శ్రీ మూక పంచశతి:
శ్రీ మూకశంకర విరచిత
మూక పంచశతి
శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన
స్తుతి శతకం
🙏🌸🙏🙏🙏🌸🙏
శ్లోకము:-
*ఘనస్తనతట స్ఫుటస్ఫురిత కంచులీ చంచలీ*
*కృత త్రిపురశాసనా సుజనశీలితోపాసనా|*
*దృశోః సరణిమశ్నుతే మమ కదా ను కాంచీపురే*
*పరా పరమయోగినాం మనసి చిత్కలా పుష్కలా||83||*
భావము:
నిబిడమైన స్తనతటముచే స్పష్టముగా స్ఫురితమైన కంచుకముచే ( రవికతో) చంచలము చేయబడిన త్రిపురారి అగు శంకరుడు కల్గినట్టియు సత్పురుషులచే పరిశీలింపబడిన ఉపాసన కలిగినట్టియు మహాయోగులయొక్క మనస్సునందు పుష్కలమైన చిత్కళయగు పరదేవత కాంచీపట్టణమందు నాయొక్క చూపుల మార్గమును ఎన్నడు పొందునో!
శ్లోకము:-
*కవీంద్రహృదయేచరీ పరిగృహీత కాంచీపురీ*
*నిరూఢకరుణాఝరీ నిఖిలలోకరక్షాకరీ|*
*మనఃపథదవీయసీ మదనశాసనప్రేయసీ*
*మహాగుణగరీయసీ మమ దృశోస్తు నేదీయసీ||84||*
భావము:
కవిశ్రేష్ఠులయొక్క హేదయములందు సంచరిచునదియు స్వీకరించబడిన కాంచీపురముగలట్టియు ధృడమైన దయాప్రవాహము గలిగినట్టియు సమస్తలోకములకు రక్షణ చేయునట్టియు మనోమార్గమునకు దూరమైనట్టియు గొప్ప గుణములతో గరిష్టురాలై మన్మధుని శిక్షించిన శివునకు ప్రియురాలైన కామాక్షి నాయొక్క చూపుకు మాత్రము దరిదాపు అగుగాక!
🔱 ఆ తల్లి
పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱
🙏🌸🌸🌸🌸🌸🙏.
No comments:
Post a Comment