*జ్ఞాని.....*
మహానుభావులు తమకు ఏది ఉన్నా, లేకున్నా సరిపెట్టుకొని జీవించారు. ఏ వెంపర్లాట, ఆరాటం లేకుండా జీవించటమే వారు ఆచరించి చూపిన ఆదర్శం. సాధారణ మానవుని కి మాత్రం ఫలానాది ఉంటేనే జీవించగలమనే బలహీనత ఉంది.
రాకుమారుడిగా వెలుగొందిన శ్రీరాముడు 14 ఏండ్ల వనవాసాన్ని ఆనందంగా అంగీకరించిన సహనమే ఆయన్ను ఆదర్శ పురుషుడిని చేసింది. రాముడిని పూజించటం అంటే ఆయన గుణాలను గౌరవించి స్వీకరించటమే.
జ్ఞాని ప్రపంచాన్ని దాటడు. ప్రపంచంపై ఉన్న బంధాన్ని అధిగమిస్తాడు. ప్రపంచం దాటటం అంటే దేహావసరాలను దాటటమే. అది ఎవరికీ కుదరదు. విరాగులై చరించిన మహర్షులు కూడా చేతిలో కమండలంతోనే తిరిగారు. స్ధిరంగా, స్ధానువుగా ఉండటం కూడా ఒక వికారమే అవుతుంది.
జ్ఞానులు అలా ఉండరు. మనతోనే, మనలాగే సంచరిస్తారు. కాకపోతే వారికి ఏ కోరిక ఉండదు. కాబట్టి వారిని ఏదీ బాధించదు. వారి ప్రతి కదలిక మనకు ఒక బోధ లాగానే ఉంటుంది...
No comments:
Post a Comment