☘️ *_కనువిప్పు కలిగించే ఒక చిట్టికథ_* ☘️
✍️..........................................
*⭕విజయుడు అనే రాజు "నాకంటే తెలివైన వాళ్ళెవరైనా ఉంటారా?" అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రికేమో మొహమాటం! "కాదంటే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందో" అని "మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవ్వరూ లేరు ప్రభూ" అనేసేవాడు.*
*⭕అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బారులో తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. ఊరికే ఉండక, మంత్రిగారిని కూడా "మీరేమంటారు మంత్రిగారూ?!" అని అడగడం మొదలుపెట్టాడు..*
*⭕మంత్రిగారికి ఏమి అనాలో తోచలేదు. 'ఎలాగైనా రాజు గారిని ఈ అలవాటు నుంచి బయటపడేట్లు చేయకపోతే సమస్యే' అనుకున్నాడు ఆయన.*
*⭕ "మన రాజ్యపు పొలిమేరల్లో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైనవారు ఉన్నారట ప్రభూ..! మీరు ఒకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి- ఆ ఊరి జనాలకంటే మీరే తెలివైనవారు అని తేలిపోతే బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది.. అయినా వారెవరూ మీ తెలివికి సరితూగరులెండి" అని తప్పించుకున్నాడు మంత్రి.*
*⭕దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు. 'ఏంటి ఈ గోపాలపురం? ఏంటి వీళ్ల తెలివి? చూసొస్తాను' అని నేరుగా అక్కడికే బయలుదేరాడు.*
*⭕ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూముల్లో ఓ పశువుల కాపరి కనిపించాడు- ఆవుల్ని మేపుకుంటూ.*
*⭕"ముందు వీడిని ఓడిస్తాను... నా తెలివి ముందు వీడు ఏపాటి?" అనుకుంటూ దగ్గరికి వెళ్లాడు రాజు.*
*⭕"నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను. నీకు చేతనైతే జవాబు చెప్పు చూస్తాను-" అన్నాడు.*
*⭕పశువుల కాపరి రాజుకేసి వింతగా చూసి "సరే, అడగండి" అన్నాడు.*
*_⭕"సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది?"_ అడిగాడు విజయుడు.*
*⭕'గాలి'.... చెప్పాడు పశువుల కాపరి.*
*_⭕అన్నింటికంటే ఉత్తమమైన జలం?_*
*⭕"గంగాజలం"*
*_⭕అన్నింటిలోకి ఉన్నతమైన పాన్పు?_*
*⭕" ఇంకేముంటుంది చందనపు కర్రతో చేసినదే"*
*⭕"భలే భలే! నా మనసులోనూ ఇవే జవాబులున్నాయి!" అన్నాడు విజయుడు అతడిని మెచ్చుకుంటూ.*
*⭕ఆ మాటలకు "హ్హ హ్హ హ్హ" అని ఎగతాళిగా, పగలబడి నవ్వాడు పశువుల కాపరి.*
*⭕"ఎందుకు, అంత నవ్వుతున్నావు?" అడిగాడు విజయుడు చికాకుగా.*
*⭕"తప్పుగా చెప్పిన జవాబుల్ని సరియైనవని మెచ్చుకుంటుంటేనూ..." అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి.*
*⭕"మరి సరైన జవాబులేమిటో చెప్పు చూస్తాను" అన్నాడు విజయుడు పట్టుదలగా.*
*⭕"సృష్టిలో అన్నికంటే వేగవంతమైనది మనసు. ఎడారుల్లో ఎండవేళన దొరికేదే ఉత్తమ జలం, ఉన్నతమైన పాన్పు అమ్మ ఒడి..." చెప్పాడు పశువుల కాపరి.*
*⭕"అవును నిజమే" మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు.*
*⭕"ఇంకో సంగతి చెప్పనా?" అన్నాడు పశువుల కాపరి. "నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులూ సరైనవే, ఇవి కూడా సరైనవే- ఏమంటే 'ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి' అనుకోవటంలోనే అసలు తప్పు ఉంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులుండచ్చు- ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉన్నట్లే"*
*⭕విజయుడు నివ్వెరపోయాడు. _"అవును గదా! నేను ఇలా ఆలోచించనే లేదే?! ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉండచ్చు గదా, 'అందరిలోకీ తెలివైనవాళ్ళు' అంటూ అసలు ఎందుకుండాలి?"_ అని ఆయన ఆశ్చర్యంలో మునిగాడు.*
*⭕పశువుల కాపరిని అభినందించాడు. అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవటం మానేశాడు!*
*⭕అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ, కాల క్రమేణా _" మంచి రాజు - అందరినీ ప్రోత్సహిస్తాడు"_ అని పేరు తెచ్చుకున్నాడు.*
⭕ *_చదివి చదివి కొంత చదువంగ చదువంగ_*
*_చదువు చదివి యింక చదువు చదివి_*
*_చదువు మర్మములను చదువలేడయ్యెను_*
*_విశ్వదాభిరామ! వినురవేమ!_*
*⭕భావం: ఎన్ని చదువులు చదివి, ఎన్ని విద్యలు నేర్చినా, ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే కదా!*
~~~~~~~~~~~~~~~~~~
*_{మనమందరం.. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు.. ఖచ్చితంగా ఇందులోని సారాంశాన్ని అర్థం చేసుకుని మసలుకోవాలి.
ఇది సేకరణ
No comments:
Post a Comment