🌺 తపస్సు మహిమ 🌺
తపస్సు వలన ఇహలోకంలో సమస్త సంపదలు లభిస్తాయి. పుత్రులు కలుగుతారు, స్వర్గం లభిస్తుంది, మోక్షం సిద్ధిస్తుంది. భోగ, భాగ్యాలు కలుగుతాయి. తపస్సు వలన పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొందుతారు. సర్వమైన దేవతలు, త్రిమూర్తులు, సూర్యచంద్రులు ఒకరేమిటి లోకపాలక వ్యవస్థలో ఉన్నవారంతా తపస్సుచేతనే ఆయా ఆధికారిక స్థానాలను పొందియున్నారు. లోకులకు మేలుకీడులను ఒసగే గ్రహ, నక్షత్రాలు తపస్సు చేతనే జ్యోతిర్మయ స్వరూపాన్ని పొంది ప్రకాశిస్తున్నాయి. పారమార్థిక జ్ఞానం, లౌకిక విజ్ఞానం, ఆరోగ్యం, సంపద, సౌభాగ్యం, సౌందర్యం, సుఖం సమస్తము తపస్సు వలననే సాధ్యమని వేదవిదులు అంటున్నారు. విశ్వామిత్రుడు కఠోరమైన తపస్సును ఆచరించి బ్రహ్మజ్ఞాని అయ్యాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తదుపరి పొందదగిన వస్తువు ముల్లోకాలలోను లేదు.
No comments:
Post a Comment