Wednesday, October 16, 2024

 *తప్పులెన్నువారు!!!*
                 

*పరనింద మానవ స్వభావంలో సర్వసాధారణ లక్షణం. తప్పులుగా తమకు తోచేవి ఎదుటి వ్యక్తిలో కనపడినప్పుడు, ఆ మనిషిలో మరెన్ని మంచి గుణాలున్నా, ఆ తప్పులనే పట్టిచూపిస్తుంటారు కొంతమంది.* 

*తప్పులుగా వాటిని అతడు అంగీకరించక ప్రతిస్పందిస్తే, చులకనగా చూడటమే కాక, అపరాధిగా ముద్ర వేయడానికైనా వెనకాడరు.*

*మనిషి ఎప్పుడూ తప్పులే చేయడా?  మరొకరి తప్పులపై తనకంత ఆసక్తి ఎందుకని? ఇలా ఆత్మవిమర్శ చేసుకునేందుకు కొందరు అవకాశమివ్వరు.*

*సర్వం విష్ణుమయమన్నప్పుడు భగవంతుడి సృష్టిలో తప్పులెలా ఉంటాయన్న పరమ భావన మహాత్ముల్లోనే కనిపిస్తుంది.*

*గీతలో కర్మయోగం, తప్పొప్పులను విభజించి భగవంతుడు మనిషికిచ్చినదేమీ లేదని, అవి రెండూ అతడి కర్మాచరణల ఫలితాలని అంటుంది.*

*ధర్మశాస్త్రాలన్నీ అతడిని, తన అహంభావనలతోనే అవి నిర్ణయించి నిర్దేశించే న్యాయాధికారివి కావద్దంటాయి.*

*అదే వాస్తవాన్ని, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని, వేమన శతకంలోని ఒక చిన్న పద్యపాదం అతడికి చిరకాలం జ్ఞాపకం ఉండేలా చెబుతుంది.*

*ఇటాలియన్‌ మేధావి లియొనార్డో ఒకరిలో తప్పులుగా కనిపించేవి, భూతద్దాల్లో పెద్దవిగా చేసి చూపించి ప్రపంచాన్ని ఉద్ధరించాలని మనుషులనుకుంటే అది చవకబారు ప్రయత్నమంటాడు, దాన్ని మానుకొమ్మంటాడు.*

*తప్పు మీద తప్పు చేసుకుపోతున్న శిశుపాలుడు అతడు నూరు తప్పులు చేసేదాకా కృష్ణపరమాత్ముడు ఉపేక్షించి ఊరుకున్నాడు.*
*ఆతరవాతనే అతడిని సంహరించాడు.*
*తప్పు చేసే వ్యక్తికి తగినన్ని అవకాశాలిచ్చికానీ భగవంతుడు శిక్షించడని చెప్పే పురాణ గాథల అంతరార్థం అదేనని మనుషులు గ్రహించరు.*

*తప్పు చేసినప్పుడు చేసిన వాడికది తప్పని చెప్పి సరిదిద్దుకొమ్మని ఒప్పించగల కుశలత కలిగినవాడు గొప్పవాడు.*

*గౌతమ బుద్ధుడు అటువంటి మార్గదర్శకుడు.*
*కరడుగట్టిన బందిపోటు అంగుళీమాలుడి దోషభూయిష్ఠమైన ప్రవర్తనలో గుణాత్మకమైన పరివర్తనకు కారణమై ఆయన అతడిని తనకు ప్రధాన శిష్యుడయ్యే స్థాయికి చేర్చాడు.*

*తప్పులు చేసేవారికి తమ తప్పులు తెలుసుకునేందుకు భగవంతుడే సమయం ఇస్తున్నప్పుడు, సాటి మనిషి తప్పులపై అంత తొందరగా స్పందించవలసిన అగత్యం తమకేమిటని మనుషులు ఆలోచించరు. నిందారోపణలు చేస్తూ జీవించే మనిషి నిజ జీవితంలో ఎన్నటికీ విజేత కాలేడు.*

*భగవంతుడు మనుషులందరినీ దోష రహితులుగా, సమగ్రత తొణికిసలాడే పరిపూర్ణులుగా సృష్టించలేదు. తప్పులు చేయవద్దని, అవి జరగకుండా చూసుకొమ్మని మనిషి మరో మనిషికి చెప్పడం ధర్మవిరుద్ధం కాదు.*

*చేసిన తప్పు తెలియజెబుతున్నప్పుడు, తప్పు చేసిన వ్యక్తికి అది తనపై ప్రేమాభిమానాలతో, సదుద్దేశంతో జరిగిన ప్రయత్నంగా అనిపించాలి. యుక్తాయుక్తాలు నిర్ణయించే అధికారి తానన్న భావన అతడికి కలిగిస్తూ, తప్పులు సరిదిద్దాలనుకుంటే- ఈ ప్రపంచంలో అతడు ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముంటుంది.* 
 పరమగమ్యాన్ని చేర్చే మార్గంలో ప్రయాణించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 

మనస్సు కామలోభాలకు లొంగిపోయి ఆధ్యాత్మిక సాధకుడు దిగజారిపోయే ప్రమాదం నిరంతరం ఉంటుంది. 

ఎంతో పురోగతి సాధించిన వారికి తప్ప నిజమైన రక్షణ లభించదు.

ఆత్మసాక్షాత్కారం లభించే లోపల ఎంత గొప్ప భక్తుడైనా అధఃపతనం చెంది, వేదనలో మునిగిపోవచ్చు. 

కాబట్టి తగిన పురోగతి సాధించకుండా మన సామర్ధ్యం గురించి ఎక్కువగా అంచనా వేసుకుని సాహసాలు చేయకూడదు.

ఆధ్యాత్మిక సాధనను, ప్రార్థనలను ఉధృతం చేయాలి. రాత్రింబవళ్ళూ  నిరంతర ప్రార్థన, నిరంతర ధ్యానం, గాఢమైన సద్విచారణ చేస్తే అపారమైన  మంచి జరుగుతుంది.

సాధన ప్రారంభదశలో ఉన్నవారు తన మనస్సును భగవంతునికి సంబంధించిన ఆలోచనలతో నింపుతూ, వాటిని ఒక అలవాటుగా మార్చుకోవాలి.

ఒకసారి బలమైన అలవాట్లు ఏర్పడ్డాక మార్గం సుగమం అవుతుంది. అప్పుడు శ్రమ కొంత తగ్గుతుంది.   

****స్త్రీ జన్మ

 *స్త్రీ జన్మ*
                  

ఒకరోజు ధర్మరాజుకొక ధర్మసందేహం వచ్చింది. ‘స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం వుంటుంది’ అని. 
*ఇదే విషయం భీష్ముడిని అడిగాడు.

*దానికి భీష్ముడు నవ్వి “నీకొక కథ చెబుతాను. అందులో నీకు సమాధానం దొరకవచ్చు!” అని చెప్పడం ప్రారంభించాడు….

పూర్వము ‘భంగస్వనుడు’ అనే రాజు వుండేవాడు. అతను ధర్మ నిరతుడు, సత్య సంధుడు. ప్రజలను కన్న బిడ్డల కన్న మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు  సంతానము కలుగ లేదు. 

“అపుత్రస్య గతిర్నాస్తి!” అని పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడయినా లేడే అనే బాధతో  అగ్ని దేవుడిని ప్రార్ధించి అగ్నిస్తుత యజ్ఞం చేసాడు. 

అగ్ని దేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు.

 ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజయిన తన అనుమతి లేకుండా ‘భంగస్వనుడు’ యజ్ఞము చేసి నూరుగురు కుమారులను పొందడం ఆగ్రహం తెప్పించింది. అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలని అనుకున్నాడు. తగిన సమయం కోసం వేచివున్నాడు.

ఒకరోజు ‘భంగస్వనుడు’ వేటకు వెళ్లాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలా చేసాడు. 

ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది. 

 వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు. స్పటికంలా స్వచ్ఛమయిన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు.

మునిగి పైకి లేచే సరికి ఆ రాజు  ఆశ్చర్య కరంగా స్త్రీ గా మారిపోయాడు.

అయాచితంగా ప్రాప్తించిన స్త్రీత్వానికి  చాలా చింతించాడు. 

“ఈ రూపముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లలకు, పుర జనులకు ఎలా ముఖము చూపించగలను !?" అని విచారించి...
"అయినా ఇలా అడవిలో ఉండలేను కదా!" అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు.

మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కుమారుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి
అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించ సాగాడు.

కాలక్రమంలో, ప్రకృతి వైపరీత్యాన 
మునికి - స్త్రీలాగా మారిన రాజుకి 
జత కుదిరి  మోహించి వివాహమాడారు.  స్త్రీగా ఆ మునివలన అత్యంత బలసంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు.

వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో....
        
"కుమారులారా! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను. స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను. కనుక వీరు మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి." అంది. 

స్త్రీ గా మారినా ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృ వాక్య పాలకులుగా తండ్రిమాట పాటించి వారు రాజ్యాన్ని
పంచుకుని పాలించసాగారు.

ఇది చూసిన ఇంద్రుడు ‘నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది
అతడికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య బేధము కల్పించాలని’ సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి ‘భంగస్వనుడి’కి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి....
"రాజకుమారులారా ! ఏమిటీ వెర్రి ఎవరో ఎవరినో తీసుకు వచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా!? అసలు వీరి తండ్రి ఎవరు ? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు?" అని వారిలో కలతలు రేపాడు. 

అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నపుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేని పోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు. 

అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. 

చని పోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగింది.

ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలా బ్రహ్మణ రూపుడై... “అమ్మా నీవు ఎవరవు ? ఎందుకిలా రోదిస్తున్నావు " అని అడిగాడు. 

అప్పుడు ఆమె తాను యజ్ఞము చెయ్యడము కుమారులను కనడము అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము మునిద్వారా కుమారులను కనడము పూసగ్రుచ్చినట్లు చెప్పింది. 

అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై….  "రాజా! నేను ఇంద్రుడను నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను" అని చెప్పాడు. 

 దానికి  ఆమె "దేవా ! అజ్ఞానంతో
తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు అధిపతి వైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వ్యక్తినా! కనుక నన్ను దయతో రక్షించు!" అని వేడుకోగా....

ఆ మాటలకు కరిగి పోయిన ఇంద్రుడు "రాజా ! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రుల నైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను, ఎవరు కావాలో నీవే
ఎంచుకో !" అన్నాడు.

ఆమె (భంగస్వనుడు) సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంది.

ఇంద్రుడు "అదేమిటి రాజా! మిగిలిన వారు నీ కుమారులు కాదా !?" అని అడిగాడు. 

 భంగస్వనుడు "వారు కూడా నా పుత్రులే! వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా!” అని చెప్పింది. 

ఇంద్రుడు సంతోషంతో  "రాజా! నీ సత్యనిష్టకు సంతోషించాను. నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను" అని...  రాజా ! నీకు ఇంకొక వరము ఇస్తాను నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగి
ఇస్తాను" అన్నాడు.

దానికి ఆమె "మహేంద్రా ! నా కుమారులను బ్రతికించావు అదే చాలు.
స్త్రీగానే ఉంటాను" అంది. 

ఇంద్రుడు ఆశ్చర్యంతో  "అదేమిటి రాజా ! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి ?"
అని అడిగాడు. 

స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గు పడి 
"మహేంద్రా! నేను స్త్రీగా ఉండడములో ఆనంద పడుతున్నాను. ఇందులో వున్న తృప్తి నాకు పుంసత్వములో కనబడలేదు కనుక ఇలాగే ఉండి పోతాను" అంది.

దేవేంద్రుడు నవ్వి “అలాగే అగుగాక”అని ఆశీర్వదించాడు.

అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు “యుధిష్టిరా ! ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం !” అని అడిగాడు.

 స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమయిన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు.

ఒకతెకు జగములు వణకున్ అగడితమై  
   ఇద్దరు కూడిన అంబులు ఇగురున్ ।
   ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా
   పట్టపగలె చుక్కలు రాలున్ ॥

[ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. 
అంటే స్త్రీ చాలా  చాలా శక్తివంతురాలని భావము]✍️

 *యమదూత - భూలోకం* 
                 
 *యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురమ్మని పంపుతాడు.* 

 *భూలోకానికి వచ్చాడు ఆ దూత.* 

 *ఒక ఆవిడ అప్పుడే బిడ్డను ప్రసవించింది.* 

 *అంతకు ముందు వారం ఆమె భర్త చనిపోయాడు.* 

 *ఆ తల్లిని కూడా  చంపేస్తే ఆ బిడ్డ ఆలనా పాలన ఎలా అని ఆ యమదూత జాలిపడి ప్రాణాలు తీయకుండానే వెళ్ళిపోయాడు.* 

 *అదే విషయాన్నీ యమధర్మరాజుకు చెప్పగా దేవరహస్యం తెలియక నీకు ఇచ్చిన కార్యాన్ని నువ్వు చేయకుండా ఉల్లంఘించినందుకు నువ్వు నీ రూపు మారి భూలోకంలోకి వెళ్ళి దేవరహస్యం అర్థం అయ్యాకే ఇక్కడకు చేరుకుంటావని శాపం ఇచ్చాడు.* 

 *యమదూత పూర్తి నల్లని రూపంతో ఒక చోట మూలుగుతుండగా అక్కడకు ఓ దర్జీ వచ్చి చూసి జాలిపడి అతడిని ఇంటికి తీసుకు వెళ్తాడు.*
 *తన ఇంటి ముందు ఆవరణలో అతను కుట్టుమిషన్ పెట్టుకుని బట్టలు కుడుతూ జీవనం సాగిస్తాడు*  *యమదూతను తీసుకెళ్లి కూర్చోబెట్టి భార్యను పిలిచి భోజనం వడ్డించమంటాడు.* 

 *’తాను తాగేందుకే గంజి లేదు అతిథికి విందుభోజనమా?’ “అన్నం లేదు ఏమీ లేదు వెళ్ళు!” అంటుంది.* 

*యమదూత అక్కడనుండి వెళ్లిపోతుండగా మళ్ళీ ఆమె పిలిచి “సరే లోపలి రా వచ్చి బోంచేయి!” అంటది.* 

 *అప్పుడు యమదూత ఒక నవ్వు నవ్వుతాడు. అప్పుడు అతడి శరీరం కొంత భాగం బంగారు వర్ణానికి మారుతుంది.* 

 *ఆ దర్జీ “నువ్వు నా దగ్గరే ఉండి నాకు తోడుగా పని చేస్తూ ఇక్కడే ఉండొచ్చు!” అంటాడు.* 

*అలా ఐదేళ్లు గడిచాక ఓ స్థితిమంతురాలైన ఒక స్త్రీ ఇద్దరి పిల్లలతో దర్జీ దగ్గరకు వచ్చింది.* 

*ఆ ఇద్దరి పిల్లలలో ఒకడు అవిటివాడు.* 

 *కొన్ని బట్టలు ఇస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా చాలా ఖరీధైన దుస్తులు కుట్టించమని చెప్పి వెళ్ళింది.* 

 *అప్పుడు నవ్వాడు మరోసారి యమదూత.* 

 *మళ్ళీ శరీరం బంగారు వర్ణంలోకి రంగు మారింది.* 

 *మరొక పదేళ్లు గడిచింది ఇప్పుడు యమదూత బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు అప్పుడు ఓ ఐశ్వర్యవంతుడైన వ్యక్తి కారులో  వచ్చి చాలా విలువచేసే గుడ్డను ఇచ్చి తనకు ఇరవై ఏళ్లకు చినిగిపోని సూట్ ఒకటి కుట్టమని మూడురోజుల్లో వచ్చితీసుకుంటానని చెప్పి వెళ్తాడు* 

 *యమదూత రెండు రోజులు కుట్టకుండానే జాప్యం చేసి మూడో రోజు ఒక దిండు కవర్ మరియు ఒక దుప్పటిలా కుట్టేస్తాడు. అది చూసిన ఆ దర్జీ “అయ్యో ఎంత పని చేసావు ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేను ఏమి చెప్పాలి?” అని అంటుండగానే కారు డ్రైవర్ వచ్చి “అయ్యా మా యజమాని చనిపోయారు ఆయనకు దిండు కవర్ దుప్పటి కుట్టివ్వ”మని చెప్పి కుట్టినవి తీసుకుని వెళ్ళిపోతాడు* 

*అప్పుడు మరోసారి నవ్వుతాడు యమదూత. పూర్తిగా బంగారు వర్ణంలోకి మారి పైకి వెళ్లిపోతుండగా అప్పుడు దర్జీ “అయ్యా మీరెవరు? మీరు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి మూడు సార్లు మాత్రమే నవ్వారు. మీరు నవ్వినప్రతిసారి మీ రంగు మారేది కారణం చెప్పండి!”  అన్నాడు.* 

 *జరిగిన విషయం చెప్పి* 
 **మొదటి సారి..* 
 *మీ భార్య అన్నం లేదు అని చెప్పింది.* 
 *అప్పుడు ఆమె దరిద్రదేవతలాగా కనిపించింది.* 
 *మళ్ళీ బోంచేయిఅని పిలిచినప్పుడు నాకు ఆమె మహాలక్ష్మి రూపంలో కనిపించింది* 
 *అప్పుడు తెలిసింది..అభిప్రాయాలు మారుతాయి అని!* 

 **రెండవ సారి..* 
 *ఆ పిల్లవాడి  తల్లి ప్రాణాలను తీయమన్నపుడు ఆలోచించి వదిలేసాను కానీ అతనికి ఆమె కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి అతని అంగవైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా తన బిడ్డతో  సమానంగా చూసే వ్యక్తి కి దగ్గర చేసాడు.*
 *అప్పుడు అర్థం అయింది… దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఆ చోటును తప్పకుండా భర్తీ చేస్తాడు అని!* 

 **ఇక మూడోసారి..* 
 *అతడు మూడు రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు అందుకే అలా కుట్టాను. కానీ అతను ఇరవై ఏళ్లవరకూ చినిగిపోనంతగా ఒక సూట్ కుట్టమని ఇచ్చాడు.* 
 *మనం శాశ్వతం కాదు!* 
 *ఏ క్షణాన ఎవరూ పోతామో తెలియదు! ఎంత కాలం ఉంటామో తెలియదు!! కానీ నమ్మకం!!!*
 *ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ డబ్బును ఎక్కువగా పోగుచేసేస్తుంటారు. అక్రమంగా సంపాదించి చేర్చేస్తుంటారు. * 
 *ఆశతో బతికేస్తుంటారు! అని చెప్పి దేవరహస్యాలను తెలుసుకున్నాను।” అని చెప్పి వెళ్లిపోతాడు..*✍️
         ..సేకరణ. మానస సరోవరం .
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       
 Vedantha panchadasi:
బ్రహ్మాద్యాః స్తంబపర్యంతాః ప్రాణినోఽత్ర జడా అపి ౹
ఉత్తమాధమ భావేన వర్తన్తే పటచిత్రవత్ ౹౹5౹౹

5. పటచిత్రమునందు 
బ్రహ్మ విష్ణువు మొదలగు శ్రేష్ఠములైన చిత్రములు,
నీరు తృణములు మొదలగు సామాన్య చిత్రములు ఉన్నట్లే శుద్ధ బ్రహ్మము నందును బ్రహ్మాది దేవతలు గడ్డి గరిక వంటి సామాన్య ద్రవ్యములు ఆరోపింపబడుచున్నది.
బ్రహ్మ మొదలు గరిక వరకు చేతనాత్మకము,ఉత్తమము.పర్వతములు నదులు మొదలగునవి జడాత్మమకములు,అధమములు.

చిత్రార్పిత మనుష్యాణాం వస్త్రాభాసాః పృథక్ పృథక్ ౹
చిత్రధారేణ వస్త్రేణ సదృశా ఇవ కల్పితాః ౹౹6౹౹

6. ఈ పటచిత్రమునందలి మనుష్యులకు మరల వివిధములగు వస్త్రములు, చిత్రమునకు ఆధారమైన వస్త్రము వంటివే,కల్పింపబడును.
ఆ కల్పిత వస్త్రములు వస్త్రాభాసలు.

ఒక్కసారి పరిమితి నెలకొన్నచో పిదప ఇతరపరిణామములు దానివెంట సంభవించును.
అవి భౌతిక,మానసికవ్యాధులు.
సముద్రము పైభాగమున తరంగములు ఆవిర్భవించి పిదప బుడగలు మొదలగు వానిని సృజించును.

 పటచిత్రమునందు భగవంతునివంటి శ్రేష్ఠమైన చిత్రాములు  ,తరువాత వివిధ రకములైన సామాన్యచిత్రములు కూడా  ఉంటాయి. మానవులచిత్రములు,అందులోని మానవ బొమ్మలకు వస్త్రములు,
ఆ వస్త్రములకు మళ్ళీవివిధములైన రంగులును, అలంకరణకు ఆభరణములు ఇలా ప్రతిది కల్పననే.ఆ కల్పితములన్ని అభాసలు.

అలాగే శుద్ధ బ్రహ్మమునందు కూడా
బ్రహ్మాది దేవతల నుండి గడ్డి గరిక వంటి సామాన్య ద్రవ్యముల వరకు ఆరో పింపబడుచున్నవి.ఇందులో చేతనాలు(ఉత్తమమైనవి),
జడాలు(అధమములు) వరకు ఉన్నవి.

శుద్ధ చైతన్యము కేవలచైతన్యమయము,జ్ఞేయవిషయరహితము,సర్వవ్యపియునగు చిదాత్మ స్వచ్ఛము,దాని వెలుగులో సర్వజీవులు తమ నిజాత్మను తెలిసికొందురు.

మనస్సుగా,బుద్ధిగా,ఇంద్రియములుగా,అట్టి ఇతర సర్వభావనలుగా తన స్వరూపము నిషేధింపబడిన (తిరస్కరింపబడిన) పిదప శుద్ధ చైతన్యమయిన బ్రహ్మము నేను అని తెలియవలెను.

బ్రహ్మము ఏకము కావున ద్వితీయత్వాదులు ఎచటనుంచి వచ్చును.అవిద్యా కల్పితమైన వ్యవహారంలో బ్రహ్మ పరిణామం ఎన్నో రూపాలలో కనబడవచ్చు. కానీ పారమార్థక రూపంలో బ్రహ్మమొక్కటే.నామరూపాలు లేవు.

నీ ఆత్మయే పరబ్రహ్మ అని తెలుసుకోవటం వల్ల మోక్ష ఫలసిద్ధి కలుగుతుందని పరిణామ శ్రుతి బోధిస్తున్నది.       

****🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
ఒకప్పుడు రాఘవేంద్రస్వామి అలాగే త్యాగయ్య కూడా అలాగే ఈ స్థితికి చేరుకున్నారని వారి ఇష్ట దైవ పూజలు ఆపలేదని మంచినీళ్ళే వారికి తీర్థప్రసాదములు ఇచ్చేవారని వారి సినిమాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది.
అప్పటికి మూడు నెలలుగా EMI బాకీలు ఉన్నాయి. ఏమి చేయాలో అర్థం కాలేదు. విసుగు చికాకులు వెంటాడుతున్నాయి. ఇంత స్థితిలో ఉన్నా కూడా ఇష్ట దైవ పూజలు అలాగే చక్ర ధ్యానం ఆపలేదు. కొనసాగిస్తూనే ఉన్నాము.కాకపోతే ఎవరికీ ఏమీ అప్పులు లేవు. ఒక బ్యాంకు కి తప్ప. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాత్రి నన్ను బస్టాండ్ లో బస్సు ఎక్కించడానికి మా స్నేహితుని తమ్ముడు వచ్చినాడు. గురూజీ, గురూజీ ...అంటుంటాడు. వాడు మాటలలో “తను ఉన్న చేస్తున్న వృత్తిలో అనుకోని సమస్యలు వస్తున్నాయి వాటికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి స్వామి” అన్నాడు. నేను వెంటనే యధాలాపముగా అయితే పది రూపాయిలు ఇవ్వు ప్రశ్న వేసి చెబుతాను అని అడిగి ఆ డబ్బులు తీసుకున్నాను. ఎందుకంటే, బస్సు ఎక్కటానికి కూడా డబ్బులు లేవు. అలాగని ఎవరి దగ్గర చెయ్యి చాచి అడగలేని స్థితి. ఆత్మాభిమానం కదా. వాడి దగ్గర డబ్బులు తీసుకుని వాడు అడిగిన ప్రశ్నకి తగిన పరిష్కార మార్గం చూపించి బస్సు ఎక్కి వెళ్ళాను.కానీ ఈ బస్సు ప్రయాణంలో నాకు ఒక స్ఫురణ కలిగినది. అది ఏమిటంటే ఇలాంటి వారు ఎంతో మంది ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు గదా.వారికి పరిష్కార మార్గాలు చూపించే విధానం అనగా జ్యోతిష్యవేత్తగా అవతారం ఎత్తితే మంచిదే గదా అనుకొని ఆ పది రూపాయలు పెట్టుబడి తో అంతవరకూ ఎంతో మందికి ఉచితంగా జాతకాలు చెప్పే వాడిని కాస్త నా కుటుంబ పోషణార్ధం డబ్బులు తీసుకోవడం ప్రారంభించాను.ఆనాటి నుండి నేను డబ్బుల కోసం ఇక వెనుతిరిగి చూసే అవకాశమే రాలేదు. ఏ బ్యాంకు వద్ద నేను అప్పు తీసుకున్నానో ఆ బ్యాంకుకే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళాను.అనగా F.D చేశాను. డబ్బులే డబ్బులు. ఎవరిని ముట్టుకున్న వద్దన్నా డబ్బులే డబ్బులు. పదులతో పోయి లక్షల దాకా వెళ్ళిపోయినది. ఎంత అడిగితే అంత వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చే వాళ్ళు. పూజలు చేయించుకునేవారు. వీళ్లు అనుకున్నట్టుగా ఫలితాలు పొందేవారు. మేము అంటే నేను అలాగే మా భౌతిక గురువైన విచిత్ర వేదాంతి సహాయసహకారముతో కలిసి వారి కోసం హోమాలు చేస్తే వారి ఇష్టదైవాలను ఆ హోమ దేవతలుగా కనపడి అనుగ్రహించే వారు. వారి కోరికలు తీరేసరికి నాకు మించిన డబ్బులు చేరేసరికి నాలో ధన అహంకారం మొదలైంది. "ధనం మూలం ఇదం జగత్" అన్నట్లుగా డబ్బులే నా జీవిత పరమావధి అనే స్థితికి వెళ్ళిపోయాను. నా చక్ర సాధన ఏదో మ్రొక్కుబడిగా జరిగితే పూజలు మాత్రం చాలా ఆర్భాటంగా జరిగేవి.దీనికి ఫలితము  కొల్హాపూర్ నుండి మహాలక్ష్మి దేవి విగ్రహం వచ్చినది.

స్వాధిష్టాన చక్రం శుద్ధి:

ఇది ఇలా ఉండగా ఒకరోజు నేను దత్త జయంతి రోజున దత్త దర్శనం సినిమా టీవీలో వస్తుంటే చూస్తున్నాను. ఇంద్రుని కోరిక మేరకు ఆయన ఒక రాక్షసుడిని చంపటానికి అనఘాదేవి శక్తిని ఉపయోగించడం ఆమె రాక్షసుడి నెత్తి ఎక్కేదాకా చాటుగా నిలబడమని ఇంద్రునికి చెప్పడము,కొద్దిసేపటి తర్వాత నెత్తికెక్కిన అనఘాదేవిని చూసి దత్తుడు ఈల వేయడం ఇంద్రుడు వచ్చి ఈ రాక్షసుణ్ణి సంహారము చేయటం జరిగినది. ఎందుకో ఈ దృశ్యం నన్ను బాగా ఆకర్షించింది.
ఆ తర్వాత ఆయన మహాలక్ష్మి ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయో దత్తుడు స్వయంగా బోధ చేసిన దృశ్యం చూస్తుంటే స్వయంగా నాకే చేస్తున్నారేమోనని అనిపించసాగింది. మనసు వికలమైంది. దాంతో రెండు లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చుకొని ఏకధాటిగా త్రాగటం మొదలు పెట్టినాను. మందు తాగటం అలవాటు లేదు. కానీ మందుకు బదులుగా కూల్ డ్రింక్ నా దృష్టిలో అన్ని రకాల మందులతో సమానమే. బాగా తిక్క పెరిగినప్పుడు అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, విపరీతంగా తట్టుకోలేని ఆనందము వేసినప్పుడు ఈ కూల్ డ్రింక్ తాగటం నాకు అలవాటు.అప్పుడు గాని నా తిక్క తగ్గదు. ఈ విషయము మా శ్రీమతికి తెలుసు. మందు తాగే వారిని చూసాను. కూల్ డ్రింక్ మందుగా అనుకునేవారిని మిమ్మల్నే చూస్తున్నాను అని సన్నాయి నొక్కులు నొక్కటం నాకు అలవాటు అయిపోయింది. పాపము. మా తల్లి! నేను నిజముగా మందు త్రాగినా అది ఏమి అనుకోదు. నాతో కలిసి త్రాగుతుందేమోనని నా భయము. ఎందుకంటే ఎవరికి తెలుసు.ఏ చక్రము ఏ మాయ లో ఉందో! కలసి మాయలో పడదాము అన్నది అంటే స్వామిరంగా! అసలు తాగుబోతు లేని కొంప లో ఇద్దరం త్రాగుబోతులు తయారు అవుతారు. అంత అవసరమా. యద్భావం తద్భవతి అనేది ఉండనే ఉన్నది కదా. మనము ఏది త్రాగిన అది మందు అనుకుంటే సరిపోతుంది కదా అనుకునేవాడిని. ఎందుకంటే ఈ స్వాధిష్ఠాన చక్రం బలహీన పడితే ధన మాయలో లేదా మందు మాయ(త్రాగుబోతు)గామారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇదివరకే యోగ శాస్త్రాలు ద్వారా తెలుసు.

కానీ నాకున్న ధన అహంకార మాయ వలన నాకు ఈ విషయము గుర్తు లేదు. ఎప్పుడైతే దత్త దర్శనం సినిమా చూసానో అప్పుడు గుర్తుకు వచ్చాయి. అంటే మొదటిలో నేను ధనానికి విపరీతంగా ఇబ్బంది పడినానని తెలుసు గదా! అపుడే స్వాధిష్టాన చక్రం జాగృతి అయినది. ఎప్పుడైతే నాకు కావలసిన ధనప్రాప్తి కలిగినదో అప్పుడే ఈ చక్ర శుద్ధి మాయ ఆరంభమైనది. దానితో నా అవసరానికి మించి ధనము నా దగ్గర చేరుతుందని తెలుసుకొని నా జ్యోతిష్య అవతారం పరిసమాప్తి చేయాలని అనుకుంటుండగా నాకు ధ్యానములో స్వాధిష్ఠాన చక్రం బీజాక్షరమైన 'వం' అనే ఆరు దళాల పద్మము అగుపించినది.ఆ తర్వాత నా ప్రమేయం లేకుండానే నా నాలుక ఖేచరి ముద్ర వేయడం జరుగుతుంది. తద్వారా పదార్ధ రుచులు గుర్తుకు రావడం ప్రారంభమైంది. తిరుపతి లడ్డు దగ్గరనుండి మోతీ చూర్ లడ్డు దాక పదార్థ రుచులు గుర్తుకు రావటం మొదలైంది. ఎందుకంటే ఈ చక్ర గుణము రుచి చూడటము అన్నమాట. అందుకని పదార్థ రుచులు ఎప్పుడో తిన్నది గుర్తుకు వస్తున్నాయి.ఎందుకంటే ఈ పదార్ధాల రుచి మాయలో సాధకునిని పడవేయాలని ప్రయత్నాలు అన్నమాట. అంటే ధన మాయ, పదార్ధ రుచి మాయ,మందు అలవాటు మాయ ఈ చక్ర మాయలుగా నాకు అర్థం అయ్యాయి.దానితో నేను ధ్యానములో నాలికతో ఖేచరి ముద్ర అలాగే కావాలని వివిధ రకాల పదార్థాలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండగా ఒకరోజు నాకు తెలిసిన మిత్రుడు ఒకడు హిమాలయాల నుండి దొరికే సుదర్శన చక్ర విష్ణు సాలగ్రామమును ఆ నదిలో దొరికితే తీసుకొని వచ్చాడు .దానిని ఇంట్లో పెట్టుకుని పూజ చేద్దామని అనుకుంటే దానిని భరించడం తనవల్ల కాదని దీనిని ప్రతిరోజు నిత్య నైవేద్య మహాపూజలు జరపాలని చాలా నియమ నిష్ఠ గా ఉండాలని చెప్పారు. కాబట్టి మీ మిత్రుడు చాలా పూజలు చేస్తూ నిష్ఠ గానే ఉంటాడు కాబట్టి ఆయనకు ఇవ్వమని మా ఇంటికి పంపించినారట. అది నాకు ఇవ్వటం ఇష్టం లేకపోయినా వారి ఇంట్లో ఉంటే ఏమీ అనర్ధాలు జరుగుతాయో అని భయంతో వాడు నా దగ్గరికి తీసుకొని వచ్చినాడని నాకు అర్థం అయింది. ఎప్పుడైతే నేను ఈ చక్ర మాయ గురించి తెలుసుకున్నానో దాని విజయ సంకేతంగా విష్ణు సాలగ్రామం వచ్చిందని తెలిసి దానిని పూజలో పెట్టినాను.నాకు పెద్దగా తేడా ఏమీ అనిపించలేదు. కనిపించలేదు. భయం కలగలేదు.

స్వాధిష్ఠాన చక్రం ఆధీనము:

ఇది ఇలా ఉండగా నేను పూజలు జాతకాలు చెప్పటం నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ ఉండేసరికి ధన మాయ తన మాయా ప్రభావం చూపడము  ప్రారంభమైనది. అప్పటిదాకా పూజ కి కావలసిన డబ్బులు నేను అడుగుతూ ఉండే వాడిని కదా! ఎప్పుడైతే నా స్వాధిష్ఠాన చక్రము జాగృతి,శుద్ధి పూర్తి అయ్యి ఆధీనము అయ్యే సమయానికి మహాలక్ష్మి యోగమాయ చూపడం ప్రారంభమైనది. అంటే నాకు రావలసిన 8  కోట్లు వచ్చేటట్లుగా చేస్తే10 లక్షలు దాకా డబ్బులు ఇస్తామని ఒకరు, మా ఇల్లు 5 కోట్లకు అమ్మి పెడితే 15 లక్షల దాకా ఇస్తామని మరొకరు,కబ్జా అయిన మా భూమి తిరిగి వస్తే దాని మార్కెట్ విలువలో 10% ఇస్తామని ఒకరు,I.Tలో ఇరుక్కోకుండా చేస్తే దాని పరిహారముగా డబ్బులు ఇస్తామని ఇంకొకరు ఇలా పలు రకాలుగా ఆఫర్ల మీద ఆఫర్లు తో సిద్ధముగా ఉన్నాయి. వాటిని చూసి లెక్కగడితే ఒక సంవత్సరంలో నా సంపాదన 5 కోట్ల దాకా చేరుతుందని అర్థమయ్యేసరికి “వామ్మో! ఇంత డబ్బులు మనకి అవసరమా? ఎక్కువ తిన్నా కూడా అరగదు. ఇన్నాళ్ళు గల్లా పెట్టె మనల్ని కాపు కాసింది. ఎప్పుడైతే మన అవసరానికి మించి డబ్బులు చేరతాయో ఏమో భవిష్యత్తులో ఏమి అవసరమో ఏమి వస్తుందో సంపాదించే వయసులో సంపాదించుకుంటే మంచిది అని మనల్ని ముంచే డబ్బును దాచిపెడితే గల్లా పెట్టెకి మనము కుక్కలాగా కాపలా కాయాలని నాకు అర్థమైనది.ఈ ఆఫర్ల మాయలో పడితే వారి నుండి వారి కర్మ నుండి వేయి జన్మల దాక కోలుకునే పరిస్థితి నాకు రాదు” అని అర్థమై ఒకరోజు ఎవరికీ చెప్పకుండా జాతకాలు చెప్పే జ్యోతిష అవతారమును సంతోషంగా మనఃస్ఫూర్తిగా పరిసమాప్తి చేశాను.మనకు కావలసిన డబ్బులు ఎలాగో F.D ద్వారా బ్యాంకుల ద్వారా వస్తూనే ఉన్నాయి. దాంతో నా జీవితం చక్కగా గడిచిపోతుందని ఎన్నో వ్యాపార ఆఫర్లు వచ్చినా కూడా తోసిబుచ్చి నాకు కావలసిన డబ్బులతో సుఖముగా జీవిస్తూ ఎలాంటి వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా మా ఆవిడ చేయకుండా సాధనలతో కాలము వెళ్ళ బుచ్చాలని నిర్ణయించుకునేసరికి మహాలక్ష్మి ధన మాయను నా మీద నుండి సడలించే సరికి మూడు సంవత్సరములు పైగా పట్టింది.దీనికి గుర్తుగా కాశీ క్షేత్రంలో దీపావళి నాడు అన్నపూర్ణాదేవిని మహాలక్ష్మిగా బంగారు కాసులతో కొలిచి ఆ రోజు అందరికీ పంచుతారని అవి ఇంట్లో ఉంటే ఎలాంటి  మాయలు కలగవని ఆ రోజు మేము కాశీ క్షేత్రములో దీపావళి రోజున అన్నపూర్ణాదేవి సన్నిధిలో బంగారు కాసులు అందుకున్న సమయంలో తెలిసినది. దాంతో నాకు ఆనందం వేసింది.ఎందుకంటే ఈ కాసు వచ్చిన లేదా లక్ష్మీ గవ్వలు వచ్చిన లేదా లక్ష్మీ శంఖం వచ్చిన ఈ చక్ర మాయ దాటి ఆధీనం అయ్యినట్లే అని స్ఫురణకు వచ్చినది. ఇలా కొన్ని రోజుల తర్వాత నా దగ్గరకు కాశీ నుండి లక్ష్మీ గవ్వలు, రామేశ్వరం నుండి లక్ష్మీ శంఖం వచ్చి చేరినాయి.        

****అవసరాలు - కోరికలు!*

 *అవసరాలు - కోరికలు!*
                

*కోరికలు లెక్కలేనన్ని! అవసరాలు కొన్నే. అవసరాలని తీర్చుకోవచ్చు. కోరికలను తీర్చుకోలేం.* 

*కోరిక అనేది పిచ్చెక్కించే అవసరం. దానిని సంతృప్తి పరచడం అసంభవం. నువ్వు వాటిని తీరుస్తూ వెళ్ళిన కొద్ది  ఇంకా ఇంకా అడుగుతూనే ఉంటాయి.*


*ఒక సూఫీ కథ ఉంది. అలెగ్జాండర్ చనిపోయి స్వర్గానికి వెళితే ఆయన తనతో పాటు తన రాజ్యాన్ని, బంగారాన్ని , వజ్రాలను తీసుకుని వెళ్ళాడంట. ఇది నిజం కాదు. ఒక భావన, ఈ బరువు అంతా మోసుకెళ్ళడం ఆయనకు పెద్ద కష్టంగానే ఉంది.*

*అక్కడి ద్వారపాలకులు నవ్వి …“ఎందుకు ఇంత బరువును మోసుకొచ్చావు? నీకు కష్టంగా లేదా?”అని అడిగాడు.* 

*అలెగ్జాండర్ "ఇదంతా నేను సంపాదించింది!” అన్నాడు.*

*ద్వారపాలకులు ఒక త్రాసు తీసుకుని వచ్చి అలెగ్జాండర్ తెచ్చిన వాటన్నింటినీ పెట్టి, ఇంకో వైపు ఒక కన్ను పెట్టారు.* 

*అలెగ్జాండర్ యొక్క సమస్త ఐశ్వర్యం కంటే కూడా ఆ కన్నే బరువుగా ఉంది. అలెగ్జాండర్ సంపదంతా తేలిపోయింది.* 

*ద్వారపాలకుడు ఆ కన్నును చూపించి "ఇది మనిషి కన్ను. కోరికకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దీనిని సంతృప్తి పరచడం అసంభవం. అసాధ్యం. ఎంత సంపదయినా, ఎంత గొప్ప సామ్రాజ్యమయినా, ఎంత గొప్ప ప్రయత్నం అయినా దీనిని సంతృప్తి పరచడం చాలా కష్టం! " అన్నాడు.* 

*అని కొంత దుమ్ము తీసి ఆ కంట్లో చల్లాడు. అప్పుడు ఆ కన్ను ఇటూ అటూ కదిలి దాని బరువును కోల్పోయింది.*

*కేవలం అవగాహన అనే చిన్న ధూళిని కోరిక అనే కంట్లో చల్లాలి. అప్పుడు కోరిక మాయమై అవసరాలే మిగిలి ఉంటాయి.* 

*అవసరాలు కొన్నే. అవి అద్భుతంగా ఉంటాయి. అవి బరువు ఉండవు. తేలికగా ఉంటాయి. కోరికలు అసహ్యంగా ఉంటాయి. నరరూప రాక్షసుల్ని తయారు చేస్తాయి. పిచ్చివాళ్ళను సృష్టిస్తాయి.* 

*ప్రశాంతతని ఎలా ఏర్పర్చుకోవాలి అనే విషయం నువ్వు తెలుసుకోవడం మొదలు పెడితే నీకో చిన్న గది చాలు. అంత అన్నం చాలు. కొన్ని బట్టలు చాలు. ఒక ప్రియమైన వ్యక్తి చాలు.*

గమనిక :- {ఈ పోస్ట్ కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే పోస్ట్ చెయ్యబడింది.}

 *గోవిందుడు అందరివాడేలే....*
                 *దర్శన అష్టపది:*
                   

*భగవంతుడిని ఒకో మనిషి ఒకో తీరున కొలుచుకుంటారు. కొందరు స్వామి నామాన్ని నిత్యం తల్చుకుంటూ కాలం గడిపితే, మరికొందరు తమ ఇష్ట దైవానికి నిత్య కైంకర్యం చేస్తూ తమ భక్తిని చాటుకుంటారు.*

*ఇంకొందరు స్వామిని ప్రియునిగానూ, తాము ప్రేయసిగానూ భావిస్తూ మధురభక్తిలో మునిగి తేలుతూ ఉంటారు.*

*చూసేందుకు ఇవి శృంగారంలా తోచినా... జీవాత్మ పరమాత్మల కలయికే వాటి వెనుక ఉండే ఆంతర్యం అంటారు.*

*అలాంటి మధుర భక్తి కి ఔన్నత్యాన్ని తీసుకు వచ్చినవాడు "జయదేవుడు."*

*జయదేవుడు చిన్నప్పటి నుంచే కృష్ణభక్తిలో ఓలలాడేవాడు.*

*ఆ భక్తితోనే కృష్ణుడు తప్ప అన్యమెరుగని ‘పద్మావతి’ అనే దేవదాసీని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులిరువురూ నిత్యం కృష్ణ నామ స్మరణలోనే మునిగితేలేవారు.*
**********

*మహా సంగీతవేత్త అయిన జయదేవుడు కృష్ణ భక్తుడు.*
*ఒడిశా రాష్ట్రంలోని ‘కెంధు బిల్వ’  అనే ప్రదేశంలో ‘భోజదేవుడు, రమాదేవి’ అనే దంపతుల కడుపున పుట్టాడు. కారణ జన్ముడు. భార్య పద్మావతీ దేవి.*

*8 అంగాలుగా ఉండేటట్టు రాయడంతో ఆయన కీర్తనలు జయదేవుడి అష్టపదులుగా ప్రసిద్ధి.*

*ఆయన పాట పాడుతుంటే ఆమె నృత్యం చేసేది. జయదేవుని కీర్తనకు నర్తన చేసేటప్పుడు ఆమె పాదం లయ తప్పకుండా ఉండేటట్లు కృష్ణ పరమాత్ముడు జాగ్రత్తపడేవాడట.*

*భక్తులందరూ భగవానుని  పాదాలవంక చూస్తుంటే ఆయన మాత్రం ఆమె పాదాలు జయదేవుని కీర్తనలకు అనుగుణంగా పడేటట్లు శ్రద్ధ చూపడంతో ఆయనకు ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ అని ప్రస్తుతించారు.*

*ఒకసారి జయదేవుడు అష్టపదుల రచన చేస్తున్నాడు...*

*ఒక సన్నివేశంలో–*
*“ప్రియే చారుశీలే! స్మరగరళ ఖండనం మమతిరతి   మండనం దేహిపదపల్లవ ఉదారం...”అని రాశాడు.*

*అంటే ‘ఓ రాధా! నీ పైన ఉండే విశేషమైన అనురాగంతో మన్మథ బాణాలు నామీద పడి మదనతాపం అనే విషం నా తలకెక్కిపోతున్నది.  వేడి తగ్గటం లేదు. ఒక్కసారి పల్లవమైన చల్లని నీ పాదాన్ని తీసి నా తలమీద పెట్టవూ...’ అని కృష్ణుడు అన్నట్లుగా రాసాడు.*

*రాసిన తరువాత ఆయనకు – ‘ఎంత రాధమీద ప్రేమ ఉంటే మాత్రం...రాధా! నీ మీద నాకున్న మోహం చేత మదనతాపం కలిగి వేడెక్కిన నా తల మీద నీ పాదం పెట్టు..’ అంటాడా భగవానుడు..?*
*అనడు!*

*అందువల్ల నేనిలా రాయకూడదు. మరోలా రాయాలి.. అని ఆ చరణాలు కొట్టేసి.. ఘంటం పక్కనపెట్టి–*

*“పద్మావతీ! నదికివెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తా..”అని చెప్పి బయల్దేరాడు.*
*అభ్యంగనం...అంటే ఒంటినిండా నూనె రాసుకుని వెళ్ళి స్నానం చేయడం.* 

*ఇలా గడప దాటాడో లేదో మళ్ళీ జయదేవుడు వెనక్కి వచ్చాడు... “అదేమిటి మళ్ళీ వచ్చారు?” అని పద్మావతీ దేవి అడిగితే..*

*"అష్టపది పూర్తిచేయడానికి మంచి ఆలోచన వచ్చింది.” అంటూ పూర్తి చేసి వెళ్లిపోయాడు.*

*కొంతసేపటి తరువాత నదీ స్నానం ముగించుకుని జయదేవుడొచ్చాడు.*

*తాను రాసిన పుస్తకం మీద నూనెబొట్లు పడి ఉన్నాయి. “పద్మావతీ, ఇదేమిటి.. నేను కొట్టి వేసిన చరణాలు మళ్ళీ రాసి ఉన్నాయి. ఎవరు రాసారు?” అని అడిగాడు.*

*దానికామె ‘మీరేగా.. మంచి ఆలోచన స్ఫురించిందని ఇది ఉంటేనే బాగుంటుందని అంటూ అప్పుడే వెనక్కి వచ్చి రాసి వెళ్ళారుగా..”అంది.*

*”పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్ట వంతురాలివి. వచ్చింది నేను కాదు…       ఆ పరమాత్మ.”*

*స్వయంగా ఒంటికి నూనె పూసుకుని నా రూపంలో వచ్చి నేను కొట్టేసిన చరణాలు మళ్ళీ రాసిపోయారు.  ఆయన దర్శన భాగ్యం నాకు కలగలేదు. నీవు పొందావు!” అన్నాడు.*

*అందుకే వీటిని ‘దర్శన అష్టపది’ అంటారు.  ఇప్పటికీ భక్తులు ఈ అష్టపదులను ఇంట్లో వింటూ ఉంటారు.*          

****||నా దేశాన్ని మేలుకొలుపు తండ్రీ||

 *||నా దేశాన్ని మేలుకొలుపు తండ్రీ||*
                

*ఎక్కడ పవిత్ర నదుల్లో శవాలు ప్రవహించవో…*

*ఎక్కడ సామాన్యుల మృతదేహాలను  శ్మశానాలు తిరస్కరించవో…*

*ఎక్కడ నిరుపేదలను  కాసుల ఆసుపత్రులు నిరాదరించవో…*

*ఎక్కడ  ప్రాణం కంటే ప్రాణవాయువు ఖరీదు కాదో…*

*ఎక్కడ అత్యవసర మందులు నల్లబజారులో బందీకావో…*

*ఎక్కడ ఆరోగ్యం అంగడి సరుకు కాదో, ఎక్కడ ప్రజారోగ్యం కంటే ఎన్నికల ప్రయోజనాలే  పరమావధి కావో,*

*ఎక్కడ దేశం కంటే కొందరు వ్యక్తులు గొప్పవారు కాలేరో,*

*ఎక్కడ అసత్యాలూ ఆర్భాటాలూ అహంకారాలూ ఏలికలకు ఆభరణాలు కావో,*

*ఎక్కడ బడులూ ఆస్పత్రుల కంటే గుడులు గొప్పవి కావో,*

*ఎక్కడ సైన్స్ మీద అజ్ఞానం పెత్తనం  చేయదో,*

*ఎక్కడ సత్యానికీ నిర్భయత్వానికీ సంకెళ్ళు పడవో,*

*ఎక్కడ దేశద్రోహం దేశభక్తిగా..                    దేశభక్తి దేశద్రోహంగా చెలామణి కావో,*

*ఎక్కడ త్యాగాన్ని స్వార్థం..                               నిజాయితీని నిర్లక్ష్యం..,*
*దేశ లాభాన్ని సొంత లాభం కబళించవో,*
 
*అక్కడ ఆ సుందర సుప్రభాత స్వేచ్ఛా స్వర్గంలో …*

  *నా దేశాన్ని మేలుకొలుపు తండ్రీ..!!*
            (రవీంద్రుడి జ్ఞాపకంలో..)
  

****వివేక మార్గం!

 *వివేక మార్గం!*
                

 *ప్రాణులకు మంచి-చెడు తెలుసుకొనే శక్తి సహజంగానే కొంత ఉంటుంది. సింహాన్ని చూడగానే జింకలు పారిపోతాయి. కుందేళ్లు మొదలైన జంతువులను చూసి అవి అదరవు బెదరవు.  వేటగాడు పన్నిన వలలో వివేకహీనత వల్ల పశువులు పక్షులు పడుతుంటాయి. సింహం సైతం ఎరను చూసి మోసపోయి పట్టుబడుతుంది. ప్రాణులన్నింటిలో మనిషే తెలివిగలవాడు. కారణం వివేకం! అది లేకపోతే మనిషి కూడా జంతువులాగా బతకవలసి వస్తుంది. కొందరు- మోసగాళ్ల చేతిలో పడి, అవివేకంతో సర్వం పోగొట్టుకోవడం చూస్తుంటాం.*

 *అజ్ఞాన స్థితిలో చేసే నిర్ణయాలు చెడు ఫలితాలనిస్తాయి. బలవంతం, లోభం, భయం, పక్షపాతం... తదితర దుర్లక్షణాలు వివేకాన్ని నశింపజేస్తాయి. ఇటువంటి వారికి మంచిమాటలు రుచించవు.* 

*రాముడు లంకలో ప్రవేశించగానే రావణుడు సభ ఏర్పాటు గావించి తన అనుచరుల సలహాను అడిగాడు. మూర్ఖులైన పరిజనులు ‘రాజా! ఆ మనుషులూ కోతులూ మనకు ఆహారం. ఇది మనకు సంతోషించవలసిన సమయం!’ అంటూ శ్రీరామ సైన్యాన్ని పరిహసించారు. చివరకు వానరసైన్యం చేతిలో చిత్తుగా ఓడిపోయారు.*

 *విదురుడు, భీష్ముడు చెప్పిన మంచిమాటలను దుర్యోధనుడు లక్ష్యపెట్టలేదు.    తుదకు కృష్ణుడు హితవు చెప్పడానికి వస్తే, ఆయన్ని బంధించాలని ప్రయత్నించాడు. వివేకం చూపి ఉంటే అతడి రాజ్యం, ప్రాణం నిలిచేవి.*

*అసలు వివేకం అంటే ఏమిటి? ఏది వివేకం, ఏది కాదు... ఎలా తెలుసుకోవడం?*


*ఒక వ్యక్తికి ముగ్గురు కుమారులున్నారు. తన కుమారుల భవిష్యత్తును గురించి భయం పట్టుకున్నది. ముసలితనంలో తనను సంరక్షించేది ఎవరు, వీరిలో ఎవరు ఉత్తములు, వృద్ధాప్యంలో తనను ఎవరు ఆదరిస్తారు... అని అనుమానం వచ్చింది. కుమారులను వెంటపెట్టుకొని ఒక మహాత్ముడి వద్దకు వెళ్ళాడు. ఆయనకు తన సమస్యను విన్నవించుకున్నాడు.* 

 *ఆయన వారికి అరటిపండ్లు ఇచ్చి వాటిని తినమన్నాడు. వారిలో పెద్దకుమారుడు పండ్లు తిని, వాటి తొక్కలను అక్కడినుంచే ఆ ఇంటి ముందుకు విసిరిపారవేశాడు. రెండోవాడు తన దగ్గరున్న అరటి తొక్కలను ఇంటిబయట ఉన్న చెత్తకుండీలో పడవేసి వచ్చాడు. మూడోవాడు తన దగ్గరున్న తొక్కులను తీసుకొని పోయి అక్కడే ఉన్న ఆవుకు తినిపించి వచ్చాడు. ఆ మహాత్ముడు పిల్లల తండ్రితో ఇలా అన్నాడు…*

*‘మీ పెద్దవాడు పెద్ద మొద్దబ్బాయి. అతడి వల్ల నీకు గాని, సమాజానికి గాని ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా నష్టం కూడా కలుగుతుంది. ఇక మీ రెండోవాడు తెలివిగలవాడే! తాను మంచివాడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మీ మూడోవాడు పరార్థ పరాయణుడు. నీకు వృద్ధాప్యంలో తప్పక చేదోడు వాదోడుగా ఉంటాడు!’*

*ఆ తండ్రి ఆశ్చర్యంతో….   ‘ఎలా చెప్పగలరు, మీ తీర్పునకు ఏమిటి ఆధారం?’ అని ప్రశ్నించాడు.*

*‘వివేకం!’  అన్నాడు జ్ఞాని.* 

*వివేకం కంటే గొప్ప సాధనం లేదు. వివేకి తన స్థాయిని తెలుసుకొని ప్రవర్తిస్తాడు. అందరి మన్ననలను పొందుతాడు. అవసరమైతే తన పద్ధతిని మార్చుకోవడానికి వెనకాడడు.*

 *బుద్ధుడు సర్వం త్యజించాడు. వస్త్రాలు ఆడంబరానికి దారితీస్తాయి కాబట్టి, వాటిని కూడా విడిచి పెట్టాడు. ఆహారం తీసుకోవడం మానేశాడు. ఒక చెట్టు నీడలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవగాయకులు కొందరు అటుగా పోతూ ఇలా పాడుకుంటున్నారు…*

*‘వీణ తీగలను చక్కగా సవరించుకో*
కాని తెగేదాకా బిగించితివో పరికరమే పాడవును గుర్తుంచుకో!’

 *ఈ పాట విన్న బుద్ధుడు మనసు మార్చుకున్నాడు.*
 *మధ్యే మార్గాన్ని ఎంచుకున్నాడు.* 
 Vedantha panchadasi:
యథా ధౌతో ఘట్టితశ్చ లాంఛితో రంజితః పటః౹
చిదంతర్యామీ సూత్రాత్మా విరాట్ చాత్మా తథేర్యతే ౹౹2౹౹

2.  చిత్రీకరించడంలో వస్త్రము,బిగువునిచ్చుట,
రేఖాచిత్రము,వర్ణచిత్రము అనే నాలుగు అవస్థలున్నవి. జగద్రచనలో కూడా అట్లె శుద్ధ బ్రహ్మము(చిత్) అంతర్యామి సూత్రాత్మ విరాట్టు అను నాలుగు అవస్థలు గలవు.

స్వతః శుభ్రోఽ త్ర ధౌతః 
స్యాద్ ఘట్టితోఽ న్నవిలేపనాత్ ౹
మష్యాకారైర్లాంఛితః స్యాద్రఙ్జతో వర్ణపూరణాత్ ౹౹3౹౹

3. వర్ణచిత్రమునకు ఆధారమైన వస్త్రము ఇతర ద్రవ్యములతో సంయోగము లేనపుడు శుభ్రముగ ఉండును.దానినే ధౌత వస్త్రమంటాము.గంజిపెట్టుట వలన అది బిగువు పొందును.అది సిరా మొదలగు వానిచే రేఖలతో లాంఛిత మగును.ఈ రేఖాచిత్రమున తగినట్లు వర్ణములు నింపుటవలన వర్ణ చిత్రము సిద్ధమగుచున్నది.

స్వతశ్చిదంతర్యామీ తు మాయావీ సూక్ష్మసృష్టితః ౹
సూత్రాత్మా స్థూలసృష్టైవ విరాడిత్యుచ్యతే పరః ౹౹4౹౹

4.మాయాకార్యమగు అపంచీకృత భూతకార్యమగు సమిష్టి సూక్ష్మశరీరమును ఉపాధిగ జేసికొని హిరణ్యగర్భుడు సూత్రాత్మ అనబడుచున్నది.అట్లే పంచీకృత భూతకార్యమగు సమిష్టి స్థూలశరీరము ఉపాధియైనపుడు విరాట్ అనబడుచున్నది.

పరము అనగా పరమాత్మ బ్రహ్మము, స్వరూపమున శుద్ధచైతన్యము.
మాయ-విరహితమైనది.
మాయా-సమన్వితమైన బ్రహ్మము
ఈశ్వరుడు అంతర్యామి అనబడుచున్నది.

ఈశ్వరుడు అందరియందు అంతర్యామియై యున్నాడు.ఆ పరమాత్మ బాహ్యమందును వ్యాపించియున్నాడు.కనుకనే అతని స్థులశరీరము సమస్త సమిష్టి ప్రపంచము,అంతరమందును ఉన్నాడు.

కనుక సూక్ష్మశరీరము సమిష్టి సూక్ష్మశరీరమగుచున్నది.
అంతరాంతరమున ఉన్నాడు.
అందుచే కారణశరీరము మాయ
(మూలా ప్రకృతి ఆయెను)
ఆ పరమాత్మ యొకడే ఆయా ఉపాధులనుబట్టి అనేకముగానున్నాడు.

కావున జీవోపాధి ఈశ్వరోపాధిదొలగి చైతన్యమే మిగులుచున్నది.ఇటుల జీవుడే పరబ్రహ్మము.ఈ విషయమును వేదాంతశాస్త్రములు చెప్పుచున్నవి.

రంగులు,రేఖాచిత్రాలు లేనప్పుడు ధౌత వస్త్రము శుభ్రముగానే యుండును.కాని వస్త్రానికి గంజి పెట్టుటవలనను‌,రంగులు చిత్రాలవలనను,శుభ్రమైన వస్త్రానికి బదులు దానిపై వున్న రంగులు చిత్రాలు మాత్రమే సత్యం అనుకో కూడదు కదా!

బురదతో గూడిన జలము చిల్లగింజ సంబంధముతో బురదపోయి శుద్ధమగుచున్నదో, ఆలాగునే జీవాత్మయు బ్రహ్మాత్మైక విజ్ఞాన విచారణచే పరిచ్ఛిన్నత్వాది రూపాజ్ఞానదోషమును తొలగగా నిరావరణ బ్రహ్మమై ప్రకాశించుచున్నది.

బ్రహ్మముతప్ప మరేమియు లేదు. కోశములుగానీ,ఇంద్రియములుగాని ఏవియు భాసించవు.అన్నియు పరబ్రహ్మములై యున్నందున బహ్యవస్తువులును ఆంతరిక వస్తువులును పరమాత్మ స్వరూపములే.

ఆత్మ పరమాత్మమైయున్నందున నిరతిశయ నిరవధికానందమును తనలోనే తాను అనుభవించుచున్నాడు.
మనోబుద్ధ్యాది సాధన లేమియు అపేక్షింప పనిలేదు.బ్రహ్మముకన్నా వేరు లేదుగదా!

ఇది సర్వవేదాంత సిద్ధాన్తము.        

****🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹: మూలం : కపాల మోక్షం, శీర్షిక : నా స్వాధిష్టాన చక్రం అనుభవాలు - అనుభూతులు

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
మూలం : కపాల మోక్షం

 
అనుభవం మరియూ అనుభూతి :  శ్రీ పరమహంస పవనానంద



శీర్షిక : నా స్వాధిష్టాన చక్రం అనుభవాలు - అనుభూతులు



స్వాధిష్టాన చక్రం అనుభవాలు :

ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.
అలాగే ఈ చక్రానుభవాలు, ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి. మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్రానుభవాలతో పాటుగా ఈ చక్ర దైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్రదర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈ చక్రానుభవముతో పాటుగా ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్ర దైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదనలకి సంబంధించి ఆయా సాధన స్ధితిని బట్టి వస్తాయని గ్రహించండి.
 .


అక్టోబర్ 28: మా గురుదేవులుని అడిగితే “నాయనా! నువ్వు ఎప్పుడైతే ఈ స్వాధిష్టాన చక్రం జల సిద్ధి వచ్చినదో లేదో పరీక్షించినావో ఆనాటి నుండి ఈ చక్రం నెమ్మదినెమ్మదిగా బలహీన పడుతూ వస్తోంది.అది ఎప్పుడైతే బలహీనమైనదో ఆనాటినుండి నీకు మత్తు పానీయాలు, మత్తు పదార్థాల సేవనం ఆలోచనలు, సైకో తరహా లక్షణాలు నీలో ఏర్పడినాయి. ఇంకా బలహీనపడి ఉంటే నయం కాని వ్యాధులు, మూత్ర వ్యాధులు,మర్మాంగ వ్యాధులు, మానసిక వ్యాధులు కలుగుతాయి. కాబట్టి శలభాసనం, మార్జాలాసనం, మకరాసనం, భుజంగాసనం ఆసనాలు వేస్తూ ఆరునెలలపాటు పెరుగన్నం తింటే ఈ చక్రం బలపడుతుంది” అని చెప్పటం జరిగినది.దానితో మరో ఆరు నెలల పాటు ఆయన చెప్పినట్లుగా చేసాను. అప్పుడు నాకు ధ్యానంలో ధన సంబంధ ఆలోచనలు, మత్తు పదార్థాల సేవనం ఆలోచనలు,  మత్తు పానీయాలు సేవనం  ఆలోచనలు తగ్గటం ఆరంభించి నాయి. ధ్యానం మీద తిరిగి ధ్యాస పెరిగినది.
P17:
జనవరి 10: ఈ రోజు నాకు హిమాలయాలలో దొరికే విష్ణు సాలగ్రామం దొరికినది. దానిని పూజలో ఉంచాను.
జనవరి 30: ఈ రోజు నాకు కాశీక్షేత్రము నుండి లక్ష్మి గవ్వలు వచ్చినాయి. వీటితో గవ్వల ప్రశ్నలు వేయటం ఆరంభించాను.
ఫిబ్రవరి 18: ఈరోజు నాకు రామేశ్వర క్షేత్రములో నుండి లక్ష్మీ శంఖం వచ్చినది. పూజలో ఉంచినాను.
మార్చి 2:ఈ రోజు నా ఇంటికి వెంకన్న స్వామి సహిత మహాలక్ష్మి విగ్రహ మూర్తి వచ్చినది.నవరాత్రి పూజలో,శ్రావణ మాస పూజలో,దీపావళి పూజలో లక్ష్మిపూజ చెయ్యడం ఆనవాయితీగా అయినది.
నవంబరు 10:ఈ రోజు లక్ష్మి దీపావళి.లక్ష్మి పూజ అయినది.విచిత్రంగా నాకు ధ్యానములో వైకుంఠములో ఉన్న లక్ష్మి నారాయణ మూర్తి సజీవ మూర్తిగా నన్ను ఆశీర్వదించినట్లుగా లీలగా అనిపించినది. ఆపై శూన్యములో అదృశ్యమైనారు. అంటే లక్ష్మి నారాయణలు గూడ శాశ్వతము గాదని నాకు అర్ధమైనది.
ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి.కాని ఈ అనుభవ భావాలు కలిగినపుడు నాకు వివిధ రకాల ధ్యాన,ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి.వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను.జాగ్రత్తగా చదివి అర్ధము చేసుకోండి!
**************
నా స్వాధిష్టాన చక్రం అనుభవాలు :

మేమిద్దరము స్వాధిష్ఠాన చక్రము మీద దృష్టి పెట్టి దాన్ని జాగృతి చేసుకోవాలని ధ్యానం చేస్తున్న కూడా తిరిగి మహాగణపతి స్వరూపం ధ్యానమునందు తరచుగా ఇలా 41 రోజుల పాటు కనపడసాగింది.మా ఇద్దరికి కారణమేమిటో తెలియరాలేదు.అంటే మూలాధార చక్ర సాధన ఇంకా పూర్తి కాలేదా అనే సందేహంలో సతమతమవుతుండగా ఒక రోజు ధ్యానంలో ఒక తెల్లని దివ్య మణి కనిపించసాగినది.ఇది ఏమిటి క్రొత్తగా?ఈ మణిని ఎక్కడ ఎప్పుడు గూడ చూడలేదు అనుకుంటూ మా ధ్యానాలు వాడేమో శ్రీశైలంలో నేనేమో మా ఇంటిలో ధ్యానాలు చేస్తుంటే ఇలా మణి దర్శనాలు రావడము ఆరంభమైనది.దీని సంకేతము ఏమిటో మాకు అర్ధము కాలేదు.కొన్ని రోజుల తర్వాత ఈ మణి లోపల మాకు కనిపించే మహా గణపతి ఉన్నట్లుగా అగుపించడము ఆరంభమైనది.వామ్మో!ఇది ఏమిటి?మణి మరియు గణపతి కలిస్తే వచ్చేది గణపతిమణి అంటే మనకి గణపతిమణి గూర్చి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నాడా?అసలు ఇంతవరకు శమంతక మణి,నాగ మణి,కౌస్తుభ మణి,రుద్ర మణి ఇలా వీటి గూర్చి పుస్తకాలలో చదివినట్లుగా గుర్తు. కాని ఎక్కడ గూడ ఈ గణపతిమణి గూర్చి చదివినట్లుగా లేదు అనుకుంటూ ధ్యానము చెయ్యడం ఈ గణపతిమణి రూపము కనపడటంతో దాని వెలుగులకి మా కళ్ళు మూసి ఉన్న గూడ తట్టుకోలేకపోవడముతో ధ్యాన భంగమై కళ్ళు తెరవడము ఈ మధ్య చాలా తరచుగా జరుగుతున్నది.ఇది ఇలా ఉండగా ఒక రోజు నా దగ్గరికి కాశీఖండము పుస్తకము నా దగ్గరికి వచ్చింది. దాని మొదటి పేజీ తీయగానే దానిపైన మహా చింతామణి గణపతి అని ఉంది. దాని ఫోటో కూడా ఉంది.దానిని చూడగానే నాకు వెంటనే స్ఫురణ వచ్చి అంటే ఇన్నాళ్లు మనకి ధ్యానములో కనిపించేది గణపతి మణి కాదని చింతామణి గణపతి అన్నమాట.

ఇది మీ ఇంట్లో ఉంటే అన్ని రకాల చింతలు తొలగిస్తాడు.అందుకే ఈ మణికి చింతామణి అనే పేరు వచ్చినట్లుగా మహాశివుడుకి ఉన్న అన్ని రకాల చింతలు డుండి గణపతి తీర్చటం వలన ఆయనకి చింతామణి గణపతిగా స్వయంగా మహా శివుడే నామకరణం చేసినట్లుగా ఈ పుస్తకములో చదవడము జరిగినది. అంటే మూలాధార చక్ర సాధన పరిసమాప్తి అయింది అనటానికి సూచనగా చింతామణి గణపతి వస్తాడని మాకు అర్థమయింది. కానీ ఎలా?ఈ కాలంలో అది ఎక్కడ ఉంది? అది మాకు ఎలా వస్తుంది? అది తీసుకుంటే మాయలో పడతామా లేదా మాయ దాటుతామా? ఏమీ అర్ధం కాని స్థితి అన్నమాట.అక్కడ ఇదే పరిస్థితిలో శ్రీశైలంలో మా జిజ్ఞాసి కూడా ఉన్నాడు. వాడికి అది చింతామణి గణపతి అని తెలిసినది.
వాడికి దాని మీద ఏదో తెలియని ఆసక్తి మొదలై దానిని ఎక్కడ ఉన్న ఎలాగైనా సంపాదించాలనే ఆశ పుట్టింది.ఆశ మాయ అంటే ఇదే కాబోలు. ఆశ, భయము, ధన, కాంత, స్పందన మహామాయలు వస్తాయని యోగులు తమ అనుభవాల ద్వారా లోకానికి తెలియ చేసినారు. ఇందులో మనవాడు అలాగే నేనుగూడ మాకు తెలియకుండా చింతామణి చూడాలని ఆశ నాకు ఉంటే దానిని ఎలాగైనా పొందాలని ఆశ వాడికి కలిగినది. మేము ఆశ మాయలో కూడా ఉన్నామని గ్రహించలేని స్థితి అన్నమాట.ఇలా కొన్ని రోజుల తర్వాత మా వాడికి ధ్యానంలో చింతామణి ఎక్కడ ఉందో ఏ రూపంలో ఉందో కనపడ సాగింది. వెంటనే వాడు తనకి ధ్యానములో కనిపించిన చోటుకి వెళితే అక్కడ నల్లటి, తెల్లని,జేగురు శిల ముక్క కనపడినది.దానిని చూస్తుంటే కూర్చుని ఉన్న గణపతి ఆకారంగా ఉంది కానీ అది మణి లాగా మెరవడం లేదని మణికాంతులు లేవని నాకు టెలిపతి ద్వారా తెలియజేసినాడు. నాకు దాంతో ఎలాగైనా దానిని ఒకసారైనా చూడాలని ఆశ కలిగినది.కానీ ఆ అవకాశమే లేదు. మేమిద్దరం కూడా మా సాధన పరిసమాప్తి అయ్యేదాకా ఒకరినొకరు ప్రత్యక్షంగా ఎదురు పడకూడదని అనుకున్నాము కదా.! కానీ లే, ఏమి చేద్దాం అనుకున్నాను. వాడికి దొరికిన శిలను వాడు పరీక్షలు చెయ్యటం మొదలు పెట్టినాడు. “నాకు ఆకలి వేస్తుంది నీవు నిజముగా చింతామణివి అయితే ఈ చింతను తొలగించు” అనగానే ఎవరో భక్తుడు ఇక్కడికి వచ్చి చక్కెర పొంగలి ప్రసాదంగా ఇచ్చి వెళ్లినాడట. అయితే ఇప్పుడు “నాకు విపరీతమైన దాహం వేస్తోంది దాని చింత తీర్చు” అనుకోగానే “స్వామి! నా దగ్గర మంచినీళ్లు డబ్బాలు మూడు దాకా ఉన్నాయి. అవి నాకు అవసరం లేదు. బరువు తగ్గుతుంది కదా.ఈ బాటిల్స్ తీసుకోండి” అంటూ ఒక యువకుడు వచ్చి వాటర్ బాటిల్స్ ఇచ్చాడట. ఈసారి ఇలా కాదనుకొని దుఃఖ చింత లేకుండా చెయ్యి చూద్ధాం అనుకున్నాడట. కొన్ని నిమిషాల తర్వాత ఎవరో పిలిచినట్లు ఒక సాధువు తన దగ్గరికి వచ్చి “స్వామి! మీరు కూడా సన్యాస దీక్ష లో ఉన్నారా? మంచిది. ఇంత చిన్న వయసు లోనే దీక్ష తీసుకున్నారా? మంచిది. ఆశా మోహాలు చేదించి పరమాత్మ వైపు నడవాలని అనుకుంటున్నారు. మీలాంటి వారికి మాలాంటి వారికి చింతలు తప్పడం లేదు. ఆకలి దప్పికలు బాధలు ఉండనే ఉంటాయి. కానీ దుఃఖ బాధ కూడా ఉంటుంది. ఏమీ లేదు స్వామి! కొన్ని సంవత్సరాల నుండి నేను ఒకరితో కలిసి సాధన చేస్తున్నాను. రాత్రి వాడికి ఉన్నట్టుండి విపరీతమైన ఆయాసం వచ్చి గుండెనొప్పి అంటూ గుండె పట్టుకొని చనిపోయాడు. వాడిని అలా చాలా దగ్గరగా చూసిన వాడిని, వాడి చావును కూడా చూసే సరికి ఆపుకోలేని దుఃఖం వస్తుంది. అన్నీ వదిలేసిన మనకి దుఃఖం  దేనికి స్వామి. దానిని కూడా వదిలేయాలి. స్వామి! వదిలేయాలి అంటూ వీరావేశముతో అతనికి చెప్పి దుఃఖమును జయించాలి జయించాలి దానికి చింత తొలగించుకోవాలి” అంటూ వెళ్ళిపోయాడట. మన వాడికి నోట మాట రాలేదట. దీనిని ఏమి అడిగితే, అది తీరుస్తుందని మనకున్న చింతలు తొలగిస్తుందని గ్రహించి దానికి నమస్కారాలు చేస్తూ “చింతామణి గణపతి! నన్ను క్షమించు. నీవు నా దగ్గరికి వచ్చి గంట కూడా కాలేదు. అంతలోనే నా మనస్సుకి ఎన్నో కోరిక చింతలు కల్గించావు. వాటిని తీర్చావు. అదే నీవు నా దగ్గర ఉంటే నా బ్రతుకు లేని పోని కోరికలతో గడిచిపోతుంది. నన్ను క్షమించు.నిన్ను భరించడం నా వల్ల కాదు. నేను కోరిక లేని వాడిలాగా మారాలని అనుకుంటున్నాను. నువ్వేమో కోరికలు తీర్చే వాడి లాగా ఉన్నావు. కోరిక లేని వాడికి కోరిక ఇచ్చే వాడితో ఏ పని ఉంటుంది. నువ్వు అవునా కాదా అని పరీక్షించినందుకు నన్ను క్షమించు. నువ్వు నాకు ఎక్కడ దర్శనమిచ్చినావో నిన్ను అక్కడే ఉంచుతాను అని దానిని తీసుకొని ఏ మాత్రం ఆలోచించకుండా యధాస్థానంలో పెడుతుండగా ఆ రాతి నుండి కొన్ని రకాలైన మెరుపు కాంతులు రావటం గమనించాడట. దానిని దొరికిన చోట పెట్టి వెనుతిరిగి చూడకుండా ముందుకు సాగిపోయాడని నాకు వివరాలు తెలియ చేసినాడు.
కనీసం వాడైనా ఈమణిని చూశాడు గదా, అనుకుంటూ బాధతో ధ్యానంలో కూర్చోగానే ఏదో గుడి… దాని ఆవరణము 2 వెంకన్న శిలా మూర్తులు కనపడసాగాయి. ఇది ఎక్కడ ఉంది? ఇది ఏమి గుడి? ఇది ఎందుకు కనబడుతుందో అనుకొని ధ్యాన భంగమై కళ్ళు తెరవడం జరిగినది.ఇదే దృశ్యము కొన్ని రోజులపాటు నన్ను ధ్యానములో వెంటాడింది. అప్పుడు ఈ గుడి గూర్చి విచారించగా చిన్నతిరుపతి( ద్వారక తిరుమల) వెంకన్న స్వామి అని తెలిసినది.

ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళమని చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు.కానీ విచిత్రంగా మా కుటుంబ సభ్యులు అంతా కలిసి దానిని అలాగే దాని చుట్టు ప్రక్కల ప్రాంతాలలో గుడులు కూడా చూడాలని అనుకుని ప్రయాణం కట్టారు. మేము బస్సెక్కాము.బస్సు ద్వారకా తిరుమల చేరుకుని దిగి దిగగానే పుస్తకాలు అమ్ముకొనే కుర్రాడు నా దగ్గరికి వచ్చి “అన్నా!అన్నా! ప్రొద్దుట నుండి ఒక పుస్తకం కూడా అమ్ముడుపోలేదు. కనీసం నువ్వైనా ఈ పుస్తకమును కొను” అంటూ వాడే ఒక పుస్తకం తీసి నా చేతిలో పెట్టాడు.వీడు ఏమిటి? నాకు కావలసిన పుస్తకాలు కొననియ్యకుండా వాడికి కావలసిన పుస్తకం అమ్ముతున్నాడు అనుకుని చూస్తే అది ఆ క్షేత్రమునకు సంబంధించిన పుస్తకము కావటంతో మారు మాట్లాడకుండా కొనటం జరిగినది. అందులో చూస్తే కపిలమహర్షి భక్తికి వెంకన్న స్వామి దర్శనం ఇవ్వడం అది కూడా పాదాలు భూమిలోనే ఉండిపోవటంతో పాద మూర్తి కోసం మరొక వెంకన్న విగ్రహమూర్తి ఉంచినారని ఈ మహర్షి దగ్గర చింతామణి ఉండేదని దానిని ఆయన పాదాల క్రింద ఉంచడం జరిగిందని అందుకే మొదటి విగ్రహ మూర్తికి పాదాలు కనిపించకుండా ఏర్పాట్లు చేశారని రాత్రిపూట గుడి తలుపులు మూసివేసిన తర్వాత లైట్లు ఆరి పోయిన తర్వాత సుమారు అర్ధరాత్రి 12 గంటల తర్వాత గాలి గోపురం శిఖరం నుండి కాంతులు ఈ మణి నుండి బయటకు వస్తాయని చదవగానే ఓహో! ఈ విధంగా మహాగణపతి తన చింతామణి మహత్యమును చూపబోతున్నాడా అనుకొని ఇక్కడ ఏమి కోరుకుంటారో వారి చింతలు బాధలు తొలగుతాయని కొస మెరుపుగా వ్రాయటం జరిగింది. ఇక్కడ కోరడానికి ఏముంది మోక్షప్రాప్తి తప్ప అనుకుని కాటేజికి చేరుకోవడము ఆయన దర్శనం చేసుకోవటం అర్ధరాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడటం జరిగింది.రెండు రోజుల వరకు నాకు ఏమీ కనిపించలేదు. పైగా గుడి లైట్లు వేసి ఉన్నాయి. కానీ వాటిని ఆపండి అని చెప్పలేము కదా అనుకుంటూ నిరాశగా ఎదురుచూశాను.
మరో రోజు అనుకోకుండా గుడి పరిసరాలు అంతా కరెంట్ పోవటం ,వాళ్లు జనరేటర్ కోసం వెళ్ళటం మిగిలిన ఈ కొద్ది సమయంలో చిమ్మ చీకటిలో గాలి గోపురం కలశం వైపు నేను అనుకోకుండా చూడటం… అతి సన్నని చిన్నకిరణము దాని మీద నుండి పైకి ఒకటి అడుగు మేర ప్రసరిస్తుందని తెలియగానే నాకే ఆశ్చర్యమేసి ఒకటికి మూడు సార్లు కళ్ళు నులుపుకొని తీక్షణంగా చూసే సరికి సరిగ్గా ఖచ్చితంగానే కనపడింది. కాకపోతే గుడి చుట్టూ బల్బుల వెలుగు వలన ఈ అతి సన్నని కాంతి పుంజము కనబడటం లేదని గ్రహించేసరికి అకస్మాత్తుగా మళ్లీ కరెంటు రావటము అది మళ్లీ బల్బుల వెలుగుల కాంతులలో ఈ మణి కాంతి కలసి పోవడముతో ఈ విధంగానైనా చింతామణి చూపినందుకు మహాగణపతికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ యాత్రను ముగించుకొని ఇంటికి వచ్చి యధావిధిగా ధ్యాన ప్రక్రియ సాధనలో మునిగిపోయాను. నాకు కలిగిన ఈ చింతామణి అనుభవము టెలిపతి ద్వారా మన జిఙ్ఞాసికి చెప్పడం జరిగినది. అలాగే అమెరికా డాలర్ నోటు వచ్చినట్లు అనగా చింతామణి శిల బొమ్మ దాని వెనుక ఉందని చెప్పటం జరిగినది.


స్వాధిష్టాన చక్రం జాగృతి:

ఇక నా ధ్యానం అంతా తిరిగి స్వాధిష్ఠాన చక్రము మీద పెట్టేసరికి లక్ష్మీనారాయణుడు కనిపించాడు. అది కూడా నీడలాంటి లీలారూపముతో కనిపించి కనిపించనట్లుగా కనిపించాడు.ఇలా కొన్ని రోజుల తర్వాత నాకున్న నా ఉద్యోగం పోయినది. చేస్తున్న ఉద్యోగం పోయేసరికి మనస్సు వికలమైంది. మరోచోట ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నాకు రావటం లేదు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు మాని వేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగినది. ఇంతలో మా శ్రీమతి కూడా అప్పటి దాకా తను చేస్తున్న ఉద్యోగంలో మార్పులు వచ్చాయి. కొన్నాళ్లపాటు అన్ని భరించి చేసినది కానీ తర్వాత ఏమి చేయలేని పరిస్థితి. నా ఉద్యోగం పోయిన మూడు సంవత్సరముల దాక చేస్తుండేది. కానీ అనుకోకుండా ఆమెకి కూడా ఉద్యోగ సమస్యలు వచ్చే సరికి తను కూడాఉద్యోగము వదిలే స్థితికి చేరుకుంది. అసలే స్వాధిష్టాన చక్రం సాధన చేస్తున్న సమయంలో మనని ఆర్థికంగా దెబ్బ తీసే విధంగా మా రెండు ఉద్యోగాలు పోయాయి. అప్పటిదాకా ఉద్యోగ ప్రయత్నాలులో ఉన్న నాకు తను పూర్తిగా మానివేసి తను పూర్తిగా సాధన కోసమే సమయం కేటాయిస్తానని ఖరాఖండిగాచెప్పేసింది. తనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని తను ఉద్యోగం సమయంలో తనకు వచ్చిన నాకు వచ్చిన జీతం కలిపి ప్లాట్ తీసుకోవటం జరిగినది.సుమారుగా 5 సంవత్సరముల పాటు EMI కట్టడం జరిగింది.అనుకోని అవాంతరాల వలన మా ఉద్యోగాలు పోవటంతో EMI కట్టలేని పరిస్థితి రావటం ఏకకాలంలో జరిగినాయి. ధన మాయ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంత వివరంగా చెప్పటం జరుగుతుంది. అనగా స్వాధిష్ఠాన చక్రము రీత్యా ధన మాయ ఎలా ఉంటుందో చెప్పడం అన్నమాట. విచిత్రం ఏమిటంటే ఆమె ఉద్యోగంను తీసినది గూడ నారాయణమూర్తి అనే వ్యక్తి అయితే నా ఉద్యోగంను తీసినది గూడ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కావడం విశేషం. నా ఉద్యోగ ప్రయత్నాలు పూర్తిగా విరమించి నానా రకాల వ్యాపార ప్రయత్నాలు చేసినా కూడా అవి కూడా కలిసి రాక పోవడం అది కూడా మానుకొని ధనమునకు ఇంత ఇబ్బందులు పడవలసినదేనా అనుకొని మంచినీళ్ళే ఆహారంగా అనుకునే స్థితికి చేరుకున్నాము.    

****ఆత్రేయగీత* మొదటి భాగం అధ్యాయము - 11 “వైరాగ్యము”

 *ఆత్రేయగీత*

మొదటి భాగం

అధ్యాయము - 11

“వైరాగ్యము”

వైరాగ్యం అంటే - ఏది అసత్యమో దానిని విడిచిపెట్టడం!

ఏది శాశ్వతం కాదో దానియందు విరక్తి కలిగివుండటం! అశాశ్వతమైనదేదో గ్రహించే జ్ఞానంతో వైరాగ్యం సిద్ధిస్తుంది!

వైరాగ్యం అనేది వాస్తవంగా ఒక యోగము (కలయిక). ఒకదానితో కలిస్తే గానీ ఇంకొక దానినుండీ విడిపోవడం కుదరదు! ఆత్మతో సంబంధం పెట్టుకుంటేనే వైరాగ్యం సిద్ధిస్తుంది! అది లేకపొతే వైరాగ్యం కుదరదు!

వైరాగ్యము మనోవైఫల్యంతోనూ, మనోద్వేగంతోనూ పుడితే ఆ వైరాగ్యభావం శాశ్వతం కాదు. కర్తృత్వమును విడిచిపెట్టి పనిచేస్తే వైరాగ్యం అలవడుతుంది!

భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఒకదానితో ఒకటి
ముడిపడివుంటాయి!

భక్తిలో తప్పకుండా జ్ఞానం వుండాలి. ఎక్కడ జ్ఞానము వుంటుందో అక్కడే వైరాగ్యం వుంటుంది. ఎక్కడ వైరాగ్యం వుంటుందో అక్కడ పరమాత్మ వుంటాడు!

భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఆత్మజ్ఞానానికి సోపానాలు -

భక్తి - ఏది సత్యమో దానియందు గాఢమైన విశ్వాసం!

జ్ఞానం - ఏది శాశ్వతమో దాన్ని తెలుసుకోవడం!

వైరాగ్యం - ఏది అసత్యమో దానిని విడిచిపెట్టడం!

బాహ్య వస్తువులపై ఆసక్తి వున్నంతసేపు, ఆత్మ వస్తువు గోచరించదు! దృష్టిని బాహ్యం నుండి అంతర్ముఖం చెయ్యాలి!

కర్మ-జ్ఞాన యోగములతో వైరాగ్యం అలబడుతుంది! అందుకే జ్ఞానులు తాముచేయు కర్మలన్నీ భగవంతునిపై ఆరోపించి, ఏమి ఆశింపక, మనోబుద్ధుల ప్రమేయంలేక కేవలం ఇంద్రియాలతో కర్మలు ఆచరిస్తారు. అది వైరాగ్యానికి మొదటిమెట్టు.

“నా ఆత్మయే నీవు”, “నాచే చేయిస్తున్నది నీవు” అన్న సంకల్పంతో కర్మలాచరిండమే వైరాగ్యం! 
 *🌞 సూర్యోపాసన చేయడం ఆరోగ్యానికీ, ఆధ్యాత్మిక ప్రగతికి ఒక సాధనం*
✍️ లక్ష్మీ రమణ 
🙏🪷🌹🌻🥀🔯🌹🪷🥀🌻🙏

🌞 సూర్యోపాసన  మనకి అనాది కాలం నుండీ వస్తున్నదే♪. సూర్యోపాసన వలన, ఆరోగ్యం , ఆనందం రెండూ ప్రాప్తిస్తాయని మన ధర్మం చెబుతుంది♪. ఈ సూర్యోపానను అనుష్టించినవారిలో అగస్త్య మహర్షి , రాములవారు, ఆంజనేయుడు, యాజ్ఞవల్క్యుడు ప్రధానంగా కనిపిస్తారు♪. సూర్యనమస్కారాలను నిత్యం చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని యోగశాస్త్రం చెబుతోంది♪. 

🌞 ప్రస్తుతకాలంలో శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్న ఈ సూర్యోపాసనా విధానాన్ని , అద్భుతమైన వాటి ఫలితాలను గురించి తెలుసుకుందాం♪.
 
🌞 సూర్యుడు ప్రతక్ష్య నారాయణుడు అని , స్వయంగా కనిపించే విష్ణురూపమైన  దైవంగా కొలవడం మనకి అనాదినుండీ అలవాటే♪! ఆంజనేయుడు ఆ సూర్యుని దగ్గరే విద్యను అభ్యసించి, ఆయన పుత్రిక అయిన సువర్చలా దేవిని వివాహం చేసుకున్నారు కాబట్టే, ఆయన బల, బుద్ధి సంపన్నుడయ్యారు♪. ఇక ఆంజనేయుని గురువుగారు, దైవమూ, సర్వమూ అయిన శ్రీరామచంద్రులవారు సూర్యోపాసన చేశారు♪. రావణాసురుడితో యుద్ధంచేస్తున్న సమయంలో అలిసిపోయిన రాములవారికి అగస్త్య మహాముని ఆదిత్యహృదయాన్ని ఉపదేశించారు♪. అలా అగస్త్యుడు ఉపదేశించిన ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్యోపాసన చేయడం వలన,  రావణాసురుడిపైన విజయాన్ని సాధించారు♪.

🌞 'యోగాభ్యాసము' సూర్యోపాసన గురించి అద్భుతంగా చెబుతుంది♪. యోగ ప్రక్రియలో సామూహిక ఆసనాల స్వరూపమే సూర్య నమస్కారాలు♪. 12 భంగిమలు, 12 మంత్రాలతో కూడిన ఈ ప్రక్రియలో ఒక సంక్షిప్తమైన వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం ఇమిడి ఉన్నాయి♪. ఈ సాధన వల్ల శరీరంలో ఉండే ప్రతి అవయవం ఉత్తేజితమై విష పదార్థాలను విసర్జిస్తుంది♪. శరీరంలో గ్రంథులు, అంతరంగిక గ్రంథులు, అంతస్రావాలు (హార్మోనులు) సమతుల్యం అవుతాయి♪. అంతేకాకుండా, పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి, కొత్త శక్తిని, ఉత్సాహాన్ని పొందుతుంది♪. ఈ ప్రక్రియను సూర్యోదయం సమయంలో సూర్యుడికి అభిముఖంగా సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది♪.

🌞 నిజానికి, సకల జీవరాశులకు ఆధారభూతమైనవాడు సూర్యుడు♪. ఆయన రాకతోనే జీవనం ప్రారంభం అవుతుంది♪. ప్రస్తుత కాలంలో అందరికీ కావాల్సింది ఆరోగ్యం♪. రోగనిరోధక శక్తి♪. అటువంటివి ఇవ్వగలిగిన వాడు సూర్యుడు♪. పూర్వీకులు చెప్పినవి ఒక్కొక్కటి నేటి శాస్త్రవేత్తలు అంగీకరించడం మనం చూస్తూనే ఉన్నాం♪.

🌞 ప్రస్తుతం సూర్యారాధన ఏయే మాసాలలో ఏ పేర్లతో చేయాలో తెలుసుకుందాం♪… అనేక పురాణాల్లో సూర్యోపాసన విధానం గురించిన వివరాలెన్నో ఉన్నాయి♪. 

🌞 భవిష్య పురాణంలో రాజు మాంధాత సూర్యవ్రతాన్ని గురించి తమ కులగురువు వశిష్టులవారిని అడిగినప్పుడు, ఆ మహర్షి చెప్పిన విశేషాలు ఇలా ఉన్నాయి♪. 

🌞👉 అన్ని మాసాలలోనూ... సూర్యారాధనకి ప్రాశస్త్యమైన మాసం మాఘమాసం. సూర్యుని పుట్టిన రోజు రథసప్తమి ఈ నెలలోనే వస్తుంది మరి♪.

👉 మాఘమాస సూర్య (ఆది)వారం నాడు ‘వరుణాయ నమః‘ అనీ, ఫాల్గుణమాసంలో ‘సూర్యాయ నమః‘ అనీ, చైత్ర మాసంలో _*‘భానవే నమః‘*_ అని, వైశాఖమాసంలో ‘తపనాయ నమః‘ అని, జ్యేష్టమాసంలో ‘ఇంద్రాయ నమః‘ అని, ఆషాఢమాసంలో ‘రవయే నమః‘ అని, శ్రావణమాసంలో ‘గభస్తయే నమః‘ అని, భాద్రపదమాసంలో ‘యమాయ నమః‘ అని, అశ్వయుజమాసంలో ‘హిరణ్య రేతసే నమః‘ అని, కార్తీక మాసంలో ‘దివాకరాయ నమః‘ అని, మార్గశిర మాసంలో ‘మిత్రాయ నమః‘ అని, పౌష్యమాసంలో ‘విష్ణవే నమః‘ అనీ వివిధ మాసాలలో, వివిధ నామాలూ, వివిధ నైవేద్యాలతో సూర్య వ్రతం చేసిన తరువాత, ఉద్యాపన కూడా చేయాలి అని మనకి ఆ మహర్షి చెబుతారు♪.

🌞 ఈ విధానంగా మనం సూర్యారాధన చేయడం వలన ఆధ్యాత్మికమైన , ఆరోగ్యమైన అనేక ప్రయోజనాలు లభిస్తాయి♪. 

🌞 సూర్యునికి సంబంధించిన దేవాలయాల దర్శనం కూడా చక్కటి ఫలితాన్ని అందిస్తుంది♪. మన దేశంలో సూర్యునికి గల దేవాలయాలలో ప్రముఖమైన దేవాలయాలు...
🙏 ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం. 
🙏 గుజరాత్ మోదెరాలో సూర్య దేవాలయం. 
🙏 ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యదేవాలయం, 
🙏 పెద్దాపురం వద్ద ఉన్న పాండవుల మెట్ట మీద ఉన్న సూర్యదేవాలయం ప్రముఖమైనవి. 
🙏 అదేవిధంగా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడ లో కూడా సూర్యదేవాలయం ఉంది♪.

❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
🙏🪷🌹🌻🥀🔯🌹🪷🥀🌻🙏

Tuesday, October 15, 2024

****ప్రవర్తన - పరివర్తన

 .            *ప్రవర్తన - పరివర్తన*
                  
*ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు.*

*ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి.*

*అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి.*

*ఎందుకంటే... దీనివల్ల చాలా లాభాలున్నాయి.*

*నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటంవల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతలవారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కాని, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది,  ఎంత ధ్యానం చేసినా, యోగా, వ్యాయామం... చేసినా దానిని సరిచేయలేవు. దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి.*

*రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది. మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు. చెడుగా ఆలోచించి, ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దయ్యంలా చెడు పట్టుకుంటుంది. ఎంత పూజ చేసినా ఉపయోగం ఉండదు. అది అవతలవారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం. దీనివలన ఎదుటివారికి చెందవలసిన అశుభపరిణామాలను ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని వీరు అనుభవిస్తున్నారు.*

*ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది.*

*ఉదయం లేవగానే "ఈ లోకం లో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి !" అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి.*

*ఇలా చేస్తే... మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. గురువులు బోధిస్తున్నారు.*

*మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి. మంచి చెడుల మిశ్రమమే జీవితం. సుఖదుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు. మంచికి, ధర్మానికి మారుపేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు, మహా పాపి అయిన రావణాసురుడూ ఉన్నాడు. ఏ యుగమూ చెడ్డను తప్పించుకోలేదు.*

*మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు. చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడుభావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి.*

*అంతేకాని మీకు సంబంధం లేని ఎదుటివారి పాపకర్మలను నిందించి లేదా ప్రచారం చేసి వారికి చెందవలసిన చెడును మీరు అనుభవించకండి..!*

*పుట్టుకతో ఎవరూ దుర్మార్గులు కాదు, పాపాత్ములుకాదు. ప్రతివారిలోనూ మంచి-చెడు రెండూ ఉంటాయి. కానీ మన దురదృష్టమేమిటంటే నేటి సమాజం చెడును చూసినంత ఎక్కువగా మంచిని చూడటంలేదు.*

*ఇకనైనా మనము  క్షమాగుణం కలిగి, ఎదుటివారిలోగల చెడుని వదిలేసి మంచిని మాత్రమే చూద్దాం, మంచి గురించి మాత్రమే చెబుదాం.!*

 .      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷

*🙏లోకా సమస్త సుఖినోభవన్తు🙏*
🌹🌹🌹 🪷🕉️🪷 🌹🌹🌹
 అయ్యో! రావణ భక్తులారా అసలు విషయం తెలుసుకోండి...
పర రాజ్యపహరణం పర
ధనాపహరణం పర ధారాపహరణం... అంటే ఇతరుల రాజ్యాన్ని ఇతరుల ధనాన్ని ఇతరుల భార్యల్ని అపహరించడం నా ధర్మం అని రావణాసురుడు చెప్పుకున్నాడు... పూర్తిగా తెలియకుండా ఇటీవల కాలంలో రావణ భక్తులు ఎక్కువైపోయారు. కొన్ని పిచ్చి సినిమాల కారణంగా విలన్లకు హీరో పాత్రలు వేస్తున్నారు. రావణుడు రాక్షస రాజని మా వంశస్థుడని మురిసిపోతున్నారు. రావణాసురుడు రోజు ఈ సో కాల్డ్ విదేశీ మానస పుత్రులు వ్యతిరేకించే బ్రాహ్మణైజేషన్ కి చెందిన బ్రాహ్మణుడు అన్న విషయం ఒక్కసారి రామాయణం చదివి తెలుసుకోండి. ఇంకొందరు రావణాసురుడు ద్రావిడు డు అని వాదిస్తుంటారు. అది తప్పు. రావణబ్రహ్మ జన్మస్థలం నోయిడా. మండోదరి మీరట్లో పుట్టింది. ఇది సగం సగం నాలెడ్జి...
రావణాసురుడు సీతమ్మవారిని సురక్షితంగా అశోకవనంలో దాచాడని పిచ్చి ప్రచారం చేస్తుంటారు. పుంజిక స్థల అనే బ్రహ్మపుత్రికను దేవలోకంలో వెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తే బ్రహ్మ రావణుడి వరాలకు బ్రేక్ ఇస్తూ నీకు ఇష్టం లేని స్త్రీని నీవు ముట్టుకున్నట్టయితే తలో పగిలి చచ్చిపోతావని చెప్పాడు. అందువల్ల సీతమ్మవారిని ముట్టలేదు గాని మిగతా 100 మందిని  బెదిరించి ఒప్పించి తెచ్చుకున్న విషయం గురించి ఈ అజ్ఞానులకు అసలు తెలియదు. ఈ శాపం కారణంగా సీతమ్మవారిని చెరపట్టలేదు గాని లేకపోతే ఒక సంవత్సరం రావణాసురుడు ఆగేవాడు కాదు. దానికి కూడా సీతమ్మని ఎంతో ప్రలోభ పెట్టడానికి బెదిరించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. హనుమంతుడు లంకకు వచ్చి లంకను కాల్చాక సభలో చంపేయమని ఈ సోకాల్డ్ శాంతి దూత రావణాసురుడు ఆర్డర్ వేశాడు. అక్కడ ధర్మం ప్రస్తావన చేసి ఆ శిక్షను తగ్గించింది విభీషణుడు. ఇది వీళ్లకు తెలియక ఆయన ఏదో ధర్మాత్ముడు అని పిచ్చి ప్రేలాపనలు. ఇక శూ ర్పనఖ ను ముక్కు చెవులు కోసినందుకు వీలు తెగ బాధ పడిపోతున్నారు. ఇది అంతులేని అజ్ఞానమే. అడవిలో ప్రశాంతంగా ఉన్న రాముని జీవితంలోకి వచ్చి సీతను గురించి అనేక నిందలు వేసి రాముని పెళ్లి చేసుకోమని అడిగి విఫలమై లక్ష్మణుడు దగ్గరికి వెళ్లి అక్కడ విఫలమై సీతపై పడి చంపడానికి వెళ్ళింది. అప్పుడు రాముడు దుష్టులతో ఎక్కువసేపు వేళాకోళం ఆడకూడదని లక్ష్మణుని పురమాయించాడు. మీ ఇంట్లో మీ స్త్రీల పైకి ఇలాగే ఎవరైనా వస్తే ఏం చేస్తారో... అంతేగాక శూర్పనఖ ఖరుడితో రావణబ్రహ్మతో ఏం మాటలు మాట్లాడిందో ఒక్కసారి రామాయణం చదువుకోండి. అంగదున్ని రాయబారానికి పంపిస్తే అతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు రావణుడు. విభీషణుడు కుంభకర్ణుడు ఇద్దరు మంచి మాటలు ఎన్ని చెప్పినా రావణుడు వినలేదు. విభీషణుడు అధర్మం వైపు ఉండలేనని వానర సైన్యం లోకి వెళ్ళాడు. కుంభకర్ణుడు తప్పని పరిస్థితుల్లో అన్నకు కృతజ్ఞతగా యుద్ధంలో నిలబడి చచ్చిపోయాడు. ఇదంతా వాస్తవం.@@@@
మరి రాముడు...
లక్ష్మణుడు లేకపోతే తను జీవించలేనన్నాడు... సాధారణమైన వానరులను సైన్యంగా మార్చి అంత పెద్ద రావణుడిపై తలపడ్డాడు. శార్దూలుడు శుకుడు సీక్రెట్ ఏజెంట్స్ గా వచ్చిన వాళ్ళని ఏమీ చేయకుండా పంపించారు. ఇది రామధర్మం... రావణ దహనంలో ఎవరికి వ్యక్తిగతంగా రావణాసురుడిపై పగలేదు. కానీ ధర్మం అధర్మం అనే దృష్టితో చూసినప్పుడు సమాజానికి ఇవ్వాల్సిన సందేశాన్ని రావణ వధ ద్వారా తెలియజేస్తారు.. ఇంతకన్నా ఎక్కువ ఊహించుకోకండి
 *మౌనంగానే ఎదగాలి*
```వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.

అయిదు ‘శాంతి’లలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు.

‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత.   ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’అన్నారు స్వామి వివేకానంద.```

*మౌనం మూడు రకాలు:*  
*#1. ఒకటవది:వాక్‌మౌనం.* ```
వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి.```

*#2.రెండోది అక్షమౌనం.*```
అంటే ఇంద్రియాలను నిగ్రహించడం.
```
*#3. మూడోది కాష్ఠమౌనం.*```
దీనినే ‘మానసిక మౌనం’ అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది.

మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో  పరివర్తన  తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగ మవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు.

మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ వంటి వారెందరో ఉన్నారు.

ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం.   నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.

రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.

ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.

ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే…‘మౌనం!’

ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది.   భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మనందరం మౌనంగానే ఎదుగుదాం!సరైన సాధన చేస్తే మౌనంగా ఉండడం అలవాటు అవుతుంది... మౌనం లో ఎలాంటి అద్భుతమైన ఫలితాలు ఎలా పొందవచ్చు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు సరైన సాధన ద్వారా... 

సేకరణ :"పసుపుల పుల్లారావు"
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
లోకా సమస్తా సుఖినోభవన్తు!

శాఖాహారం అమృతాహారం.

 శాఖాహారం  అమృతాహారం.

భారత దేశం పుణ్య భూమి అంటారు .!!
మరి అటువంటి భారత దేశాన్ని
పుణ్య భూమి గానే ఉంచుదా ము.

ఇది ఖచ్చితం గా చదవండి.

 మాంసాహారం మృతాహారం

జార్జి బెర్నర్డ్ షా అన్నారు,
నీ పొట్ట శ్మశానం కాదు అని.

వివరణ చూద్దాం.

(1)  జంతువులు,పక్షులు,జల చరాలు, అన్ని కూడా మనలాగే నొప్పి ఉన్న ప్రాణులే.
మనకి ఎలా అయితే పెన్సెలు చెక్కి నప్పుడు వ్రేలు కోసుకుంటే వారం పది  రోజులు,(అలాగే ఇతరత్రా)
వరకు కట్టు వేస్తామూ.
అదే జంతువులని పీక           కోస్తున్నప్పుడు అది భూమిపై గిల గిల కొట్టు కుంటున్నప్పు డు అది ఎంత బాదపడు తుంది,,  
 మైడియర్  ఫ్రెండ్స్   ఒక్కసారి ఆలోచిద్దాం . మరి ఆబాద ఎవరికి చెందుతుంది.

పెంచిన వారికి,అమ్మే వారికి,కొన్న వారికి,వండే వారికి,తిన్న వారికి . చేరి ఇంట్లో,వొంట్లో కస్టాలు.

2  ఈ మాంసము తినడం ఎక్క డ నుండి మానవుడి కి             వచ్చింది అంటే,
ఆది మానవుడు నుండివచ్చింది.                        ఆది  మానవుడు ఎలా ఉండేవాడో అందరికి తెలుసు,జంతువు లాగే ఉండేవాడు.
మరి ఈనాడు  అన్నీ అలవాట్లు మార్చుకుని జీవిస్తున్నాడు.
మరి జంతువుల తిండి ఎందుకు మారలేదు.

3   మన పురాణాలు లో ప్రతి భగవంతుడి వెనుక ఒక జంతువు లేక పక్షి ఉంటుంది.
అంటే భగవంతుడు జంతువు లో కుడా ఉన్నాడు ,మమ్మల్ని పూజించి నట్లే వాటిని కుడా పూజించండి అని.

మరి మన వాళ్లు దేవుడి తో పాటు వాటిని పూజిస్తారు,మళ్లి
వాటిని చంపి తింటారు.
ఎందుకు.   !!  
                  
అలాగే
దశావతారం లో భగ వంతుడు నేనే  ఆ అవతారాల్లో ఉన్నాను అని చూపించేడు.

4  మాంసం తిన్న  జంతువు క్రూరత్వం తో ఉంటుంది. వాటి  దగ్గరకు మచ్చిక అయితేనే వెళ్ల గలం.
ఉదా; పిల్లి,కుక్క,నక్క,పులి,సింహం.

అదే ఆవు,మేక,గొర్రె,ఏ నుగు,ఇంకా ఎన్నో వీటి దగ్గరకు మనం వెళ్లగలము.

  ఇంకా అంటారు మాంసం బలమని
మరి పై జంతువులన్నిటి కి బలము ఎలా వచ్చింది.!!

అలాగే మాంసం తిన్న జంతువుల కి కోరలు , గోళ్ళూఉంటాయి.

ఆవులు  మిగతా వాటికి దంతాలు ,గిట్టలు ఉంటాయి.
మరి మన పళ్ళు,గోళ్ళూ  ఎలా ఉన్నాయి.

అలాగే
మనిషి బ్రతకడం కోసం ఆహారం కావాలి కాని మాంసం అవసరం లేదు,

నాలుక మీద ఒక్క క్షణం ఉండే రుచి కోసం ప్రాణం తీయడం అవసరమా.

ఈ రోజు ఎన్నో రకాలయిన veg లు దొరుకు తున్నాయి.
పన్నీరు,మష్రూమ్,మీల్ మేకర్
బేబీ కార్న్, ఇతరత్రా. 

అలాగే ఇంకో ఆసక్తి కరవిషయం
ఒక kg మాంసం తయారీ కి 10     or  15 వేల లీటర్ల నీరు అవసరం పడుతుంది.
అదే కాయగూరల కి 500 లీటర్ల   
         నీరు పడుతుంది.

ప్రాణం విలువ, ప్రాణం ఉన్న వాళ్ళకే తెలుసు..

జై హింద్.

సేకరణ : మహాత్ముల సoదేశాలు నుండి లక్ష్మి
 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹నమః శుభోదయం 🌹
విమలానంద బొడ్ల మల్లికార్జున్ 

🍁 చివరి_సంపద🍁
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

 ప్రతి మనిషికి తన వద్ద మిగిలిపోయే అతి గొప్పదైన చివరి సంపద తన శరీరమే.
 మనిషి తన తోటి మనిషికి పంచివ్వాలన్నా, సహాయం చేయాలన్నా తన వద్ద ఉండవలసినది ధనం, సంపద, ఆస్తి పాస్తులు ఉండాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. 

అవి లేకపోతే మరేముండాలి!? కేవలం నీ శరీరం ఉంటే చాలు, అదే ఒకపెద్ద నిధి. అందులోనే అనేక సంపదలు ఉన్నాయి. ఆ సంపదలతో ఎదుటి వారికి అనేక రకాలుగా సహాయం చేయవచ్చు...

ఒక ఊరి చివరిగా ఓ గురువుగారు ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. ఒకసారి చాలా పేదవాడు ఆ ఆశ్రమానికి వచ్చి గురువుగారితో ఇలా అడిగాడు, స్వామి 'నేను ఎందుకు పేదవాడిగా పుట్టాను, ఆ భగవంతుడు ఎందుకు మనుషులను కొందరిని ధనవంతులుగా, మరికొందరిని పేదవారిగా పుట్టిస్తున్నాడు. ఈ బేధభావం ఎందుకు అని అడిగాడు. అందుకు గురువుగారు ఇలా సమాధానం చెప్పారు.
మీరు ఎందుకు పేదవారుగా పుట్టారు, అంటే అది మీరు గతజన్మలో చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి మీకీ జన్మ లభిస్తుంది. అంటే మీరు ఇతరులపైన ఎటువంటి జాలి, దయ వంటి ఔదార్యము కలిగి ఉండరు. అలాగే ఇతరులకు ఉపయోగపడేలాగ దాన-ధర్మాలు చేసివుండరు.
అందుకా పేదవాడు మరి నేను ఇతరులకు దానధర్మాలు చేయడానికి నావద్ద ఏమున్నది అని ఆ పేదవాడు అడిగాడు. 
అప్పుడు గురువు గారు ఈ విధంగా చెప్పాడు.
నీ దగ్గర ఇతరులకు పంచడానికి నాదగ్గర ఏమీ లేదు అని నీవు అనుకుంటున్నావు. కానీ ప్రతి మనిషికి తన దగ్గర ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను కలిగివున్నారు.

 అందులో మొదటిది మీ ముఖం. అది మీకు ఉందికదా. 
ఆ ముఖకవళికలతో మీరు ఇతరులతో మీ ఆనందాలను, నవ్వులను పంచుకోవచ్చు. దీనికి నీ దగ్గర ధనరాసులే ఉండక్కర్లేదు. ఇది ఉచితం. ఈ నీ నవ్వులే ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిద్వారా నీవే కాదు నీతో ఉన్న ప్రతి ఒక్కరినీ సంతోషంగా జీవింప చేయవచ్చు. నీలో ఎన్నెన్నో బాధలు ఉండిఉండ వచ్చు. కానీ వాటిని బయటకు వ్యక్తపరచకుండా నీవు ఎప్పుడూ నవ్వుతూ, ఆ నువ్వులను అందరికీ పంచడమే నీవు ఇతరులకు చేసే గొప్ప సాయం. అదే నీకు పెన్నిధి.
ఇక రెండవ నిధి మీ కళ్ళు. అవి మీకు ఉన్నాయి. వాటితో మీరు ప్రేమ, కరుణ,దయా, జాలి, ఆప్యాయతా, అనురాగం వంటి అనేక రకాల రసాలను ఇతరులకు పంచవచ్చు. ఇది నిజం మీరు లక్షలాది మందిని కేవలం మీ ప్రేమానురాగాలు నిండిన కంటిచూపుతోనే గొప్పగా ప్రభావితం చేయవచ్చు. వాటిని మంచి అనుభూతిగా మార్చవచ్చు. కాబట్టి ఇకనుండైనా మీ కళ్ళతో కరుణరసాలనే నిధులను పంచే ప్రయత్నాలు చేయండి.
ఇక మూడవది మీ నోరు మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి సుభాషితాలు, మంచి మంచి విషయాలు చెప్పవచ్చు. మంచిని మంచిగా చర్చించండి. ఆ చర్చలే మనిషి జీవితానికి అతి విలువైనదిగా భావించండి. ఇలా చర్చించకనే అనేక ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురుగా చెదిరి పోతున్నాయి. మంచి స్నేహితుల మధ్య పెద్ద పెద్ద అగాధాలని సృష్టిస్తున్నాయి. మనిషికి మనిషికి మధ్య ఆనందం మరియు సంతోషాలు కరువౌతున్నాయి. కాబట్టి సమస్యలు ఏవైనా మంచిగా చర్చించుకొని అపోహలు తొలగిపోతే ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు వ్యాప్తి చెందుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.
ఇక నాలుగవది మీకు గుండె ఉంది కదా. మీ ప్రేమగల హృదయంతో మీరు ఇతరుల ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకోవచ్చు. మీరు కూడా ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు. ఆ అనుభూతులను ఇంకెందరితోనో పంచుకోవచ్చు. మీరు అందించే ఆ మమతాను రాగాలు వారి జీవితాలను తాకవచ్చు. వారిలో అనూహ్య స్పందనలను కలిగించవచ్చు. ఆ విధంగా బండరాతి గుండెలను కూడా సుతి మెత్తని పూబంతులవలే మలచవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఆ అనుభూతి మీకు కూడా అవగతమౌతుంది.
ఇక మీరు కలిగి ఉన్న అతి పెద్దదైన చివరిసంపద మీ శరీరం. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక రకాలుగా మంచి పనులు చేయగలరు. అవసరమైనవారికి అనేక రకాలుగా సహాయం అందించగలరు. 

సహాయం చెయ్యడానికి మనిషికి డబ్బే అవసరం లేదు. శారీరకంగా ఏంతో శ్రమను ఇతరులకు సహాయంగా అందించవచ్చు. నువ్వు చేసే ఆ శారీరక సహాయం వారికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. వారు ఇది నాకు అసాధ్యం అనుకొనే ఏ పనినైనా, సుసాధ్యం చేసి వారికెంతో ఊరట కలిగిస్తుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి.

కాబట్టి ప్రియ ఆత్మీయులారా... మీ ఒక చిన్న సహాయం, మీ చేయూత ఎదుటి వారి జీవితాలలో దేదీప్యమానంగా వెలుగులను వెలిగించగలవు. అందుకే పెద్దలు అంటారు భగవంతుడు మనకిచ్చిన జీవితం... కలకానిదీ, విలువైనదీ! సర్వోత్తమమైనదీ! 

అలాంటి నీ జీవితాన్ని దుర్భరం చేసుకొంటూ మనం ఏడుస్తూ, ఇతరులను ఏడిపించక ప్రతిక్షణం మనం ఆనందంగా ఉంటూ, ఆ ఆనందాన్ని పదిమందికి అనేక రకాలుగా పంచుతూ, శారీరకంగా, మానసికంగా అందరికీ సహాయపడుతూ, జన్మను చరితార్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ..

.🙏🙏జై గురుదేవ్ 🙏🙏          
సర్వేజనాసుఖినోభవంతు.

//భర్త// (భార్య వత్తిడి తగ్గించే దివ్యౌషధం)

 //భర్త//
(భార్య వత్తిడి తగ్గించే దివ్యౌషధం)

💝💝 *ఒకమ్మాయి దేవుడితో ఇలా అంది:~*
💖 *”దేవుడా! నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. నేను బాగా చదువుకున్నాను.  స్వతంత్రంగా బతకగలను. అన్ని పనులు స్వయంగా చేసుకోగలను. అలాంటప్పుడు నాకు మొగుడితో పనేంటి? కానీ మా అమ్మానాన్నలు పెళ్ళి చేసుకోమని చంపేస్తున్నారు. దేవుడా నువ్వే చెప్పు. నేను ఇప్పుడు ఏం చేయాలి?*

❤️ *దేవుడు పలికాడు:  చూడమ్మా! నా సృష్టిలో అద్భుతానివి నువ్వు. అందులో ఏ సందేహమూ లేదు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఒక్కోసారి నీవల్ల తప్పులు జరగొచ్చు. నువ్వు ఓడిపోవొచ్చు. నీ టెన్షన్ తగ్గాలంటే ఏం చేస్తావు ఎవర్నైనా తిట్టాలి అరవాలి లేదా అలగాలి లొల్లి లొల్లి చేయాలి అప్పుడు నువ్వు ఎవర్ని తిడతావు, అందుకే నీకు ఒత్తిడి తగ్గాలి అంటే ఒక ప్రాణి నీ సృష్టించాను, ఆచారం పేరిట నీకు తగలబెడతాను, పేరుకు బలంగా ఒడ్డు పొడవు ఉంటాడు కానీ నీ ముందు 
తేలిపోతాడు అర్భకుడు వాడికో పేరు పెడదాం భర్త అని. అందుకే అలాంటి ఒత్తిడిలో నిన్ను నువ్వు తిట్టుకుంటావా?*
💖 *అమ్మాయి : నో! నేనొప్పుకోను.*

❤️ *దేవుడు: అందుకే నీకో మొగుడు కావాలమ్మా.*

💝💝 *అది విన్న అబ్బాయి దేవుడిని అడిగాడు:~*

💓 *’స్వామీ ఏమిటీ స్త్రీ పక్షపాతం? ఆవిడ చేసే తప్పులకు నేను నిందలు మోయాలా? నాకు మనసు ఒత్తిడి ఉండవా ...? సరే! మోస్తాను. మరి నేను ఓడిపోతే ఎవర్ని తిట్టాలి?’*

❤️ *దేవుడు : పిచ్చివాడా! నీకు అన్యాయం చేస్తానా? ఆమెకు కోపం వస్తే తిట్టడానికి నువ్వు ఒక్కడివే ఉంటావు. కానీ నువ్వు ఓడిపోయి.. నీకు కోపం వస్తే... విద్యా వ్యవస్థను తిట్టొచ్చు, న్యాయవ్యవస్థను తిట్టొచ్చు, రాజకీయ నాయకుల్ని తిట్టొచ్చు, అధికారుల్ని తిట్టొచ్చు, పోలీసుల్ని తిట్టొచ్చు, సినిమావాళ్ళను తిట్టొచ్చు,నీ ఫ్రెండ్స్ నీ తిట్టొచ్చు ప్రాంతాన్ని తిట్టొచ్చు, దేశాన్ని తిట్టొచ్చు, గాంధీని, నెహ్రూని.. అంతవరకూ ఎందుకు నన్ను ఇంకా తిట్టొచ్చు. అంతవరకే నాయనా నీ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు.....కాదు కూడదని నీ భార్యను ఏమన్నా అంటువా నిన్ను కాపాడడం నా వల్ల కూడా కాదు.....కాబట్టి తిట్టుకో అందర్నీ ఒక్క నీ భార్యను తప్ప.*💕
😂😂😂😂😂😂

****నేను – నాది అనే భావన నుంచి బయటపడాలి

 _*🧘‍♂️నేను – నాది అనే భావన నుంచి బయటపడాలి🧘‍♀️*_
🕉️🌞🌍🌙🌟🚩

*_నేను అనే ఆలోచన ఏర్పడిన మరుక్షణమే నాది అనే భావన కలుగుతుంది. నేను, నాది అనేవి రెండు పెద్ద ప్రమాదకారులు. అయినా జీవిత మంతా మనం వీటితోనే బతకాలి. ప్రపంచమంతా వీటి మీద ఆధారపడే నడుస్తుంది, అమ్మ ఒడిలో ఇవి ఉండవు. నేను మొదలవుతుంటే నాది అనేది దాని వెనక తోకల్లాగవస్తుంది._* 


*_స్వార్థానికి 'నేను-నాది’ రెండు రెక్కలు. ఇవి లేకపోతే అది అహం అనే తోటలో ఎగరలేదు. హాయిగా అహం తోటలో ఎగురుతున్నవాడిని” ఆ రెక్కలు వదులుకో అని చెప్పేవారూ ఉండరు. ఎందుకంటే అది వాళ్లకూ అవసరమే._*


*_‘నేను-నాది’ లేకపోతే జీవితం సాగదేమో ! నేను-నాది తోనే లోకం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిద్రలో అవి ఉండవు. అప్పుడు లోకం కూడా ఉండదు._*


*_ఎవరైనా మన ‘నేను’ మీద దెబ్బకొడితే విలవిల్లాడిపోతాం. ఎదుటివాడి ‘నేను’ మీద దెబ్బతీయకుండా ఉండలేం, నాదనేది ఎవరైనా లాక్కుపోతే చూస్తూ ఊరుకోం. పోరాడి, పెనుగులాడి నాది అనేదాన్ని నిలబెట్టుకుంటాం. జీవితమంతా ఈ యుద్ధం సాగుతూనే ఉంటుంది._*


*_అసలు ఈ నేను-నాది లేని మనుషులు ఉంటారా ? ఉంటారు. వాళ్లే ఆధ్యాత్మిక వాదులు. తీవ్రమైన ఆధ్యాత్మిక బ్రహ్మీస్థితిలో మునిగి ఉన్నవారు. వాళ్లకు నేను-నాది యోచనలు తగ్గిపోతూ ఉంటాయి. ఎలాగైనా వాటిని వదిలించుకోవటానికి ధ్యానం, పూజ, జపం, ప్రార్థన, యోగం అనే ఆయుధాలను ప్రయోగిస్తుంటారు._*


*_ప్రార్ధనచేసే వ్యక్తి తాను గొప్పగా ప్రార్ధన చేస్తున్నాను అనుకున్నాడంటే 'నేను’ తగ్గకపోగా మరింత బలపడుతుంది. “నాకు పూజ తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు, నేను జపంలో మునిగానంటే ప్రపంచమే తెలియదు” లాంటి భావాలతో ముందుకు వెళితే నేను-నాది ఇంకా బలిష్టమవుతాయి. లక్ష్యం నెరవేరకపోగా, దానికి ఇంకా దూరమైనట్లు అవుతుంది._*


*_ఈ నేను-నాది జంజాటానికి ఒకే ఒక్క విరుగుడు ఉంది. అది భక్తి. భక్తితో ఏ పని చేసినా అది భగవదర్పణ అవుతుంది. భక్తి పారవశ్యంలో నేను-నాది అనేవి క్రమేపీ హారతి కర్పూరంలా హరించుకుపోతాయి. భక్తుడు భగవంతుడిలో లీనమయ్యే కర్మలోనే నేను-నాది లేకుండా పోయే స్థితి వస్తుంది. అయితే అదంత సులువైన స్థితి కాదు. నేను-నాదికి బదులు మనం-మనది అనుకోవడం ఎంతో బావుంటుంది. ఇది అసలైన జ్ఞానం._*


*_దీన్ని మెల్లగా మనం ఒంటపట్టించుకోవాలి. నేను-నాది చిన్నప్పటినుంచే సహజంగా వచ్చేస్తాయి. ఆ స్థానంలో మనం-మనది అభ్యాసం చెయ్యాలి. అలా మనసుకు శిక్షణ ఇవ్వాలి. కొంచెం కష్టమైనా అది అసాధ్యం కాదు. నేను లేకపోతే బతుకు చప్పగా ఉన్నట్లనిపిస్తుంది._*


*_చాలా మందికి నాదనేది లేకపోతే ఎందుకు మనం బతకడం అనిపిస్తుంది కూడా. కాని జంతువులకు పక్షులకు, చెట్లకు నేను-నాది ఉందా అనే భావాలు ఉన్నాయా ? సహజ భావాలు వాటిని నడిపిస్తాయి. నేను లేకపోవడం వల్ల బాధనూ మరిచిపోయి అవి ఆనందంగా ఉంటాయి. మనకు భౌతిక బాధలూ మానసిక సంకటాలుగా తయారై ఏడిపించుకు తింటూ ఉంటాయి._*


*_అందరూ మాయ అంటున్న ఈ ప్రపంచంబాగుంది. ఇక్కడ నేను హాయిగా ఉంటాను. ఈ రంగురంగుల పూలు, చెట్లు, పక్షులు, ఆకాశం, గాలి, ప్రకృతి నాదే. నేను ఈ ప్రకృతికి సంబంధించిన వాడిని. నా జన్మకు ఏదో ప్రయోజనం ఉంది. అందుకే ఈ ప్రకృతి నా తల్లి ద్వారా నన్ను భూమ్మీదకు తెచ్చింది._* 


*_నేనెంతో అదృష్టవంతుణ్నీ. ఈ నేను భావనను బాగా విస్తృతపరచుకొని ‘మనంగా మార్చుకుంటాను. నాది యోచనను బాగా విశాలం చేసి మనదిగా చేసుకుంటాను. ఉన్నంతకాలం అందరికోసం ఆలోచిస్తాను. అందరితో కలిసి పనిచేస్తాను. లక్ష్యసాధనకు అవరోధంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకుని నేను-నాది అనే దాన్ని మరిచిపోయి నది సముద్రంలో కలిసిపోయినట్లుగా సముద్రాకార నదిగా ఆనందం పొందుతాను అనుకునే మానవుడి కంటే గొప్పవాడు లేడు. అతడే వేదాంతి, అతడే విశ్వప్రేమికుడు. అలాంటివాడినే పరమాత్మ భగవద్గీతలో పరమశ్రేష్ఠుడు అని చెప్పాడు._*


*_సమబుద్ది కలవాడి కంటే మించినవాడు ఈ లోకంలో లేడు. ఈ సమత్వమే యోగం !_*

🕉️🌞🌍🌙🌟🚩
 *మనది కానిది మనకెందుకు* (సంయుక్త అక్షరాలు లేని కథ)
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒక ఊరిలో రాజయ్య అని ఒక కట్టెలు కొట్టేవాడు వుండేటోడు . వాడు రోజూ అడవికి పోయి ఆ రోజుకు సరిపడా కట్టెలు కొట్టుకోని అమ్మేవాడు. ఎక్కువగా ఆశ పడేవాడు గాదు. ఉన్న దానిలో తిని, హాయిగా కాలం గడిపేవాడు.

ఒక రోజు వాడు అడవిలో పోతావుంటే, దారిలో ఒక చోట ఒక బంగారు వరహా కనబడింది. దానిని తీసుకొని చుట్టూ చూసినాడు.. ఎవరూ కనబళ్ళేదు.

కొంచెం దూరం పోయేసరికి మరో వరహా కనబడింది వాడికి! ఇంకొంచెం దూరం పోయేసరికి ఇంకో వరహా! అలా ఒకదాని తరువాత ఇంకొకటి!!

కాసేపటికి వాడి చేతులు రెండూ వరహాలతో నిండిపోయినాయి. కానీ వరహాలు మటుకు ఇంకా కనబడతానే ఉన్నాయి.

"పాపం! ఎవరో పారేసుకున్నట్టున్నారు. వీటిని తీసుకు పోయి రాజభటులకు చూపిద్దాం. వాళ్ళొచ్చి, మిగతావి కూడా వెతికి పట్టుకొని, సొంతదారులు ఎవరో కనుక్కొని అప్పజెబుతారు" అనుకుంటా తిరిగి వెనక్కు బైలుదేరినాడు రాజయ్య.

రాజయ్య ఇంటి పక్కనే ధనయ్య అని ఒకడు వున్నాడు. ఊరిలో వానంత ధనవంతుడు ఎవడూ వుండడు. వాడు పెద్ద ఆశపోతు. ఎంత సంపాదించినా "ఇంకా కావాల,ఇంకా" అని అల్లాడి పోతా వుంటాడు.

ఆరోజున వాడు ఇంటి బైట కూచోని, ఎప్పుడూ గాడిద మీద కట్టెలు వేసుకోని వచ్చే రాజయ్య వుత్త చేతులు వూపుకుంటా రావడం చూసినాడు. "పాపం.. ఈ రోజు కట్టెలు దొరకలేదేమో" అనుకున్నాడు- గాని రాజయ్య మొగం ఏదో గాబరాగా వుంది.

అది చూసి, 'ఏదో జరిగింది' అనుకోని, దగ్గరికి పోయి "ఏం రాజయ్యా, కట్టెలు దొరకలేదా, ఎందుకలా కంగారు పడతా వున్నావు?" అన్నాడు.

రాజయ్య వానికి జరిగిందంతా చెప్పినాడు.

"నిజమా... ఇంకా వరహాలు వున్నాయా, అక్కడ?" అన్నాడు ధనయ్య అశగా.

'వున్నాయం'టూ తలూపినాడు రాజయ్య.

"సరే ఒక పని చెయ్యి. మన పల్లెలో రాజభటులు ఎక్కడ వుంటారు?! నేనే సొయంగా అవన్నీ ఏరుకోని పోయి, మన నగరాన్ని పాలించే రాజుకు అప్పజెబుతాలే. నువ్వు హాయిగా నీపని చూసుకో!"అని నమ్మకంగా చెప్పేసినాడు ధనయ్య.

రాజయ్య చానా అమాయకుడు. ఎవురిని పడితే వాళ్లని నమ్ముతాడంతే. అందుకని ఆ ధనయ్య మాటలు నమ్మేసి, తన చేతిలోని వరహాలు గూడా వానికే ఇచ్చి, "ఇవి గూడా తీసుకోని పోయి రాజుకు అప్పజెప్పు ధనయ్యా, ఒకని సొమ్ము మనకెందుకు?!" అనేసినాడు.

ధనయ్య లోపల్లోపల సంబరంగా నవ్వుకుంటా అవి తీసుకున్నాడు. వెంటనే బిరబిరా ఇంటిలోనికి పోయి, రెండు గోనె సంచులు గాడిదమీద వేసుకోని, రాజయ్య చెప్పిన వైపు వురుకులు పరుగులు మీద పోయినాడు. రాజయ్య చెప్పిన చోటుకి చేరుకునే సరికి బంగారు వరహాలు కనబన్నాయి. సంబరంతో ఎగిరి గంతులు వేసినాడు. గాడిదను వేగంగా తోలుకుంటా పోతా ఒక్కొక్క వరహా ఏరుకో సాగినాడు.

నెమ్మదిగా ఒక గోనెసంచీ నిండిపోయింది. వరహాలు చానా బరువు వుంటాయి గదా, దాంతో గాడిద మోయలేకపోతోంది. ఐనా ధనయ్య ఆశ అగడం లేదు. ఇంకా దారి వెంబడి వరహాలు కనబతానే వున్నాయి. సాయంకాలానికి రెండు సంచులూ నిండిపోయినాయి.

ఇంక చీకటి పడతా వుంది. ఆ అడవిలో దొంగలు చానా ఎక్కువ. వాళ్ల చేతికి చిక్కితే కష్టమే. అందుకని ధనయ్య మెల్లగా వెనక్కి తిరిగి ఇంటికి బైలుదేరినాడు. గాడిద ఆ బరువును మోయలేక, అడుగు తీసి అడుగు వేయసాగింది. ఇలాగే నత్తలాగా నెమ్మదిగా పోయారంటే చీకటి పడి, దొంగలకు దొరికిపోవడం ఖాయం!

దాంతో ఎదారిపడిన ధనయ్య ఒక మూటని తనే ఎత్తుకుని పోదామని చూసినాడు. కానీ పని చేయక చానా రోజులైంది కదా, అందుకని నాలుగు అడుగులు వేసేసరికే చుక్కలు కనబన్నాయి. దాంతో తిరిగి మూటలు రెండూ గాడిద వీపుమీదే వేసినాడు. "ఏం చేద్దామా?" అని ఆలోచించ సాగినాడు.

ఊరికి తొందరగా చేరుకొనేకి ఒక అడ్డదారి వుంది. ఆ దారిన పోతే సగం దూరం తగ్గుతుంది. కానీ ఆ తోవలో చిన్న వాగు ఒకటి అడ్డం వుంది. వాగులో ఎక్కడ ఏ గుంత వుంటాదో, ఎక్కడ ఏ పెద్ద రాయి తగులుతాదో ఎవరికీ తెలీదు. అందుకే ఎవరూ అటువైపు రారు.

కానీ ఆశపోతు ధనయ్య ఆ వాగువైపే బైలు దేరినాడు. కాసేపటికి అక్కడికి చేరుకోని నెమ్మదిగా గాడిదతో సహా వాగులోకి దిగినాడు. నీళ్ళు వేగంగా పారతా వున్నాయి. గాడిద అప్పటికే బాగా అలసి పోయివుంది. దానికి చేతగావడం లేదు. అడుగులు తడబడతా వున్నాయి. అంతలో దాని కాలు చిన్న గోతిలో పడింది. అంతే! దభీమని కింద పడిపోయింది. దాని వీపు మీదున్న రెండు మూటలూ జారి పోయినాయి. వాటిలోని నాణాలన్నీ నీళ్ళలో పడి చెల్లాచెదురై పోయినాయి. ధనయ్య అదిరిపన్నాడు. నీళ్ళల్లో కిందా మీదా పడతా వెదకసాగినాడు.

కొట్టుకు పోయినవి కొట్టుకు పోగా అక్కడొకటి ఇక్కడొకటి దొరకసాగినాయి వరహాలు. వాటిని ఏరుకుంటా వుండగానే వెనుక చప్పుడయింది. తిరిగి చూసినాడు: పెద్ద దొంగలగుంపు- చేతుల్లో కత్తులతో. అదిరిపన్నాడు. "దొరికితే ఇంగేమన్నా వుందా, అంతే సంగతులు!" అనుకొని, ఆ నీళ్ళల్లోనే వేగంగా ముందుకు వురకసాగినాడు. అలా వురుకుతా వుంటే నడుమ ఒక పెద్ద గొయ్యి అడ్డం వచ్చింది. చూసుకోక అందులో కాలు పెట్టినాడు. అంతే కాలు కలుక్కుమనింది. దభీమని పడిపోయినాడు. "అబ్బా!" అంటూ ముక్కుతా మూలుగుతా పైకి లేచినాడు. అంతలో దొంగలు వచ్చి వాన్ని చుట్టుకున్నారు-

"ఏరా మానుంచే తప్పించుకోని పారిపోదామని అనుకుంటున్నావా" అంటా తలా నాలుగు పీకినారు. చేతిలోని బంగారు వరహాలన్నీ గుంజుకున్నారు. వాటితో పాటు ధనయ్య మెడలో గొలుసు, వేళ్ళ వుంగరాలు, చేతి కంకణం, బంగారు మొలతాడు- అన్నీ ఒలుచుకోని పోయినారు.

"అయ్యో! చేతికి చిక్కిన వరహాలూ పాయ, ఒంటిమీదున్న బంగారమూ పాయ!" అని బాధతో లబోదిబోమన్నాడు ధనయ్య.

అయినా వానికి ఆశ చావలా. బుధ్దిరాలా. వుత్త చేతులతో ఇంటికి పోవాలనిపించలా. అక్కడే ఒక చెట్టుచాటున పడుకోని నిదురపోయినాడు.

తరువాతి రోజు పొద్దున్నే- ఇంకా తెలవారక ముందే లేచి, కుంటుకుంటా కుంటుకుంటా మళ్ళీ వరహాలు దొరికిన చోటికి పోయినాడు. ఇంకా అక్కడ దారంతా వరహాలు పడున్నాయి.

"హమ్మయ్య! ఆ పాతవన్నీ పోతే పోయినాయిలే. ఇక్కడ ఇంకా చాలా వున్నాయి. ఈసారి తొందరగా ఏరుకోని పోతాను. చీకటి పడేలోగా ఇంటికి చేరుకుంటాను" అనుకుంటా బిరబిరా ఏరుకోసాగినాడు. నిజానికి ఆ వరహాలన్నీ ఆ వూరి రాజుగారివే. ఆ ముందురోజు వరకూ చుట్టు పక్కల దేశాలనుంచి, సామంతుల నుంచి వసూలు చేసుకున్న కప్పమంతా ఒక పెద్ద గుర్రంబండిలో వేసుకోని రాజుగారి ఖజానాకు తీసుకోని పోతా ఉండినారు సైనికులు . అయితే ఆ బండికింద చిన్న బొక్క పడింది. దారి వెంబడంతా ఒక్కొక్కటే వరహా జారి పడిపోయింది. సైనికులు దాన్ని గమనించుకోలేదు. తీరా పోయినాక తెరిచి చూస్తే ఇంకేముంది?! లోపల సగానికి సగం ఖాళీ అయిపోయింది.

దాంతో సైనికులు అదిరిపడి వెదుకుతా పోతే, దారి వెంబడి మొత్తం బంగారు వరహాలు కనబన్నాయి. దాంతో వాళ్ళు అటు వైపు నుంచి ఒక్కొక్కటి ఏరుకుంటా రాసాగినారు. ధనయ్యకు ఇది తెలీదు గదా, అందుకని వీడు ఇటువైపు నుంచి ఒక్కొక్కటి ఏరుకుంటా పోసాగినాడు. కొంతసేపు అయ్యేసరికి వాళ్ళు, వీడు ఒకరికొకరు ఎదురు పడినారు!

సైనికులు అదిరిపడి "ఏరా, దొంగ వెధవా! రాజుగారి వరహలే కాజేసి పోదామని అనుకుంటా వున్నావా?" అంటూ వాన్ని పట్టేసుకున్నారు.

వాడు నాకేమీ తెలీదంటూ లబోదిబోమని మొత్తుకోసాగినాడు. "మిగిలిన వరహాలు ఎక్కడున్నాయో చెప్పు!" అంటూ వాళ్ళు వాన్ని నున్నగా, తన్నిన చోట తన్నకుండా తన్నినారు. దాంతో వాడు వాళ్లకు జరిగిందంతా చెప్పేసినాడు.

సైనికులు కోపంగా "పోగొట్టుకుని పోయింది ఏదైనా దొరికితే దాన్ని రాజుకి అప్పజెప్పాల గానీ, ఇలా మట్టసంగా మూడో కంటికి తెలీకుండా నున్నగా నొక్కేయడమేనా. ఇంక నీకూ, ఆ దొంగలకూ తేడా ఏముంది? నీవల్ల రాజు సంపద అంతా దొంగల పాలు అయింది. మరియాదగా తిరిగి ఆ రెండు మూటల బంగారు ఖజానాకు కడతావా, లేక జీవితాంతం కారాగారంలో వేసి బంధించమంటావా?!" అన్నారు.

ఆ మాటలకు వాడు అదిరిపన్నాడు. కాళ్ళా వేళ్ళా పన్నాడు. అయినా వాళ్ళు వాన్ని వదలలేదు. దాంతో ఇంటికొచ్చి, ఎప్పుటినుంచో తినీ-తినక దాచి పెట్టుకున్న సొమ్మంతా తీసి వాళ్ళ చేతిలో పెట్టినాడు ధనయ్య. దాంతో ఆ సైనికులు అవన్నీ తీసుకోని వాన్ని వదిలేసినారు. "ఆశకు పోతే ఆఖరికి వున్నవి గూడా పోయినాయే!" అని ధనయ్య లబలబలాన్నాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

****_జీవితంలో కష్టాలు ఉండటం సహజమే.! కానీ బాధలో ఉండటం అసహజం.

 *_జీవితంలో కష్టాలు ఉండటం సహజమే.! కానీ బాధలో ఉండటం అసహజం. ఈ చరిత్రలో ఎవరిని తీసుకున్నా కష్టాలు లేని వారెవ్వరూ లేరు.!_*

*_సోక్రటీస్ నుంచి వివేకానందుడి వరకు, ఐన్ స్టీన్ నుండి అబ్దుల్ కలాం వరకు అందరూ ఎన్నో కష్టాలు పడ్డవారే.! మరి వారందరికీ కష్టాలు వుండి వుంటే వారు ఎప్పుడూ బాధలో ఉన్నట్లు కనబడరెందుకు.?!_*

*_కష్టాలు వేరు, బాధలు వేరా.? కష్టం అంటే ఏంటి, బాధ అంటే ఎంటి.? కష్టాలు ఉన్నా బాధ లేకుండా ఉండవచ్చా.?_*

*_జీవితంలో ఊహించనిది, అనుకోనిది జరిగినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, మన శక్తికి మించిన పరిస్థితి ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని కష్టంగా భావిస్తూ వుంటాం.!_*

*_ఈ కష్టాలకు అనేక కారణాలు ఉండవచ్చు.! వాటిలో ఎన్నో మన చేతుల్లో ఉండవచ్చు, వుండకపోవచ్చు.! అది అత్యంత సహజం... అన్నీ మన చేతుల్లో లేకపోవడం.!_*

*_కానీ బాగా గమనిస్తే ఒకే కష్టం ఒక వ్యక్తికి వస్తే చాలా బాధపడుతూ కనబడితే, అదే కష్టం ఇంకో వ్యక్తికి వచ్చినప్పుడు మామూలుగా ఏ బాధ లేనట్లు కనబడుతూ వుంటాడు.!_* 

*_అంటే మనకు ఇక్కడ అర్థం అయ్యే విషయం ఏమిటంటే బాధ అన్నది కష్టాలనుంచి కాకుండా ఇంకెక్కడినుంచో వస్తోంది.! అదే మన మనస్సు.! అంటే బాధ అన్నది మనస్సు వల్ల, మనస్సు నుంచి సృష్టించబడినదే కానీ నిజంగా బాధ అన్నది లేదు.!_* 

*_అంటే మనం అనుకుంటే బాధ లేకుండా కూడా ఉండవచ్చు.! కాబట్టి కష్టాలు అన్నవి మన చేతుల్లో లేని సహజ ప్రక్రియ అయితే బాధ అన్నది మన చేతుల్లోనే వున్న అసహజ ప్రక్రియ.!_* 

*_మనం అనుకుంటే సర్వ వేళలా బాధలులేకుండా ఉండవచ్చు కూడా.!_*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🫐🏵️🫐 🪷🙇‍♂️🪷 🫐🏵️🫐

పాదాభివందనం ఎందుకు చేయాలి....!! 🙏పాదాభివందనం వలన… ప్రయోజనం ఏమిటి🪷

 🕉️ ఓం నమః శివాయ 🕉️

🙏 శివాయ గురవే నమః 🙏

🙏 పాదాభివందనం ఎందుకు చేయాలి....!!

🙏పాదాభివందనం వలన…
             ప్రయోజనం ఏమిటి🪷
🌺🌺☘☘🌺🌺☘☘🌺🌺☘☘   

🌺శుభ కార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.

☘కేవలం శుభకార్యాల లోనే కాక, పెద్దవారు కనిపించనప్పుడు కూడా చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు. 

🌺అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి!🌷

☘భారతీయ సంప్రదాయంలో, పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న పురాతన పద్దతి. 

🌺అయితే కొందరు, 
అడుగులను అపరిశుభ్రంగా  భావిస్తారు.

☘పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలు, ఉన్నాయి.

🌺పెద్దవారి పాదాలను తాకాలంటే, మన అహంకారం వదిలి తల వంచాలి. 
అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.

☘సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు, వారి ఆలోచనలు, స్పందనలు, వాటి నుండి వచ్చే పదాలు, చాలా శక్తివంతంగా ఉండటం వల్ల చిన్నవారికి ఎన్నో ఆయురారోగ్య ఐశ్వర్య విద్యా లాభాలు చేకూరుతాయి!

🌺పెద్దవారి పాదాలను తాకడానికి 
మన నడుము వంచి,  
మన కుడి చేతిని పెద్దవారి ఎడమ కాలిమీద పెట్టాలి.  

☘అలాగే మన ఎడమ చేతిని పెద్దవారి కుడి కాలిమీద ఉంచాలి. 
అప్పుడు పెద్దవారి చేతులు, మన మీదఉంటాయి. 

☘ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. 
ఆ సమయంలో పెద్దవారి శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవుతాయి.

🌺ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే  దీవెనలు ఫలిస్తాయి.

☘పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం వల్ల, వారి పాద ధూళిలో కూడా, ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది. 

🌺"మేము కూడా మీ మార్గంలో  నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని, సంపాదించడానికి ఆశీర్వదించండి", 
అని చెప్పే సంప్రదాయానికి ప్రతీకగా, 
చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.

☘మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు,
ఆ ఇంటిలో ఉన్న పెద్దవారికి
పాదాభివందనం చేసి, పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.

🌺అలాగే  ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా,
వారికి పాదాభివందనం  చేసి,
పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.

☘🙌 సాధారణంగా పెద్దవారి ఆశీర్వచనాలు ఈవిధంగా ఉంటాయి! 🙌🌹

🌺పెళ్లయిన జంటని :
అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు.

☘పెళ్లి అయిన ఆడవారిని :
దీర్ఘసుమంగళీభవ

🌺చిన్న పిల్లల్ని :
🙌చిరంజీవ - చిరంజీవ

☘చదువుకుంటున్నవారిని :
🙌బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి.

🌺పెద్ద చదువులు చదువుకునేవాళ్ళని :
🙌ఉన్నతవిద్యా ప్రాప్తిరస్తు.

☘పెళ్లికావసలసిన వాళ్ళని :
🙌శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.

🌺ఉద్యోగం చేస్తున్నవాళ్ళని :
🙌ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు.

☘ఏమని ఆశీర్వదించాలో తెలియనప్పుడు 
ఒక్క మాటలో ఆశీర్వదించాలంటే 

🌺🙌"మనోవాంఛా ఫలసిద్దిరస్తు"🙌

☘(నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి)
ఈవిధంగా పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు!

🌺(పెద్దలకు, తల్లి దండ్రులకు, పూజ్యులకు, గురువులకు, పాదాభివందనం చేసి, ఆశీర్వచనాలు పొందేలా, మనం మన పిల్లలకు చిన్నప్పటినుంచీ నేర్పాలి.)
మన సంస్కృతిని మర్చిపోకూడదు...

🙏 సర్వేజనాః సుఖినో భవంతు🙏

****హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువులే.!!

 తెలుగు రాష్ట్రాల్లో  73% హిందువులు హిందు వ్యతిరేక శక్తులకే మద్ధతు ఇస్తున్నారు.

భారత్ టుడే సర్వేలో వెల్లడి

అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువులే.!!

ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు :-

1. అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.

2. అన్ని మతాల సారం ఒక్కటే అంటారు.. ఏదో  వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా.

3. అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని  బోధనలు చేస్తారు...  వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.

4. వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద  వేదాంతుల్లాగా. 

5. వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.

6. క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు. మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.

7. క్రైస్తవుల ఇంటికి ప్రార్దనకు వెళ్లి కేకులు, బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.

8. హిందువులను, హిందు గ్రంధాలను, హిందూ దేవుళ్లను దూషించేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.

9. హిందూ ధర్మం గొప్పతనాన్ని  ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.

10. పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా: కృష్టుడికి 16 వేలమంది భార్యలు).

11. స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.

12. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.

13). ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?

ఈ సెక్యులర్ హిందువులు 
(హిందూ ధర్మాన్ని నాశనం చేసేవారు) ఇప్పుడైనా మారండి నిజం తెలుసుకోండి 

గొప్పదైన నీ ధర్మాన్ని నీ దేశాన్ని కాపాడుకో. మేలుకోండి హిందువులారా! లేకపోతే కొన్ని రోజులు, కొన్ని ఏళ్ళ తర్వాత మీ పిల్లలకి పూర్వం హిందూమతం ఉండేది అనిచెప్పే దుస్థితి వస్తుంది. హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ, ఆచరిస్తూ తమ పిల్లలను సైతం హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటించేలా పెంచాలని విజ్ఞప్తి. ధన్యవాదాలు 🙏

****ప్రస్తుత పరిస్థితి* ------------------------------------------------ *కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్...

 *ప్రస్తుత  పరిస్థితి*
------------------------------------------------
 *కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్...అర్హత లేకున్నా అందలం ఎక్కుతున్న అమ్మాయిలు!! కొడుకు కు ముప్ఫై ఏళ్ల లోపు పెళ్లి కాకుంటే ఆజన్మ బ్రహ్మా చారిగా ఉంటాడనే బెంగ తల్లి దండ్రులను పట్టి పీడిస్తుంది...ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా ముప్ఫై ఏళ్ల వరకు అమ్మాయిలు కూడా పెళ్లి ధ్యాస లేకుండా ఉద్యోగం వెలగ బెడుతుండంతో పురుషాధిక్యత సమాజంలో ఆడవాళ్ళ పెత్తనం పెరిగిపోయి *పెళ్లి కాని ప్రసాదు* లు తాళి బొట్టు పట్టుకొని అమ్మాయి కోసం వెంపర్లాడం తో  ఈ తరం అమ్మాయిలు చెట్టు ఎక్కి మరి పిల్లవాడి రేజ్యూం చూసి పెదవి విరవడంతో ఒక అమ్మాయికి పదిమంది నిష్పత్తి చొప్పున పెళ్లి చూపుల పరంపర కొనసాగుతూనే ఉంది!! అబ్బాయిలు బెండకాయ ముదిరినట్టు ముదిరి పోతున్న పెళ్లి జాడ లేక విలవిల లాడి పోతున్నారు...అమ్మాయిల డిమాండ్ కన్నా ఆమెను కన్న పేరెంట్స్ కోరికలు చాంతాడు అంత ఉండడం తో పెళ్ళి కొడుకులు క్యూ కడుతున్నారు...వాడికి పర్మినెంట్ జాబు ఉండాలి ఒక ఐదెకరాల పొలం ఉండాలి...హైదరాబాద్ లో కోటి రూపాయల అపార్ట్మెంట్ ఉండాలి...అమ్మాయి మెళ్ళో ఇరవై ఐదు తులాల బంగారం వేయాలి...పెద్ద వివాహ వేదిక లో వెయ్యి మందికి భోజనం పెట్టాలి... ఆన్న డిమాండ్ ముందు ఉంచడమే కాకుండా అమ్మాయి పెళ్లి అయ్యాకా కూడా జాబ్ చేస్తే ఆ అమ్మాయి సంపాదన తల్లి దండ్రులకు చెందాలి  ఆన్న ప్రధాన డిమాండ్ల ను తలవోగ్గి పెళ్లి పీటల మీద కు అమ్మాయి వచ్చే వరకు వణుకుతూ పెళ్లి పనులు చేసే మగ పెళ్లి వారి బాధలు ఏ పగ వాడికి కూడా వద్దు! ఒక్క తెలుగు రాష్ట్రాల లోనే కాదు దేశం మొత్తం మీద అమ్మాయిల కోరికలు గుర్రాలు అయి పరిగెడుతుంటే భవిష్యత్ భారతంలో వివాహ వ్యవస్థ ఉంటుందా లేక *సహాజీవన వ్యవస్థ* గా మారిపోతుందా అనే భయం విద్యాధికులు, సంప్రదాయ వాదులు పట్టుకుంది..ఎందుకంటే కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో ఇరవై ఐదేళ్ళకే అమ్మాయిలకు ముప్ఫై వేల ఉద్యోగం దొరకడం...మూడేళ్లలో అది రెట్టింపు కావడంతో సొంత కారు...కావాల్సిన కాస్మెటిక్స్...మాడ్రన్ దుస్తులతో కార్పోరేట్టు కల్చర్ లోకి వెళ్లి పోతున్న అమ్మాయిలు...పెళ్లి ధ్యాస మరిచి రంగుల ప్రపంచం లో విహరిస్తూ *ఆడింది ఆట పాడింది పాట* జీవితం కొనసాగుతుంటే, పెళ్లి మీద ద్యాస ఎందుకుంటుంది?!...దానికి తోడు అమ్మాయిల కొలీగ్స్ లలో ఇద్దరో  ముగ్గురో డైవర్స్ కేసులు ఉంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడి, "పెళ్లి  చేసుకొని వాడి చెప్పిన మాట వినే కన్నా సోలో లైఫ్ బెటర్" అనే అమ్మాయిల సైకాలజీ వల్ల పెళ్ళిళ్ళు అటు మొగవారికి ఇటు ఆడవారికి సరియైన వయసులో జరగపోవడం, దానికి తోడు అబ్బాయి *మంచి వాడా చెద్దవాడ* అని  తెలుసుకోవడానికి ఆర్నెళ్ళు *సహజీవన యాత్రలు* చేసి రావడంతో మోజు తీరి మరో *ఎర్నర్* కోసం వెతుకుతున్న ఈ తరం యువతుల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతుంది...*కులం చెడ్డ సుఖం దక్కాలనే* పెద్దల మాట పెడచెవిన పెట్టీ, రంగు రూపు చూసి వాడి బుట్టలో పడి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని వాడు *సకల కళా వల్లభుడు* అని తెలుసుకొని అమ్మ గారి ఇంటికి చేరుకుని లబోదిబోమంటే పోయిన మృదుత్వం వస్తుందా?! ఇలా ముప్ఫై ఏళ్లు గడిచాకా డబ్బున్న ఏజ్ బార్ వాడు దొరికితే వాడితో నైనా సరిగా సంసారం చేస్తుందా అంటే అదీ లేదు! పిల్లలు పుడితే అందం ఎక్కడ మసి బారుతుందో అని ముప్ఫై ఐదేళ్ల వరకు పిల్లలు కనకుండా టాబ్లెట్లు మింగే అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల మనవలు - మనవరాళ్లు కావాలనుకునే  పేరెంట్స్ ఆశలు అడియాశలు అయి పోతున్నాయి...2024 లో యువతుల *పెళ్లి సందడి* ముప్ఫై ఏళ్ళు దాటుతుంది అంటే అమ్మాయిల్లో పెళ్లి ద్యాస కన్నా సంపాదన ద్యాస ఎక్కువగా ఉందనే విషయం తేట తెల్లమవుతుంది...! ఏ వయసులో ఆ వయసు ముచ్చట తీరాలని పెద్దలు ఊరికే అనలేదు...అది లేకే నేటి పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి...ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా పెళ్ళిళ్ళు మూడు నాళ్ళ ముచ్చటగా కావడానికి ఆడపిల్లల తండ్రులు మొదటి కా రణం కాగా *పిల్లవాడు సెటిల్* కాలేదు...అని అబ్బాయి ఆదాయం పై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండో కారణం! ముప్ఫై ఏళ్ల వరకు మహా అయితే అదా చేసుకుంటే యాభై లక్షలు ఉంటాయి కాబోలు *కోటి* ఆశలు తల్లి దండ్రులు ఉంటే ఆ కోటి వచ్చేసరికి నెత్తి మీద జుట్టు ఊడి పోతూ లేక...చిక్కి శల్యమైన *పోరన్ని* ఏ పిల్ల పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది?...ఆడపిల్లలు అందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి...ఆయన లా ఆడి కారు ఉండాలని కోరుకోవడంలో  తప్పులేదు.... కానీ అలాంటి వరుడు వేటలో ఉన్న ఎంపిక అయ్యే సరికి ఈడు పోయి అనాకారి దొరికితే వాళ్ళ ఆశలు అడి యాశలు అయి పెళ్లయిన ఏడాదికే కోర్టు మెట్లు ఎక్కుతూ డైవర్స్ ఆట మొదలు పెడుతున్నారు!🌷🌷🌷🌷🌷🌷🌷ఇక పవిత్ర భారత దేశంలో ఇప్పుడు అత్తలా ఆరళ్ళ కన్నా కోడళ్ళ ఆరాళ్ళు ఎక్కువవుతున్నాయి...   పెళ్లయిన ఆర్నేళ్ళకే వేరు కాపురం పెట్టీ, అత్త మామలు రాకుండా సూటి పోటి మాటలు అంటూ దూరం పెడుతున్న వనితల అతి ప్రవర్తన వల్ల కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోయింది...వృద్ధాప్యంలో కొడుకు కన్నా ఇంటి ముందు శునకం పెంచుకోవడం బెటర్ అనే మైండ్ సెట్ లో ఓల్డ్ ఏజ్    పేరంట్స్ ఉంటున్నారు...పొరపాటున ఆడపిల్లల కన్నా తల్లి దండ్రులు కూడా అటు అల్లున్ని పంచన చేరలేక...చేరినా కూడా అక్కడ అడ్జెస్ట్ కాలేక మానసిక వేదన తో కుమిలి  పోతున్నారు...ఇక ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్న ఇంట్లో.... పేరెంట్స్ బాధ వర్ణనాతీతం...ఆస్తుల పంచాయతీలు ఒక వైపు ఆదరణ లేక *వృద్ధ పక్షులు* ఒకరికి ఒకరై ఓదార్చు కుంటు దేవుడు ఎప్పుడు తీసుకు వెళ్తాడా? అని ఎదిరి చూస్తున్నారు! పదేళ్లు ఎత్తుకొని కాలికి ముల్లు అంటకుండా పెంచిన పిల్లలు...సంపాదన పరులు అయ్యాకా తల్లి దండ్రులకు మంచి చెప్పులు కూడా కొనివ్వని దౌర్భాగ్య పరిస్థితి నేడు కనబడుతుంది...! నాలుగు రోజులు పెద్ద కొడుకు...నాలుగు రోజులు బిడ్డ దగ్గర ఉంటే వాళ్లకేం తోడి పెడుతున్నారని కొడుకు - కోడళ్ళ వేధింపులతో ఒంటరి జీవనంలో ఇమడలేక....అటు పిల్లలు ఆదరణ కోల్పోయి  కళ్ళ   వెంట ధారగా కన్నీళ్లు కారుస్తూ ఎవరూ ముందు పోయినా మరొకరికి కష్టం అని *భార్యభర్తలు* ఒకరికొకరం ఉన్నామని ధైర్యం చెప్పుకుంటూ జీవనం వెళ్ళ బోస్తున్నారు...! చాలా మంది అత్తమామలు కొడుకు కోడలు నుండి ఆదరణ -  ఆప్యాయతతో కోరుకుంటారు. చాలా సందర్భాలు వాళ్లకు అది దూరం అవుతుంది..
మన 'ఆధునిక సమాజంలో అత్త మామలు అడ్జెస్ట్ కాలేక పోతున్నారు...ఇదీ చాదస్తం అనే కన్నా *ప్రేమ* ఎక్కువవడం అంటే కరెక్ట్!
భారతదేశంలోని కొంతమంది కోడలు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక సమస్యలు దీని వల్లే తలెత్తుతున్నాయి...అత్త పెత్తనం కోడలు సహించదు...తన కోడలు తన చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటున్న తల్లి తన కూతురు మాత్రం *స్వేచ్ఛ* లేదు అని ఆరాట పడుతుంది...మహిళల్లో ఈ ద్వంద వైఖరి వల్లే కోడళ్ళు శాడిస్ట్ లుగా తయారవుతున్నారు...
అత్తమామలతో జీవించడం వాళ్లకు పెద్ద సవాళ్లు గా అనిపిస్తుంది.
ఈ తప్పుడు భావాలు అనాదిగా ఉంటూనే ఉన్నాయి..*కోడలు బిడ్డ కాదు...అల్లుడు కొడుకు కాదు* అనే  మైండ్ సెట్ ఇంకా వందేళ్లు అయినా మారేట్టు లేదు!  అత్తగారు - కోడలు మధ్య సంబంధం నిజానికి అందంగా ఉండాలి... కానీ తరచుగా వారి మధ్య ఘర్షణ వాతావరణం, ఆధిపత్య పోరాటం కొనసాగుతూనే ఉంటుంది..ఈ తప్పుడు భావాలు ఇద్దరి మధ్య మంచితనాన్ని నాశనం చేస్తున్నాయి. బహుశా, అత్తమామల జోక్యం, కొడుకు పై పెత్తనం వల్ల తాను *స్వాతంత్ర్యం* కొల్పోతున్నాననే అభద్రత భావం లో కోడలు ఉంటుంది.. ఆ భయాలను ఆమె తల్లి దండ్రులు ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో అశాంతి ఎక్కువవుతుంది.. తన కుమార్తె  తన అత్తమామలతో సుఖంగా జీవించాలని కోరుకునే తల్లి దండ్రులు ఉంటే ఇలాంటి అపశృతులు రావు...కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం ఉండాలని కోరుకోవడం వల్లే ఈ అశాంతి!!
  ఒక కోడలు మరియు ఆమె అత్తగారి మధ్య ఏర్పడే సమస్యలు 'పోటీ' పడుతుంటాయి!  ఇది వివాహా వ్యవస్థలో చాలా సమస్యలను కలిగిస్తుంది!  తల్లి మరియు భార్య ఇద్దరి మధ్య కొడుకు నలిగి పోతాడు...తల్లి కన్నా పెళ్ళమే బెల్లం అనుకున్న మరుక్షణం కొడుకు ఇంటి వైపు తల్లి చూడదు!!  అటు తల్లి ఇటు పెళ్ళాం మధ్య మానసిక వేదనకు గురయ్యే పుత్ర *రత్నాలు* కూడా కోకొల్లలు!!🌷🙏🌷🌷🙏🙏🌷🙏🌷🙏🙏
ఈ ఇంటికి నేను మొదటి కోడలు ను అనే ఇగో తల్లిలో బలంగా ఉంటుంది..
 35 సంవత్సరాలకు క్రితం ఈ ఇంటి పరువును నిలబెట్టాను...అలా నువ్వు అణిగి మణిగి ఉండాలని అత్తా కోరుకోవడంలో తప్పు లేదు కానీ  ఆనాటి అత్తలు వేరు ఈ  నాటి కోడళ్ళు వేరు! ఆనాటి అత్తలకు కావాల్సిన అస్తి ఉండేది...దానికి చూసుకోవడానికి కోడలు కు ఇంటి బాధ్యత అప్పగిం చేది. అయిన ఆనాటి అత్త కోడళ్ళు మధ్య కూడా అభిప్రాయ బేధాలు ఉండేవి...ఇంటి నిండా పనిమనుషులు ఉన్నారు కాబట్టి ఇంటి గుట్టు  బయట పడలేదు... ఇప్పుడు అలా కాదు కోడళ్ళు సంపాదన పరులు అయ్యారు. అత్త కొంగు పట్టుకు తిరగాలి అంటే ఏ కోడలు ముందుకు రాదు!   ఇప్పుడు కట్నా కానుకల కన్నా *స్వేచ్ఛ జీవితం*, కోరుకుంటున్న ఈ తరం జంటల వల్ల మానవ సంబంధాలు ఆప్యాయతలు గంగలో కలిసి పోయాయి...మనవలతో అడుకొనివ్వని కోడళ్ళు...ఆతి గారాబం చేయవద్దని చెప్పే కొడుకుల వల్ల తాత మనవలు ఆత్మీయత మసి బారి పోయింది!
కొత్తగా పెళ్లయిన వధువులు తమకు ఇష్టమైన దుస్తులను ధరించడానికి,  లేదా వారి తల్లిదండ్రులను ఎప్పుడు తన దగ్గరకు వచ్చి పోతుండాలి అని కోరుకుంటుంది తప్పా అత్తా మామలను ఆదరించాలని అనుకోక  పోవడం వల్లే అత్త కోడళ్ళ మధ్య బాగా గ్యాప్ పెరిగిపోతుంది! ఒక వేళ కొడుకు ఇంటికి వెళితే   ఆలస్యంగా నిద్ర లేచిన  కోడలు... చెప్పులు వేసుకొని ఇంట్లో తిరిగే కోడలు...పూజలు పునస్కారాలు  లేకుండా, స్నానం ఆచరించకుండానే వంటింట్లో దోసెలు వేసే కోడళ్ళ *పనితీరు* వంట బట్టలేక ఏదైనా మాట అత్త గారు అంటే తాను స్వేచ్చలేని పంజరంలో చిలుకను అయ్యాయని ఏడుస్తూ బెడ్ రూం లో అలక పాన్పు ఎక్కుతున్న సుందరాంగి మాటలు విని తల్లి పై కోపగిస్తున్న కొడుకుల ప్రవర్తన వల్ల కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోతుంది!! అత్తమామలు కొడుకు ఇంటికి వస్తె *హై-సెక్యూరిటీ జైలు* లో బంధించి నట్టు కోడలు ఫీలు అవుతుంది.. అత్త 'నియమాలు' కొడలు కు నచ్చవు...కోడలు తీరు అత్తకు నచ్చదు...
పిల్లల యొక్క ఏకైక బాధ్యత ఎలా కోడలు తీసుకుంటుందో 
అత్తమామలతో కలిసి జీవించడం కూడా బాధ్యత అనుకునే కోడళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ!  
వృద్ధ అత్తమామలతో కలిసి జీవించడం ప్రతి కోడలికి ఎంతో విజ్ఞాన దాయకం., ఎందుకంటే వారి ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధ వహించడం వాళ్ళు చేస్తారు...తెలివైన కోడలు అయితే అత్తా మామలతో ప్రేమ గా ఉంటే సగం పనిభారం తగ్గినట్టే! అత్త గారే వంట చేస్తుంది...మామ గారే పిల్లలను బడికి పంపే బాధ్యత తీసుకుంటారు...కానీ వంటింట్లో ఏదో *దోచుకుపోతుంది* అని భయపడి కిచెన్లోకి రానివ్వని కోడళ్ళు...కోడలు ఇంట్లో సమకూర్చిన ప్రతి వస్తువు తన కూతురు ఇంట్లో ఉండాలని అనుకునే అత్తల వల్ల ఈ గ్యాప్ ఎక్కువవుతూనే ఉంది! భారతదేశంలో పవిత్రమైన కర్తవ్యంగా అత్త కోడళ్ళు ఉండాలి... కానీ ఈ తరం కోడళ్ళ లో మార్పు వస్తేనే కుటుంబ వ్యవస్థ మళ్ళీ చిగురిస్తుంది...