ఈ ఫొటోలో బిచ్చగాడిలా పిచ్చివాడిలా కనిపిస్తున్న
ఇతని పేరు 'వశిష్ఠ నారాయణ్ సింగ్'
NASA లో స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజర్లలో ఒకరు.
ఐన్ స్టీన్ ప్రతిపాదించిన e=mc2 అనే ఫార్ములాకే సవాల్ విసిరిన దిట్ట. కాలిఫోర్నియా యూనివర్సిటీ లో పీహెచ్డీ పూర్తిచేసాడు...
..👉
కానీ విధి వైకరించింది ఇతడు ఇలా ఐపోవడానికి కారణం మన దేశంలోని బీహార్ ప్రభుత్వం. ఎలాగంటారా...ప్రపంచానికి '0' సంఖ్యను కనుకొన్న ఆర్యభట్ట జన్మించిన బీహార్ రాష్టంలోనే ఈయన జన్మించారు. కాలేజి లో చదువుకునే సమయంలోనే ఇతడు అడగే ప్రశ్నలకి లెక్చరర్ల దగ్గర సమాధానం ఉండేదికాదు. అమెరికా నుండి ఆ కాలేజికి వచ్చిన ఒక ప్రొఫెసర్ కి ఈయన ప్రతిభ నచ్చి తనతో అమెరికాకి తన సొంత డబ్బులతో తీసుకెళ్లి కాలిఫోర్నియా యూనివర్సిటీ లో చేర్పించాడు. అక్కడినుండి వశిష్ఠ జీవితం మారిపోయింది. అవార్డులు రివార్డులతో ఆయన ఏకంగా నాసా లో ముఖ్యమైన శాస్రవేత్తల్లో ఒకరిగా కొనసాగారు.
తనని వెంట తీసుకెళ్లిన ఆ ప్రొఫెసర్ కూతురునే ప్రేమించి విషయం చెప్పాడు అందుకు అదృష్టంగా భవిస్తూ ఒప్పుకున్నాడు. ఇలా సాగుతున్న తన జీవితంలో ఒకసారి నారాయణ్ ఇంటినుండి రమ్మని కబురు వచ్చింది. వెళ్ళాడు. వెళ్లిన వెంటనే ఆయనకి తెలియకుండానే పెళ్లి కుదిర్చేసి హడావిడిగా పెళ్లి చేసేసారు. నారాయణ్ కి తన తండ్రి కళ్ళల్లో సంతోషం చూసి, ఇష్టం లేకున్నా ఆ పెళ్లి చేసుకున్నాడు. ఇష్టంలేని పెళ్లి చేసుకున్నందున లోలోపల మధనపడుతూ కొంతకాలం బీహార్ లోనే ఉన్నాడు. ఉన్నట్టుండి నారాయణ్ కి ఒక వ్యాధి వచ్చింది. తనలో తానే మాట్లాడుకోవడం, పిచ్చిగా ప్రవర్తించడం చూసి తన భార్య విడాకులు ఇచ్చేసింది. అతన్ని అక్కడి ప్రభుత్వ పిచ్చాసుపత్రిలో చేర్పించారు నిజానికి నారాయణ్ కి వచ్చిన వ్యాధి అంత ప్రమాదకరమైనదేమి కాదు ట్రీట్మెంట్ ఇస్తే కొన్ని నెలల్లోనే కోలుకునేవాడు. ఈ సమయంలోనే అక్కడి ప్రభుత్వం మారడంతో నారాయణ్ కి వైద్య పరీక్షలు చేయడం మానేసారు. చేసేదేమి లేక తన తమ్ముడు అతన్ని ప్రయివేట్ హాస్పిటల్ కి తీసుకెళితే దారి మధ్యలో ఎక్కడో తెలియని ఊరిలో రైలు దిగేసాడు. అప్పటినుండి నారాయణ్ ఆచూకీ ఎవ్వరికి తెలియలేదు. అతని కుటుంబ సభ్యులు ఈయనకోసం ఎంతవెతికినా దొరకలేదు. సరిగ్గా నాలుగేళ్ళ తర్వాత డోరేగంజ్ లోని ఒక బస్టాప్ దగ్గర ఇదిగో ఇలా కనిపించాడు. నారాయణ్ వైద్యపరీక్షలకి అయ్యే ఖర్చుని అప్పటి మారిన ప్రభుత్వం భరించి ఉంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఇలా అయ్యేది కాదు..
ఏ దేశం పేరుని నాసా వరకు తీసుకెళ్లాడో ఆ దేశమే ఇతన్ని పట్టించుకోలేదు.
అవును మరి... మన దేశంలో సైన్టిస్ట్ లకన్నా బాబాలే ఫెమస్ అంటారుగా... ఏది ఏమైనా నారాయణ్ గొప్పతనం అమెరికా వాళ్ళకి ఎప్పటినుండో
తెలిసింది కానీ, మనకి మాత్రం ఈమధ్యనే తెలిసింది. అపోలో 11 రాకెట్ ప్రయోగం సమయంలో 20 కంప్యూటర్ లు ఆగిపోవడంతో వాటిని మల్లి దారిలోకి తెచ్చింది నారాయణ్ నే... ఇంకా అయన రాసిన కొన్ని సైన్టిఫిక్ ఫార్ములాలని అమెరికా లోని యూనివర్సిటీ ల్లో ఇప్పటికీ పాఠాలుగా చెప్తున్నారు కూడా...
...
వశిష్ట నారాయణ్ సింగ్ జీ .... సెల్యూట్ 😥😥
No comments:
Post a Comment