*ధ్యాన మార్గ*
నేను బంధం లేకుండా ఉండలేను, కోపం తగ్గించుకోలేనని చెప్పవద్దు. సాధ్యం కానిదంటూ ఏమీలేదు. గొప్ప అవకాశాలున్నాయన్న నమ్మకంతో నీవు వాటిని పొందగలవు. ముందసలు చేయ
గలనన్న ఉత్తేజం వస్తే వ్యక్తి ఒకవైపు నుంచి మరొకవైపుకు మరల గలుగుతాడు.
అప్పుడు పని జరుగుతుంటుందే కానీ బంధం ఏమీ ఉండదు. బంధమన్నది పని
చేస్తున్న వాడిని , పని చేయించుకుంటున్న వాడిని ఇరువురినీ బందీలుగా చేస్తుంది.
అలా బందీలవకుండా చెయ్యవచ్చు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఎక్కడో-
అడవికి వెళ్తే తప్ప ఈ విధంగా చెయ్యలేం అని అనుకోవద్దు. అన్ని పనుల మధ్య
ఉంటూనే దీనిని సాధించవచ్చు. ఈ విషయంలో ఎప్పుడూ ! జనకుని' గురించి
ఉదహరిస్తుంటారు. నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టని వాటికి నీవు బందీవి కాకుండా
గాక, నిన్ను బాగా ఇబ్బంది పెట్టేవాటి మధ్యలో వుంటూ వాటికి నీవు బందీవి
కాకుండా ఉండడమే గొప్పని చెప్పవచ్చు.
🕉️❤️🕉️
అహంకారంతో నిండివున్న మూఢుడు, అంతా నేను చేస్తున్నానంటాడు. సృష్టికర్త అందరికీ కొద్ది పాటి అహాన్ని కూడా ఇచ్చాడు. అసలు అంతా ప్రకృతి వల్లనే జరుగుతుంటే ఆకొద్దిపాటి 'అహం' కారణంగా అన్నీ నేను చేశాను,చేస్తున్నాను అంటాడు మానవుడు.
🕉️❤️🕉️
సనాతనులు వున్నారు. వాళ్లల్లో కొందరు ''కాకదంత పరీక్షచేసే, మీ వాదాలు మాకు తెలియవు. తెలిసికొనడానికి, అర్థం చేసికోవడానికి, ప్రయత్నం చేయవలసిన అవసరం కూడ
లేదు. మీకు కావలసింది దేవుడు; ఆత్మ. ఏది ప్రకృతి కతీతమో, ఎక్కడ సుఖదుఃఖాది ద్వంద్వాలుండవో, నిత్యానందం ఎక్కడ వుంటుందో, అట్టి పరమాత్మయే మా గమ్యం” - అనీ, కొందరు “పూర్ణవిశ్వాసంతో గంగలో మునగడంచేత ముక్తి పొందవచ్చుననే నమ్మకం మాకుంది."
అనీ, కొందరు, “శివ, రామ, విష్ణ్వాదిరూపాలలో ఎవరినైనా, అతడే సర్వాంతర్యామి అయిన దేవుడని నమ్మి, అచంచల భక్తి విశ్వాసాలతో పూజిస్తే, నీకు తప్పక ముక్తి కలుగుతుందనీ" చెబుతారు. వీరి తెగకు
చెందినవాడనని చెప్పడానికి నేను గర్విస్తున్నాను.
ఇంకొక తెగవారుకూడా వున్నారు. ప్రపంచం, భగవంతుడు, ఈ కాని రెంటిని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించాలని వారు చెబుతారు. ప్రాచీన ఋషులు గొంతెత్తి మనకిలా చెప్తున్నారు. " భగవత్సాన్నిధ్యాన్ని పొందాలంటే, కామకాంచనాలను త్యజించాలి. ఈ సంసారం అనిత్యమైంది నిస్సారమైంది. ఎంత ప్రయత్నించినా, దీన్ని పరిత్యజించక భగవంతుని
పొందలేవు. అది చేయలేకపోతే బలహీనుడనని ఒప్పుకో! అంతేకానీ, ఆదర్శాన్ని మాత్రం కించపరచకు. హీనం, నశ్వరం (నశించేది) అయిన దానిపై, ఉదాత్తతను, శాశ్వతత్వాన్ని అపాదించడానికి ప్రయత్నించకు. ”
కాబట్టి వారి దృష్టిలో, ఆధ్యాత్మికతను సాధించాలన్నా, భగవంతుని పొందాలన్నా, మొదట, మీ అభిప్రాయాలలోని ఈ దాగుడుమూతలను, అసత్యాన్ని, భావచౌర్యాన్ని పరిత్యజించాలి.
Swami Vivekananda @Dhaka (March 1901).
No comments:
Post a Comment