*హృదయము.....*
హృదయాన్ని గుర్తించటానికి రవ్వంత కూడా పరిశ్రమించనక్కరలేదు. నీవు ఆత్మ కన్నా భిన్నంగా ఉన్నావా? నీవు ఆత్మవే ! ఆత్మయే హృదయం.
గాఢనిద్రలో నీవున్నావు.. జాగ్రత్తలోనూవున్నావు. వ్యత్యాసం ప్రపంచం తోచటం, తోచకపోవటం. మనస్సులో ప్రపంచం లేస్తోంది. అణుగుతోంది.
ఇలా లేచేది, అణిగేది నిజమైన ఆత్మకాదు. ఆత్మలోనే మనస్సు పుట్టి, పెరిగి లయిస్తోంది. అందువల్లే ఆత్మ అన్నిటికి మూలం. నీ వెవరని ప్రశ్నిస్తే, వెంటనే దేహానికి కుడివైపున వున్న హృదయస్థానాన్ని చేతితో తట్టి చూపుతూ,
"నేను - నేను" అంటావు. ఇట్లా అత్యంత సహజంగా హృదయాన్ని ప్రతి వారు చూపుతారు.హృదయాన్ని తెలియని వారెవ్వరూ లేరు.
అయితే... వ్యక్తులు దుఃఖితులుగా ఉండటానికి కారణమేమంటే దేహాన్ని, మనస్సును ఆత్మగా భ్రమ పడటం వల్లే. అజ్ఞానం వల్లే ఈ భ్రమ కలిగింది. అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం ఒక్కటే కావాలి.
No comments:
Post a Comment