Wednesday, January 8, 2025

 *_ఒక గుడ్డివాడికి చూపు రాగానే మొట్టమొదటి విసిరేసేది అప్పటిదాకా తనకి సహాయపడిన చేతికర్రనే..._*

*_అలాగే నువ్వు ఇతరులకి ఎంత మంచి చేసినా... ఎంత సహాయం చేసినా... గుర్తుపెట్టుకోలేని సమాజంలో ఉన్నాము అనేది గుర్తెరుగు._*

*_ఎందుకంటే నీకు కష్టం వస్తే ఆదుకునే వాళ్లెవ్వరూ నీ పక్కన ఉండరు. నీ జీవితం నీదే, నువ్వే పోరాడాలి. మిగతావాళ్లదంతా... ప్రేక్షకపాత్రే..._*

*_అందుకే అతి వినయం, మరీ అతి మంచితనం వుంటే నువ్వు నటిస్తున్నావ్ అనే రోజులలో ఉన్నాం జాగ్రత్త. అందు వలన ఎందులోనూ అతి పనికి రాదు._*

*_అలాగే నేల విడిచి సాము చేయకూడదు అని సామెత. మన శక్తి తెలుసుకోకుండా సహాయం చేయకూడదు._*

*_కనీసం ఆశ కూడా కలిపించకూడదు. డబ్బు/శక్తి/సమయం/సలహా..._*

*_మనకి ఉన్నంతలో పదోవంతు మాత్రమే ఎదుటివారికి వినియోగించగలం. అంతకు మించి ఆలోచన చేయడం కూడా సాహసమే..._*

*_మనం బలంగా నమ్మితే సరిపోదు. బలహీనతని వదిలితేనే బ్రతుకు మారుతుంది..._*

*_కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు ఏదో ఒక నాడు నీకు గర్జించే అవకాశం వస్తుంది... నిలబడడం నేర్చుకుంటే... ఒంటరిగా తలపడటం నేర్చుకుంటావు ☝️_*
 
    *_-సదా మీ. శ్రేయోభిలాషి...👏_*
🌲🌲🌲 🪷🙇🪷 🌲🌲🌲

No comments:

Post a Comment