Friday, January 31, 2025

 *ధ్యాన 😌 మార్గ*
కన్యాకుబ్జపురమునందు అజామిళుడనే బ్రాహ్మణ బాలుడు గురుకుల వాసం చేస్తూ చతుర్వేదాలు భక్తిశ్రద్ధలతో నేర్చుకుంటూ గురువులకు సేవ చేసుకుంటూ కాలం గడుపుతుందేవాడు. అజామిళునకు యౌవనదశ వచ్చింది. బలం, కామ వికారం వంటివి ఉత్పన్నమయ్యాయి. ఒకనాడు అజామిళుడు దర్భలు, సమిధలు, పువ్వులు, పండ్లుతేవడం కోసం సమీపంలో ఉండే వనానికి వెళ్లాడు. యజ్ఞసంభారాలన్నింటినీ సమీకరించుకొని ఒక పువ్వుల పొద వద్దకు వెళ్ళి పువ్వులు కోస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పూపొదలలో ఒక పురుషుడు, యౌవనంలో ఉన్న ఒక స్తీ మోహావేశంతో లోకాన్నే మర్చిపోయిఉండటం చూశాడు. అలా చూచిన అజామిళుని మనసు చలించింది! ఇంకేముంది! విద్య, జ్ఞానం, మానం, మర్యాద, పాపభీతి వీటన్నింటిని విడిచిపెట్టి మదవతియైన ఆ స్త్రీ సాంగత్యంలో చిక్కువడిపోయాడు.

తన బ్రాహ్మణత్వాన్ని విడిచి పెట్టి వర్ణ సాంకర్యంలో స్వర్గసుఖాలను అనుభవించడానికి సిద్ధపడి ఆమెతోనే జీవితం అంటూ పతితుడైపోయాడు. అలా ఆమెతో కలిసి సంసారం సాగిస్తూ పదిమంది కొడుకుల్ని కూడా కన్నాడు. సంసారయాత్ర కోసం అనేక రకాల నీచమైన కార్యాలు చేసి చెప్పరానంత పాపాన్ని మూటగట్టుకున్నాడు. కొంతకాలానికి ముసలితనం వచ్చింద కాని సంసార విషయవాంఛలు మాత్రం వీడలేక తన కొడుకుల్లో చిన్నవాడైన నారాయణుడిపై అజామిళునికి ప్రేమ ఎక్కువ. ఆ కొడుకు ప్రేమలో పడి మొత్తం లోకాన్నే మర్చిపోయేవాడు. తన వృద్ధాప్య ఆఖరిక్షణాల్లో అజామిళునకు మృత్యుఘడియలు సమీపించాయి. అతని మనోనేత్రానికి యమదూతలు కనిపించారు. క్రూరమైన రూపాలతో ఉన్నవారిని చూశాక తనకు చనిపోయే సమయం ఆసన్నమైందని తెలుసుకొని అజామిళుడు పుత్రున్ని విడిచి వెళ్లడం తప్పదని తెలిసి దుఃఖిస్తూ దేహం అంతా వణుకు పుట్టి ఏదో తెలియని ఆందోళనతో అతడు తన చిన్నకొడుకుని నోరారా “నారాయణా! నారాయణా!!!” అని పిలుస్తూనే ప్రాణం విడిచాడు. యమభటులు అతన్ని యమపాశంతో కట్టి యముని వద్దకు బయలుదేరుతూండగా అదే సమయానికి విష్ణుదూతలు అక్కడికి వచ్చారు. వారిని చూసి యమభటులు ఆశ్చర్యపోయి. “అయ్యలారా! ఈజీవి జీవితకాలం చాలా పాపాలు చేశాడు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం ఇతన్ని యమలోకానికి తీసుకువెళుతున్నాం”
అన్నారు. అందుకు జవాబుగా శ్రీవారి సేవకులు చిరునవ్వుతో
మీరు యముని భటులైతే వినండి! ఈతడు మరణాసన్న సమ
యంలో తన కుమారుడైన నారాయణున్ని “నారాయణా! నారాయణా!! అని పిలిచి ఆ దేవదేవుడైన నారాయణుని స్మరించాడు. అతను పిలిచింది తన కుమారుణ్ణే ఐన్వా అది శ్రీహరి నామంకాబట్టి ఆ ప్రాణి చేసిన నానాపాపాలు అంతటితోనే నశించిపోయాయి. కాబట్టి ఎలాంటి కష్ట్టమయంలోనైనా ఆ శ్రీమన్నా
రాయణుని నామాన్ని పలికిన వారికి యమబాధలుండవు;
అన్న విష్ణుదూతల మాటలకు యమభటులు తెల్లబోయి మరో
మాట మాట్లాడక అజామిళుని జీవాన్ని బంధవిముక్తి చేసి అక్కడి
నుండి వెళ్ళిపోయారు. అటుపై విష్ణుదూతలు అజామిళుని తమ
దివ్యవిమానంలోని కెక్కించుకొని వైకుంఠానికి తీసుకెళ్ళారు.

దీన్ని బట్టి తెలిసిందేమంటేే యవ్వనదశలో తెలిసీ
తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి, కనీసం
వృద్ధాప్యంలోనైనా కొంతవరకు భగవంతుని ధ్యానం చేయడం
చాలా ఉత్తమమైందని గ్రహించాలి.
------------------      

No comments:

Post a Comment