Thursday, January 30, 2025

 *దైవ ఆరాధన... మహర్షలు.....*

భగవత్ జ్ఞానం గల మహానుభావుల ఉపదేశాన్ని వింటేచాలు తరిస్తాం. భగవంతుని దివ్య నామాల్ని అనుగ్రహించని సూతులవారిని ఋషులంతా ప్రార్థించారు. భగవంతుణ్ణి కాక పోయినా, భగవత్ భక్తి కలిగి ఉన్న మహానుభావులని ఆశ్రయించినా చాలు. భగవంతుణ్ణి తెలుసుకోగలిగితే మంచిదే, కానీ అది కష్టమైనది. తెలియనప్పుడు భగవంతుణ్ణి ఎల్లప్పుడు అనుభవించే యోగ్యత కలవారిని ఆశ్రయిస్తే అది ఎంత గొప్ప లాభమో కదా.. ఆ యోగ్యత నీకు ఉంది అని నిన్ను ఆశ్రయించాం అని ఋషులు అన్నారు.

" యత్పాద సంశ్రయా సూత మునయః ప్రశమానయాః 
సద్యః పునంతీ ఉపస్పృష్టాః స్వర్ధున్యాపోను సేవయాః "

"యత్పాద సంశ్రయా మునయః" భగవంతుణ్ణే సతతం మననం చేస్తుండే జ్ఞానులు, మహానుభావులు ఉంటారే, వారిలో మరో యోగ్యత ఉంటుంది.

"ప్రశమానయాః", కొన్ని గుణాలను సాధించాలని కోరుకుంటారు. శమము, దమము, భాహ్య ఇంద్రియ నిగ్రహం, అంతర్ ఇంద్రియ నిగ్రహం లాంటివి సాధించి ఉంటారు. వారి ఇంద్రియాలనే కాదు ఇతరుల ఇంద్రియాలనీ ఆదేశించగల శక్తి గల వారు. వారు అనుగ్రహించారంటే చాలు.

భగవంతుని అనుగ్రహం చేత సర్వేంద్రియ నిగ్రహం చేత భగవంతుని నామాన్నే మననం చేసే "సూత" నీలాంటి మహానుభావులుంటారే..

"సద్యః పునంతీ ఉపస్పృష్టాః" అలాంటి వారి పాదాల్ని ఒక్క సారి తాకామా, వారి అనుగ్రహం పొందితే అది ఎంతో శ్రేయోదాయకం.

"స్వర్ధున్యాపోనుసేవయాః", స్వర్ధుని అంటే గంగానది, ఆపస్ అంటే జలం, గంగానది పవిత్రమైనది. ఎవడెవడు గంగానదిలో స్నాన మాడితే పాపాలని, లోపాలని తొలగించి పవిత్రతను అందిస్తుంది. మన లోపాలు తొలగాలి అంటే మరి ఏంచేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ నీటిని స్పృషించాలి. స్పృషిస్తే మన లోపాలని తొలగించడం, ఇది గంగానది యోగ్యత.  మరి భగవత్ జ్ఞానం గల మహానుభావుల యోగ్యత ఎలా ఉంటుంది.. అంటే వారిని స్పృషించటం కాదు, వారిని గురించి వింటే చాలు, వారి ఉపదేశాన్ని వింటే చాలు తరిస్తాం.

"ద్రష్టవ్యః సర్వదేహిభిః", వాళ్ళు మనల్ని చూస్తే చాలు గొప్ప యోగ్యతని కలిగిస్తారు. భాగుపడాలని కోరిక ఉంటే అట్లాంటి వారిని సేవించాలి. వారి ఉపదేశం వినాలి. వారి దివ్య అనుభవ పరీవాహంగా వెలుబడుతుండే భగవన్నామ శ్రవణం చేయాలి...

No comments:

Post a Comment