*గడిచిపోయిన విషయాలను పదే పదే స్పురణకు తెచ్చుకోవడము,ఫలితముగా బాధ అనుభవించడము మానవుని బలహీనతలలో చెప్పుకోదగినది.ఒకసారి చెప్పిన జోక్ కి పదిసార్లు నవ్వలేము కదా! నిన్న చదివిన వార్తాపత్రికను ఈ రోజు చదువము కదా! అలానే గడచిన విషయం ఎక్కడ జరిగిందో అక్కడే వదిలేయాలి.గతంను వెనుకకు తీసుకురాలేము.భవిష్యత్ అనేది మన చేతులలో లేదు.ఉన్న క్షణం ఒక్కటే మనది.ఈ బరువు బాధ్యతలు మనం మోయలేము.వీటిని భగవంతునికి అప్పజెప్పి మనకున్న క్షణంను మంచికోసం వినియోగించుకుందాం.ఏది జరగనివ్వండి, భగవంతుడే దిక్కు అన్న విశ్వాసంతో ఉందాం.గ్యారంటీ లేని ఈ జీవితానికి ఇంతకంటే ఏం అవసరం??!*
No comments:
Post a Comment