Saturday, January 25, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


85. సుసందృశం త్వా వయం మఘవన్ వన్దషీమహి

యజ్ఞస్వరూపా! చక్కగా దర్శిస్తున్న నీకు మేము వందనము చేస్తున్నాము
(యజుర్వేదం)

జగత్కారణుడైన భగవానుని స్తుతిస్తూ వేదం సుసందృశం త్వావయం మఘవన్ వన్దిషీమహి అని పలికింది. భగవానుడు సర్వసమగ్ర దృష్టి కలవాడు. ఆయన చూపు
శక్తిమంతమైనది.
'అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః' అని శ్రుతిచెప్పినట్లుగా సృష్టిలో ప్రత్యణువున బహిరంతరాలలో వ్యాపించిన పరమేశ్వరుడు
అన్నిటినీ సమగ్రంగా దర్శిస్తున్నారు.

( భగవానుడు చూస్తున్నాడనే స్పృహ ఉన్నవాడు పాపం చేయడు. ఆయనకు ప్రీతికరమైన సత్కర్మనే ఆచరిస్తాడు. ఇలా ధార్మికంగా అతడు
| జాగ్రత్తపడతాడు. అంతేకాదు-ఆయన గమనించుకుంటున్నాడు కనుక, దేనికీ
వెరవకుండా ధైర్యంగా, అభయస్థితిలో ఉంటాడు. ఇలా ధర్మనిష్ఠనీ,
అభయాన్నీ ఇవ్వగలిగే సత్యస్ఫురణ ఈ వేదవాక్యంలో విశదమవుతోంది.)

'సుసందృశం' అనే మాట చాలా చక్కనిది. సమ్యగ్ దృష్టి-సదృశం. సర్వకాల జ్ఞానము, సర్వభూత జ్ఞానము కలవాడు భగవానుడు. జీవులది పరిచ్ఛిన్న దృష్టి.
పరిమితంగానే చూడగలడు, పరిమితంగానే భావించగలడు. కానీ భగవానునిది అపరిచ్ఛిన్న దృష్టి. అనంత దర్శనశక్తి సంపన్నుడు. కాలపరంగా, దేశపరంగా
అనంతత్వమది. అపరిమితమై, సర్వవ్యాపకమైన దృష్టిలో జీవుల కర్మలను గమనిస్తూ,తదనుగుణ ఫలాలను అందిస్తూ విశ్వాన్ని నిర్వహిస్తున్న విశ్వేశ్వరుడతడు. అది
సమగ్రమైన దృష్టి. ఎవరికి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో తెలిసిన స్వామి సర్వకాలాలలోను సర్వజీవులనుగమనించుకుంటున్నాడు. అందుకే "సహస్రాక్షః,
సుదర్శనః, సులోచనః, సాక్షీ సర్వదర్శీ" అనే నామాలతో నారాయణుని స్తుతించారు.

భగవానుడు సర్వమును తెలిసినవాడనే భావం ఈ వాక్యంలో స్పష్టమౌతోంది.సూర్యుడు, చంద్రుడు, పగలు, రాత్రి (కాలము), అంతఃప్రజ్ఞ, నక్షత్రాలు... ఇవన్నీ పరమేశ్వరుని దర్శన శక్తులు. ఇవన్నీ కూడా ప్రతి జీవుని కర్మలను గమనించే సాక్షి
స్వరూపాలు.

ఇవన్నీ భగవానుని నేత్రాల వంటివి. వీటి కన్ను ఎవరూ కప్పలేరు. భగవానుని చూపు మనపై ఎల్లప్పుడూ ఉన్నదనే జ్ఞానం ఈ వాక్యంలో ద్యోతకమౌతోంది. ఈ
వాక్యాన్ని స్పృహలో ఉంచుకుంటే చాలు మనకు జాగ్రత్త, ధైర్యం కలుగుతాయి.భగవానుడు చూస్తున్నాడనే స్పృహ ఉన్నవాడు పాపం చేయడు. ఆయనకు ప్రీతికరమైన సత్కర్మలనే ఆచరిస్తాడు. ఇలా ధార్మికంగా అతడు జాగ్రత్తపడతాడు. అంతేకాదు-ఆయన
గమనించుకుంటున్నాడు కనుక, దేనికీ వెరవకుండా ధైర్యంగా, అభయస్థితిలో ఉంటాడు.

ఇలా ధర్మనిష్ఠనీ, అభయాన్నీ ఇవ్వగలిగే సత్యస్ఫురణ ఈ వేదవాక్యంలో విశదమవుతోంది.

'సందృశం' అనే మాటకు ముందు 'సు' అనే శబ్దం కూడా ఉంది. ఈ 'సు'
శబ్దానికి శుభం, క్షేమం, మంచి, చక్కని... అని అర్థాలున్నాయి. స్వామి చూపులు శుభమైనవి, క్షేమమైనవి, ప్రసన్నమైనవి,సౌందర్యవంతమైనవి.... అని అర్థాలు గ్రహించవచ్చు. స్వామి దర్శనశక్తి జగతికి క్షేమాన్నీ, మంగళాన్నీ కలిగిస్తోంది.

ఈ భావాన్ని మరింతగా బలపరుస్తూ 'మఘవన్' అనే మాట ఉన్నది. పూజ్యుడు,యజ్ఞస్వరూపుడు అనే అర్థాలను ఈ మాటకు చెప్పుకోవచ్చు.

లోకహితానికై భగవానుడు చేసే విశ్వనిర్వహణయే యజ్ఞం. అదే ఆయన స్వరూపం.

హితాన్ని కలిగించే శోభనమైన సమగ్ర దృష్టి కలిగిన అనంత శక్తిసంపన్నుడు
ఈశ్వరుడు.

అటువంటి పరమేశ్వరుని సభక్తికంగా నమస్కరించి, ఆయన కృపకు పాత్రులమవడమే మన విధి.          

No comments:

Post a Comment