*శ్రీ గురుభ్యోనమః*
.*శ్రీకృష్ణ పరమాత్మ మనోభావము*
. యజ్ఞార్థమైన కర్మ కంటే ఇతర కర్మల యందు ఈ లోకం కర్మ బంధంగా కలది .యజ్ఞం కొరకు ఫలాసక్తిని, సంగాన్ని , విడిచినవారై కర్మను చక్కగా ఆచరించు. నియత కర్మను కాకుండా ఇతర కర్మలన్నీ బంధాలకు కారణం అవుతాయి. కాబట్టి కర్మలు సంగం లేకుండా చక్కగా ఆచరించు అంటున్నాడు జగద్గురువు. మానవ జన్మ ఒక యజ్ఞం కదా! దేహి యొక్క యాత్ర దేహి ప్రయాణం గమ్యాన్ని చేరుకోవటమే ఒక మహా యజ్ఞం కదా! నాలుగు వేదాల సారాన్ని గ్రహించి పరిపూర్ణ బ్రాహ్మి స్థితికి చేరుకునే దానికంటే మించిన యజ్ఞం ఏది ఉంటుంది? ఈ ఆత్మను పరమాత్మ స్థితికి ,దైవంలో విలీనం అయ్యే స్థితికి, దైవంతో సాయుజ్యం పొందే స్థితి కంటే మరో యజ్ఞం ఏముంటుంది? యజ్ఞార్థం అంటే దైవానికి సమర్పించేది .ప్రతి కర్మను దైవ సమర్పణ దృష్టితో ప్రారంభించు," ముడిపడితే బంధం విడివడితే మోక్షం " భగవంతుని సమర్పణతో కాకుండా వ్యతిరేకంగా చేసే కర్మలన్నీ కూడా లోకానికి బంధాలు ,అందుకే భగవతార్ధం, దైవార్థం, ముక్తసంగుడవై సంగాన్ని విడిచిన వాడిడై కర్మను ఆచరించు. మనం కూడా ధర్మ స్పృహతో, ధర్మచింతనతో, దైవం పై తదేకంగా దృష్టిని నిలకడ చేసి, యజ్ఞార్థమే కర్మలో యోగమై కర్మ యజ్ఞాన్ని ఆచరిద్దాం. ఈ మానవుడిని మహాజ్ఞానిగా తయారు చేద్దాం. ఈ దేహాన్ని దేవాలయంగా, యజ్ఞశాలగా, యాగశాలగా మలుచుకుందాం...
*సర్వం సద్గురార్పణం* .🧘🏿♂️
No comments:
Post a Comment