Sunday, January 19, 2025

 


నా గర్భస్థానాన్ని నీకు ఆవాసంగా చేస్తే
గొడ్ల చావిడిని నాకు నివాసంగా చేసావు..
నా చీర కొంగును నీకు పైబట్టగా చేస్తే
గోనెపట్టను నాకు దుప్పటిగా చేసావు..
నా రక్తాన్ని క్షీరముగా మార్చి నీ ఆకలి తీరిస్తే
ఉప్పు నీటిని ఎక్కించి చేతులు దులుపుకున్నావు.
నా చెమట చిందించి నిను ప్రయోజకుణ్ణి చేస్తే
అవసాన దశలో కన్నీటిని నాకు కానుకిచ్చావు.
నా కంటిపాపగా నిను సాకి శిల్పంగా మలిస్తే
కడసారి చూపుకి రాక అనాథ శవాన్ని చేసావు..
రెక్కలొచ్చాక ఎగరడం తప్పు కాదు!
కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన కన్నవారిని అనాథలను చేసి ఎగరడం తప్పు!!
..✍️

No comments:

Post a Comment