియాళ్వార్)

*5. ఆళ్వారులు ఎంతమంది?
      = 12మంది.

*6. గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?
     = భూదేవి.

*7. గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?
   = తమిళ భాష.

*8. తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?
  = నాలాయిర్ దివ్యప్రబంధము.

*9. శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?
      = 108.

*10. గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?
    = శ్రీవిల్లిపుత్తూరు.

*11. దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?
   = దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.

*12. శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?
    = 196 అడుగులు.

*13. ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?
= మూడవ పాశురం.

*14. శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?
= తిరుసాదము.

*15. శ్రీవిష్ణుచిత్తులు వారు తనకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?
= కోదై (గోదా)

*16. పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?
= గరుడాంశము.

*17. తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?
=  శ్రీవ్రతము.

*18. మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?
= పరమాత్మ చేతిలోని శంఖమువలే.

*19. శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?
= మన్మధుని

*20. తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?
= సింహం పిల్లవలె.

*21. తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?
= ధృడమైన కోరిక, పట్టుదల.

*22. కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?
= మొదటి పాశురం.

*23. శ్రీకృష్ణుడు యశోద గర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?
= దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)

*24. ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?
= రెండవ పాశురం.

*25. తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?
= వామన అవతారం.

*26. ఆళ్వార్లకు మరో పేరేమిటి?
= వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.

*27. నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?
=  మూడు.

*28. మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?
= పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.

*29. శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమిటి?
= ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).

*30. ‘పెరునీర్’ అంటే  ‘పెద్ద మనస్సున్నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?
= యమునా నది.

*31. మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?
= దానగుణం.

*32. లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?
= వర్షానికి.

*33. పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?
= పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.

*34. విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?
= ఐదవ పాశురం.

*35. విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
= నమ్మళ్వారు.

*36. తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?
= బుద్ధివ్రతం.

*37. గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?
= పిళ్ళాయ్ (పిల్లా).

*38. తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?
= ఆళ్వార్లతో.

*39. గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?
= పూదత్తాళ్వారు.

*40. తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?
= శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.

*41. కీచుకీచుమని అరిచే  ‘ఏ’ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?
= భరద్వాజ (చాతక) పక్షులు.

*42. తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?
= కులశేఖరాళ్వార్.

*43.  మనకు తెలిసిన మంచి విషయాలు పదిమందితో పంచుకోవాలని మనకు తెలియచేసే ప్రాణులేవి?
= పక్షులు.

*44. ఎనిమిదవ  పాశురంలో నిద్రలేపబడు గోపిక ఏ ఆళ్వారును సూచిస్తుంది?
= నమ్మళ్వారు.

*45. పశువులను ప్రాతఃకాలాన్నే చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పావైలో ఏమంటారు?
= శిరువీడు.

*46. భగవానుడి కౌస్తుభాంశముతో పోల్చబడిన ఆళ్వారు ఎవరు?
= కులశేఖరాళ్వార్.

*47. అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు?
= కుంభకోణం.

*48. పదకొండవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?
= ప్రీతి వ్రతం.

*49. కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వారు ఎవరు?
= పూదత్తాళ్వార్.

*50. పదమూడవ పాశురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవారు?
= శ్రీకృష్ణుని వర్గం, శ్రీరాముని వర్గం.

*51. పదమూడవ పాశురంలో శ్రీకృష్ణుని ఏ లీల తెలుపబడింది?
= బకాసుర వధ.
 
*52. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి?
= త్యాగం.

*53. శ్రీవత్సము అంశగా గల ఆళ్వారు ఎవరు?
= తిరుప్పాణి.

*54. తిరుప్పావై జీయర్ అని ఎవరికి పేరు?
= భగవద్రామానుజులు.

*55. తిరుప్పావై 30 పాశురములలో మధ్యదైన 15వ పాశురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి?
= నానేదానాయిడుగ- అంటే ‘దోషము నా యందే కలదు!’

*56. శ్రీకృష్ణుడు కువలయాపీడమను ఏనుగును సంహరించుటలో అంతరార్ధమేమి?
= అహంకారమును హతమార్చుట.

*57. పదహారవ (16వ) పాశురం నుండి ఏ వ్రతము ప్రారంభమగుచున్నది?
= దాస్య వ్రతము.

*58. గోపికలు ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు?
= నందగోపుని (భగవానుని అందించారు కనుక)

*59. కోయిల్ అనగా ఏమి?
= కోన్ అనగా స్వామి. ఇల్ అనగా స్థానము. - భగవంతుని నివాసము.

*60. నందుణ్ణి ఏ గుణము గలవానినిగా గోపికలు కీర్తిస్తారు?
= దాన గుణము.

*61. గోపికలు ‘ఎంబెరుమాన్’(మా స్వామీ) అని ఎవరిని పిలుస్తారు?
= నందుడు.

*62. భగవానుడి ధనురంశగా గల ఆళ్వారు ఎవరు?
= తిరుమంగై యాళ్వారు. 

*63. గోపికలు తమ వంశమునకు .!మంగళ దీపమని’ ఎవరిని కీర్తిస్తారు?
= యశోద.

*64. ‘శెంపొర్కజలడి’ -ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం (Golden leg) గలవాడని గోపికలు ఎవరిని కీర్తించెను?
= బలరాముడు. 

*65. నీళాదేవి ఎవరు?
= కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు.

*66. యశోద తమ్ముడు ఎవరు?
= కుంభుడు.

*67. భగవానుడి ఖడ్గము (నందకము) అంశముగా గల ఆళ్వారు ఎవరు?
= పేయాళ్వారు.

*68. ఆండాళ్ అలంకరణలో విశేషమేమిటి?
= ఎడమవైపు కొప్పు. ఎడమచేతిలో చిలుక.

*69. భగవద్రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాశురమేది?
= 18 వ పాశురం.

*70. లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి?
= 18వ పాశురం.

*71. శ్రీకృష్ణుడు శయనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది?
= కువలయాపీడము.

*72. అశ్వినీ దేవతలు ఎవరు?
= సంజ్ఞాదేవి కుమారులు ఇద్దరు- నాసత్యుడు, దన్రుడు.

*73. గోపికలు నీళాదేవినుండి ఏ వస్తువులు వరముగా పొందిరి?
= అద్దము, విసనకఱ్ఱ.

*74. తిరుప్పావై 20 వ పాశురం పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును?
= కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం.

*75. ఇరవై మూడవ పాశురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి?
= మృగరాజగు సింహము.

*76. ప్రసిద్థములైన మూడు గుహల పేర్లేమిటి?
= అహోబిలం, పాండవుల గుహ, వ్యాస గుహ.

*77. పరమాత్మ వద్ద ఎట్టి వాసన యుండును?
= సర్వగంథః -సర్వవిధ పరిమళములు.

*78. పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశము చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు?
= సింహ గర్జన.

*79. కిరీటాలు ఎన్నిరకాలు? వాటి పేర్లేమిటి?
= మూడు-కిరీటం, మకుటం, చూడావతంసము.

*80. కపిత్థవృక్షమనగా ఏ చెట్టు?
= వెలగ చెట్టు.

*81. ఇరవై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?
= భోగవ్రతము.

*82. ఇరవై ఆరవ పాశురాన్ని ఏ దివ్యదేశంలో రెండుసార్లు చదువుతారు?
= శ్రీవిల్లిపుత్తూరు.

*83. పరమాత్మ యొక్క శంఖమునకు ఏమని పేరు?
= పాంచజన్యము.

*84. ఇరవై ఏడవ పాశురంలో పేర్కొనబడిన ‘కూడార్’ ఎవరు?
= సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు.

*85. ఇరవై ఏడవ పాశురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి?
= కూడారై ప్రసాదం (108 వెండి గంగాళాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు)

*86. భగవంతుడి శిఱుపేరు (చిన్నపేరు) ఏమిటి?
= గోవింద.

*87. భగవానుడి సుదర్శన చక్రాంశముగా గల ఆళ్వారు ఎవరు?
=  తిరుమొళిశై యాళ్వారు.

*88. కృష్ణునికి, గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది?
= సూర్యునికి, కాంతికి గల సంబంధము.

*89. గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్లు ఇరవై ఎనిమిదివ పాశురంలో పాడుతుంది?
= ఆవుల వెనుక.

*90. ధనుర్మాసములో ఎన్నవ పాశురము చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయము కలదు?
= 27 వ పాశురం.

*91. పొత్తామరై అడి- అందమైన తామర పూవు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి?
= శ్రీకృష్ణునివి.

*92. భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణము?
= దాసుని లక్షణములు.

*93.  ‘అజాయమానః’ (పుట్టుక లేనివాడు) అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాటమార్చి ఏమని పలికెను?
=  ‘బహుధా విజాయతే’(అనేక విధములుగా పుట్టుచున్నాడు)

*94. సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?
= విష్ణుపోతము(విష్ణువనే ఓడ)

*95. పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?
= ఆయన దాసులే గొప్ప.

*96. ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?
= ఎన్ని జన్మలకైనా అని అర్థము.

*97. ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?
= అయోధ్య.

*98. వజ్గం అంటే ఏమిటి?
= ఓడ.

*99. ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?
= అమృత కలశం.

*100. ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?
=  ‘తిజ్గళ్ తిరుముగత్తు’- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.

*101. గోపికల దివ్యాభరణములేవి?
= కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.

*102. శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?
‘అణి పుదువై’  ఈ జగత్తుకే మణివంటిది.

*103. శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?
= పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.

*104. గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?
=  పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).
 
*105. తిరుప్పావై ఎటువంటి మాల?
= ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.

*106. శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?
= గోదాదేవి.

*107. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?
= గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.

*108. భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
= తొండరపడిప్పొడి యాళ్వార్.

ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే  శరణమ్🙏

No comments:

Post a Comment