Sunday, January 19, 2025

 *🌺🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🏻
*_🌴 మానవుడు అనుసరించాల్సింది ధర్మాన్నే తప్ప మతాన్ని కాదు. కర్మ సిద్ధాంతం అనేది లోకములో ప్రతీ జీవికి వర్తిస్తుంది. గతంలో ఎవరు ఏ విధమైన కర్మలు చేసుకుంటే నేడు వాటి ఫలితమే అనుభవిస్తారు. ఇందులో మతాలు, కులాలు, వర్గాలు అంటూ ఎలాంటి బేధాలు ఉండవు.. ఏ కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది  తెలుసుకుని చేయడమే ధర్మం. కర్మ సిద్ధాంతానికే కాదు, అన్నింటికీ మూలం ధర్మమే. ధర్మాన్ని తెలుసుకుని కర్మలు ఆచరించాలి తప్ప మతాన్ని పట్టుకుని వేలాడకూడదు. దేవునికి లేని కుల,మతాలు దేవుణ్ణి నమ్మే నీకెందుకు! నీవు నిజంగా దేవుణ్ణి నమ్మాలనుకుంటే ఆయన చెప్పిన ధర్మాన్నే అనుసరించు.. అంతే తప్ప ఆయనకు సంబంధం లేని కుల, మతాలను పట్టుకుని నేను దేవుడు భక్తుణ్ణి అని డబ్బాలు కొట్టుకోకు!.. దేవుడు నవ్వుకుంటాడు సుమీ!!🌴_*.      

No comments:

Post a Comment