*🙏సంక్రాతి కనుమ రోజుల్లో రథం ముగ్గు వెయ్యడానికి కారణం ఏంటి..!!*
🌿సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గులతో ఇల్లు కళకళలాడిపోతూ ఉంటాయి. పురాతన కాలంలో గీతల ముగ్గులు ఎక్కువగా వేసేవారు. కానీ మారుతూ ఉన్న కాలం ని బట్టి అందమైన కొత్త కొత్త రకాల డిజైన్స్ వచ్చాయి.
🌸పాతకాలంలో ఎక్కువ చుక్కల ముగ్గులను వేసేవారు. మెలికల ముగ్గులు, ఇప్పుడు మాత్రం చుక్కల ముగ్గులే కరువైపోయాయి. అన్ని కొత్త కొత్త డిజైన్స్. అందమైన బొమ్మలతో డిజైన్స్ ముగ్గులను ఎక్కువగా వేస్తున్నారు.
🌹సంక్రాంతి కనుమ రోజున రథం ముగ్గును ఇలా మాత్రమే తిప్పి వేస్తారు కారణం తెలుసా🌹
🌿కనుమ రోజు రథం ముగ్గును ఎటు తిప్పి వేయాలి కనుమ రోజు ముగ్గులకి రథం ముగ్గుకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. ఈ రథం ముగ్గును కనుమ రోజున ఎటు తిప్పి వేయాలి అనే సందేహం కొంతమందికి వస్తుంది.
🌸కనుమ రోజున రథం ముగ్గును, ఇంటి ముంగట వాకిట్లో బయటికి తిప్పి వేయాలి. దీనికి అర్థం, కనుమ రోజున కీడు రథం నుంచి బయటికి వెళ్లిపోతుంది. అని పూర్వికుల నుంచి ఇప్పటివరకు ప్రజల యొక్క విశ్వాసం.
🌿 అంటే శివుడు కనుమ రోజు రధము ఎక్కి మన ఇంటి వాకిట్లో నుంచి వెళుతూ ఉంటాడు. అని పురాణ గాథలు చెబుతున్నాయి.
🌹సంక్రాంతి పండుగ నాడు
రథం ముగ్గును ఇలా వేయాలి.. 🌹
🌸సంక్రాంతి పండుగ రోజున రథం ముగ్గు నువ్వు ఇంటిలోకి ఆహ్వానిస్తున్నట్లుగా వేయాలి. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో పూజలు చేసుకుంటాము. ఇప్పుడు శివుడు మన ఇంట్లోకి రథంపై వస్తాడని పూర్వికులు పురాణాలలో తెలుపబడింది.
🌹కనుమ రోజున రథం ముగ్గు ఎలా వేయాలి... 🌹
🌿కనుమ రోజున రథం ముగ్గును, బయటకు పంపుతున్నట్లుగా వేయాలి. ఎందుకంటే శివుడు, రథంపై వచ్చి తిరిగి కనుమ రోజున బయటికి వెళ్తాడు. ఈ సమయంలో మనకి కీడు అనేది వస్తుంది అని పురాణాలు తెలిపారు. కీడు పోవాలి అంటే రథం ముగ్గును బయటికి వేయాల్సి ఉంటుంది.
🌸ఇలా వెనక వేయకపోతే మనకి ఇంట్లో కీడు అనేది ఉంటుంది అని అప్పటి ప్రజలు నమ్మేవారు. ఆ నమ్మకం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తెలిసినవారు ఇలా వేస్తారు.
🌿 తెలవని వారు కనుమ రోజు రథం ముగ్గు నువ్వు బయటికి పంపినట్లు మాత్రమే వేస్తూ ఉంటారు.
🌸కానీ నిజానికి సంక్రాంతి రోజున రథం ముగ్గును లోపలికి ఆహ్వానిస్తున్నట్లు వేయాలి, కనుమ రోజున రధం ముగ్గును బయటికి పంపుతున్నట్లు వేస్తూ ఉండాలి.
🌿రథం ముగ్గు లోపటికి వేయటం వల్ల మన ఇంట్లోకి సిరిసంపదలు సుఖసంతోషాలు భోగభాగ్యాలు వస్తాయి. ఈ రథం పై సూర్యభగవానుడు వస్తాడు. దీంతో మనకు మంచి ఆరోగ్యం కూడా వస్తుంది.
🌸అలాగె రథం ముగ్గుని బయటికి పంపినట్లు వేయాలి. ఇలా చేస్తే మనకు అన్నీ శుభాలే జరుగుతాయి. రథం ముగ్గుని విధంగా వేసుకోవాలి కనుమ రోజున.. స్వస్తి...🌞🙏
No comments:
Post a Comment