Friday, January 10, 2025

 *_కొన్ని పరిస్థితుల కారణంగా, కొన్ని సందర్భాలలో  సమస్యలు ఎక్కువై ఇబ్బందులు పడవచ్చు... బ్రతుకు దుర్భరం కావచ్చు..._* 

*_మన చుట్టూ వున్న వారు హేళన చేయవచ్చు... మన దగ్గర వాళ్ళు, మన మిత్రులు అవసరానికి అనేక విధాలుగా సాయం పొంది, ఇప్పుడు మనల్ని గుర్తించక పోవచ్చుగాక..._*

*_కష్టంలో ఉన్నప్పుడు ఎవరు మన పక్కన ఉంటారు, ఎవరు మనల్ని పక్కన నెట్టేస్తారు..._*

*_మన సంతోషం చూసి ఎవరు కుళ్ళుకుంటారు... మన బాధను చూసి ఎవరు ఆప్యాయంగా పలకరిస్తారు అని తెలుసుకోవడమే విజ్ఞత..._*

*_ఎందుకంటే... కొందరు మనల్ని ఊబిలో నెట్టేయ్యడానికి మన పక్కనే ఉంటూ గోతులు తీస్తారు అలాంటి వారితో జాగ్రత్త._*

*_క్లిష్టమైన పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా, నా అనేవారు నీకు సహాయం చేయకపోయినా దిగులు పడకు... భయపడకు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు..._*

*_పసిప్రాయములో నిలబడడానికి ఎన్నోసార్లు కింద పడుతూ లేస్తూ దెబ్బలు తిన్నావు కదా.! అయితేనే ఈరోజు నిలబడి పరిగెత్తుతున్నావు..._*

*_ప్రయత్నం అనేది పసితనం నుండే మొదలైంది... ఇప్పుడెందుకు నిలబడడానికి చతికిలబడుతున్నావు.?_*

*_కష్టాలు, లాభనష్టాలు, అవమానాల గురించి ఎప్పుడు ఆలోచించవద్దు, నువ్వు చేయాల్సింది ప్రయత్నం చేస్తూపోవడమే..._*

*_నీతోని కాని పక్షంలో అంతా కాలానికి వదిలేయ్... అంత శ్రవ్యంగా సాగుతుంది భయమెందులకు.?_*

*_ప్రయత్నం చేయడమే సమర్ధుల లక్షణం... ప్రయత్నం చేయకపోవడం అసమర్థుల లక్షణం..._*

*_నీ సమర్థతను నిరూపించుకుంటావా... లేదా... అసమర్ధుడిగా మిగిలిపోతావా... అంతా... నీ చేతుల్లోనే ఉంది...☝️_*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 ❣️🙇❣️ 🌹🌹🌹

No comments:

Post a Comment