Tuesday, December 24, 2024

 *గురుబోధ:*

ఎప్పుడైతే భ్రమ తొలగి, భగవంతుడు సర్వాంతర్యామి అన్న భావన కలుగుతుందో తన్మయత్వం పొందుతామో, 

భగవంతుడు సర్వాంతర్యామియైనా అంతర్యామి అని గ్రహిస్తామో అప్పుడు తన్మయత్వములో, తాదాత్మ్యము చెంది కన్నులు మూసుకుంటాము. ఇది మనలో అంతర్లీనంగా ఉండే ఉపాసనాశక్తి వల్ల జరుగుతుంది. ఆ స్థితిలో భగవంతుడి అనుగ్రహం కలిగి, శీఘ్రముగా దర్శనం కలుగుతుంది. కనుకనే జ్ఞానులు సమాధిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ తన్మయత్వములో కన్నులు మూసుకుంటారు. ఉదా: హాథీరాం బాబాజీ (భగవంతుడు ఏనుగురూపం లో వచ్చి చెరకుగడలు తిని అతడిని రక్షించడం వలన అప్పటినుంచి ఆయనని హాథీరాంబాబాజీ అని పిలుస్తున్నారు) కృష్ణుడు ఎదురుగా దర్శనమిచ్చినప్పుడు అన్నీ మర్చిపోయి తన్మయత్వం తో కన్నులు మూసేసేవాడు. అప్పుడు కృష్ణుడు నన్ను చూడడానికి పిలిచి, నేను వచ్చినప్పుడు కన్నులు మూసుకుని ఉంటావేమిటి? అని అడిగేవాడు.  ఏమి చెప్పమంటావు కృష్ణా! కన్నులు తెరిచి చూచినట్లైతే నీ చిన్నరూపమే కనిపిస్తుంది. కానీ కన్నులు మూసి చూచినప్పుడు కోటిసూర్యులకాంతితో దివ్యమంగళరూపముతో మనోదర్శనమిస్తావు. అందుకే కళ్ళు మూసుకున్నాను, కానీ నా ఎదురుగా నువ్వు లేకపోయినట్లైతే అంతటి గొప్ప దర్శనము కలుగదు, కాబట్టి నా ఎదురుగా ఉండమని ప్రార్థించేవాడు.

*బ్రహ్మ రాతా..?* *కర్మ ఫలమా..?*

 *బ్రహ్మ రాతా..?*

                 *కర్మ ఫలమా..?*
                 
బ్రహ్మశ్రీ వెల్లంకి కృష్ణశర్మగారి సౌజన్యంతో 


ఒకసారి నారదుడు భూలోకంలో సంచరిస్తుంటే, ఆయనకు ఒక సముద్ర తీర ప్రాంతంలో ఒక పుర్రె కాలికి తగిలిందట. దాని‘తలరాత’ఆ పుర్రె మీద ఇంకా అలాగే నిలిచి ఉందని చూసి నారదుడు కుతూహలంతో ఆ పుర్రెను చేతిలోకి తీసుకొని ఆ రాతను చదివాడట. పొడి పొడి మాటలలో..
*‘జన్మ ప్రభృతి దారిద్య్రం, దశ వర్షాణి బంధనం, సముద్ర తీరే మరణం, కించిత్ భోగం భవిష్యతి’*

(పుట్టుక నుంచి దరిద్రం, మధ్యలో పదేళ్ళు  కారాగార వాసం, చివరికి సముద్ర తీరంలో చావు, కొంచెం భోగం కలుగుతుంది) అని ఉంది.

నారదుడికి ఆశ్చర్యం వేసింది... ‘జన్మంతా దరిద్రం, మధ్యలో కారాగార వాసం, చివరికి అయిన వాళ్లు ఎవరూ దగ్గర లేకుండా ఎక్కడో సముద్రతీరంలో చావు అని రాసి పెట్టి ఉండగా, ఇక ఆపైన భోగం ఏమిటి? మా నాన్న గారు పొరబడ్డారా?’ అనుకొని సరాసరి బ్రహ్మలోకానికి వెళ్లి తండ్రిని ప్రశ్నించాడు...
“ఇతగాడు నిష్ఠదరిద్రుడే!దిక్కులేకుండా మరణించిన మాటా నిజమే...  కానీ నీలాంటి దేవర్షి తన స్వహస్తాలతో ఇతని కపాలాన్ని ఎత్తి, మోసుకొంటూ సాక్షాత్తూ బ్రహ్మలోకం దాకా చేర్చాడంటే, కొద్దిపాటి మహాభాగ్యం లభించి నట్టు కాదంటావా?”అన్నాడట బ్రహ్మ.

బ్రహ్మ రాత పొల్లు పోనిదనీ, దాన్ని ఎవరూ తప్పించుకోలేరనీ భారతీయ సంప్రదాయంలో అనాదిగా ఓనమ్మకం!
*‘యత్ ధాత్రా నిజ పాల పట్ట లిఖితం, స్తోకం మహత్ వా ధనం తత్ ప్రాప్నోతి మరుస్థ లేపి నితరాం మేరౌ చ న అతోధికమ్’*
(విధాత, మనిషి ఫాల తలం మీద ఎంత రాశాడో అంత ధనం, అది కొంచెమైనా అధికమైనా, ఆ మనిషికి ఎడారిలో ఉన్నా లభిస్తుంది. సువర్ణమయమైన మేరు పర్వతం ఎక్కినా అంతకంటే ఎక్కువ లభించదు) 
అని చెప్పాడు భర్తృహరి.

మరి అంతా బ్రహ్మరాతే అయితే ఇక మనిషి కర్మలకీ, ప్రయత్నాలకీ ఏ విలువా లేనట్టేనా?
బోలెడంత ఉంది....!

’ఈ ప్రపంచంలో ప్రతి కర్మకూ దానికి తగిన ఫలం ఉండి తీరుతుంది!’ అని కదా కర్మ సిద్ధాంతం!

అంటే పాపానికి ఫలంగా దుఃఖం, పుణ్యానికి ఫలంగా సుఖం అనుభవించాల్సిందే..!

బ్రహ్మరాత అంటే ప్రాణి ఈ జన్మలో అనుభవించబోతున్న పూర్వ జన్మ కర్మల ఫల శేషమే..!

దీనినే మరో విధంగా చెప్పుకోవాలంటే, మనిషి కర్మ ఫలాల శేషం ఎప్పటికప్పుడు అతని ఖాతాలో జమ గానో, అప్పుగానో భద్రంగా నిలువ ఉంటుంది..!

మనిషి పుట్టినదే ఆ నిల్వను వాడుకొనేందుకు, లేదా ఆ ఋణం తీర్చుకొని వెళ్లేందుకు..!

బ్రహ్మ రాత అంటే ఈ కర్మఫల శేషం తాలూకు పద్దు అని మాత్రమే..!

ఇది బ్రహ్మ తన ఇచ్చానుసారం రాసేది కాదు..!

మనిషి ప్రతి జన్మలో చేసుకొనే పాప పుణ్య కర్మల బాధ్యత అతనిదే..!

బ్రహ్మ రాత చెరపలేనిదీ, అనుభవించక తప్పనిదీ, తప్పించుకోటానికి వీలులేనిదీ అన్న మాటకు అర్థం కర్మ ఫలం అనుభవించక తప్పదు అని మాత్రమే..!              

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

53. త్వం కామ సహసాసి ప్రతిష్ఠితో విభుః

పరమేశ్వరా! నీవు
'కామ’స్వరూపానివి. ప్రతిష్ఠితుడవైన విభుడవు (అథర్వవేదం)

'కామం' అంటే కోరిక. ఆధ్యాత్మికమైన ఈ దేశంలో 'కామం' వంటి భౌతికాంశాలను అలక్ష్యపరచారని భావిస్తాం. కానీ ఈ దేశంలోనే ఈ విషయమై అద్భుతశాస్త్రాలు
పుట్టాయి. అయితే వ్యాపార విష సంస్కృతిని ప్రపంచమంతా ప్రసరించిన విదేశీ దృష్టిని మన నేత్రాల్లోకి అరువుతెచ్చుకుని అద్భుతమైన మన ఆవిష్కరణల్ని అతి తక్కువ భావంతో చులకన చేస్తున్నాం.

(కామ=క+అ+మ. ఇందులో 'క' బ్రహ్మవాచకం. 'అ' విష్ణుసూచకం. 'మ'
రుద్రస్వరూపం. ఈ మూడు సృష్టి, స్థితి, లయ శక్తులు. ఈ మూడు శక్తుల
మూలశక్తి 'కామ'. అందుకే పరమేశ్వరుని 'కామ' అని కొలుచుకుంటాం.దైవాన్ని ఎంత పవిత్రంగా, ధర్మంగా ఆరాధిస్తామో కామాన్ని కూడా అంత చక్కగా నియమాలతో పాటిస్తే అది మనల్ని పతనం కానీయకుండా కాపాడుతుంది.)

కామం భగవద్భావనగా గ్రహించమనీ, పురుషార్థాలలో ఒకటిగా స్థాపించాం.
మహాభారతంలో 'కామగీతలు' చెప్పబడ్డాయి. అంటే కామం పట్ల దార్శనిక దృష్టితో తాత్త్విక చింతన ఈ దేశంలో ప్రాచీన కాలంలోనే జరిగిందన్న మాట. వాత్సాయనాదుల
గ్రంథాలను స్పష్టంగా పరిశీలిస్తే ఒక ఆరోగ్యవంతమైన కుటుంబవ్యవస్థకు మూలాలను ఎలా ప్రతిష్ఠ చేశారో అర్థమౌతుంది.

ధర్మపు పునాదిపై అర్థకామాలను సంపాదించడమనే మౌళిక సామాజిక సూత్రాన్ని అత్యంత ప్రభావవంతంగా ఆవిష్కరించిన సంస్కృతి మనది.

“ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభోధర్మమునకు విరుద్ధం కాని కామము నా స్వరూపము' - అని సాక్షాత్తు భగవానుడే గీతాబోధ చేశాడు. సహజ స్వభావాన్ని సవ్యధోరణిలో సాగనిస్తే వ్యక్తికీ, సమాజానికీ క్షేమమని గ్రహించి, ధర్మపు హద్దులనే పాదుగా వేసి మానవజీవన వృక్షాన్ని పదిలంగా ఎదగనిచ్చిన పటిష్ట సంస్కారం
ఇక్కడ అనాది సిద్ధాంతం.
-
పరమాత్మయే 'స అకామయత ఏకోహం బహుస్యాం ప్రజాయాయేతి' అనే 'కోరిక'తో ఏకుడే అనేకుడై పరమేశ్వరుడయ్యాడనీ, అందుకే ఆయన కామేశ్వరునిగా
కొలువబడుతున్నాడనీ, ఆయన శక్తియే కామేశ్వరీదేవి అనీ విశ్వంలో ప్రతి అణువులోనూ
ఆ శక్తి విలసనమే దాగి ఉందనీ అద్భుత దర్శనం ఇక్కడ ఉపాసనా
సంప్రదాయమయ్యింది.

భౌతిక కామనలను ధర్మబద్ధం చేసే ప్రవృత్తి మార్గానికి ప్రాధాన్యమిస్తూనే
అంతర్ముఖమైన భగవత్కామన (బ్రహ్మకామన వేదాంతవిద్యగా పరిఢవిల్లిన మోక్షసామ్రాజ్య ఆవిష్కరణ(నివృత్తిమార్గం) ఈ నేలపై విలసిల్లింది.

అసలు సృష్టి, స్థితి, లయలు ప్రతిక్షణం జరుగుతుంటాయి. ఒకటి సృష్టింపబడి,ఎదిగి, తిరిగి లయించడం ప్రతిక్షణం, ప్రతిచోటా జరిగే ప్రక్రియ. ఈ మూడు చేసే
శక్తులను బ్రహ్మవిష్ణురుద్రులన్నాం. నిజానికి ఒకే శక్తి ఈ మూడుగా పని చేస్తోంది.ఆ ఒక్క శక్తిని 'కామ' శక్తి అన్నారు. అక్షర నిర్మాణంలో కూడా హేతుబద్ధమైన సూక్ష్మవిజ్ఞానాన్ని అవలంబించిన మనశాస్త్రం 'కామ' అనే నామంలో మూడు శక్తులున్నాయని వివరించింది.

కామ=క+అ+మ. ఇందులో 'క' బ్రహ్మవాచకం. 'అ' విష్ణుసూచకం. 'మ'
రుద్రస్వరూపం. ఈ మూడు సృష్టి, స్థితి, లయ శక్తులు. ఈ మూడు శక్తుల మూలశక్తి 'కామ'. అందుకే పరమేశ్వరుని 'కామ' అని కొలుచుకుంటాం.

దైవాన్ని ఎంత పవిత్రంగా, ధర్మంగా ఆరాధిస్తామో కామాన్ని కూడా అంత చక్కగా నియమాలతో పాటిస్తే అది మనల్ని పతనం కానీయకుండా కాపాడుతుంది.    
 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
                  *ఎది సత్యం?*

*అందరూ నిజాన్ని, నిజాయతీని ఇష్టపడతారు. కాని, అది ఇతరుల్లో చూడాలనుకొంటారు. తమకు వర్తించదనుకొంటారు కొందరు. ‘సత్యమేవ జయతే’ సూత్రం పాటిస్తున్నామంటూ అబద్ధం తప్ప పొరపాటునైనా నిజం చెప్పరు కొంతమంది. అపనమ్మకానికి పునాది అబద్ధమే. అబద్ధాలు చెప్పడం కూడా అపరాధమే. ఆధ్యాత్మిక దృష్టిలో అసత్యం మహా పాపం. ఎందుకంటే, అసత్యానికి, మోసానికి ఆట్టే తేడా లేదు. మోసానికి పెట్టుబడి అబద్ధాలే. సత్యహరిశ్చంద్రుడు సత్యదీక్ష కోసం ఎన్ని కష్టాలైనా పడ్డాడు కాని, ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. ఇప్పటి కాలంలో కొందరు ఒక్క నిజం కూడా చెప్పరు. దొంగ సాక్ష్యాలన్నీ అబద్ధాల సంపుటులే.* 

*ఆధ్యాత్మిక రంగంలో ‘ఏది సత్యం?’ అనే ప్రశ్నకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దానికి అనుబంధ ప్రశ్న ‘ఏది నిత్యం?’. ఏది సత్యమో అది నిత్యం అంటారు వేదాంతులు. భగవంతుడే సత్యస్వరూపుడంటారు. ‘సత్యమేవ జయతే’- అంటాయి ఉపనిషత్తులు. అంటే, దైవ సంకల్పానికి విజయం నిశ్చయం!వాక్కులతో ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆత్మకు అసలు నిజం తెలుసు. మనోవేగం కన్నా దైవజ్ఞాన వేగమే చాలా ఎక్కువంటారు. జరిగినవి, జరుగుతున్నవి మాత్రమే మనిషికి తెలుసు. జరగబోయేదీ భగవంతుడికి తెలుసంటారు. దీనినే త్రికాల జ్ఞానంగా చెబుతారు.*

*మహర్షులు త్రికాల వేదులు. అందుకే వారు దైవ సమానులు. భగవంతుడితో మహర్షులు, దేవర్షులు పూజలందు కొంటారని పురాణ ఇతిహాసాల్లో చదువు తుంటాం. లోకకల్యాణం తప్ప వారికి ఇతర స్వార్థాలు ఉండవు. వసిష్ఠ, కశ్యప, నారద మునీంద్రులు ఈ కోవకు చెందినవారు. ‘సత్యం’ అనే ఇరుసు మీదనే లోకాలు పరిభ్రమిస్తున్నాయి. సుదర్శనమే లోకచక్రం. స్థితి కారకుడైన విష్ణువు సుదర్శనంతోనే లోకకంటకులను సంహరిస్తాడంటారు.*

*ఆగ్రహంలోనూ నిగ్రహం చూపగలవారే మహర్షులు. విశ్వా మిత్రుడు ఆగ్రహంతో తన నూరుగురు కుమారులను అంతం చేసినా, వసిష్ఠుడు విశేషమైన నిగ్రహం చూపాడు. అందుకే ఆయన బ్రహ్మర్షి కాగలిగాడు. ప్రకాశవంతంగా సూర్యుడు వెలిగే వేళ మబ్బు కప్పినంతలో సూర్యుడు లేడనుకోగలమా? మనం మాయ ప్రభావంలో ఉన్నామని గ్రహించగలిగితే మనం చూసేది సత్యం కాదని తెలుస్తుంది. ‘ఏది సత్యం’ అనే ప్రశ్నతో శోధన చేస్తే, మన కృషి తీవ్రతను బట్టి సమాధానం దొరుకుతుంది. మమకారమే ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డుగోడ. అభిమన్యుడి మరణంతో కుంగిపోతున్న అర్జునుడికి సత్యబోధ చేస్తాడు శ్రీకృష్ణుడు. చంద్రుడి కుమారుడిగా అభిమన్యుణ్ని చెబుతాడు. మరణానంతరం అభిమన్యుడితో అర్జునుడు సంభాషించే సన్నివేశాన్ని కృష్ణుడు కల్పించినప్పుడు- ‘నీవెవరో నాకు తెలియదన్నా’డంటారు.* 

*అర్జునుడి భ్రమ తొలగిపోవడం అక్కడ ప్రధానాంశం. కేవలం పరమాత్మ ఒక్కడే సత్యం, నిత్యం. అందుకే గీతాకృష్ణుడు ‘మరే ఆలోచనలూ లేకుండా నన్ను మాత్రమే ఆశ్రయించు. నిన్ను రక్షిస్తాను’ అంటాడు. దేని నుంచి రక్షణ?అసాధ్యమైన అష్టవిధ మాయల ప్రభావం నుంచి అని మనం గ్రహించాలి. గీతాబోధ అర్జునుడి కొరకే అనుకోకూడదు. మనందరికీ అని అర్థం చేసుకుంటే గీతా ప్రయోజనం సిద్ధిస్తుంది.*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*

🌴⛳🌴 ⛳🌴⛳ 🌴⛳🌴
 *దేవాలయలు.....*

*మనదేశంలో ప్రతి గ్రామంలోను కనీసం ఒక దేవాలయమైన ఉంటుంది. దేవాలయం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.*

*ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది... అలా ప్రతి గ్రామంలోనూ దేవాలయాన్ని నిర్మించు కోవలసిన అవసరమేమిటి... ఒక వేళ దేవాలయంలేని గ్రామమున్నట్లయితే ఏమవుతుంది...*

*ఇటువంటి ప్రశ్నలన్నిటికీ ఇలా సమాధానం చెప్పుకోవచ్చు. ప్రతియొక్కరికీ మానసిక ప్రశాంతత స్థిరచిత్తంతో జీవించాలని ఉంటుంది. దేవుని కటాక్షం లేకుండా అటువంటి జీవితం లభ్యమవటం అసాధ్యం. దేవుని కటాక్షం లభించాలంటే దేవాలయాలు అవసరం.*

*సనాతన ధర్మంలో వాస్తవానికి దేవుడు లేని చోటు లేదు. భగవంతుడు సర్వాంతర్యామి. మరి దేవుడు సర్వాంతర్యామి అయినట్లయితే దేవాలయాలెందుకు... ఒక దేవాలయంలో దేవుని బందించి, ఆయన సర్వవ్యాపకత్వానికి పరిమితులను ఏర్పరుస్తున్నాము కదా...*

*ఇటువంటి సందేహాలను లేవనెత్తే వారు పూర్తిగా ఏమి తెలియను వారు కాదు. అయితే వాళ్లు సత్యాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోలేదు. అందువలనే ఇటువంటి సందేహాలు తలెత్తుతుంటాయి. పరమాత్మా సర్వాంతర్యామి అనటంలో ఇటువంటి సందేహం లేదు. అయితే తగు అవగాహన, సంస్కారం లేని కారణంగా సామాన్యులు పరమాత్మ సర్వాంతర్యామి అనే విషయాన్ని హృద్గతం చేసుకోలేక పోతున్నారు.*

*అయితే అటువంటి అవగాహన సంస్కారం ప్రహ్లాదుని వంటి మహాపురుషులకే ఉంటుంది. మహాభక్తుడైన ప్రహ్లాదునికి ప్రతిచోటా దైవదర్శనం భాగ్యం లభించేదని శ్రీమద్భాగవతం ద్వారా మనకు తెలుస్తోంది. అయితే సామాన్యులు ప్రహ్లాదునికున్న సంస్కారాన్ని, అధికారాన్ని కలిగి ఉండరుకదా.*

*అయుతే దైవ భక్తిని పెంపొందించుకోవడానికి సామాన్యులు ఏమిచేయాలి... మన పూర్వీకులు మనకి చాల మార్గాలను సూచించారు. శాస్త్రాలు నిర్దేశించిన ప్రకారం ప్రాణప్రతిష్ట చేయబడిన దేవత విగ్రహాలను పూజిస్తే తప్పకుండా దైవకటాక్షం లభిస్తుందని శాస్త్ర వచనం. పామరులు కూడా సులభమైన ఈ మార్గాన్ని అవలంబించి దైవ కటాక్షాన్ని పొందవచ్చు.*

*ఒక దేవాలయంలో దేవుని బందించి ఆయన సర్వవ్యాపకత్వానికి పరిమితులను ఏర్పరుస్తున్నాము కదా అనే సందేహం అడగవచ్చు. దీనికి శ్రీ శంకరాభగవత్పాదుల వారు ఒక ఉదాహరణ చెప్పారు...*

*"యధా సకల భూమండలాధిపతి రపి అయోధ్యాపతిః ఇతి వ్యవహ్రియతే"*

*భూమండలాధిపతి అయిన శ్రీరామచంద్రమూర్తిని అయోధ్యాధిపతిగా అభివర్ణిస్తున్నాము. అంతమాత్రాన ఆయన అధికారం తగ్గిపోతుందా... ఆయన అయోధ్యాపతి మాత్రమే కాదు, లోకాధిపతి కూడాను.*

*అలాగే పరమాత్మా ఇతరచోట్ల ఉన్నట్లే దేవాలయంలో కూడా ఉంటాడు. అయితే దేవుడిని అన్వేషించే వారి సౌలభ్యం కోసం ఒక స్థానాన్ని చూపించాలని దేవాలయాన్ని దైవస్థానంగా చూపిస్తాం. దేవాలయంలో దేవుని ఆరాధన ద్వారా మనం మానసిక ప్రశాంతత పొందవచ్చు.*

*ప్రహ్లాదుని వంటి శ్రద్ధా భక్తులు అధికారికత మీకు కనక ఉన్నట్లయితే, అటువంటి సంస్కారాలను మీరు కూడా పొందగలిగినట్లైతే భగవంతుడిని అన్నిచోట్లా మీరు కూడా దర్శించవచ్చు. అప్పుడు మీరు దేవాలయానికే వెళ్లి దేవుడిని పూజించాల్సిన పనిలేదు, ప్రతిచోటు మీకు దేవాలయమే అవుతుంది. అయితే ప్రహ్లాదుని స్థాయి మనం చేరుకునే దాకా దేవాలయానికి వెళ్లి పూజించక తప్పదు. అందువలన దేవాలయాలు అవసరమవుతున్నాయి.*

*మరి మన విన్నపాలను భగవంతుడు పట్టించుకుంటాడా అనే అనుమానానికి ఆస్కారం లేదు. భగవంతుడు అనంతమైన కరుణామూర్తి. శృతి ఇలా వివరించింది...*

*"అపాణిపాదో జవనో గ్రహీతా*
*వశ్యత్య చక్షు: స శృణోత్య కర్ణ: |*
*సవేత్తి వేద్యం న చ తస్యాస్తి వేత్తా*
*తమాహురగ్య్రo పురుషం మహన్తం ||"*

*భగవంతుడు మనవంటివాడు కాదు, మనకు చేతులున్నాయి కాబట్టి వస్తువులను పట్టుకుని పైకెత్త గలుగుతున్నాము. కాళ్ళున్నాయి కాబట్టి నడవగలం. చేతులు లేకపోయినా భగవంతుడు పైకెత్తగలడు నడవగలడు. మనం భక్తితో ఏది సమర్పించినా... ఫలం, పుష్పం, పత్రం, తోయం... భగవంతుడు స్వీకరిస్తాడు.*

*మనం మళ్ళీ మొదటి ప్రశ్నకు వచ్చాము... గ్రామాలలో దేవాలయం లేకపోతే ఏమవుతుంది... అంటే మనం ఎవరి ముందు మన కష్టాలను చెప్పుకుంటాము... అయితే సామాన్యులు భగవంతుడిని ఎక్కడ దర్శించగలరు... దేవాలయాలలో మాత్రమే దర్శించగలరు.*

*ఈ అవసరాలను తీర్చటానికి మన పూర్వీకులు ప్రతి గ్రామంలో కనీసం ఒక్క దేవాలయాన్నైనా నిర్మింపచేశారు. సనాతన ధర్మం సుస్థిరంగా చైతన్యవంతంగా ఉండటంలో దేవాలయాలు ప్రముఖమైన పాత్రలు నిర్వహిస్తాయి. దేవాలయాలు లేకపోతే సనాతన ధర్మం దయనీయస్థితిలో ఉండేది. సనాతన ధర్మ సంరక్షణకు దేవాలయాలే ఆశాజ్యోతులు. అందువలన దేవాలయాలు అత్యంతావశ్యకం...*

          *ఆధ్యాత్మికం ఆనందం*

🌺🌺🌺 🙏🕉️🙏 🌺🌺🌺

***గోమాత గొప్పదనం

 *🙏🌺గోమాత గొప్పదనం🌺🙏*  

*🌺ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటి సారివేసిన పేడ పదివేల రూపాయలకు కూడ ఎక్కడా దొరకదు. అది బ్లడ్‌ క్యాన్సర్‌కు అత్యుత్తమ ఔషధం. ఫిట్సుకు కూడ ఇది ఉపయోగపడుతుంది. దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది. అందువలన అది దొరకుట చాలా కష్టం. పడక కురుపు, పుండు వున్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద (కచ్ఛిక) పొడి పుండుకు పట్టించుట మొదలు పెట్టగా నెల రోజులలో పుండు నయమైనది. ఆ పుండు ఎముక కనిపించేంత లోతైనది.*  

*🌺 ఆవు పేడతో అగరు వత్తులు తయారవుతాయి. ఆ అగరు వత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు. పిల్లలకు దెబ్బ తగిలిన, ఆ పొడి రెండు రోజులు వాడిన అది తగ్గుతుంది.  మధుమేహ వ్యాధిగ్రస్థులకు దెబ్బలు, పుండ్లు కూడ ఆవు పేడ బూడిద వ్రాసిన త్వరగా తగ్గుతాయి. ఏవైనా విష క్రిములు కుట్టినప్పుడు, (తేనెటీగ, కందిరీగ మొదలగునవి) ఈ బూడిద వేసిన 1 నిమిషంలో తగ్గుతుంది.  వరదలు, తుఫానులు వచ్చినప్పుడు, ఇతర సమయాలలో నీరు బురదగా వున్నప్పుడు, నీరు కాచి త్రాగుతారు. ఒక బిందెడు నీటిలో ఆవు పిడకల బూడిద 1 స్పూను కలిపిన ఆ నీటిని కాయవలసిన పనిలేదు. ఆ నీరు త్రాగిన వారికి కలరా, తలనొప్పి, జ్వరము, విరేచనములు రావు. కావున వరద సమయాలలో ఆ బూడిదను పంచినా రోగాలు రావు.*  

*🌺 ప్రయాణాలు చేసే వారు ఆవు కచ్చికల బూడిదను వెంట తీసుకువెళ్ళి బయట నీరు త్రాగవల్సి వచ్చిన బాటిలు నీటిలో 1 చిటికెడు బూడిద కలిపి వాడిన ఎలాంటి రోగాలు రావు. (అగర వత్తుల భస్మం) సేకరించి వుంచుకోండి. ఆవు పేడతో చేసినవి మాత్రమే. . ఆవు పేడతో చేసిన అగరు వత్తులు వాడిన ఆ ధూపము ఇల్లంతా వ్యాపించి, ఆ ఇంటి దారిద్య్రము తొలగిపోతుంది. ఆవు పిడకల పొడితో పళ్ళపొడి తయారు చేసిన, పంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. పంటినొప్పి, కదులుట తగ్గుతుంది. పళ్ళు గట్టిపడతాయి.*   

*🌺ఆవు పేడతో చేసిన పండ్లపొడిని నోటిలో ఉంచి 5 నిమిషముల తర్వాత పండ్లు వేలితో రుద్దాలి. చిగుళ్ళను వేలితో మర్ధన చేయాలి. బ్రష్‌ను వాడవల్సిన పనిలేదు.*
🐄🐂🐄 🐂🐄🐂 🐄🐂🐄
 *ధ్యానమార్గ*
శ్రేయాన్ స్వధర్మో విగుణ!' నా ధర్మం చెప్పుకోతగ్గంత గొప్పదనాన్ని కలిగి ఉండకపోయినా, “పరధర్మార్స్వనుష్ఠితాల్' ఇతరుల ధర్మాన్ని పోల్చి చూసినప్పుడు, అయినా కూడా ఎవరి ధర్మం వారే ఆచరించాలి. ఇక్కడ వ్యక్తిత్వాలను 
గురించి తెలియజేస్తున్నాడు. ఎవరి వేలుముద్రలు వారివే ఉంటాయి. అలాగే ఎవరి ధర్మం వారిదే. కొన్ని మానసిక ఉద్వేగాలు, ఇష్టాయిష్టాలు, నిర్ణయాలు అన్నీ
కలసి మానసిక పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా ఏర్పడింది నీస్వభావం ఏదైతే
దానిలోనే ఉండు. సిగ్గు పడకు, ముడుచుకుపోకు. ఇతరుల నుంచి మంచిని
నేర్చుకోవచ్చు కానీ, వారినే అనుకరించడానికి ప్రయత్నించడం తప్పు. నీవు నీవుగానే ఉండు అని చెప్పడం వల్ల, నీ మీద నీకు నమ్మకం, దృఢ సంకల్పం, కలుగుతుంది. ఆ స్థితి నుంచే నిన్ను నీవు అభివృద్ధి చేసుకో. ఎవరో నిన్ను మూసపోసి తయారుచెయ్యడం లేదు. నీకు నీవే నిన్ను తయారు చేసుకుంటున్నావు. 'స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః! నీ ధర్మం నీకు
సౌకర్యంగా ఉంటుంది. వేరే వారి ధర్మం నీకు సరిపడదు. పరధర్మం భయాన్ని
కా' నీ ధర్మం
కలిగిస్తుంది.
❤️🕉️❤️
'పరతస్తు సః పర' సూక్ష్మమైంది. పర అనబడుతుంది,
ఘనీభవించిన వాటిని తాకి చూడవచ్చు. ఘన పదార్థంగా ఉన్న శరీరంకన్నా ఇంద్రియాలు కొంతవరకు సూక్ష్మమయినవి. ఘనీభవించిన దానిలో ఉన్న శక్తికన్నా, సూక్ష్మంలో ఉన్న శక్తి చాలా విలువయిందిగా ఉంటుంది. 'సూక్ష్మం మహాంతశ్చ' సూక్ష్మమయిన శక్తి అనంతంగా, విశాలంగా, శక్తిమంతంగా విస్తరించి ఉంది. • ప్రత్యగాత్మ భూతాశ్చ' నీలోని ఆత్మస్థితికి దగ్గరగా ఉంది. శరీరం భౌతికంగా నీకు కనబడుతుంది. ఇంద్రియాల జ్ఞానం కొద్ది సూక్ష్మంగా, మనస్సు ఇంకా సూక్ష్మంగా, బుద్ధి దానికి మించిన సూక్ష్మంగా, ఆత్మ వాటికి చాలా దూరంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది.
❤️🕉️❤️
ద్వైతం ఇంద్రియాల అవగాహన, అద్వైతం ఆత్మతత్త్వం, ముండకోపనిషత్తులో 'బ్రహ్మైవేదమ్ అమృతం' ఈ సృష్టి అంతా కూడా అనంత బ్రహ్మమయం, ముండకోపనిషత్తు పురస్తాత్ బ్రహ్మ' ముందు బ్రహ్మమే, 'పశ్చాత్ బ్రహ్మ' వెనుక బ్రహ్మమే 'దక్షిణస్తత్ ఉత్తరేణ బ్రహ్మైవేదం విశ్వం ఇదం వరిష్ఠం' కుడి, ఎడమవైపులన్ని వైపులా బ్రహ్మం తప్ప మరేమీ లేదు అని చెప్పింది. పూజింప తగిన బ్రహ్మ తప్ప మరేమీ కానరాదు. ద్వంద్వం మరేమీ కానరాదు. ద్వంద్వం లేని ప్రతిచోటకూడా పరిశుద్ధ చైతన్యస్థితే ఉంటుంది.           
 గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన
 పాలనీక తన్ను పండ్లురాల
 లోభివాని నడుగ లాభంబు లేదయా
 విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: గొడ్డు బోతైన ఆవు దగ్గరకి పాలుపితకటానికి కుండను తీసికొనివెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది కాని పాలు ఇవ్వదు అదే విధముగా లోభిని యాచించటం కూడా వ్యర్థము.

 పెట్టిపోయలేని వట్టి నరులు భూమిఁ
 పుట్టనేమి వారు గిట్టనేమి
 పుట్టలోనఁ జెదలు పుట్టవా గిట్టవా
 విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఎదుతి వారికి సహాయము చేయనివాడు పుట్టినా చచ్చినా ఒకటే. పుట్టలో చెదలు పుట్టినా, చచ్చినా ఒకటే కదా!

 ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు
 తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక
 మురికి భాండమందు ముసుగు నీగల భంగి
 విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు.  
 *భార్యా శ్రేష్ఠతమా సఖా*

*భార్య గొప్పదైన స్నేహితురాలు* ( *మహాభారతం* )

అపూర్వ నాగరికతతో ప్రపంచంలో ప్రప్రథమ సంస్కృతిని సాధించిన భారతీయధర్మం ఇప్పటికీ ఆ విలువలను పూర్తిగా కోల్పోలేదు. *స్త్రీ-పురుష సంబంధాలపై సనాతనధర్మం తపశ్శక్తితో గొప్పవ్యవస్థను ఏర్పరచింది.* 

ఆ ధర్మానికి మూలస్తంభం కుటుంబం. కుటుంబానికి మూలాధారం దాంపత్యధర్మం. కాలగతిలో ఎన్ని పరిణామాలు ఎదురౌతున్నా ఈ ధర్మమే పరంపరను నిలబెట్టింది.

*భార్యాభర్తల బంధాన్ని స్నేహబంధంగా నిర్వచించారు.* 

( " *ఆర్జించిన ధనాన్ని భార్యకు అధీనం చేయాలి. ధనరక్షణ, వ్యయాలపై ఆమెయే అధికారిణి*. గృహంలో సదాచారంలోనూ, శౌచంలోనూ,
ధర్మంలోనూ, ఆహారంలోనూ ఆమెకే పూర్ణ అధికారం" -
అని మనుస్మృతి ఉపదేశం.)

“పురుషునకు దైవమిచ్చిన స్నేహితులెవరు?" - అని యక్షుడు ప్రశ్నిస్తే “భార్య”(భార్యా దైవకృతా సభా) అని సమాధానమిచ్చాడు ధర్మరాజు. ఈ స్నేహాన్ని చాటడానికే
*వివాహంలో 'సప్తపది' (ఏడడుగులు) మంత్రాలున్నాయి.* 

వివాహ మంత్రాలన్నీ దాంపత్యం అనేది ఒక 'సఖ్యం' అని స్పష్టీకరించాయి " *ఏడడుగులు వేసి నాతో స్నేహితురాలవై ఉండు. మనం ఎప్పుడూ స్నేహితులుగానే ఉందాం. నీ స్నేహమే నాకు లభించింది* నీ స్నేహం విడవలేను. నా స్నేహం వీడకు" - అని వివాహమంత్రాల భావం.

*“ధర్మార్థ కామాలలో నిన్ను అతిక్రమించను"(నాతి చరామి) అంటూ ప్రతిజ్ఞ చేస్తాడు వరుడు.* 

అసలు “పరస్పర విరోధంగా కనిపించే ధర్మార్థ కామాలను సమన్వయపరచే శక్తి భార్యకే ఉంది"... అని మహాభారతం చెబుతోంది. అర్థకామాలు భార్య ద్వారా
నెరవేరడం వల్ల అధర్మ దోషం ఉండదు. ఇలా ధర్మంతో ఆ రెండూ కలిసి పురుషుని ఉన్నతుని చేస్తున్నాయి. ఈ లోతు తెలుసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ
పటిష్టపడి సవ్యమైన సమాజం సుప్రతిష్ఠితమవుతుంది.

యజుర్వేద మంత్రాలలో స్నేహధర్మం గురించి చెబుతూ - "స్నేహితునిగా భావించే వారిని పరిత్యజించరాదు. మిత్రుని వదిలిన వారికి ధర్మంలో భాగం ఉండదు. పుణ్యమార్గం అతనికి గోచరించదు” - అంటే ఇహపరాల్లో క్షేమం ఉండదని భావం.

( *కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా నిర్వహించడంలో భార్యాభర్తలు కలిసి ఉద్యమించాలని వేదబోధ. అసలు దాంపత్య ధర్మం అనాది. సనాతనం* . ఒకే పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడనీ, అదే
ప్రకృతీ-పురుషులనీ, ఆ అర్ధనారీశ్వరతత్త్వం వల్లనే సమస్త విశ్వం ఆవిర్భవించిందనీ వేదం స్పష్టంగా పలికింది.)

*స్నేహబంధమైన దాంపత్యంలో దీనిని గుర్తుంచుకోవాలి.* 

*మనిషి తనని తాను ఎలా క్షమించుకుంటాడో, తనతో తాను ఎలా రాజీపడతాడో తన భార్య(భర్త)తోనూ అలాగే సహనశీలియై సఖ్యాన్ని కాపాడుకోవాలి.* కొన్ని భేదాలు
వచ్చినా శాశ్వత ప్రయోజనమైన ధర్మం కోసం, స్నేహనిబద్ధత కోసం సహనం వహించడం ప్రేమధర్మం.

“సామ్రాజ్ఞి శ్వశురేభవ” మూర్థానాం పత్యురారోహ”

- “నా గృహానికి నువ్వు సామ్రాజ్ఞివి,” “పతినైన నా శిరస్సుపై అధిష్ఠించు" - అని ఉత్తమస్థానంలో గౌరవించదగినది ఇల్లాలేనని వైదిక వివాహ మంత్రాల బోధన.

అర్థస్య సంగ్రహే పక్త్యాంచ పారిణాహ్యస్యచేక్షణే||

"ఆర్జించిన ధనాన్ని భార్యకు అధీనం చేయాలి. ధనరక్షణ, వ్యయాలపై ఆమెయే అధికారిణి. గృహంలో సదాచారంలోనూ, శౌచంలోనూ, ధర్మంలోనూ, ఆహారంలోనూ
ఆమెకే పూర్ణ అధికారం" - అని మనుస్మృతి ఉపదేశం.

*స్త్రీకి ధనాన్ని ఆర్జించే వేదన ఉండరాదు - అని నిబంధించిన సంస్కృతంలోని ఉదారతని గ్రహిస్తే, “స్త్రీధనం కోసం ఆశపడే పురుషుడు అధముడు" - అని హెచ్చరించిన మన మహర్షుల వాక్కుల్ని గుర్తుపెట్టుకుంటే, పవిత్రమైన వివాహ వ్యవస్థలో వరకట్నపు అపశ్రుతులు వినబడనే వినబడవు.* 

కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా నిర్వహించడంలో భార్యాభర్తలు కలిసి ఉద్యమించాలని వేదబోధ.

అసలు దాంపత్య ధర్మం అనాది. సనాతనం. 

ఒకే పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడనీ, అదే ప్రకృతీ-పురుషులనీ,
ఆ అర్ధనారీశ్వర తత్త్వం వల్లనే సమస్త విశ్వం ఆవిర్భవించిందనీ వేదం స్పష్టంగా పలికింది.
ఈ విషయాన్నే మనువు -

'ద్విధాకృత్వాత్మనో దేహమర్ధన పురుషో భవత్'
అర్ధేన తస్యాం సా నారీ విరోజ మసృజతే ప్రభుః॥ అని తెలియజేశాడు.

విశ్వనిర్మాణానికే మూలం దాంపత్యభావం. ఒకే పరతత్త్వం రెండయ్యింది. అలాగే స్త్రీ-పురుషభావం ఏకమవ్వాలి. ఆ ఏకంలో పరమాత్మ వైభవం ప్రకాశిస్తుంది. ప్రకృతి నియయం పాలించబడుతుంది. అంటే - దాంపత్యధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధం. భార్యాభర్తల అన్యోన్యత గురించి రాముడు చెప్పిన ఒక్క మాట చాలు

*"అనన్యా హి మయా సీతా భాస్కరస్య ప్రభా యథా” “సూర్యునికి వెలుగులా సీత నాకు అనన్య(వేరుకానిది)”.* దాంపత్యంలో ఔన్నత్యాన్ని తెలిపేది ఇంతకన్నా గొప్ప వాక్యం ఉంటుందా!

 Vedantha panchadasi:
జానామి ధర్మం న మే ప్రవృత్తిః జానామ్యధర్మం న చ మే నివృత్తిః ౹
కేనాపిదేవేన హృది స్థితేన యథా నియుక్తోఽ స్మి తథాకరోమి ౹౹176౹౹

176. ఏది ధర్మమో నాకు తెలుసు. కాని దానిని అనుసరించి ప్రవర్తింపను.
అధర్మమేదో తెలుసు.కాని దాని నుండి విరమింపను. హృదయమునందు ఆసీనుడైన ఏ దైవమో ఎట్లు నియమించిన అట్లు చేయుదును.  వ్యాఖ్య:- ప్రసన్నగీత యందలి దుర్యోధనుని పలుకులు
"కేనేపి దేవేన" అనే మార్పుతో భగవంతుడే కర్తయని భావించే జ్ఞాని వాక్కుగా చెప్పబడినవి.

పరమార్థ మందు ఆత్మజ్ఞానికి కర్మలతో సంబంధమే లేదు. అయినను లోకదృష్టి యందు చేయువాడుగానూ,చేయించువాడుగానూ కనపడుచున్నాడు.

అయినప్పటికి సంపూర్ణ అపరోక్షజ్ఞానముగల మహానుభావుడు నూరుకోట్ల అశ్వమేథయాగముల నాచరించుగాక,సమస్త దానముల సల్పుగాక,అఖిల జీవులకు సుఖకరములైన సుకర్మములను చేయుగాక,కానీ
తత్తత్కృత్యముల వలన,కర్తృత్వ బుద్ధి లేక పోవుటచే పుణ్యము లేదు పాపము లేదు.

తత్త్వవేత్తయగు కర్మయోగి అన్నియు చేసియు చేయని వాడు.కనుక వినిన,తినిన,తిరిగిన,తాకిన,
గ్రహించిన,మూకొనిన,
పరిహరించిన - ఏమి చేయుచున్ననూ ఆయా ఇంద్రియములు ఆయా విషయములందు ప్రవర్తించు చున్నవే గాని తాను యేమియు చేయుట లేదని నిశ్చయము.

ఎట్లనగా,ఆయా ఇంద్రియములు దేహమునకే గానీ ఆత్మయైన తనకు కరణములు(కొరముట్లు)కానేరవు.
కాన కరణ రహితమగు తనకు కర్మయే లేదని జ్ఞాని నిశ్చయమై యున్నది.

నార్థ పురుషకారేణేత్యేత్వ మాశంక్యతాం యతః ౹
ఈశః పురుషకారస్య రూపేణాపి వివర్తతే   ౹౹177౹౹

177. ఈశ్వరుడే అంతా చేయుచున్నచో ఇక పురుషకారమేల? అని శంకింప పనిలేదు.ఈశ్వరుడు పురుషప్రయత్న రూపమున కూడా భాసించును.

ఈదృగ్బోనేశ్వరస్య  ప్రవృత్తిర్మైవ
వార్యతామ్ ౹
తథాపీశస్య బోధేన స్వాత్మాసఙ్గత్వ ధీజని ౹౹178౹౹

178.  ఇట్టి సిద్ధాంతము ఈశ్వరుడు సర్వమును చోదించుననుటతో విరోధింపదు.ఈశ్వరుడు అంతర్యామి అని తెలిసికొనిన పురుషుడు తన ఆత్మ అసంగమని కూడా తెలిసికొనును.

తావతా ముక్తి రిత్యాహుః శ్రుతయః
 స్మృతయస్తథా ౹
శ్రుతి స్మృతీ మమైవాజ్ఞే ఇత్యపీశ్వర భాషితమ్ ౹౹179౹౹

179. ఆత్మ అసంగమనెడి బోధయే ముక్తికి కారణమని శ్రుతి వాక్యములు స్మృతి వాక్యములును చెప్పుచున్నవి.వరాహపురాణమున శ్రుతి స్మృతులు కూడా తన ఆజ్ఞ వలననే అని ఈశ్వరుడనును.

ఆజ్ఞాయా భీతిహేతుత్వం భీషాఽ
స్మాదితి హి శ్రుతమ్ ౹
సర్వేశ్వరత్వమేతత్సా దన్తర్యామిత్వతః పృథక్ ౹౹180౹౹

180. ఈశ్వరుని వలన భీతిచే ప్రకృతి శక్తులు ప్రవర్తించునని శ్రుతిలో వింటాము.అనగా ఈశ్వరాజ్ఞ భయము కలిగించును.కనుక ఈశ్వరుని అంతర్యామిత్వము కంటె భిన్నమై ఈశ్వరుని సర్వేశ్వరత్వము కూడా ఉన్నది.

తైత్తిరీయ ఉప.2.8.1;
కఠ ఉప.2.3.3;
నృసింహ తాపనీయ ఉప.2.4.
వ్యాఖ్య:-  తాను దేనిని ఎంతమాత్రము చేయకున్నను విశ్వములోని భూతములన్నియు పని చేయునట్లు చేయునది ఏది?

కంకణమువంటి ఆభరణము‌లు బంగారముతో చేయబడువిధముగా ద్రష్ట ,దర్శనము, దృశ్యము దేనితో చేయబడును?

త్రివిధములయిన అభాసరూపములను
(ద్రష్ట -దర్శనము-దృశ్యములను) అచ్ఛాదించి,అభివ్యక్తము చేయునదేది?

బీజములో వృక్షమున్నట్లుగా భూత,భవిష్యత్,వర్తమానములను త్రివిధకాల విభాగము దేనియందాభాసముగా నున్నది?బీజమునుండి వృక్షము, వృక్షమునుండి బీజము పర్యాయముగా వచ్చునట్లు ఏది పర్యాయముగా అభివ్యక్తమయి అదృశ్యమగును?

ఈ విశ్వముయొక్క సృష్టికర్తయెవరు?ఎవరి శక్తిచేత జీవించుచున్నాము?

చైతన్యవంతమయినను
శిలగానున్నది,శూన్యాకాశములో అద్భుతమయిన చమత్కారములను(మాయలను)చేయునది ఏది?

ఈ ప్రశ్నలన్నియు ఆ పరమాత్మకు సంబంధించినవే.
ఆ పరమాత్మ అంతర్యామిగా సర్వమును చోదించుననుటతో ఎట్టి విరోధములేదు.ఇది తెలుసుకున్నవాడు ఆత్మ అసంగమని కూడా తెలుసుకొనును.ఎట్లనగా,

అగ్నిదేవుడు సర్వపదార్థములను భక్షించి వాటి గుణములను అంటుకోనటుల అనగా వేపచెట్టును కాల్చి చేదును,
శ్రీ గంధపు చెట్టును కాల్చి సుగంధమును అంటుకోనటుల 
ఆ పరమాత్మ సర్వమును చేయుచూ కూడా చేయనివాడే, అసంగుడే.

జ్ఞానికి వ్యవహార నియమముగానీ దాని వలన ప్రమాదముగానీ లేదు.కర్తృత్వము లేక పోవుట వలన పుణ్యపాపములయందు 
అసంగుడు.

అసంగమనెడి బోధయే ముక్తికి కారణమని శ్రుతి ,స్మృతి వాక్యములును చెప్పుచున్నవి.
ఈ శృతి,స్మృతితులు కూడా ఆ పరమాత్మ నిర్ణయమని వరాహపురాణము చెప్పుచున్నది.

సమస్త ప్రకృతి శక్తులయందును ఆ పరమాత్మ అంతర్యామిగాయుండి నడిపించుచున్నాడు.

ఆ ఆత్మ నామరహితమయి వర్ణింపరానిది,సూక్ష్మము గనుక మనస్సు ఇంద్రియములుగానీ గ్రహింపజాలవు.

జీవన్ముక్తుడగు తత్త్వజ్ఞాని ఆత్మ రూపుడై సర్వత్రా వ్యాపించి యున్నప్పటికీ,ఈ శరీరమను నగరమున నున్నవాడై ప్రపంచ కల్పితములగు(ప్రారబ్ధానుసార)
భోగములననుభవించి,పూర్వమే సాక్షాత్కరింపబడియున్న స్వాత్మరూప పరమపురుషార్థమను మోక్షమును సేవించును.అనగా,

"పరమాత్మగానే యుండును".       
 🥶 12 Psychological Advice's ;

✅ Your 9-5 is someone's passive income. Find new ways to make money and create yours.

✅ You shouldn't take advice from people who're not where you want to be in life.

✅ No one is coming to save your problems. Your life's 100% your responsibility.

✅ You don't need 100 self-help books, all you need is action and self discipline.

✅ College is a waste of time for 99% of people. You can learn 10x faster from the internet if you use it right.

✅ No one care about you. So stop being shy, go out and create your chances.

✅ If you find someone smarter than you, work with them, don't compete.

✅ Weed has 0 benefit in your life. Blunt will only slow your thinking and lower your focus.

✅ Comfort is the worst addiction and cheap ticket to depression.

✅ Don't tell people more than they need to know, respect your privacy.

✅ Avoid alcohol at all cost. Nothing worse than losing your senses and acting a fool.
🥶 12 మానసిక సలహాలు ;

 ✅ మీ 9-5 అనేది ఒకరి నిష్క్రియ ఆదాయం.  డబ్బు సంపాదించడానికి మరియు మీదే సృష్టించడానికి కొత్త మార్గాలను కనుగొనండి.

 ✅ మీరు జీవితంలో ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడ లేని వ్యక్తుల నుండి మీరు సలహా తీసుకోకూడదు.

 ✅ మీ సమస్యలను రక్షించడానికి ఎవరూ రావడం లేదు.  మీ జీవితం 100% మీ బాధ్యత.

 ✅ మీకు 100 స్వయం సహాయక పుస్తకాలు అవసరం లేదు, మీకు కావలసిందల్లా చర్య మరియు స్వీయ క్రమశిక్షణ.

 ✅ కాలేజీ అంటే 99% మందికి సమయం వృధా.  మీరు దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీరు ఇంటర్నెట్ నుండి 10 రెట్లు వేగంగా నేర్చుకోవచ్చు.

 ✅ మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.  కాబట్టి సిగ్గుపడటం మానేయండి, బయటకు వెళ్లి మీ అవకాశాలను సృష్టించండి.

 ✅ మీకంటే తెలివైన వారు ఎవరైనా కనిపిస్తే, వారితో కలిసి పని చేయండి, పోటీ పడకండి.

 ✅ కలుపు మీ జీవితంలో 0 ప్రయోజనాన్ని కలిగి ఉంది.  బ్లంట్ మీ ఆలోచనను నెమ్మదిస్తుంది మరియు మీ దృష్టిని తగ్గిస్తుంది.

 ✅ కంఫర్ట్ అనేది చెత్త వ్యసనం మరియు నిరాశకు చౌక టిక్కెట్.

 ✅ వ్యక్తులు తెలుసుకోవలసిన దానికంటే ఎక్కువ చెప్పకండి, మీ గోప్యతను గౌరవించండి.

 ✅ ఆల్కహాల్‌ను పూర్తిగా నివారించండి.  మీ ఇంద్రియాలను కోల్పోవడం మరియు మూర్ఖుడిగా ప్రవర్తించడం కంటే అధ్వాన్నంగా ఏమీ లేదు.


 *_అన్ని దినోత్సవాల మాదిరి రైతులకూ ఒక దినోత్సవం ఉంది. జాతీయ వ్యవసాయ దారుల దినోత్సవం (National Farmers Day) భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జరుపుకుంటారు._*

*_దీనిని 'కిసాన్ దివస్' అని కూడా అంటారు. భారతదేశ ఐదవ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రజల ఆకలి బాధను తీర్చే దైవాలు రైతులు. నేల తల్లిని నమ్ముకొని, పలు రకాల ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ, శ్రమించి పంటలను పండించి దేశ ఆర్ధికవ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నారు మన వ్యవసాయ దారులు. ఒకప్పుడు అందరి వృత్తీ వ్యవసాయమే. కానీ.. ఇప్పుడు పది మందికీ అన్నం పెట్టే రైతన్నలు కరువయ్యారు. దేశం ఎంత అభివృద్ధి చెందినా రైతుల కష్టాలు మాత్రం తగ్గడం లేదు. రైతులు కావాలని కోరింది ప్రభుత్వం ఇవ్వదు. ఎందుకు ఇవ్వటం లేదో రైతులకు తెలియదు. వారు అడిగింది సరైంది కాదా అంటే కాదని ఎవ్వరూ అనలేరు._*

*_రైతులపై కూడా కార్పొరేట్ ల ప్రభావం పడింది. అందుకే కార్పొరేట్ లకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు రైతుల భూములను సైతం లాక్కుంటున్నాయి తప్ప వారికి కావాల్సిన సౌకర్యాలు కలుగ జేయడంలో వెనుకడుగు వేస్తున్నాయి. గత ఏడాది రైతులు తమ సమస్యల కోసం దేశ రాజధానికి బయలు దేరారు. వారిని అడుగడుగునా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి రాకుండా అడ్డుకున్నది. ప్రస్తుతం కూడా రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఢిల్లీలోని పార్లమెంట్ వరకు రావాలని, వారి సమస్యలు చెప్పుకోవాలని బయలు దేరారు. ఎక్కడికక్కడ వారిపై పోలీసు లాఠీలు నాట్యం చేస్తున్నాయే తప్ప వారి సమస్య ఏమిటి? వారు అడుగుతున్నది ఎంత వరకు సమంజసం? వారి కోర్కెలు తీర్చొచ్చా? లేదా? అనే అంశాలు చర్చించేందుకైనా రైతు నాయకులతో ప్రభుత్వం మాట్లాడొచ్చు. కానీ అవేవీ జరగలేదు. ఇదీ నేటి ప్రభుత్వం తీరు._*

*_మనది ప్రాధమికంగా వ్యవసాయ దేశం. ఇందులో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే రాను రాను వ్యవసాయానికి యువత దూరం అవుతున్నారు. ఫలితంగా వలసలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సుస్థిర ఆహార భద్రత, ఆధునిక వ్యవసాయ పద్దతిలో స్థిరమైన వ్యవసాయాన్ని నిర్మించడం అనే థీమ్ తో జాతీయ వ్యవసాయ దినోత్సవం జరుపుతున్నారు. దేశంలొ 140 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 18 కోట్ల మంది రైతులు ఉన్నారని ప్రభుత్వం చెబుతున్నా దేశ వ్యాప్తంగా 12 కోట్ల మందికి మించి లేరని రైతు నాయకులు చెబుతున్నారు. ఇంత తక్కువ మంది ఉన్న ఈ సెక్టారును మరింతగా ప్రోత్సహించి దేశానికి కావాల్సిన ఆహారం వీరి ద్వారా తీసుకునేందుకు అవకాశం ఉంది. ఆహార భద్రత పేరుతో విదేశాలపై ఆధార పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారత దేశం నుంచి ఎన్నో దేశాలకు కావాల్సిన ఆహార ధాన్యాలు పంపిస్తున్నాం. ప్రపంచ దేశాలలో ఏ దేశానికీ లేని వ్యవసాయ అవకాశాలు భారత దేశానికి ఉన్నాయి._*

*_మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే జమిందారీ చట్టం రద్దు అయింది. కౌలుదారీ చట్టం వచ్చింది. రైతులను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విడిపించి వారికి బ్యాంకు ఋణాలు అందించే విధానము ప్రవేశ పెట్టేలా చేయడం వెనుక చరణ్ సింగ్ నిర్వహించిన రైతు ఉద్యమాలున్నాయి. రైతుల గురించి, వ్యవసాయం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన చరణ్ సింగ్ దేశ ప్రధాని అయినపుడు రైతాంగం ఆనంద పడింది. అయితే ఆయన పార్లమెంట్ ను ఎదుర్కోలేక తాత్కాలిక ప్రధానిగానే 1980లో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చరణ్ సింగ్ రైతు నాయకుడిగానే 1987 మే 29 న మరణించారు. రైతులకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని కిసాన్‌ దివస్ గా ప్రకటించింది._*

*_పంటలు పండించడానికి వారు పడే శ్రమకు గుర్తింపు లేక, చేసిన అప్పులు తీర్చలేక అత్మ హత్యలు చేసుకుంటున్న రైతన్నను కాపాడేందుకు మనమందరం నడుం బిగించాలి. రైతులకు సీలింగ్, మిగులు భూములని పంపిణీ చేయడం, వ్యవసాయ భూములను, వేరే అవసరాలకు వినియోగించకుండా ఉండటం, పంటల బీమాను సమర్ధవంతంగా అమలు చేయడం, పండిన పంటలకు మంచి మద్దతు ధర ఉండేట్లు చూడటం, రైతులకు వడ్డీ భారం తగ్గించడం వంటి స్వామి నాధన్ కమిషన్ సిఫార్సుల అమలుతోనే అన్నదాతలను ఆదుకోవడం సాధ్యం అవుతుంది._*

*_ఈరోజు ప్రాముఖ్యం_*

*_రైతుల కృషిని, దేశ ఆర్థిక వ్యవస్థకు వారు చేస్తున్న సేవలను గౌరవించడం._*

*_వ్యవసాయ రంగం ప్రాముఖ్యతను తెలియజేయడం._*

*_రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడం, వాటి పరిష్కార మార్గాలను కనుక్కోవడం._*

*_ఈ రోజున ప్రభుత్వాలు, వివిధ సంస్థలు రైతులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. వ్యవసాయరంగంలో విశేష కృషి చేసిన రైతులను సన్మానిస్తారు. కాబట్టి జాతీయ వ్యవసాయ దారుల దినోత్సవం అనేది మన దేశ రైతులందరికీ ఒక ప్రత్యేకమైన రోజు._*

*_ప్రభుత్వం, సమాజం రైతుల పట్ల సరైన వైఖరిని కనబరచకుండా కేవలం వేడుకలు జరుపుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. రైతు దినోత్సవం జరుపుకోవాలా? వద్దా? అనే ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం లేదు. ఇది పరిస్థితులు, సందర్భం, మన దృక్పథంపై ఆధారపడి ఉంటుంది._*

*_రైతు దినోత్సవాన్ని ఒక అవకాశంగా తీసుకోవచ్చు. రైతుల సమస్యలపై దృష్టి పెట్టడానికి, వాటిని పరిష్కరించడానికి కృషి చేయడానికి, వారిని గౌరవించడానికి, ప్రోత్సహించడానికి ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రైతు దినోత్సవం కేవలం వేడుక కాదు, రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని గుర్తు చేసే రోజు._*

*_"జై కిసాన్" అనే నినాదం కేవలం ఒక పదం కాదు, అది రైతుల పట్ల మన గౌరవాన్ని, కృతజ్ఞతను తెలియజేస్తుంది. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది._*

*_రుణ భారం_*

*_రైతులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం రుణ మాఫీ పథకాలు, తక్కువ వడ్డీ రుణాలు వంటివి ప్రవేశపెట్టింది. కానీ, ఇంకా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరుగుతోంది. దీనికి పంటల బీమా పథకం ఉన్నప్పటికీ, దానిని మరింత అందుబాటులోకి తీసుకురావాలి. రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించడం లేదు. దీనికి ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థను మెరుగు పరచాలి. చాలా ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాలు సరిగా లేవు. దీనికి ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించడం, ఉన్న వాటిని అభివృద్ధి చేయడం చేయాలి. చాలా మంది రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన లేదు. దీనికి ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. కిసాన్ సమ్మాన్ నిధి, రైతు బంధు వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది. అయితే, ఈ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేయాలి._*

*_కాబట్టి జాతీయ రైతు దినోత్సవం లక్ష్యం పూర్తిగా నెరవేర లేదు. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ప్రభుత్వం, సమాజం, రైతులు అందరూ కలిసి కృషి చేస్తేనే ఈ లక్ష్యాన్ని చేరుకోగలం. ముఖ్యంగా రైతుల సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారాలు కనుగొనడం చాలా ముఖ్యం. అప్పుడే జాతీయ రైతు దినోత్సవ నిజమైన లక్ష్యం నెరవేరుతుంది._*

Monday, December 23, 2024

 *జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ* 
 🌾🍌🌾🍈🌾🫛🌾🌶️🌾🧅
రైతుతోనే 
రమణీయం అందరి బ్రతుకులు
ప్రజలందరు కుశలత ఉన్నారంటే
పట్టెడన్నం అందరికి లభిస్తుంది అని అర్థమోయి

ఆ అన్నం 
అందరం తింటున్నామంటే
అది రైతన్నల చలువే
అందరం గ్రహించాలి

ఎండా వానా చలి పగలు రేయి 
బురద మురుగు పాము పుట్ర
అన్ని భరించి చేస్తారు
అన్నదాతలైన రైతన్నలు సేద్యం

ఆ రైతు లేనిదే
అందరి జీవనం కష్టమే
ఏ ఒక్క క్షణం జరగదు
ఎవ్వరు బ్రతుకులు సాగవు ముందుకు

అందరు చూస్తున్నారు వారిని చిన్నచూపు
అది ప్రతి ఒక్కరు నెరిగినదే
ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో
వారు ఉంటున్నారు అన్ని సౌకర్యాలు లేక

పేద ధనిక వర్గాల వారికి
అందరికి అవుతుంది ఆకలి
ఆ ఆకలి తీరాలంటే తిండితోనే 
ఆ తిండి పదార్థాలు పండించేది రైతులే

వారు లేనిదే ఎవ్వరు  తినలేరు తిండి 
వారికి ప్రభుత్వం కల్పించాలి
విత్తనాలు ఎరువులు బ్యాంకు లోన్లు 
పండిన పంటకు గిట్టుబాటు ధరలు 
సరుకు నిల్వకు గిడ్డంగులు

అప్పుడే అభివృద్ది వైపు 
వెళతారు
అందరికి ఆనందం
అదే మనం రైతులకు ఇచ్చే భరోసా
రైతో రక్షితి రక్షతః
✍️ *మిడిదొడ్డి చంద్రశేఖరరావు 9908413837*
 🙏   హరే కృష్ణ!!*🙏

♿భగవద్గీత ఎందుకు చదవాలి?*

🔹సంతోషంగా ఉన్నావా ... *భగవద్గీత చదువు.*

🔹బాధలో ఉన్నావా ... *భగవద్గీత చదువు.*

🔹ఏమీ తోచని స్థితి లో ఉన్నావా ... *భగవద్గీత చదువు.*

🔹ఏదో గెలిచినావా ...*భగవద్గీత చదువు.*

🔹ఏదో ఓడిపోయినావా ...*భగవద్గీత చదువు.*

🔹నువ్వు మంచి చేసినావా ... *భగవద్గీత చదువు.*

🔹నువ్వు చెడు చేసినావా ... *భగవద్గీత చదువు.*

🔹నువ్వు ఏదో సాధించాలి అనుకుంటున్నావా...*భగవద్గీత చదువు.*

🔹నువ్వు ఏది సాధించ లేక పోతున్నావా ...*భగవద్గీత చదువు.*

🔹నువ్వు చాలా ధనవంతుడవా...*భగవద్గీత చదువు.*

🔹నువ్వు చాలా బీద వాడివా ... *భగవద్గీత విను.*

🔹నువ్వు సమాజాన్ని బ్రతికించాలని అనుకుంటున్నావా...*భగవద్గీత చదువు.*

🔹నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నావా...*భగవద్గీత చదువు.*

🔹నువ్వు మోసపోయినావా...*భగవద్గీత చదువు.*

🔹నీకు అందరూ ఉన్నారా... *భగవద్గీత చదువు.*

🔹నీవు ఒంటరివా....*భగవద్గీత చదువు.*

🔹నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా... *భగవద్గీత చదువు.*

🔹నీవు వ్యాధిగ్రస్తుడవయ్యావా...*భగవద్గీత చదువు.*

🔹నీవు చాలా విద్యావంతుడవా...*భగవద్గీత చదువు.*

🔹నీవు పురుషుడవా...*భగవద్గీత చదువు.*

🔹నీవు మహిళవా...*భగవద్గీత చదువు.*

🔹నీవు ముసలివాడివా ...*భగవద్గీత చదువు.*

🔹నీవు యవ్వనస్తుడివా ...*భగవద్గీత చదువు.*

🔹దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా ...  *భగవద్గీత చదువు.*

🔹దేవుడు లేడు అని అనుకుంటున్నావా ....
*భగవద్గీత చదువు.*

🔹ఆత్మ అంటే ఏమిటి? తెలుసుకోవాలని అనుకుంటున్నావా...
*భగవద్గీత చదువు.*

🔹పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నావా...
*భగవద్గీత చదువు.*

🔹మనిషి జీవితం ఎందుకో తెలుసుకోవాలని అనుకుంటున్నావా ...
*భగవద్గీత చదువు.*

🔹కర్మ అంటే ఏమిటో  తెలుసుకోవాలని ఉందా...*భగవద్గీత చదువు.*

🔹ఈ సృష్టి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వుందా...*భగవద్గీత చదువు.*

🔹పుట్టకముందు మనం ఎవరో తెలుసుకోవాలని వుందా... 
*భగవద్గీత చదువు.*

🔹చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో  తెలుసుకోవాలని వుందా...*భగవద్గీత చదువు.*

🔹దేవుడంటే అసలు ఎవరో తెలుసుకోవాలని వుందా...*భగవద్గీత చదువు.*

🔹నీలో కామం, క్రోధం, లోభం, మొహం, మధం, మాత్సర్యము వంటి అరిషడ్వర్గాలు ఉన్నాయా...
*భగవద్గీత చదువు.*

🔹నీవు ప్రేమిస్తున్నావా...
*భగవద్గీత చదువు.*

🔹నీవుద్వేషిస్తున్నావా...
*భగవద్గీత చదువు.*

🔹నీలో వైరాగ్యం ఉందా...*భగవద్గీత చదువు.*

🔹జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలని వుందా...
*భగవద్గీత చదువు.*

🔹బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలని వుందా...*భగవద్గీత చదువు.*

🔹ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలని వుందా...*భగవద్గీత చదువు.*

🔹మోక్షం అంటే ఏమిటో, స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంటే ...*భగవద్గీత చదువు.*

🔹పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయితెలుసుకోవాలంటే.
*భగవద్గీత చదువు.*

🔹ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే...
*భగవద్గీత చదువు.*

🔹ఇక చివరగా... నీవు ఎవరు, ఎక్కడ నుండి వచ్చావు, ఎక్కడికి పోతావు, నీవారు ఎవరు, నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే...*భగవద్గీత చదువు.*

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
 *ఇదేమి ఊరురా నాయనా* - సహరి పత్రికలో వచ్చిన జానపద చమత్కార కథ - డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212   
**************************
కందనవోలు అనే రాజ్యంలో దేవరాజు అనే వ్యాపారి ఉండేటోడు. ఆయన చానా కష్టజీవి. కడుపు నింపుకోడానికి తిండి వెతుక్కునే స్థాయి నుండి పదిమందికి అన్నం పెట్టే స్థాయి వరకు ఎదిగినాడు. ఆయన చేయని వ్యాపారమూ లేదు తిరగని ఊరూ లేదు. నెమ్మదిగా అతనికి వయసు మీద పడింది. చనిపోయే ముందు కొడుకు రంగరాజుని పిలిచి "రేయ్... అంతా నాకే కావాలా అని ఎప్పుడు అనుకోకు. పది రూపాయలు సంపాదిస్తే కనీసం ఒక రూపాయయినా దానం చెయ్యాల. అలాగే ఒక ముఖ్యమైన విషయం... నువ్వు ఏ ఊరికైనా పో... ఏ వ్యాపారమైన చేయి... కానీ తూర్పు దిక్కున ఉన్న కంత్రీకట్టకు మాత్రం పోవద్దు. ఎందుకంటే" అంటూ విషయం చెప్పే లోపల ఆయన ప్రాణం విడిచినాడు.
రంగరాజు తండ్రి చెప్పినట్టే రకరకాల ఊర్లు తిరుగుతా ఎవరినీ మోసం చేయకుండా పదిమందిని ఆదుకుంటా చానా డబ్బు సంపాదించినాడు. ఒకసారి అడవిలో గుర్రం మీద పోతావుంటే దారిలో ఒక దొంగల గుంపు దాడి చేసింది. వాళ్లకు దొరుకుతే నిలువుదోపిడీ చేయడమే గాక చంపినా చంపుతారు. అందుకని వాళ్ళనుంచి తప్పించుకోడానికి గుర్రాన్ని వేగంగా అడవిలోనికి ఉరికించినాడు. అది అలా ఉరుకుతా ఉరుకుతా అడవిలో దారి తప్పిపోయింది. ఎటుపోవాల్నో తోచలేదు. ఎటు చూసినా చెట్లు, గుట్టలు, వాగులు, వంకలు. దాంతో దొరికింది తింటా చెరువుల్లో కాలువల్లో నీళ్లు తాగుతా ఒక నాలుగు రోజులు అడవిలో తిరిగినాక ఆఖరికి ఒక ఊరు కనబడింది. సంబరంగా ఆ ఊరి లోపలికి పోయినాడు. దారిలో ఒక పిల్లోడు కనబడితే "ఏ ఊరు బాబూ ఇది" అని అడిగినాడు. దానికి వాడు "కంత్రీ కట్ట" అని చెప్పినాడు. ఆ పేరు వినగానే రంగరాజు అదిరిపడినాడు. వాళ్ల నాయన చెప్పిన మాటలు కళ్ళముందు మెదిలినాయి. కానీ నాలుగు రోజుల నుంచి అడవిలో తిరిగి తిరిగి బాగా అలసిపోయినాడు గదా. దాంతోబాటు ఆకలితో కడుపు నకనకలాడి పోతావుంది. అందుకని ఈ ఒక్కరోజు ఇక్కడ పండుకొని తర్వాత రోజు పొద్దున్నే దారి కనుక్కొని వెళ్ళిపోవాలి అనుకున్నాడు.
ఊరిలో పోతావుంటే ఒక ఇంటి ముందు ఒక ముసలాయన కనబడినాడు. రంగరాజు ఆయనతో "తాతా... అన్నం తినక నాలుగు రోజులైంది. అడవిలో దారి తప్పి ఇట్లా వచ్చినాను. నిద్ర లేదు. ఒక్కరోజు ఆశ్రయం ఇవ్వగలవా" అని అడిగినాడు. ముసలాయన వాన్ని ఎగాదిగా కిందికీ మీదికీ చూసినాడు. మెడలోని దండలు, వేసుకున్న బట్టలు చూడగానే బాగా ధనవంతుడని అర్థమైంది. దాంతో "ఎంతమాట నాయనా... ఆకలితో అన్నం పెట్టమని ఇంటి ముందుకు వచ్చినవాళ్లని ఉత్త చేతులతో పంపిస్తే చచ్చిన తర్వాత నరకంలో వేడి వేడి నూనెలో వేయిస్తారంట" అంటూ లోపలికి పిలిచి తాగడానికి నీళ్లు ఇచ్చి స్నానం చేసి రమ్మన్నాడు. అతని మాటలు తియ్యగా, ఆప్యాయంగా సొంత మనిషి కదా మాట్లాడుతున్నట్లు ఉన్నాయి. ఆ ముసలాయన రంగరాజును మాటల్లో పెట్టి "నీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చినావు, మీ అమ్మానాన్న ఎవరు, ఏం చేస్తారు" అంటూ అన్ని వివరాలు ఒక్కటి కూడా విడవకుండా కనుక్కున్నాడు.
రంగరాజు భోంచేశాక ఊరు చూద్దామని బయలుదేరినాడు. అతడు అట్లా కొంత దూరం పోయినాడో లేదో ఒక ఒంటి చేతి మనిషి ఎదురొచ్చినాడు. ఆయనకు కుడి చెయ్యి లేదు. అతను రంగరాజుతో "నువ్వు కందనవోలు దేవరాజు కొడుకువే కదా... అచ్చం మీ నాయన లెక్కనే వున్నావు" అని పలకరించినాడు. రంగరాజు అవునంటూ తలూపినాడు. వెంటనే అతను "మీ నాయన ఈ ఊరికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చేటోడు. ఒకసారి నాకు ఐదు వందలు అవసరమైతే నా కుడిచేయి కుదవబెట్టుకొని డబ్బులు ఇచ్చినాడు. ఇదిగో ఈ ఐదు వందలు తీసుకొని వెంటనే నా చేతిని నాకివ్వు. లేదంటే నష్టపరిహారం కింద పదివేల బంగారు వరహాలు అయినా ఇవ్వు" అని గట్టిగా పట్టుకున్నాడు. రంగరాజుకు అతనికి ఏం చెప్పాలో తోచలేదు. "ఇప్పటికిప్పుడు తిరిగి ఇమ్మంటే ఎలా... రేపటి వరకు నాకు సమయం ఇవ్వు" అన్నాడు.
అతను "సరే రేపు వస్తా" అంటూ వదిలేసినాడు.
రంగరాజు ఇంకొంచెం దూరం పోయినాడో లేదో ఒకామె ఏడుస్తా పరిగెత్తుకొని వచ్చి రంగరాజును గట్టిగా పట్టుకుంది. "మీ నాయన రెండు సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి ఇంటి ఖర్చులకోసం నెల నెలా క్రమం తప్పకుండా వేయి వరహాలు పంపిస్తా ఉన్నాడు. కానీ మీ నాయన సచ్చిపోయినప్పటి నుండి ఆరు నెలలుగా ఒక్క పైసా కూడా నాకు అందలేదు. అందరి వద్ద అప్పులు చేసి బ్రతుకుతా ఉన్నాను. మీ నాయనకు ఆస్తికైనా అప్పుకైనా నీవే కదా వారసునివి. వెంటనే నా అప్పులన్నీ తీర్చి నెలనెలా నాకు వేయి వరహాలు పంపు" అనింది. ఆ మాటలు వినేసరికి రంగరాజు నోట మాట రాలేదు. ఏం చేయాలో అర్థం కాక "నీవు మా నాన్న పెళ్ళానివి అనే విషయం ఇప్పుడే కదా నాకు తెలిసింది. రేపటి వరకు సమయం ఇవ్వు. ఏం చేయాలో ఆలోచిస్తాను" అన్నాడు. ఆమె సరే అనింది.
రంగరాజు అలా పోతావుంటే ఒకతను ఎదురుపడి "ఏం రంగరాజు... మీ నాన్న వచ్చినప్పుడల్లా నాతో చదరంగం ఆడేటోడు. నువ్వు కూడా ఆడతావా. నువ్వు ఓడిపోతే నేను కోరింది ఇవ్వాలి. నేను ఓడిపోతే నువ్వు కోరింది ఇస్తా. ఏం పందానికి వస్తావా" అన్నాడు. రంగరాజుకు కూడా చదరంగం అంటే చచ్చేంత ఇష్టం. దాంతో సై అంటే సై అంటూ పందానికి దిగినాడు. ఇద్దరూ చానాసేపు పందెం కోళ్లలెక్క పోటీపడి ఆడినారు కానీ చివరికి రంగరాజు ఓడిపోయినాడు. దాంతో "చెప్పు... నీకు ఏం కావాలి" అన్నాడు. దానికి అతను "నువ్వు మా ఇంటి వెనుకున్న బాయిలో నీళ్లన్నీ తాగాలి లేదా నీ దగ్గర ఉన్న మొత్తం బంగారం అన్నా ఇవ్వాలి. ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం" అన్నాడు. రంగరాజుకు ఏం చెప్పాలో అర్థం కాక "రేపటి వరకు సమయం ఇవ్వు" అన్నాడు.
రంగరాజు ఆలోచించుకుంటా తాను ఉండే ఇంటికి తిరిగి వచ్చినాడు. కడుపునిండా అన్నం తిని "చెప్పు తాతా...  ఎవరి  రుణం ఉంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. రెండు రోజులు ఆశ్రయమిచ్చినావు అన్నం పెట్టినావు. నీకెంత ఇవ్వాలి" అన్నాడు. దానికాయన ఆయన " దబ్బులదేముందిలే నాయనా... నేను నిన్ను సంతోషపెట్టినట్లే నువ్వు కూడా నన్ను సంతోషపెట్టు చాలు" అన్నాడు. దానికి రంగరాజు సరేనని చిరునవ్వు నవ్వి మొత్తం తిన్న దానికి, ఉన్నదానికి మూడు వరహాలు అయితే అంతకు రెట్టింపు ఆరు వరహాలు అతని చేతిలో పెట్టినాడు. కానీ అతను ఏమాత్రం సంతోషపడలేదు. ఎంత డబ్బు ఇవ్వచూపినా అతను ఇవి నాకేం సంతోషాన్ని కలగజేయడం లేదు అంటున్నాడు. రంగరాజుకి ఏం చేయాలో తోచక "సరే నాకు ఒక్క రోజు సమయం ఇవ్వండి. మిమ్మల్ని సంతోష పరుస్తాను" అన్నాడు.

తర్వాత రోజు నలుగురూ పొద్దున్నే వచ్చి రంగరాజును పట్టుకున్నారు. కానీ రంగరాజుకు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఇంకోరోజు గడువు కోరినాడు. దాంతో ఆ నలుగురు కలిసి ఆ గ్రామపెద్ద దగ్గరికి న్యాయం కోసం పోయినారు. గ్రామపెద్ద రంగరాజును పిలిపించినాడు. రంగరాజు ఆలోచనలో పడినాడు. "ఈ ఊర్లో అందరూ కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేసేటట్లు ఉన్నారు. తనకు సాయం చేసేవారు గానీ న్యాయం చెప్పేవారు గానీ ఎవరూ లేరు. తన ఆపదల్లోంచి తానే సొంతంగా బయటపడాలి. వీళ్లకు మంచిగా మర్యాదగా సమాధానం చెబితే సరిపోదు. దెబ్బ కొడితే మళ్ళా లేయకూడదు" అనుకుంటా అట్లాంటి సమాధానాల కోసం ఆలోచించకుంటా గ్రామపెద్ద ఇంటికి పోయినాడు.
గ్రామాధికారి రంగరాజును కోపంగా చూస్తా "ఏమయ్యా చూడడానికి బాగా చదువుకున్నోని మాదిరి కనపడుతున్నావు. ఇదేనా పద్ధతి. ఆ ఒంటిచేతి మనిషి డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇస్తానంటూ ఉన్నాడు కదా... వెంటనే మీ నాయన కుదవ పెట్టుకున్న కుడిచేయిని తెచ్చి ఆయనకు ఇవ్వు. లేదా నష్టపరిహారం అయినా చెల్లించు" అన్నాడు. దానికి రంగరాజు ఒక నిమిషం ఆగి "అయ్యా... మా నాన్న దగ్గర ఈయన ఒక్కడే కాదు చానామంది వాళ్ళ చేతులు, కాళ్ళు కుదువ బెట్టినారు. కాబట్టి ఎవరిది ఏ చేయో ఎవరిది ఏకాలో కనుక్కోవడం కష్టం. ఇతను ఎడమ చేయి గనుక ఇస్తే అచ్చం దానికి సరిపోయే కుడిచేతిని వెతికి పట్టుకొని వస్తా" అన్నాడు. ఆ మాట వింటూనే ఒంటిచేతి మనిషి అదిరిపడినాడు. "ఓరి దేవుడోయ్... ఏదో పది రూపాయలు వస్తాయి కదా అని ఆశపడితే మిగిలిన ఈ ఒక్క చేయి కూడా పోయేటట్లుందే" అనుకుంటా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినాడు. గ్రామపెద్ద చేసేదేంలేక "సరే... వాని సంగతి వదిలేయ్. నెల నెలా మీ నాయన పంపే డబ్బులతో గౌరవంగా బతుకుతున్న ఈమె మీ నాయన చచ్చిపోయినాక తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడతా ఉంది. ఈమెను చూసుకోవాల్సిన బాధ్యత వారసునివైన నీపైనే ఉంది కదా" అన్నాడు. దానికి రంగరాజు "అయ్యా... మీరు చెప్పింది నిజమే. నేనుండేదేమో కందనవోలు. ఈమె ఉండేదేమో ఈ ఊరు. అక్కడికి ఇక్కడికి చానా దూరం.  మా అమ్మ ఒక్కతే ఇంటి దగ్గర ఇంటి పనులన్నీ చేసుకుంటా కష్టపడతా ఉంది. కాబట్టి ఈమె కూడా తట్ట బుట్ట సర్దుకొని నా వెంబడి వచ్చేస్తే అక్కడ ఇద్దరమ్మలు కలసి హాయిగా పని చేసుకుంటా ఒకరికొకరు తోడుగా ఉంటారు. చచ్చేంత వరకు నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. తల్లి ఉండాల్సింది కొడుకు దగ్గరే కదా" అన్నాడు. ఆ మాటలు వినగానే ఆమె అదిరిపడి "నీవు నెలనెలా పంపే నీ డబ్బూ వద్దు. నీ ఊరూ వద్దు. సచ్చినా ఇక్కడి నుండి ఒక్క ఇంచు కూడా కదలను" అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది.
ఇద్దరూ అట్లా వెళ్ళిపోగానే గ్రామ పెద్ద తల గీరుకుంటా "మరి వీనితో కాసిన పందెం సంగతేమి. భావినీళ్లు మొత్తం తాగేస్తావా లేక నీ దగ్గర ఉన్న సొమ్మంతా అనాపైసల్తో సహా అప్పజెప్తావా" అన్నాడు. దానికి రంగరాజు "అయ్యా పందెం ప్రకారం బావిలో నీళ్లు మొత్తం తాగుతా. వెంటనే పోయి ఆ బావిలోని నీళ్లు ఒక్కచుక్క కూడా మిగలకుండా తోడుకొని రమ్మ నండి. ఆ తరువాత మాట పడకూడదు" అన్నాడు. ఆ మాటలు వినగానే పందెం కాసిన మనిషి అదిరిపడినాడు. అది అట్లాంటి ఇట్లాంటి అల్లాటప్ప బావి కాదు. ఏడు బొంగుల లోతుంటాది. ఎన్ని నీళ్ల తోడినా ఎండాకాలం కూడా ఒక్క ఇంచు తగ్గవు. అట్లాంటిది ఆ బావి నీళ్ళన్నీ తోడేదెప్పుడు? వీడు తాగేది ఎప్పుడు? దాంతో అది తన చేతకాదు అంటూ మట్టసంగా అక్కడినుంచి వెళ్లిపోయినాడు.
ఇక చివరగా మిగిలింది అన్నం పెట్టిన తాత. అతన్ని సంతోష పరచాలి. ఎట్లాగబ్బా అని ఆలోచించి తాతతో "మీ గ్రామపెద్ద చానా మంచి మనిషి. ఈ చుట్టుపక్కల అరవయ్యారు ఊర్లలో ఇంత పద్ధతిగా తీర్పులు చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు. అందుకే వారిని గౌరవంగా ఒక పట్టు శాలువాతో సన్మానించాలి అనుకుంటున్నాను. నీకు సంతోషమేనా" అన్నాడు. ఆ మాట వినగానే తాత గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. నాకు ఇది సంతోషంగా లేదు అంటే గ్రామపెద్దకు కోపం వస్తుంది. కొరడాలతో కొట్టిచ్చి ఊరులోంచి వెలి వేయిస్తాడు. దాంతో ఏమీ చేయలేక "మా గ్రామపెద్దని సన్మానిస్తే నాకు సంతోషం తప్ప బాధ ఎందుకు ఉంటాది" అన్నాడు. దాంతో రంగరాజు చిరునవ్వు నవ్వి "నిన్ను సంతోషపరిచాను కాబట్టి ఇక నీకు డబ్బు ఒక్క పైసా కూడా ఇయ్యనక్కర్లేదు" అంటూ పట్టు శాలువా తెప్పించి గ్రామ పెద్దను ఘనంగా సత్కరించినాడు. అట్లా తన తెలివితేటలతో ఆపదలన్నింటినుంచి బయటపడటమే గాక మరొక ఆపద వచ్చి మీద పడకముందే ఒక్క క్షణం కూడా ఆ ఊరిలో ఉండకుండా అక్కడి నుంచి బయటపడినాడు.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 *మారిన దొంగ (సరదా జానపద కథ)*
డా.ఎం హరికిషన్-కర్నూల్-9441032212
***************************
కందనవోలు నగరంలో ఒక పెద్ద గజదొంగ వున్నాడు. తరతరాల నుంచి వాళ్ళ వృత్తి దొంగతనాలే. వాళ్ళ వంశంలో ఇంతవరకూ ఒక్కరు గూడా పట్టుబడిందీ లేదు. కారాగారంలో అడుగుపెట్టిందీ లేదు. చుట్టుపక్కల వాళ్ళకు చిన్న అనుమానం కూడా రాకుండా అందరితో కలసిమెలసి వుంటూ తాము పెద్ద వ్యాపారస్తులమని చెబుతుండేవారు. అనేక రాజ్యాలు తిరుగుతూ అక్కడ తక్కువ ధరకు లభించేవి కొంటూ, వాటిని ఎక్కువ ధర వచ్చే మరొక రాజ్యంలో అమ్ముతూ వుంటామని చెప్పేవారు. వాళ్ళు వుండే రాజ్యంలో పొరపాటున గూడా ఎక్కడా చిన్న దొంగతనం గూడా చేసేవాళ్ళు కాదు. దాంతో ఎవరికీ ఎటువంటి అనుమానమూ వచ్చేది కాదు.
ఆ గజదొంగకు ఒక కొడుకు వున్నాడు. వాని పేరు బాలచంద్రుడు. బాలచంద్రునికి దొంగతనాలంటే అస్సలు ఇష్టం లేదు. నిజాయితీగా, కష్టపడి బ్రతకాలని కోరిక. కానీ చిన్నప్పటి నుంచీ తండ్రితో పాటే తిరుగుతూ, వృత్తిలోని మెలకువలన్నీ అణువణువూ అందిపుచ్చుకున్నాడు. తండ్రిని బాధపెట్టడం ఇష్టం లేక అతనితో పాటే దొంగతనాల్లో పాల్గొనేవాడు. కానీ అనుకోకుండా అతని తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఇక దొంగతనాలు ఆపివేయాలని, తన పిల్లలు ఆ వృత్తిలోకి అడుగు పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ తాను నేర్చుకున్న మెలకువలు వ్యర్థం కాకుండా అవి మంచి పనుల కోసం మళ్ళించాలి అనుకొని ఆ ఊరి మహారాజును కలవడానికి వెళ్ళాడు.
మహారాజుకు జరిగిందంతా చెప్పి “రాజా... మేము దొంగలమయినా మాకొక న్యాయం వుంది. ఆశ్రయం ఇచ్చిన రాజ్యంలో ఎప్పుడూ ఎక్కడా దొంగతనానికి పాల్పడలేదు. పేదవాళ్ళ ఇళ్ళవైపు కన్నెత్తి చూడలేదు. ధనవంతులైనా నిజాయితీగా సంపాదించిన వారి ఇంటిలో ఎప్పుడూ అడుగు పెట్టలేదు. నా వయసు పదేళ్ళున్నప్పటి నుంచే నేను ఈ రంగంలో అడుగుపెట్టాను. ఏ కారాగారాలు నన్ను బంధించలేవు. ఏ సంకెళ్ళూ నన్ను ఆపలేవు. ఎటువంటి తాళమైనా సరే చిటికెలో ఊడిపోవలసిందే. ఎటువంటి ఆభరణమైనా క్షణంలో మాయం కావలసిందే. ఉడుములా ఎంతటి నున్నని గోడనయినా అవలీలగా ఎక్కగలను. శత్రువుల పట్టు నుంచి కందెనలా జారిపోగలను. చచ్చినా నా నుంచి నిజాలను ఎవడూ బైట పెట్టించలేడు. ఎంతటి బాధనైనా భరించే శక్తి అలవడింది. నాకున్న శక్తిని గౌరవించి, నా సేవలను మీ రాజ్యం కోసం, ప్రజల కోసం ఉపయోగించుకోండి. తగిన వేతనమిచ్చి మీ కొలువులో నియమించుకోండి. నేను నాపిల్లలు నిజాయితీగా, గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఇవ్వండి" అని వేడుకున్నాడు.
రాజుకు ఆ దొంగను ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు. అంతలో పక్కనున్న మంత్రి, “మహారాజా... వీనికి ఉద్యోగం ఇవ్వడం... తెలిసి తెలిసీ దొంగ చేతికి తాళంచెవులు అప్పగించినట్లు అవుతుందేమో" అన్నాడు అనుమానంగా. మహారాజు కాసేపు ఆలోచించి "సరే... అన్ని అనుమానాలూ పక్కన పెట్టి నీకొక పని అప్పజెబుతా. అది గనుక నువ్వు విజయవంతంగా పూర్తి చేయగలిగితే నిన్ను కొలువులో చేర్చుకుంటాను" అన్నాడు.
“చెప్పండి మహారాజా... మీరు ఎంత కష్టమైన పని చెప్పినా దానిని విజయవంతంగా నెరవేర్చుకొని వస్తాను. నా శక్తి సామర్థ్యాలను నిరూపించుకొంటాను" అన్నాడు.
అప్పుడు మహారాజు “రెండు రోజుల కిందట మన గూఢచారి ఒకరు పొరుగు రాజ్యమైన అవంతీపురం సైనికులకి పట్టుబడ్డాడు. కానీ వాళ్ళకు అతను మన గూఢచారని తెలీదు. ఎవరో పెద్ద గజదొంగ అనుకుంటూ వున్నారు. విషయం వాళ్ళకి తెలిసిపోయేలోపల ఎలాగైనా సరే ఆ గూఢచారిని మూడోకంటికి తెలియకుండా విడిపించుకొని రావాలి. నీకు సాధ్యమవుతుందా” అని అడిగాడు. అలా అడుగుతుంటే మహారాజు మాటలు తడబడుతున్నాయి.
ఆ దొంగ మహారాజు వంక సూటిగా చూస్తూ "మహారాజా... యువరాజును క్షేమంగా విడిపించుకొని వచ్చే బాధ్యత నాది” అన్నాడు.
ఆ మాటలకు మహారాజు అదిరిపడ్డాడు. “యువరాజా... ఆ రహస్యం నీకెలా తెలుసు” అన్నాడు ఆశ్చర్యంగా.
“మహారాజా... విషయం వివరిస్తున్నప్పుడు మీ ముఖంలో చాలా ఆందోళన, మాటల్లో తడబాటు కనబడింది. ఎప్పుడూ అందంగా, ఆనందంగా, ఉత్సాహంగా వుండే మీరు పెరిగిన గడ్డంతో, నిద్రపోని ఎర్రని కళ్ళతో, విచారంగా వున్నారు. మనకు చాలా దగ్గరి వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే మన మొహం అలా మారిపోతుంది. ఆ గూఢచారిని విడిపించుకొని రమ్మని మీ పక్కనుండే మంత్రి నన్ను ఆదేశించవచ్చు. కానీ స్వయంగా మీరే అడగడంలోనే అతను మీకెంత ముఖ్యమో అర్థమవుతుంది. అంతేగాక వారం రోజులుగా యువరాజు రాజ్యంలో కనబడడం లేదు. ఇవన్నీ ఒకదానికొకటి కలిపి చూస్తే పట్టుబడిన గూఢచారి యువరాజే అని అర్థమవుతూ వుంది" అని చెప్పాడు.
ఆ మాటలతో మహారాజుకు ఆ దొంగ తెలివితేటల మీద నమ్మకం కుదిరింది. "జాగ్రత్త...
అవంతీపురం మనకన్నా పెద్ద రాజ్యం. వాళ్ళతో పెట్టుకుంటే మన రాజ్యం సర్వనాశనం అవుతుంది. అందుకే వినయంగా నడుచుకుంటున్నాం. కానీ ఎప్పటికయినా సరే ఆ రాజ్యాన్ని జయించాలి. అనేది నా కోరిక. అందుకే యువరాజు అవంతీపురం రహస్యాలు, ఆయువుపట్లు తెలుసుకోవడానికి రహస్యంగా అక్కడికి వెళ్ళి దురదృష్టవశాత్తూ పట్టుబడ్డాడు. వాళ్ళని ఎదిరించి యుద్ధం చేసి నా కొడుకుని విడిపించుకోలేను. అట్లాగే నా కొడుకు గూఢచారిగా వాళ్ళ రాజ్యంలోకి వచ్చాడని వాళ్ళకి తెలిసినా... ఆ రాజు కోపంతో మన మీద యుద్ధం ప్రకటిస్తాడు. అందుకే ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో మనోవేదనతో వున్నాను” అని చెప్పాడు.
గజదొంగ చిరునవ్వుతో "మహారాజా... నాకో నాలుగు రోజులు సమయం ఇవ్వండి. అలాగే నేను ఏది చెబితే అది ఎదురు ప్రశ్నించకుండా నా ఆజ్ఞను పాటించే ఇరవైమంది మెరికల్లాంటి సైనికులను నాతో పంపండి. ముక్కుకి తెలియకుండా ముక్కెర కొట్టేసినట్లు, యువరాజుకు చిన్న ఆపద కూడా కలగకుండా మీ వద్దకు తీసుకువస్తాను" అని అన్నాడు.
మహారాజు అలాగేనంటూ అంగీకారం తెలిపాడు.
*********************
ఆ గజదొంగ తరువాత రోజు ఉదయానికంతా మహారాజు ఇచ్చిన ఇరవై మంది సైనికులతో, యాత్రికుల మాదిరి మారువేషం వేసుకొని అవంతీపురంలో ఒక సత్రానికి చేరుకున్నాడు.
"మీరు నగరమంతా తిరుగుతూ వీధులన్నీ చక్కగా గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నానికంతా తిరిగి సత్రం వద్దకు చేరుకోండి" అని అందరినీ పంపించి తాను యువరాజును బంధించి వున్న కారాగారం వద్దకు చేరుకున్నాడు.
కారాగారం చుట్టూ లోపల ఏమీ కనబడకుండా ఎత్తయిన గోడలున్నాయి. లోపలికి పోవడానికి ఒకటే ద్వారం వుంది. అక్కడ ఇద్దరు సైనికులు ఆయుధాలతో కాపలాగా వున్నారు. ముందు ఒక చిన్నగదిలో సైనికాధికారి కాపలాగా వున్నాడు. అతని అనుమతి లేకుండా లోపలికి ఎవరూ పోలేరు.
ఆ దొంగ చుట్టూ చూశాడు. కారాగారం ఎదురుగా ఒక చిన్న ఫలహారశాల కనబడింది. అక్కడికి పోయి ఉగ్గానీ బజ్జీ తింటూ వానితో మాట కలిపాడు. “ఇదేందన్నా... ఈ కారాగారం ఇంత చిన్నగా వుంది. కాపలాగూడా ఇద్దరే వున్నారు. దొంగలు చాలా సులభంగా తప్పించుకోవచ్చు గదా” అన్నాడు నవ్వుతా.
“అదేమీ కనబడినంత సులభం కాదులే... బైట ఇద్దరు మాత్రమే కనబడతా వున్నా లోపల ఉదయం పది మంది, రాత్రి పది మంది వంతుల వారీగా కాపలా వుంటారు. రాత్రి కాపలా వున్నవాళ్ళు రేపు ఉదయం ఎనిమిదికి బైటకొచ్చి, మరలా రాత్రి ఎనిమిదికి తిరిగి వస్తారు. నిజానికి ఇక్కడ దొంగలు ఎక్కువ మంది వుండరు. కేవలం ముగ్గురో నలుగురో అంతే. కొత్తగా పట్టుకొచ్చిన వాళ్ళని ఇక్కడ వుంచుతారు. ప్రతి ఆదివారం విచారణ జరుగుతుంది. శిక్ష పడిన వాళ్ళని పెద్ద కారాగారానికి మారుస్తారు. మిగిలిన వాళ్ళని వదిలి వేస్తారు. అందుకే కొంచం తక్కువ కాపలా” అని చెప్పాడు.
ఆదివారం అంటే ఎల్లుండే. అంతలోపు యువరాజును ఇక్కడినుంచి తప్పించకపోతే తరువాత మరింత కష్టమయిపోతుంది. కారాగారం చుట్టుపక్కల జాగ్రత్తగా గమనిస్తూ సత్రానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడికి మిగతా సైనికులు కూడా వచ్చి సిద్ధంగా వున్నారు.
“ఈ రోజు మీరంతా హాయిగా విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం నుంచీ మన పని మొదలవుతుంది" అంటూ ఉదయం ఏమి చెయ్యాలో వివరించి చెప్పాడు. అందరూ “సరే” అన్నారు.
తరువాత రోజు ఉదయం ఏడుకంతా అందరూ విడివిడిగా కారాగారం వద్దకు చేరుకున్నారు. బైటనుంచి సైనికులు ఒకొక్కరే వచ్చి సైనికాధికారిని కలిసి లోపలికి వెళుతూ వున్నారు. వారు లోపలికి పోయిన కాసేపటికి లోపలినుండి సైనికులు పదిమంది బైటకు వచ్చారు. రాత్రంతా కాపలా కాసి అలసిపోయిన వాళ్ళు నిద్రమబ్బుతో తలొక వైపు ఇంటిదారి పట్టారు. గజదొంగ సైగ చేశాడు. వెంటనే ఒక్కొక్క సైనికున్ని ఇద్దరు రహస్యంగా దూరం నుంచి అనుసరించసాగారు. వాళ్ళ ఇళ్ళు ఎక్కడ వుంది, ఆ చుట్టుపక్కల ఎవరెవరు వున్నారు, ఇంట్లో ఎంతమంది వున్నారు... ఇలాంటి విషయాలన్నీ గమనించి సత్రానికి తిరిగి వచ్చారు.
“చూడండి... మీరు అనుసరించిన వాళ్ళలో ఎవరి కుటుంబం చిన్నదో, ఎవరి వీధుల్లో జనసంచారం తక్కువగా వుందో, ఎవరి ఇళ్ళు విడివిడిగా ఇతరుల ఇళ్ళకు దూరంగా వున్నాయో, ఎవరు శారీరకంగా బలహీనంగా వున్నారో చెప్పండి. అలాంటి ఇళ్ళ మీదకు దాడి చేసి సైనికులను బంధించడం సులభం" అన్నాడు. అందరూ తాము చూసిన వివరాలన్నీ వివరంగా చెప్పారు. ఆఖరికి అందులో రెండు ఇళ్ళను ఎన్నిక చేశారు. అనుచరులలో పదిమందిని ఎన్నిక చేసి, వారిని రెండు గుంపులుగా విడగొట్టాడు.
మీరు ఐదుగురు చొప్పున వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళండి. ఎవరూ చూడకుండా మెరుపువేగంతో ఇంటిలోకి దూరండి. సైనికులు నిద్రమబ్బులో వుంటారు కాబట్టి చురుగ్గా వుండరు. ఇంట్లో వున్న వాళ్ళకు ఎటువంటి హాని చేయకుండా అందరినీ బంధించండి. తలుపులు మూసేసి బైట తాళం వేయండి. మీలో ఒకరు సైనికుని దుస్తులు ధరించి ఎనిమిదికంతా కారాగారం వద్దకు చేరుకోండి. ఇంకొకరు ముందు జాగ్రత్తగా అతన్ని అనుసరించండి. దారిలో మన మిత్రుడు మిమ్మల్ని కలిసి లోపల ఏం చేయాలో చెబుతాడు. వాళ్ళని విజయవంతంగా బంధించగానే ఒకరు వచ్చి మాకు తెలియజేయండి. ఇదంతా సాయంత్రంలోగా పూర్తి కావాలి” అన్నాడు. వాళ్ళు అలాగేనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
“మనం ఎంత చేసినా బైట వుండే ఆ సైనికాధికారి మన వాళ్ళను గుర్తు పట్టేస్తాడు గదా. కాబట్టి వాన్ని గూడా బంధించి, మనవాన్ని అక్కడ కూర్చోబెడదామా" అన్నాడు ఒక అనుచరుడు. 
"అలా చేయడం సులభమే. కానీ బైటకు వచ్చే సైనికులు సైనికాధికారి మారిపోయిన విషయం గుర్తు పడతారు గదా. అది ఇంకా ప్రమాదం. కాబట్టి అక్కడ ఆ సైనికాధికారే వుండాలి. మనవాళ్ళు లోపలికి పోవాలి" అన్నాడు చిరునవ్వుతో గజదొంగ.
"కట్టె విరగకూడదు. పాము చావగూడదు అంటే ఎలా" అన్నారు వాళ్ళు. గజదొంగ చిరునవ్వు నవ్వి, “ఆ సైనికాధికారి రోజూ సాయంత్రం బైట వున్న ఫలహారశాల నుంచి తినడానికి ఏదయినా తెప్పించుకొని, వేడిపాలు తాగుతూ వుంటాడు. ఆ ఫలహారాల అంగడి వద్ద అస్సలు రద్దీ వుండదు. పది నిమిషాలకు ఒకరో ఇద్దరో వస్తుంటారు. పని తక్కువ కాబట్టి పనివాళ్ళు ఎవరూ వుండరు. అంతా యజమానే చూసుకుంటాడు. కాబట్టి మన పని చాలా సులభం” అంటూ ఇద్దరిని పిలిచి వాళ్ళకు ఏమి చేయాలో చెప్పాడు. వాళ్ళు చిరునవ్వుతో అలాగేనంటూ బైలుదేరారు.
మిగిలిన వాళ్ళతో "మీలో సగం మంది ఆయుధాలు ధరించి కారాగారం చుట్టూ రకరకాల ప్రదేశాల్లో రహస్యంగా దాక్కోండి. మనం లోపల పని ముగించి బైటకు రాగానే ఇక్కడి నుంచి మెరుపు వేగంతో వెళ్ళిపోవడానికి మంచి మేలుజాతి గుర్రాలను సిద్ధం చేసి వుండండి. అంతా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే సంతోషమే. అలా కాకుండా ఊహించని ఆపద ఏదయినా ఎదురయితే నేను గట్టిగా మూడుసార్లు ఈల వేస్తాను. ఆ సంకేతం వినగానే ఒక్కసారిగా దాడి చెయ్యండి. నాతోబాటు ఒక్కరు వుండండి. ఇక ఈ సత్రం ఖాళీ చేస్తున్నాం. అందరికీ ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలో గుర్తుంది గదా" అన్నాడు. అందరూ అలాగేనంటూ తలలూపారు. తలా ఒక దిక్కుకు విడిపోయారు.
సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. సైనికులను కుటుంబంతో సహా ఒక గదిలో బంధించి వారి వేషాల్లో ఇద్దరు కారాగారం వైపు బైలుదేరారు. దారిలో వారికి లోపలికి వెళ్ళి ఏం చేయాలో వివరంగా చెప్పి చెరీ ఒక బరువైన సంచీని ఇంకొకరు అందించారు. అప్పటికే కారాగారం ముందున్న ఫలహారశాలకి చేరుకున్న గజదొంగ దాని యజమానిని బంధించి సైనికాధికారి తాగే పాలలో బేదులు పెట్టే మందు కలిపి అందించాడు. అది తాగిన కాసేపటికే వాని కడుపులో ఉరుములు మెరుపులు మెదలయ్యాయి. పది నిమిషాలకొకసారి చెంబు పట్టుకొని ఉరకడం మొదలుపెట్టాడు.
సమయం ఎనిమిదవుతా వుంది. సైనికులు ఒకొక్కరే వచ్చి సంతకాలు చేసి పోతా వున్నారు. సైనికాధికారికి ఒళ్ళంతా నీరసంగా వుంది. కడుపంతా అల్లకల్లోలంగా వుంది. వచ్చీపోయేవాళ్ళని గమనించే స్థితిలో లేడు. కళ్ళు బైర్లు కమ్ముతా వున్నాయి. మాటిమాటికీ వెనక్కి పరుగెడుతూ వున్నాడు. అలా వెళ్ళిన సమయంలో ఆ ఇద్దరు అనుచరులు అక్కడకు చేరుకొని పుస్తకంలో సంతకం పెట్టి కారాగారంలోకి అడుగుపెట్టారు.
లోపలున్న వాళ్ళు వీళ్ళ కొత్త మొహాలు గమనించి “ఎవరు మీరు. ఇంతకు ముందు ఎక్కడా చూడలేదే" అని ప్రశ్నించారు.
వాళ్ళు నవ్వుతూ "మేము ఈ రోజే పనిలో చేరాము. సైనికాధికారిదీ మాదీ ఒకే ఊరు. కష్టాల్లో వున్నాము కనికరించమని కాళ్ళు పట్టుకుంటే ఈ ఉద్యోగం ఇచ్చాడు" అంటూ అక్కడున్న వాళ్ళకు, బైట కాపలాగా వున్న ఇద్దరికీ తమతో బాటు తెచ్చిన లడ్లు, జిలేబీలు ఇచ్చారు. సైనికులు వాళ్ళకు శుభాకాంక్షలు చెబుతూ వాటిని సంబరంగా తిన్నారు. అంతే... అరగంటకంతా ఎక్కడి వాళ్ళక్కడ మత్తెక్కి మబ్బుగా పడిపోయారు. మరుక్షణమే వాళ్ళు యువరాజు బంధింపబడి వున్న గదికి వెళ్ళి తాళం తీసి జరిగిందంతా చెప్పారు. యువరాజు కూడా సైనికుని మాదిరి బట్టలు వేసుకుని వాళ్ళను అనుసరించాడు.
బైట వున్న సైనికాధికారి చెంబు పట్టుకొని పోయి తిరిగి వచ్చే లోపల ముగ్గురూ బైటకొచ్చి ఫలహారశాల వద్ద వున్న గజదొంగను కలిశారు. మరుక్షణమే వాళ్ళు సిద్ధంగా వున్న
గుర్రాలపై తమ రాజ్యానికి బైలుదేరి తరువాత రోజుకంతా కందనవోలు మహారాజును కలిశారు. 
మహారాజు జరిగిందంతా తెలుసుకొని “శభాష్... వీరుడా ఇచ్చిన మాట ప్రకారం యువరాజు ఒంటి మీద చిన్న గీత గూడా పడకుండా అప్పజెప్పావు. నీలాంటివాడు మన గూఢచార దళంలో వుంటే ఎంతో మేలు. నీకు సరియైన పదవి గూడా అదే" అంటూ ఆ గజదొంగను మెచ్చుకొని గుఢచారదళం నాయకునిగా నియమించడమే గాక, పదివేల బంగారు వరహాలు కానుకగా అందించాడు.
***************************
డా.ఎం హరికిషన్-కర్నూల్-9441032212
***************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 🕉️🌞🌎🌙🌟🚩

*_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Dec 23._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - డిసెంబరు 23._*

*This "I and mine" causes the whole misery. With the sense of possession comes selfishness, and selfishness brings on misery.*

*నేనూ నాదీ అనే ఈ భావాలే లోకంలో అనర్ధాలన్నింటికీ కారణాలు. ఇంద్రియసుఖాలకై ప్రాకులాట స్వార్ధానికి దారి తీస్తుంది. స్వార్ధమే దుఃఖానికి కారణమౌతుంది.*

🕉️🌞🌎🌙🌟🚩
 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

52. మధుమతీం వాచం వదతు శాంతివామ్

మధురంగా, శాంతికరంగా మాట్లాడుగాక (అథర్వవేదం)

మాట ఎలా ఉండాలి? అనేదానిపై మన వేదపురాణేతిహాసాలు విశ్లేషించిన విషయాలు విస్తారం.

భగవంతుడిచ్చిన మాట్లాడేశక్తిని చక్కగా వినియోగించుకోవాలని హెచ్చరించారు.పలుకు ఒక వరం. ఒక మాటని పంచభూతాలూ, వాటి అధిపతియైన పరమేశ్వరుడు
వింటుంటారు. ఈ అవగాహనతో మనం జాగ్రత్తగా మాట్లాడాలని వేదమాత బోధిస్తోంది.

( అయాచితంగా వాక్శక్తి లభించిందనుకొని ఏదిపడితే అది మాట్లాడుతారు.అలాకాక ఆ మాట్లాడే అపురూప శక్తి ఎన్ని జన్మాల పుణ్యంగానో లభించిందని తెలుసుకుంటే, ఆ అరుదైన వరాన్ని ఒక తపస్సుగా, శ్రద్ధగా వినియోగించుకొని జన్మను తరింపజేసుకోగలరు.)

మన సంస్కారాన్నీ, బుద్ధినీ మాట ప్రతిఫలింపజేస్తుంది. సాధారణంగా చాలామంది విసుగ్గా, చిరాగ్గా మాట్లాడుతుంటారు. మాటిమాటికీ అమంగళాలు పలుకుతుంటారు.
తత్కాల కోపావేశం లాంటివి ఎలాంటి మాటనైనా విసిరేస్తాయి. వాటి ప్రభావంవాయుతరంగాల్ని(వాతావరణాన్ని) కల్లోలపరచి అశాంతిని సృష్టిస్తుంది.

అందుకే హితకరంగా, ప్రియంగా, శాంతిగా మాట్లాడితే చాలు.

కొందరు ఊరకనే కసరుకుంటుంటారు. ధుమధుమలాడుతుంటారు. ప్రతి మాటకీ ఊతగా ఒక అమంగళ వాక్యమో(వాడి దుంపతెగ!
చచ్చాం పో! ఒళ్ళుమండిపోతుంది! వంటివి) (అమంగళము శమించుగాక!) నిందాపదమో, అశ్లీలమో లేకుండా మాట్లాడలేరు. ఇలాంటి మాటలు వారి మనోభూమికల్ని కల్మషం చేస్తాయి.
లౌకిక కార్యానికీ, ఆధ్యాత్మిక సాధనకీ కూడా దేవతల సహాయం అందకుండా
చేస్తాయి.

దేవతలు శుచిగా, మృదువుగా మాట్లాడితేనే ప్రీతి చెందుతారట. ప్రకృతి సంతోషిస్తుందట. దీనిని మనం గమనించవచ్చు. ఒక ఇంట్లో తల్లీతండ్రి కఠినంగా కసురుకుంటుంటే భాషరాని పసిపాప వెంటనే అసహనంగా ఏడుస్తాడు! కల్లాకపటం లేని పసిమనసు ఆ మాటలో కరుకుదనం, తనని ఉద్దేశించినది కాకపోయినా
పరిసరాలలో అలజడిని కలిగించడం చేత కల్లోలపడుతుంది. అలాగే దేవతలు,ప్రకృతి కూడా ఇబ్బంది పడతాయి. వారి మనసుని నొప్పించిన వారికి క్షేమం
కలగడం కష్టం.

ప్రియంగా మాట్లాడినంత మాత్రాన ప్రతి జీవి సంతోషిస్తుంది. అందుకే
ప్రియకరంగా, మధురంగా మాట్లాడు. మాటలకి దరిద్రమా చెప్పు!

ప్రియవాక్య ప్రదానేన సర్వేతుష్యంతి జన్తవః
తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రతా |

ఇందులో 'సర్వే జన్తవః” ('అన్ని ప్రాణులు) అనే పదం ఉంది. మనమాడే మాట ప్రతిప్రాణిపై ప్రభావం చూపిస్తుందని దీని అర్థం.

అయాచితంగా వాక్శక్తి లభించిందనుకొని ఏదిపడితే అది మాట్లాడుతారు. అలాకాక
ఆ మాట్లాడే అపురూప శక్తి ఎన్ని జన్మాల పుణ్యంగానో లభించిందని తెలుసుకుంటే,ఆ అరుదైన వరాన్ని ఒక తపస్సుగా, శ్రద్ధగా వినియోగించుకొని జన్మను
తరింపజేసుకోగలరు.                  
 *_ఆశావాదికి కష్టాలు కనిపించవు. కేవలం అవకాశాలే కనిపిస్తాయి. మొక్కకు భూమి కింద రాయి తగిలినా కూడా తడి తగిలే దాకా వేళ్లను విస్తరిస్తూనే ఉంటుంది. ఆశావాది కూడా అంతే..._*

*_సృష్టిలో అన్ని జీవుల కన్నా తెలివైన జీవి మనిషే. కానీ ఏ జీవి కూడా ఓడిపోవాలని అనుకోవు. పరిస్థితులు కలిసి రాకపోతే ఏ జీవీ ఆత్మహత్యలు చేసుకోవు._*

*_కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే... మనిషి మాత్రం ఈ పనులన్నీ చేస్తాడు. ఓడిపోతే తీవ్ర నిరాశకు లోనవుతాడు కానీ ఇతర జంతువులు ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందుకే అవన్నీ ఆశావాదులే._*

*_అందుకే ఇతర జంతువుల్లో నిరాశ కనిపించదు. ఒకచోట పడితే మరో చోటకు వెళ్లి ప్రయత్నిస్తాయి. ఇతర జీవులు కానీ మనిషి ఓటమి ఎదురైతే చాలు తీవ్రంగా నిరాశ పడిపోతాడు._*

*_రేపు మరో అవకాశం వస్తుందనే విషయాన్ని మరిచిపోతాడు. అందుకే మనుషులంతా ఆశావాదులుగా మారాలి. ఆశావాదాన్ని ఆశ్రయించిన వారికి నిరాశ ఎదురవదు._*

*_ఈరోజు ఓటమి ఎదురైతే రేపు గెలుపు దక్కుతుందని ఆశపడండి. అదే మీ ఆయుష్షును పెంచుతుంది. ఆశీర్వాదం ఎంత బలీయమైనదంటే చివరి శ్వాస వరకు ప్రాణాన్ని నిలిపి ఉంచే శక్తి దానికి ఉంది...☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి... 👏_*
🌷🌷🌷 🌹🙇‍♂️🌹 🌷🌷🌷
 

 అత్యుత్తమ ఉదాహరణ భగవద్గీత గురించి..🙏🙏🙏** వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దన బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయో2వ్యవసాయినామ్ ॥**

ఈ నిష్కామ కర్మ యోగమును అవలంభించిన వాడి బుద్ధి ఏకాగ్రంగా, నిశ్చయంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకొని దాని కొరకు కర్మచేస్తే వాడి బుద్ధి పరి పరి విధాల పోతుంది. కుదురుగా నిశ్రయంగా ఉండదు.

ఆధ్మాత్మికంగా చెప్పాలంటే మానవులకు దైవము మీద నిశ్చయమైన బుద్ధి ఉండాలి. ఆ దేవుడు మంచి వాడు, ఈ దేవుడు మనకు కోరిన వరాలినుడు అనే భేదభావము ఉండకూడదు. అలాగే శ్రయమైన బుద్ధి కలవాడు ఏ పని చేసినా సక్రమంగా, విజయవంతంగా చేస్తాడు. ఏ పని చేస్తున్నా మనసు దైవము మీద నిలిపి ఉంచుతాడు. ప్రాపంచిక విషయములను ఎక్కువగా పట్టించుకోడు. ఒక లక్ష్యము అంటూ లేని వాడి బుద్ధి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ముళ్లపొద మీద తీగ పాకినట్టు అడ్డదిడ్డంగా పాకుతుంది. ప్రపంచంలో దొరికే అన్ని వస్తువులమీదికి మనసు పోతుంది. వాటి కోసం వెంపర్లాడుతుంది. ఉదాహరణకు సూర్యకిరణములను భూత అద్దంలో నుండి ప్రసరింపజేస్తే, అవి ఏకాగ్రత చెంది దేనినైనా భష్మం చేస్తాయి. అదే సూర్యకిరణములు విడి విడిగాఉంటే ఆ పని చేయలేవు. కాబట్టి మానవునికి ఏకాగ్రబుద్ధి అవసరము.
 [12/23, 6:12 AM] Msg 9440 Gag Msmtg SURYA PRAKASH Susarla: *ప్రతీ పనికి అనువైన కాలం అనేది ఉంటుంది.*
*ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తేనే, దానివల్ల ప్రయోజనం. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా వుండాలంటే, వర్షాకాలంలో ఎక్కువ నీటిని నిల్వ చేసుకోవాలి. ఎక్కువ నీరు నిల్వ ఉండాలంటే, వానలకు ముందే చెరువుల్లో పూడికను తీసివేయించాలి.
*ఇలా మనిషి చేసే ప్రతి పని కాలానుగుణంగా ఉండాలి. క్రమం తప్పని సృష్టి నియతిని చూసి, మనిషి నేర్చుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమంటే ఇదే. గతించిన కాలం గురించి చింతించి ప్రయోజనం లేదు. వర్తమానాన్ని నిర్లక్ష్యం చేసి, భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవడంలో అర్థం లేదు.
*పుట్టిన తరవాత మనిషి కాలానుగుణంగా పొందేవాటిలో ముఖ్యమైనది యౌవన దశ. మనోవికాసానికి కావాల్సిన వనరులన్నీ యుక్తవయసులోనే పుష్కలంగా ఉంటాయి.
*వికాసం అంటే- జీవితంపై సుస్పష్టమైన అవగాహన ఏర్పరచుకుని లక్ష్యంతో జీవించడం. సృష్టిలో మిగతా ఏ ప్రాణికీ దక్కని అవకాశం ఇది.
*పట్టువిడవకుండా నిరంతరం కృషిచేసే సామర్థ్యం, యువశక్తిలో మెండుగా ఉంటుంది. వృద్ధాప్యంలో ఇంద్రియ పటుత్వం తగ్గుతుంది. శరీరం సహకరించనప్పుడు ఏ ఉన్నత కార్యాల్నీ తలపెట్టలేరు. గడించిన అనుభవం గొప్ప ఆస్తిగా మిగులుతుంది. తనకు తానుగా ఉన్నత కార్యాలకు పూనుకోకపోయినా, విజయపథంలో దూసుకుపోయేవారికి చిరునామా అవుతారు.
*యుక్తవయసులో ఉన్నప్పుడు లభించిన శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకున్న వారికే వృద్ధాప్యం గొప్ప వరమవుతుంది. యౌవనాన్ని వ్యర్థం చేస్తే వృద్ధాప్యం బాధించక మానదు.
*ఉపాధ్యాయుడు గొప్ప అనుభవజ్ఞుడైనా- విద్యార్థిలో క్రమశిక్షణ, చదువుపై శ్రద్ధ లేకపోతే అతడు రాణించలేడు. ద్రోణాచార్యులు విలువిద్యను శిష్యులందరికీ ఒకే విధంగా నేర్పించారు. అర్జునుడి స్థాయికి మిగతావారు ఎదగలేకపోయారు.
*విలువిద్యపై పార్థుడికి ఉన్న తీవ్ర ఆసక్తే దీనికి కారణం. అందుకే గురువుకు తగ్గ శిష్యుడు, శిష్యుడికి తగిన గురువు ఉండాలంటారు పెద్దలు. దేనినైనా నేర్చుకోవాలన్న కుతూహలం శ్రద్ధాసక్తులు, బాల్యంలోనే ఏర్పడాలి.
*బాల్యంలో మనసు శుద్ధంగా స్వచ్ఛంగా తెల్లకాగితంలా ఉంటుంది. వీటిపై పెద్దలు ఏది రాస్తే అదే వారి మనసులో ముద్రితమవుతుంది. అవే యుక్తవయసులో సంస్కారాలుగా మనస్సాక్షికి ముడిపదార్థంలా రూపొందుతాయి.
*సాయంసంధ్యా సమయాలలో పిల్లలను దగ్గరకు చేర్చుకుని గతంలో బామ్మలు నీతి కథలు చెప్పేవారు. అవి పసిహృదయాలలో నాటుకుని శీలనిర్మాణానికి దోహదపడేవి.
*భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన స్వామి వివేకానందుడిలో ఆధ్యాత్మిక భావాల్ని బాల్యంలోనే తల్లి భువనేశ్వరీదేవి నూరిపోసి, జాతి గర్వించే తత్వవేత్తగా తీర్చిదిద్దింది.
*వీరోచిత భావాలను ఆర్షవైభవాన్ని బాల్యంలోనే తల్లి జిజియాబాయి బువ్వగా తినిపించి శివాజీని ఛత్రపతిని చేసింది.
*అందుకే మన పూర్వీకులు అమ్మకు గురువులలో ప్రథమస్థానం, దేవతలలో ఉన్నత స్థానం కల్పించారు. 
*సర్వసంగ పరిత్యాగులైనా తల్లికి పాదాభివందనం చేస్తారు.
*బాల్యంలో ఉత్తమ సంస్కార బీజాలు పడినా, అవి అభ్యాసదశలో నిర్జీవం కాకూడదంటే విద్యతోపాటు శీలనిర్మాణానికి అధ్యాపకులు, తల్లిదండ్రులు ప్రాధాన్యమివ్వాలి.
*వారి ఉరకలేసే ఉత్సాహాన్ని సన్మార్గంలోకి మళ్ళేలా చూడాల్సిన బాధ్యత పెద్దలదే.
గురువుల సన్నిధే పరిపూర్ణ వ్యక్తి వికాసానికి చివరి మెట్టు.
[12/23, 6:12 AM] Msg 9440 Gag Msmtg SURYA PRAKASH Susarla: మన కోపం ఇతరులపై చుపించలనుకున్నా
వాస్తవానికి మనపై మనం
చుపించుకుంటాము మరియు
మనం బాదించాలనుకున్న వారి కంటే
ఎక్కువగా బాధపడతాము
 శాఖాహారం  అమృతాహారం.

భారత దేశం పుణ్య భూమి అంటారు .!!
మరి అటువంటి భారత దేశాన్ని
పుణ్య భూమి గానే ఉంచుదా ము.

ఇది ఖచ్చితం గా చదవండి.

 మాంసాహారం మృతాహారం

జార్జి బెర్నర్డ్ షా అన్నారు,
నీ పొట్ట శ్మశానం కాదు అని.

వివరణ చూద్దాం.

(1)  జంతువులు,పక్షులు,జల చరాలు, అన్ని కూడా మనలాగే నొప్పి ఉన్న ప్రాణులే.
మనకి ఎలా అయితే పెన్సెలు చెక్కి నప్పుడు వ్రేలు కోసుకుంటే వారం పది  రోజులు,(అలాగే ఇతరత్రా)
వరకు కట్టు వేస్తామూ.
అదే జంతువులని పీక           కోస్తున్నప్పుడు అది భూమిపై గిల గిల కొట్టు కుంటున్నప్పు డు అది ఎంత బాదపడు తుంది,,  
 మైడియర్  ఫ్రెండ్స్   ఒక్కసారి ఆలోచిద్దాం . మరి ఆబాద ఎవరికి చెందుతుంది.

పెంచిన వారికి,అమ్మే వారికి,కొన్న వారికి,వండే వారికి,తిన్న వారికి . చేరి ఇంట్లో,వొంట్లో కస్టాలు.

2  ఈ మాంసము తినడం ఎక్క డ నుండి మానవుడి కి             వచ్చింది అంటే,
ఆది మానవుడు నుండివచ్చింది.                        ఆది  మానవుడు ఎలా ఉండేవాడో అందరికి తెలుసు,జంతువు లాగే ఉండేవాడు.
మరి ఈనాడు  అన్నీ అలవాట్లు మార్చుకుని జీవిస్తున్నాడు.
మరి జంతువుల తిండి ఎందుకు మారలేదు.

3   మన పురాణాలు లో ప్రతి భగవంతుడి వెనుక ఒక జంతువు లేక పక్షి ఉంటుంది.
అంటే భగవంతుడు జంతువు లో కుడా ఉన్నాడు ,మమ్మల్ని పూజించి నట్లే వాటిని కుడా పూజించండి అని.

మరి మన వాళ్లు దేవుడి తో పాటు వాటిని పూజిస్తారు,మళ్లి
వాటిని చంపి తింటారు.
ఎందుకు.   !!  
                  
అలాగే
దశావతారం లో భగ వంతుడు నేనే  ఆ అవతారాల్లో ఉన్నాను అని చూపించేడు.

4  మాంసం తిన్న  జంతువు క్రూరత్వం తో ఉంటుంది. వాటి  దగ్గరకు మచ్చిక అయితేనే వెళ్ల గలం.
ఉదా; పిల్లి,కుక్క,నక్క,పులి,సింహం.

అదే ఆవు,మేక,గొర్రె,ఏ నుగు,ఇంకా ఎన్నో వీటి దగ్గరకు మనం వెళ్లగలము.

  ఇంకా అంటారు మాంసం బలమని
మరి పై జంతువులన్నిటి కి బలము ఎలా వచ్చింది.!!

అలాగే మాంసం తిన్న జంతువుల కి కోరలు , గోళ్ళూఉంటాయి.

ఆవులు  మిగతా వాటికి దంతాలు ,గిట్టలు ఉంటాయి.
మరి మన పళ్ళు,గోళ్ళూ  ఎలా ఉన్నాయి.

అలాగే
మనిషి బ్రతకడం కోసం ఆహారం కావాలి కాని మాంసం అవసరం లేదు,

నాలుక మీద ఒక్క క్షణం ఉండే రుచి కోసం ప్రాణం తీయడం అవసరమా.

ఈ రోజు ఎన్నో రకాలయిన veg లు దొరుకు తున్నాయి.
పన్నీరు,మష్రూమ్,మీల్ మేకర్
బేబీ కార్న్, ఇతరత్రా. 

అలాగే ఇంకో ఆసక్తి కరవిషయం
ఒక kg మాంసం తయారీ కి 10     or  15 వేల లీటర్ల నీరు అవసరం పడుతుంది.
అదే కాయగూరల కి 500 లీటర్ల   
         నీరు పడుతుంది.

ప్రాణం విలువ, ప్రాణం ఉన్న వాళ్ళకే తెలుసు..

జై హింద్.

సేకరణ : మహాత్ముల సబదేశాలు నుండి లక్ష్మి

**** 'హాత్ కత్రా పిల్లర్' ఓల్డ్ గోవా

 'హాత్ కత్రా పిల్లర్'   ఓల్డ్ గోవా 

మతం మారడానికి నిరకరించిన హిందువులను ఈ రాతి స్తంబానికి కట్టి వారి రెండు చేతులను భుజాల వరకు నరికేసేవారు....

Francies Xavier  అనే వాడు 80000 మంది హిందువుల చేతులను నరికించాడు...

ఇలాంటి వాటిని మన చరిత్రకారులు మనకి తెలియనీయకుండా దాచేశారు.
🙏Happy క్రిస్మస్ అని చెప్పే హిందువులకు ఇది అంకితం 🙏





*****సినిమా పిచ్చోళ్ళ కోసమే ఈ వీడియో - An Eye Opener!!

 సినిమా పిచ్చోళ్ళ కోసమే ఈ వీడియో - An Eye Opener!!
Youtube video link - https://youtu.be/UwwdrqLPyiU


Transcript - అందరికీ నమస్కారము సినిమా పిచ్చోళ్ళ గురించే ఈ స్పెషల్ వీడియో సినిమా పిచ్చోళ్ళు ఎవరు మేడం అంటే మనలో చాలా మంది ఉన్నారు నేను కూడా ఉన్నాను లేండి నా సంగతి తర్వాత ఈ సినిమాలు చూసి కొంచెం ఆ సినిమాలో వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళు అనుకరిస్తూ మన నిజ జీవితాన్ని మన యొక్క లైఫ్ స్టైల్ ని మార్చుకుంటూ మంచిగా మార్చుకుంటే వెల్ అండ్ గుడ్ బట్ బట్ పెడదారిలో వెళ్ళడానికి ఎక్కువ ట్రై చేస్తారు చాలా మంది ఈజీ కదా మంచిగా బతకాలంటే అంటే కొంచెం కష్టపడాలి అదే పెడదారిలో పోవాలంటే చాలా ఈజీ సో ఇది బ్యాడ్ ఇంపాక్ట్ ఒకటి ఎక్కువ పడుతుంది ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళు హీరోలని హీరోయిన్లని వాళ్ళు ఇంత పెద్ద అందలాలకు ఎక్కించేసి వాళ్లకు ఒక ఫ్యాన్స్ క్లబ్ అని అసోసియేషన్స్ అని ఇవన్నీ అవసరమా చెప్పండి మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఏదో ఒక ఫీల్డ్ లో ఉన్నారు మే బి యు ఆర్ ఏ డాక్టర్ లాయర్ ఇంజనీర్ లేని టీచర్ అట్లా ఏదో ఒక ప్రొఫెషన్ లో మనం బతుకుతున్నాం ఎట్లా వచ్చాం ఈ ప్రొఫెషన్ కి ఏదో ఒక డిగ్రీ గట్టిగా చదివి ఆ ప్రొఫెషన్ మీద కొంచెం స్కిల్ పెంచుకుని దాంట్లో సెటిల్ అయ్యాము ఈ ఫిలిం యాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి ఇక వేరే దిక్కు లేక ఈ యాక్టింగ్ ఒకటి ప్రొఫెషన్ గా ఎంచుకొని కాస్త ఈ ఆక్టింగ్ స్కిల్స్ ఒకటి నేర్చుకొని కొంతమంది నేర్చుకోకుండా వచ్చేసారు లేండి పర్వాలేదు అది వేరే సంగతి వచ్చేసి వాళ్ళు ఏదో బతుకుతున్నారు వాళ్ళ బతుకు తెరువు అది ఇంకా డాన్స్ ఒకటి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారు ఇంకా ఆక్టింగ్ అంటారా ఇంకా చెప్పక్కర్లేదు నేను చూశాను చాలా సినిమా షూటింగ్స్ సో ఒక్కొక్క సీన్ షూటింగ్ చేయడానికి ఎన్నో రీటేక్స్ తీసుకుంటారు ఇప్పుడు నేను youtube లో మాట్లాడుతున్నాను ఏ రీటేక్ ఉండదు సింపుల్ గా నా మైండ్ లో ఉన్న థాట్స్ ని ఐ జస్ట్ ఎక్స్ప్రెస్ అట్లా కాదు వాళ్ళు ఎన్నో టేక్స్ తీసుకుంటారు అరే ఇన్ని టేక్స్ తీసుకుంటున్నారు అంటే ఎవరైనా ఆక్టింగ్ చేయొచ్చు అండి కాకపోతే అవకాశాలు లేవు అవకాశాలు ఉంటే మాత్రం ఎవరైనా ఆక్టింగ్ చేయొచ్చు అంత ఈజీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక వీళ్ళకి మీరు హీరోలు అనేసి అదేదో పట్టాలు కట్టేసి వాళ్ళ వెనకాల తలబడి ఈయన వస్తున్నాడు ఆయన వస్తున్నాడు అని అవన్నీ అవసరం లేదు ఇంకా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఏ స్కిల్ లేదు ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళ మీద జాలి చూపించండి ఎందుకంటారా దే ఆర్ ఎంటర్టైనింగ్ అస్ మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళు బతుకుతున్నారు సంపాదిస్తున్నారు అది వేరే సంగతి సంపాదిస్తున్నారు కోట్ల కోట్లు ఒక హై లెవెల్ లో కూర్చున్న సెలబ్రిటీస్ అనే హోదా ఒకటి తీసుకున్నారు అండ్ దే ఆర్ ఎంటర్టైనింగ్ అస్ ఎంటర్టైనర్స్ అని చెప్పొచ్చు చూడండి అని ఎంటర్టైనర్స్ నాట్ హీరోస్ ఆర్ హీరోయిన్స్ ఏదో పెద్ద పెద్ద పదవులు ఇవ్వకండి వాళ్ళకి నార్మల్ మనుషులే ఒక చిన్న సిట్యువేషన్ చెప్పనా నేను శంషాబాద్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ చేస్తున్నప్పుడు మా కాలేజీలోనే షూటింగ్ అవుతా ఉండక ఒక నెల రోజుల దాకా వాళ్ళు వచ్చే ఆ సినిమా షూటింగ్ కి కాలేజీలోనే తిష్ట అక్కడే షూటింగ్ జరుగుతా ఉండేది అప్పుడు జగపతి బాబు అండ్ ప్రియమని వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏదో సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు అది మీరు గుర్తొస్తే మీరు కామెంట్ బాక్స్ లో రాయండి సో ఒక సినిమా ఒకటి షూటింగ్ జరుగుతుంది జరుగుతా ఉండి ఇక వాళ్ళు అక్కడే కూర్చున్నారు రోజు వాళ్ళని చూడు ఆయన బ్రహ్మానందము దేవ బాబు ప్రియమని వీళ్ళు వీళ్ళు తిరగడం అక్కడ ఆ సరౌండింగ్స్ లో ఒక రోజు నేను క్లాస్ కి వెళ్తున్నాను వెళ్తా ఉంటే అక్కడ క్లాస్ ముందర జగపత్తి బాబు చైర్ వేసుకొని కూర్చున్నాడు ఐ హావ్ సీన్ అంటే ఒకసారి చూశాను అంతే ఇక దానికి పెద్ద షాక్ అయిపోయి నా దగ్గర పోయి నీకు మీకు ఒక పెద్ద ఫ్యాన్ అండి ఇదని అదని అవసరం లేదు నేను క్యాజువల్ గా వెళ్ళిపోయాను ఆయన జస్ట్ హి వాస్ లుకింగ్ అట్ మీ అరే అంటే నేను తెలియదా లేకపోతే ఏంటిది ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అన్నట్టు చూస్తున్నాను డంట్ మ్యాటర్ వాళ్ళు పెద్ద అంత లెవెల్ ఏం లేదు వాళ్ళకి మంచోళ్లే వాళ్ళు కష్టం మీద వాళ్ళు పడుతున్నారు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అంతే అంతకు మించి ఇంకా ఎక్కువ అభిమానాలు పెంచుకోకండి మనం ఇంకా చాలా గ్రేట్ ఎందుకంటే ఏదో ఒక ఫీల్డ్ లో బాగా మంచి నాలెడ్జ్ తెచ్చుకున్నాం కాబట్టి ఇక సినిమా పిచ్చోళ్ళల్లో నేను కొన్ని కేటగిరీస్ చెప్తాను ఇప్పుడు నేను 1970 బార్న్ 70 బార్న్ అంటే ఆ టైం లో 1970 80 90 ఈ టైం లో పుట్టినోళ్ళు అంటే అంతకు ముందు పుట్టిన వాళ్ళందరికీ సినిమాలో ఒక క్రేజ్ ఎందుకంటే మాకు ఇప్పట్లో ఉన్నట్టు కేబుల్ టీవీ లు లేవు అండ్ ఇంకా యాప్స్ లేవు ఇట్లా sony అని ప్రైమ్ అని నెట్ అని ఇలాంటి యాప్స్ మాకు అస్సలు తెలియదు అసలు కలర్ టీవీ నే తెలియదు మా ఇంట్లో కలర్ టీవీ వచ్చింది 1997 లో అప్పటిదాకా బ్లాక్ అండ్ వైట్ చిన్న టీవీ ఉండేది ఇక దాంట్లో ఏంటంటే శనివారం ఆదివారం రెండు సినిమాలు వచ్చేవి శనివారం హిందీ సినిమా ఆదివారం తెలుగు సినిమా ఇక వాటి కోసం కాచుకొని కూర్చునే వాళ్ళం వాడు ఏది ఏ సినిమా చూసేవాళ్ళం సంతోషంగా ఆ పాటలు గుర్తుపెట్టుకునే వాళ్ళము అట్లనే హిందీ కూడా ఇట్లనే నేర్చుకున్నాం ఎందుకంటే ఎవ్రీ శనివారం వచ్చే హిందీ సినిమా చూసేవాళ్ళము విని విని హిందీ కూడా వచ్చేసింది అట్లా మా జనరేషన్ అది కాబట్టి మాకు అప్పట్లో సినిమా అంటే చాలా పెద్ద క్రేజ్ ఆ సినిమా థియేటర్ కి వెళ్లి ఈ చిరంజీవి సినిమా రిలీజ్ అయిందని ఇంకా లేకపోతే శోభన్ బాబు కృష్ణ ఈ సినిమా రిలీజ్ అయినాయి అని చెప్పేసి పోయి థియేటర్ లో ఓ పడిగాపులు కాసి ముందుగా టికెట్లు తీసుకొని తర్వాత థియేటర్ లోకి వెళ్లి చాలా సంతోషంగా చూసేవాళ్ళం ఇంకా జనాలు కొంచెం పేపర్లు విసిరే వాళ్ళు విజిల్ కొట్టేవాళ్ళు ఆ ఎన్విరాన్మెంట్ అది ఆ పిచ్చి అది వేరే ఉండేది ఇక తర్వాత స్లోగా ఇప్పుడు ఇన్ని యాప్స్ మనకి అన్ని అందుబాటులో ఉన్నాయి ఇవి వచ్చినాక అవసరం లేదు అనిపించింది ఈవెన్ నేను క్రికెట్ మీద కూడా చాలా పిచ్చే ఉండేది క్రికెట్ సినిమాలు రెండిటి మీద టెన్త్ క్లాస్ దాకా ఉండేది టెన్త్ క్లాస్ తర్వాత నేను అంటే సెల్ఫ్ టాక్ నా మీద నేనే నా కరియర్ మీద ఫోకస్ చేస్తూ అప్పుడు నేను అప్పుడు డిసైడ్ చేసుకున్నాను అరే అవసరం లేదు వీళ్ళ గురించి ఇంతగానం పిచ్చి పెట్టాల్సిన అవసరం పిచ్చి పెట్టుకొని మైండ్ అంతా ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం అవసరం లేదు చూడు ఎంజాయ్ చెయ్ వదిలేయ్ అక్కడనే అండ్ ఇంకొకటి చెప్పనా సినిమాలు ఇస్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ మన మైండ్ ఎప్పుడైనా ఫ్రెష్ చేసుకోవాలి కలిసి కాస్త బయటికి వెళ్ళాలి అంటే గనుక చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ టూర్ కి వెళ్ళినా గాని చాలా కాస్ట్ ఫస్ట్ అఫ్ ఆల్ ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఏదో తీసుకుంటాము అండ్ అక్కడ మూడు పూటలు భోజనం చేయాలి అక్కడ తిరగడానికి మళ్ళా డబ్బులు స్పెండ్ చేయాలి సైడ్ సీన్స్ కోసము చాలా తడిచి మోపుడు అయిపోతుంది అలాంటప్పుడు ఓ సినిమా చాలా ఈజీ కదా కాబట్టి నియర్ బై థియేటర్ లోకి వెళ్ళే సినిమా చూస్తాము బాగుంది యాక్ట్ బాగా చేశాడు ఆ కూర్చున్నంత సేపు ఆ రెండు మూడు గంటలు ఏంటంటే ఆ మన మైండ్ ని అలా పట్టేసి ఒక ఎంటర్టైన్మెంట్ గా మైండ్ ఏదో లోకంలోకి తీసుకెళ్లి అలా ఉంచుతాం బయటకు వచ్చాక మనకున్న ప్రాబ్లమ్స్ మర్చిపోతాము టెన్షన్స్ మర్చిపోతాము కాస్త మైండ్ ఫ్రెష్ అయింది ఇక బయట బయట నుంచి రాంగానే కాస్త హోటల్ కి వెళ్ళడమో లేకపోతే అలా తిరగడమో ఏదైనా ప్లేస్ కి వెళ్ళడమో అట్లా అట్లా కొంచెం ఇది అందుకనే అంటాను ఇది చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సామాన్య మానవుడికి ఇది అందుబాటులో ఉన్న చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ పెద్ద ఖర్చు కాదు కాబట్టి కానీ అంతేగాని వీళ్ళ గురించి అంతగానము పడి పడి చచ్చిపోకండి మొన్న పుష్ప 2 లో ఆ సీన్ చూశాను అది ఒక ఆవిడ చనిపోవడము ఎందుకండీ వాళ్ళ గురించి అట్లా పరిగెత్తడము ఆఫ్టర్ ఆల్ మీరు ఒక్కసారి వాళ్ళు మేకప్ లేకుండా నార్మల్ గా చూడండి యు లుక్ బెటర్ దెన్ దెమ్ మీరు ఇంకా స్మార్ట్ గా ఉంటారు ఈ స్మార్ట్నెస్ అనేది దేవుడు ఇచ్చిన వరము వాళ్ళు మేకప్ వేసుకొని వేసుకొచ్చిన వచ్చిన స్మార్ట్నెస్ అది అంతేగాని ఒరిజినల్ గా దే ఆర్ నాట్ సో స్మార్ట్ ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి అందుకని సినిమాల గురించి కాస్త పిచ్చి తగ్గించండి చూడండి ప్రశాంతంగా చూడండి ఎంటర్టైన్మెంట్ గా చూడండి అంతేగాని దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి టైం స్పెండ్ చేస్తూ ఇలా ఫ్యాన్స్ అని అదని ఇదని మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ మీ కరియర్ కావచ్చు మీ ఫ్యామిలీ కావచ్చు ఇంకేదైనా గోల్స్ ఉంటే గోల్స్ కావచ్చు కావచ్చు అవన్నీ మీరు ఇగ్నోర్ చేసి వీళ్ళ వెనకాల మాత్రం పరిగెత్తకండి యు ఆర్ వేస్టింగ్ యువర్ వాల్యూబుల్ టైం మీ అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి పెంచారు ఏదో సాధిస్తారు మంచి పైకి వస్తారు ఇది చేస్తాడు నా కొడుకు అది చేస్తాడు అనేసి చాలా ఆశలు పెట్టుకున్నారు అవన్నీ బూడిదలో పోసేసి వీళ్ళ వెనకాల తిరుగుతారా మీరు నో దిస్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ యు మీరు మీ యొక్క సమయాన్ని విలువైన సమయాన్ని మామూలు సమయం కూడా కాదు ఎందుకంటే మనకి ఉన్న లైఫ్ ఏ చిన్నది దీంట్లో మనము మనకున్న విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు చేయకండి అట్లా చూడండి ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి బయటకు రండి వదిలేయండి అంతేగాని వీళ్ళ కోసం బతకొద్దు ఇంకా కొంతమంది ఛానల్స్ పెట్టుకున్నారు రెండు సినిమా సినిమా వాళ్ళ గురించి ఇక వాళ్ళ గురించి రివ్యూస్ ఇవ్వడం వాళ్ళ గురించి మాట్లాడటం ఏదో ఒకటి చెప్పడమే చెప్పడం ఇదే పని వాళ్ళకి అంటే వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్ మనీ బట్ దే ఆర్ వేస్టింగ్ యువర్ టైం మీ టైం వేస్ట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఏం చూడాలో అది చూడండి అనవసరమైన చూడకండి ఇప్పుడు ఆయన అటు పోయినాడు ఇతన్ని పెళ్లి చేసుకుంది ఈయన వదిలేసిండు ఇవన్నీ మనకి ఎందుకండీ వాళ్ళ పర్సనల్ లైఫ్ అది ఇంకొక ముఖ్య విషయం విషయము వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ చాలా దారుణంగా ఉంటది మాక్సిమం మీరు ఏ హీరో హీరోయిన్ లైఫ్ అయినా ఒకసారి పాస్ట్ చూడండి వాళ్ళు చాలా దారుణంగానే బతుకుతారు చాలా కొద్దిమంది ఈ దారుణమైన బ్రతుకు నుంచి బయటపడి వాళ్ళ జీవితాలలో కొంచెం వెలుగులు నింపుకొని పెళ్లి చేసుకుని ఈ సినిమా ఇండస్ట్రీ కి గుడ్ బాయ్ చెప్పి ప్రశాంతంగా ఒక మనిషిగా జీవించడం మొదలు పెట్టారు వాళ్ళు బానే ఉన్నారు ఇక మిగిలిన మాక్సిమం జనాల లైఫ్ చాలా అతలాకుతలంగా గందరగోళంగా ఉంటది మనమే ప్రశాంతంగా బతుకుతున్నారు వాళ్ళు మనలాగా బయటికి రాలేరు ఒక షాపింగ్ కి వెళ్ళలేరు రోడ్డు మీద నడవలేరు ఏం బతుకులు వాళ్ళవి కష్టపడుతున్నారు పాపం నేను అదే చెప్తున్నాను సింపుల్ దే ఆర్ జస్ట్ ఎంటర్టైనింగ్ అస్ ఎంటర్టైనర్స్ వాళ్ళ మీద జాలి చూపించండి ఎందుకంటే వాళ్ళు అన్ని రంగులు వేసుకొని అంతంత సేపు మేకప్లు వేసుకొని మన కోసము అన్ని షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేసి డాన్స్ చేసి నానా కష్టపడుతున్నారు వాళ్ళ మీద జాలి చూపించండి కానీ వాళ్ళ వెనకాల పడకండి వాళ్ళు పెద్ద హీరోలు హీరోయిన్స్ ఏమీ కాదు నార్మల్ మనుషులు యామ్ ఐ క్లియర్ కొంచెం మైండ్ వాష్ చేసుకోండి మళ్ళా రేపు పొద్దున ఎవరైనా వస్తున్నాడా ఆ హీరో వస్తున్నాడు ఈ హీరో వస్తున్నాడా ఎవరకండి అస్సలు ఊరుకోద్దు అవసరం లేదు నార్మల్ మనుషులే వాళ్ళు కూడా అంతే హోప్ ఇట్ ఇస్ క్లియర్ చాలా బాధ అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా ఇలాంటి సీన్స్ చూస్తే మాత్రం సో ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో నేను చేసింది సో స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ హెల్త్ ఫ్యామిలీ గోల్స్ ఇంకొక మంచి టాపిక్ తో కలుస్తాను టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గుడ్ లక్ 

Sunday, December 22, 2024

****Eating Non Vegetarian FOOD Creates Blocks | Spiritual Parenting by Dr Newton Kondaveeti

 
YouTube link - https://m.youtube.com/watch?v=0OPqUF2v8oU




****ఓంకారం🕉️అద్భుత🌊🎇🔥రహస్యం

 *ఓంకారం🕉️అద్భుత🌊🎇🔥రహస్యం🌈🕉️🛕🔱🇮🇳🙏*
🧘‍♂️🕉️🧘‍♂️🕉️🧘‍♂️🕉️

*ప్రతీ రోజు ఓంకార🕉️ధ్యాన💓సాధన ద్వారా*
*మీ "ఎమోషన్స్" భావోద్వేగాలను బ్యాలాన్స్  చేసుకోగలుగుతారు.*

*🕉️ఇతరుల ప్రవర్తన వల్ల మీరు వెంటనే కోపతాపాలకు లోను అవ్వరు.*

*🕉️ నిద్ర లేచినప్పటి నుండి పడుకునె వరకు అంతే శక్తి🔥 తో అలసిపోకుండా ఉండగలరు.*


*🕉️ మిలో దివ్య శక్తులు ఆక్టివేట్ అవుతాయి.*

*🕉️ఊహా శక్తి పెరుగుతుంది.*

*🕉️సమయస్పూర్తి పెరుగుతుంది.*

*💠 విశ్వం తో త్వరగా కనెక్ట్ అవుతారు.*

*💠🕉️ చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి.*

*💠 మానసిక ప్రశాంతత లభిస్తుంది.*
 
*💠ఓం🕉️ శబ్దం మీ పరస్పర సంబంధాలను మెరుగుపరుస్తుంది..ప్రజలు మీ మీద అసూయ పడడం మానేస్తారు*

*నిరాకార భగవంతుడు🕉️ శివ పరమాత్ముని✴️ ఒక్క శబ్దంలో చెప్పాలంటే అది ఓంకారం🕉️*
*మనం ఓంకారం🕉️ చేస్తే భగవంతుడు శివ పరమాత్మునితో ధృడమైన సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు*

*💠 నిత్యం యవ్వనంగా ఉండగలుగుతారు.*

*💠🕉️మానసిక రుగ్మతలు  తొలగిపోతాయి.*

*💠🕉️ఆర్థిక సమస్యలు  పరిష్కారం అవుతాయి*

*💠🕉️వృద్ధాప్య సమస్యలు తగ్గుతాయి*

*💠🕉️జీవితం అద్భుతంగా మారుతుంది*

 *💠🕉️ఊహించని మార్పులు వస్తాయి*

*💠🕉️ వాక్కు సిద్ది కలుగుతుంది*

*💠🕉️ గౌరవ మర్యాదలు పెరుగుతాయి*

*💠ఓంకారం🕉️ శక్తితోనే✴️⚡ సమస్యలన్నిటికీ పరిష్కారం*

*💠🕉️ వ్యసనాల నుండి విముక్తులు అవుతారు.*

 *💠 ఆసుపత్రులు నయం చేయలేని జబ్బులు ఓంకార🕉️ధ్యానం ద్వారా నయం అవుతాయి*

 *💠ఓంకార🕉️ధ్యానం ద్వారా కుటుంభములొ సంతోషం వృద్ధి కల్గుతుంది.*

*💠ఓంకార🕉️ ధ్యానమ ద్వారా ఆయువు పెరుగుతుంది*

*ఇంకా మరెన్నో లాభాలు ఓంకార🕉️ ధ్యానం💓 వల్ల కలుగుతాయి.*

*కావునా, ఓంకార🕉️ధ్యానం💓 చేయండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి.*

*నీ హృదయం చెప్పేది వినడం మొదలుపెట్టే వరకు నీకు మనశ్శాంతి ఉండదు..*
🧘‍♂️🕉️🧘‍♂️🕉️🧘‍♂️🕉️🧘‍♂️ 

*🕉️ఓంనమః శివాయ🔱🙏..*

🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩
 కేరళలోని త్రిసూర్‌కు చెందిన నస్రియా సుల్తానా అనే మలయాళీ సోషల్ మీడియాలో ప్రసిద్ధిగాంచిన ఐకాన్...... ఆమె ఇటీవల ఒక హిందూ వ్యక్తిని వివాహం చేసుకుంది. నస్రియా సుల్తానా తన వివాహానికి సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ మరియు ట్విట్టర్‌లలో పోస్ట్ చేసినప్పుడు, ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది ముస్లింలు ఆమెను వ్యాఖ్యల విభాగంలో అతి నీచాతి నీచంగా దూషించారు ఆమె మతంలోని అనుయాయులు.  ఏ ఒక్క ముస్లిం కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్పలేదు సరి కదా, చాలా మంది ఆమె నరకానికి వెళుతుందని, నరకంలో అల్లాహ్ ఆమెను కాల్చివేస్తాడని మరియు చాలా మంది ఆమెకు భయంకరమైన బెదిరింపులు కూడా ఇచ్చారు.  కానీ అదే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ కుళ్లిపోయిన కపట ముస్లిం సమాజ అనుయాయులు "ప్రేమకు మతం లేదు" మరియు మానవత్వమే అతిపెద్ద మతం అని గొప్ప-గొప్ప వ్యాఖ్యలు చేస్తారు.  ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడిని అల్లాహ్ జన్నత్ కు తీసుకెళతాడు, (హిందూ) భార్యను మాత్రం నరకానికి పంపిస్తాడు.....విచిత్రమైన విషయం ఏమిటంటే ముస్లిం అమ్మాయి గనక హిందు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అల్లాహ్ ఆ ఇద్దరిని నరకంలోకి (దొజక్) లోకి పంపిస్తాడు.....ఎందుకంటే అల్లాహ్ అపార కరుణ ప్రదాత, దయాశీలుడు ఇంకా సర్వ శక్తిమంతుడు......  అమాయక హిందు సోదరీమణులారా తస్మాత్ జాగ్రత్త ......మీ కొరకు నరకానికి ద్వారాలు తెరిచి ఉంచారు మీ శ్రేయోభిలాషులు , శాంతిని కోరే మీ .........
 *_శారీ డే..సారీ లే..!_*

చీరకట్టులో ఎన్నెన్ని
గమ్మతులున్నవో..
చిగురాకు పెదవుల్లో
ఎన్ని మత్తులున్నవో..

తెల్ల చీర 
కట్టుకున్నదెవరి కోసమో..
మల్లెపూలు 
పెట్టుకున్నదెవరి కోసమో..

తెల్ల చీర..మల్లె పూలు
పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ..
ఏదో కబురు పట్టుకొచ్చింది
కృష్ణమ్మ..
ఆ కబురేమిటమ్మ..
ఈ ఉరుకెందుకమ్మా..

చెంగావి రంగు చీర 
కట్టుకున్న చిన్నది..
దాని దిమ్మదియ్య
అందమంతా 
చీరలోనే ఉన్నది..!

ఇప్పుడెక్కడికి పోయింది
ఆ అందం..
చీరే అరుదైపోయిన సంస్కృతి..
ఆధునిక కాలం..
ఫేషన్ జాలం..
చీర..మూర..
అలవిమీర..
కోకలిప్పుడు 
కర్టెన్ల పాలు..!

పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా 
నీ పైట కొంగు జారిందే 
గడుసుపిల్లా..
కొంగు జారితేముంది 
కొంటె పిల్లోడా..
నీ గుండె చిక్కుకుందేమో 
చూడు బుల్లోడా..
నిజంగా వాణిశ్రీ చీర కడితే
అపూర్వమే..
ఇప్పుడు చీరకట్టుడు
అయింది పూర్వమే..

లంగా ఓణీ నేటితో 
రద్దైపోనీ..
ఓణీ పోయి చున్నీ వచ్చె..
ఆ చున్నీ కూడా 
రద్దైపోయిన 
కలికాలం..
అసలే చలికాలం..!

సరే..ఎవరి 
అభిరుచి వారిది..
ఒక్కో వస్త్రధారణలో 
ఒక్కో సొగసు..
కాని చీరకట్టునే 
చూడాలంటుంది మనసు..!

చుట్టూ చెంగావి చీర
కట్టావే చిలకమ్మా..
బొట్టూ కాటుక పెట్టి
నే కట్టే పాటను చుట్టి..

ఎన్ని పాటలు రాసారు 
సినీ కవులు..
ఎన్నెన్ని కవితలు అల్లారు
భావకవులు..
చీరకట్టు..
దాని కనికట్టుపై..!

ఒక్కో ప్రాంతంలో
ఒక్కో కట్టు..
దానికి ఒక్కో పేరు..
చీర..కోక..
గుండారు..కచ్చ..
కుడి పైట..ఎడం పైట..
అంతా అచ్చమైన 
అందానికి బాట..!

అమ్మాయిలూ..అక్కలూ..
చెల్లెళ్ళూ..ఆంటీలు..
ఇప్పటి లెక్క ప్రకారం
బామ్మలూ..నైటీ బ్యూటీలూ..
ఎవరి అందం వారిది..
ఎవరి సౌకర్యం వారిది..
మారే ఫేషన్ ..
దాన్ని అనుసరించి 
మీ పేషన్..
మీ ఇష్టం..
అయితే అప్పుడప్పుడు
కట్టండి చీర..
మన సంప్రదాయానికి
వెయ్యొద్దు తెర..

చీరలోని గొప్పదనం తెలుసుకో..
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో..
సింగరమనే దారంతో 
చేసింది చీర..
ఆనందమనే రంగులనే
అద్దింది చీర..
మమకారమనే మగ్గంపై
నేసింది చీర..
చీరలోని గొప్పదనం తెలుసుకో..
ఆ చీర కొని
ఇంట్లో బీరువాలో దాచకు..!

నీ చీర..
చూపు ఓర..
అందాల ధార..
కోపం చురచుర..

అమ్మ చీర..
కన్నీరు తుడిచే
కరుణా ధార...
ఆలి కొంగు
మగాడు పట్టుకు తిరిగే 
బంగారం..
చీరే ఆడదానికి 
అసలైన సింగారం..!

              *_సురేష్.._*

****ధ్యానం - నీ లోనికి నీ పయనం

 ధ్యానం - నీ లోనికి నీ పయనం


ధ్యానం - 
నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించివున్న పరమాత్మను దర్శించటానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మదర్శనం పొందడం. 
ధ్యానం -
మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మనలోనికి మనం చేసే ప్రయాణం.
ధ్యానం -
ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నంలో ఓ మార్గం.
ధ్యానం -
వంచించే ఇంద్రియాలు ద్వారా పరమాత్మను గ్రహించగలమన్న అజ్ఞానమును వీడి, బాహ్యవిషయములనెరిగే మనస్సుని, ఎగిసిపడే అహంకారాన్ని అంతమొందించి హృదయంలోని అవ్యక్తమైన కాంతినీ, స్వస్వరూపస్థితిని ఎరుక లోనికి తెచ్చే ప్రక్రియ.
ధ్యానం -
మనస్సు యొక్క నిశ్చలత్వం.
ధ్యానం -
మనల్ని పరమసత్యానికి దగ్గరగా తీసుకెళ్ళే మార్గం.
ధ్యానం -
ఇతరభావాలను విడిచి ఒకే ఒక భావంపై ఏకాగ్రతను కల్గించడం.
ధ్యానం -
అంతరంగ చైతన్యముకు చేరువకావడం.
ధ్యానం -
హృదయాంతర్గత ఆత్మచైతన్యంలో జీవించడం.

ఎందఱో ధ్యానసిద్ధిని పొందినవారు ధ్యానత్వంలో ఉన్న మహిమత్వాన్ని ఇలా ఎన్నోరాకాలుగా నిర్వచించినను ఇది ఎవరికి వారే తెలుసుకోవాల్సిన సత్యం. ఎవరికి వారే తప్పనిసరిగా చేయాల్సిన అంతర్ముఖప్రయాణం. ఎవరికివారే పొందాల్సిన స్థితి. ఎవరికి వారే పొందాల్సిన అనిర్వచనీయమైన చైతన్యానుభూతి.
                                       
ప్రాపంచిక జీవనం, పారమార్ధిక జీవనం సమతుల్యముగా ఉన్నప్పుడే మానవుడిది పరిపూర్ణజీవితమౌతుంది. ప్రాపంచిక, పారమార్ధిక జీవనగమనములో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత తప్పనిసరి. ఈ రెండూ ధ్యానం వలనే సాధ్యం.
పరిపూర్ణజీవనానికి ధ్యానమే మార్గమని శ్రీకృష్ణ పరమాత్మ, పతంజలి, బుద్ధుడు, గురునానక్, మహావీరుడు మొదలు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, నేటి సద్గురువులు వరకు; అలానే ఎందఱో ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ధ్యానం మైండ్ ని శుద్ధిచేసే ఓ ప్రక్రియ. ఎన్నెన్నో సంఘటనలతో, ఒడిదుడుకులతో, మార్పులూచేర్పులతో, సుఖదుఃఖాలతో కూడుకున్నదే జీవితం. వీటన్నిటినీ యధాతధంగా స్వీకరించేశక్తి  ధ్యానంవలన అలవడుతుంది. ధ్యానంవలన సాక్షిభావం, తద్వారా భావసమతుల్యత అలవడుతుంది. గతాన్ని నెమరువేసుకోకుండా, భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయకుండా, దేన్నీ ఆశించకుండా ఏ క్షణంకా క్షణం  జాగురుకతతో, ఎరుకతో సంపూర్ణముగా జీవించడం ఎలాగో ధ్యానం ద్వారానే అలవడుతుంది. అంతే కాదు, సంస్కారశుద్ధి, విషయవాసనలనుండి విముక్తి ధ్యానసాధన ద్వారానే సాధ్యమౌతుంది. పరమాత్మ ఎరుకలోనికి రావాలంటే హృదయం నిర్మలం కావాలి. హృదయం నిర్మలం కావాలంటే మానసిక అలజడులు, ఆలోచనలు, విషయవాసనలుండకూడదు. ఇవేవీ ఉండకూడదంటే ధ్యానం ఒక్కటే ఉపాధి.
ధ్యానం చేస్తున్నప్పుడు  ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని అదిలించి నెట్టివేయలేము. అవి మరల మరల వస్తూనే వుంటాయి. అందుకే పుట్టుకొస్తున్న ప్రతీ ఒక్క ఆలోచనను సాక్షిభావంతో చూడడం, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టకుండా, కొనసాగించకుండా అలా గమనిస్తూ వుంటే కొంతకాలంకు ఆ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఇదేరీతిలో ధ్యానం చేస్తున్నప్పుడు కొందరు - కృష్ణుడు, బుద్ధుడు, సూర్యుడు, దేవతలు, ప్రకృతి దృశ్యాలు దర్శిస్తూ తాము ధ్యానస్థితిలో ముందుకు పోతున్నామని, మంచి మంచి అనుభవాలు కల్గుతున్నాయని, ఉన్నతమైన ధ్యానస్థితిలో ఉన్నామని అనుకుంటారు. కానీ అది సరికాదు. నిజమైన ధ్యానంలో మనస్సు మహానిశ్చలంగా ఉండిపోతుంది. అలా నిశ్చలమైన మనస్సులో ఎటువంటి చిత్రణలు ఉండవు. ఇవన్నీ ఒకవిధంగా స్వాప్నిక దృశ్యాలే అని గ్రహించాలి. ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి. ఇది పరిపూర్ణ ధ్యానం కాదని గ్రహించాలి.  ధ్యానమంటే కొన్నిమాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయంలో కళ్ళుమూసుకొని కూర్చొని చేసే ప్రక్రియ కాదు. ఏ పని చేస్తున్నను ధ్యానం జరుగుతూ ఉండాలి. అంటే చేస్తున్న ప్రతీపనియందు సాక్షిభావంతో ఉండి పనిచేయగలిగినప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, ధ్యానయుక్తమైన పరిపూర్ణజీవితం అవుతుంది.
ధ్యాన సాధన చేస్తున్నమొదట్లో ధ్యానస్థితిలో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబనగా తీసుకున్న ధ్యానవస్తువు (నామం, రూపం, దీపం, శ్వాస మొదలగునవి) ఉంటాయి. ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ధ్యానవస్తువు ఉండదు. ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యేసరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని కూడా ఉండడు. సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి. ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో అంటే పరమచైతన్యంలో ధ్యాని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస....అన్నీ అన్నీ సమీకృతమై వీలీనమైపోతాయి. ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి. ఇదే సంపూర్ణ ఆత్మధ్యానం. ఇదే ఆత్మనిష్ట.

ఆత్మనిష్ట కలుగుటకు ధ్యానమే సాధనమని, ఆ సాధన ఎలా చేయాలో కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయము నందు తెలియజేసెను. 

మహర్షులనుండి ఇంద్రాది దేవతలవరకు; మహాయోగులనుండి ముముక్షువులవరకు; సద్గురువులనుండి సత్ సాధకులవరకు.........
ప్రతివొక్కరూ ధ్యానం చేసి జ్ఞానం పొంది తరించినవారే.