Thursday, January 23, 2025

 *🕉️🙏ఓమ్ 🕉️🙏*

*ఆదిశంకరాచార్యులు*
*సంస్కృతం లో*
*రచించినది.🕉️🙏👇*

*🕉️🙏భజ గోవిందం*
           *(మోహ ముద్గరం)*🕉️🙏

*🕉️🙏'భజగోవిందం'*
           *లోని*
           *11 వ శ్లోకం*
           *అర్ధం. 🕉️🙏👇*


 *🕉️🙏”మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్‌ కాలః సర్వం మయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా”*
*అన్నారు ఆదిశంకరాచార్యులవారు.*🕉️🙏

 *🕉️🙏’ధనమున్నదని,*
            *అనుచరగణం ఉన్నదని,*
            *యవ్వనం ఉన్నదని*
            *గర్వించకు. 🕉️🙏*

*🕉️🙏ఈ మొత్తం ఒక్క నిమిషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచం అంతా భ్రమతో కూడుకున్నదని, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో, ఆత్మానుభూతిని చెందు!’ అని దీని అర్థం.*🕉️🙏

 *🕉️🙏ధనం,*
             *జనం,*
             *యౌవనం* 
             *అన్నీ అశాశ్వతమే.* 
             *బుద్బుద ప్రాయమే.*🕉️🙏

 *🕉️🙏ఆత్మజ్ఞానానికి అనువైన జన్మ మానవజన్మ మాత్రమే. 🕉️🙏*

*🕉️🙏ఈ మానవజన్మలో ఆత్మజ్ఞానాన్ని అలక్ష్యం చేసి లౌకిక సంపదలూ, భోగాలూ మాత్రమే ప్రధానమనకునే వారి గతి అధోగతే అని ప్రబోధించారు ఆదిశంకరాచార్యులు.*🕉️🙏

 *🕉️🙏ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి. ఈ క్షణికమైన సంపదలను చూసుకొని మనిషి గర్విస్తాడు,అహంకరిస్తాడు.*🕉️🙏

*🕉️🙏 కొందరికి ధనగర్వం…!🕉️🙏*

 *🕉️🙏మరికొందరికి తన కోసం ఏదైనా చేయగలిగే అనుచరులున్నారనే గర్వం…!*🕉️🙏

 *🕉️🙏ఇంకొందరికి తమ యవ్వనాన్ని చూసుకుని గర్వం….!*🕉️🙏

 *🕉️🙏ఒక్కసారి భూకంపం వస్తే ఇళ్లూ, ఆస్తులూ నేలమట్టమై పోతాయి. “నాకేంటీ!? కోట్ల ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన భవనం ఉంది” అని గర్వించినవాడు మరుక్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది.*🕉️🙏

 *🕉️🙏ఆ క్షణంలో ధనం, జనం ఏవీ రక్షించవు.*🕉️🙏

 *🕉️🙏అలాగే యవ్వనం కూడా శాశ్వతంగా ఉండదు.వృద్ధాప్యం వెక్కిరిస్తూ మన నెత్తిమీదకు వచ్చికూర్చుంటుంది.*🕉️🙏

 *🕉️🙏కాబట్టి ఇదంతా మాయాజాలమని, క్షణికమైనవని భావించాలి.🕉️🙏*

 *🕉️🙏అలాగని అన్నీ వద్దనుకోవాల్సిన పని లేదు.*🕉️🙏

 *🕉️🙏వాటిని అనుభవించడంలో తప్పు లేదు. కానీ, వాటితో అనుబంధం పెట్టుకోకూడదు.*🕉️🙏

*🕉️🙏అలా పెట్టుకుంటే, అవి పోయినప్పుడు భరించలేని దుఃఖం తప్పదు.🕉️🙏*

*🕉️🙏జీవితంలో అతి ముఖ్యమైనవిగా భావించాల్సినవి ఇవి కావు.*🕉️🙏

 *🕉️🙏శాశ్వత ఆనందప్రాప్తికి బ్రహ్మపదంలో ప్రవేశించాలి.🕉️🙏*

*🕉️🙏 ఆ పరమానందం, నిత్యానందం లభించాలంటే 'చలించే మనస్సు'ను బ్రహ్మంలో నిలిపి, ఆ బ్రహ్మంలో మనస్సును ప్రవేశపెట్టి బ్రహ్మంగా ఉండిపోవాలి.*🕉️🙏

 *🕉️🙏పరమాత్మతో మమేకం కావాలి.*🕉️🙏

 *🕉️🙏ఇది చెప్పడమంత సులువు కాకపోవచ్చు. సుసాధ్యం కాకపోవచ్చు.*🕉️🙏

🕉️🙏 *కానీ అసాధ్యం అసలే కాదు.*🕉️🙏

*🕉️🙏ఓమ్ 🕉️🙏*

No comments:

Post a Comment