☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
70. యాదృగేవ దదృశే తాదృగుచ్యతే
ఎలా కనబడుతుందో అలా చెప్పబడుతుంది (ఋగ్వేదం)
ఈ మాట సూర్యుని ఉద్దేశిస్తూ వేదం చెప్పిన మాట. సూర్యుని అధ్యయనం
చేస్తూనే అనేక విశ్వరహస్యాలను, చివరకు బ్రహ్మవిద్యను కూడా ఆవిష్కరించింది వేద సంస్కృతి.
సూర్యుడు ఉదయించాడని, అస్తమించాడని, గమనం సాగిస్తున్నాడని మనం పురాణాల్లో చెప్పేది పై వాక్య ఆధారంగానే. ఎలాంటి వారి గురించైనా మన అనుభవం బట్టి మాట్లాడుతాం. సూర్యునికి "స్థాణుః", "స్థిరః" అని పేర్లను వేదమే పేర్కొంది.
'కదలనివాడు' అని ఈ పదాలకు అర్థం. అయితే ఆయన కదలకున్నా మనకు కదిలినట్లే కనిపిస్తాడు. కదులుతున్న భూమి కదలనట్లు కనిపిస్తోంది. ఇందులో ఏది
నిజం? రెండూ నిజమే. ఏ స్థితిలో ఉన్న వారికి ఆ స్థితే నిజం. జడమైన దేహం చైతన్యవంతం అనిపించడానికి ఏ చైతన్యం మూలమో - ఆ చైతన్యం దేహమంతా ప్రసరిస్తోంది. ఇంత కదులుతూ, కదిలిస్తున్నా చైతన్యానికి మూలమైన ఆత్మ హృత్కుహరం(హృదయపు లోతు)లో స్థిరంగా ఉంది. ఇప్పుడు ఏది కదులుతున్నట్లు? ఏది కదలనట్లు? ఏదీ తేల్చలేం.
( ఆత్మతత్త్వాన్ని ఆవిష్కరించడానికి సూర్యోపాసన అనేక విధాల
సహకరిస్తుంది.సూర్యోదయాస్తమయాల ననుసరించి జగత్తులో ప్రతి జీవి
స్పందిస్తుంది. మెలకువ, నిదుర వంటి వ్యవహారాలను ఏర్పరచుకుంటుంది. అలాగని సూర్యుడు ఆ క్రియలను చేయమని ప్రేరేపిస్తున్నాడా? లేదు. కానీ ఆయన లేకుంటే ఇవేవీ జరగవు. అయితే ఆయన వీటికి బాధ్యుడు కాడు. సాక్షీరూపుడు.అలాగే ఈశ్వరుడు,పరమాత్మ, ఆత్మ - అని వ్యవహరింపబడే పరమ చైతన్యం కూడా సర్వకర్త ఆయిన సాక్షి. అన్నీ తానే, ఏదీ తాను కాడు.)
అందుకే 'తదై జతి తన్నై జతి' - అది కదులుతోంది, కదలడం లేదు. అది దగ్గర ఉంది - దూరం ఉంది(తద్దూరే తద్వంతికే). అన్నిటికీ లోపల ఉన్నద, అన్నిటా బాహ్యాన ఉన్నదదే(తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః).
-
ఈ మాట మన వేదవచనం (ఈశావాస్యోపనిషత్తు) అని చెబితే 'ఏదో అయోమయం'అని ముఖం చిట్లిస్తాంగానీ - ఇదే మాటను ఒక అణుశాస్త్రవేత్త ఎలా చెప్పాడో
చూడండి'.
If we ask, for instance, the position of the electron remains the same, we must say 'no'. if we ask whether the electrons positions changes with time, we must say 'no', if we ask whether the electron is at rest, we say 'no', if we ask whether the electron is in motion, we may say no"
- డా॥ రాబర్ట్ ఓపెన్ హీమర్.
వేదాంతజ్ఞానాన్ని ఆవిష్కరించడానికి సూర్యునే గ్రహించి ఎన్నో ఉపమానాలు చెప్పారు. సూర్యుడే లేకుంటే (ఆయన ఆకర్షణశక్తి లేకుంటే భూమికి కదలికే లేదు.కానీ ఆ సూర్యుడు కదలడం లేదు. చైతన్యం సూర్యునిదా? భూమిదా? అని ప్రశ్నిస్తే,
భూమిలో కనిపించే చైతన్యమంతా సూర్యుని నుండి గ్రహించినదే అని విజ్ఞాన అవగాహనతో సమాధానం చెప్పవచ్చు.
అలాగే పార్థివదేహానికి చైతన్యాన్నిచ్చే నిజమైన చైతన్యం ఆత్మ. అందుకే 'చైతన్యమాత్మా' అని భారతీయ దర్శనాలు చెబుతున్నాయి. మనం చూస్తూ ఉన్న జగతికి ఆత్మ
సూర్యుడేనని వేదం స్పష్టం చేసింది 'సూర్య ఆత్మా జగతః'.
|
"ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక..." అంటూ సర్వవ్యాపకుడైన ఆత్మ ఎవరికి వారికే అన్నట్లుగా గోచరిస్తుందని పోతనగారు
బోధించారు.
ఆత్మతత్త్వాన్ని ఆవిష్కరించడానికి సూర్యోపాసన అనేక విధాల సహకరిస్తుంది.సూర్యోదయాస్తమయాల ననుసరించి జగత్తులో ప్రతి జీవి స్పందిస్తుంది. మెలకువ,
నిదుర వంటి వ్యవహారాలను ఏర్పరచుకుంటుంది. అలాగని సూర్యుడు ఆ క్రియలను
చేయమని ప్రేరేపిస్తున్నాడా? లేదు. కానీ ఆయన లేకుంటే ఇవేవీ జరగవు. అయితే ఆయన వీటికి బాధ్యుడు కాడు. సాక్షీరూపుడు. ఆలాగే ఈశ్వరుడు, పరమాత్మ, ఆత్మ
- అని వ్యవహరింపబడే పరమ చైతన్యం కూడా సర్వకర్త ఆయిన సాక్షి. అన్నీ తానే,ఏదీ తాను కాడు.
సూర్యుని కిరణాల వల్ల నీరూ ప్రకాశిస్తుంది. రాయీ గోచరిస్తుంది. చెట్లూ కనిపిస్తాయి. పువ్వులూ వికసిస్తాయి. కానీ నీటి లక్షణంగానీ, రాయి స్వభావంగానీ,చెట్ల రంగులుగానీ, పూల వర్ణవాసనలు గానీ ఆ కిరణాలకు, సూర్యునకు అంటవు.అలాగే పరమాత్మ మనలో ఉంటూనే వేటికీ అంటడు. ఇలా రకరకాలుగా సూర్యుని పోలికలో ఆత్మతత్త్వాన్ని వివరించారు.
‘యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః' - ఒకే సూర్యుడు సమస్త విశ్వాన్నీ ప్రకాశింపజేస్తున్నట్లు, క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్ని చైతన్యవంతం చేస్తున్నాడని గీతావాక్యం.
ఈశ్వరతత్త్వ జ్ఞానానికి ప్రకృతి అధ్యయనం, పరిశీలన ఎంత సహకరిస్తాయో మన
శాస్త్రాల ఆధారంగా గ్రహించవచ్చు.
ఈ విధంగా సూర్యశక్తి పరిశీలనతో మనం అనుభవిస్తున్నవిశ్వరహస్యాలు
తెలుస్తాయి. మన సాధనలన్నీ కాలపరిణామాల ననుసరించి ఏర్పాటు చేసుకున్నాం.
ఈ పరిణామాలన్నీ సూర్యుని అనుసరించినవే. మన పెద్దవారు ప్రాతఃకాలం నుండి సాయంసంధ్య వరకు వివిధ కాలలలో వివిధోపాసనలను సూర్యునిలోని వివిధ దైవీశక్తులను దర్శించి ఏర్పరచిన సత్సంప్రదాయాలే.
ఒకే సత్యాన్ని విశేష ప్రజ్ఞ గలవారు అనేక విధాల చెప్పారని - ఏకం సత్ విప్రా బహుధా వదన్తి - ప్రసిద్ధి చెందిన వేదవాక్యం కూడా సూర్యమంత్రాల సందర్భంలోనిదే.
No comments:
Post a Comment