Vedantha panchadasi:
అతద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విధిముఖేన చ ౹
వేదాన్తానాం ప్రవృత్తిః స్యాద్విధేత్యాచార్య భాషితమ్ ౹౹87౹౹
వేదాంతముల ప్రవృత్తి - నిషేధ,ప్రతిపాదరూపములు.
కనుక అంతఃకరణమును నిషేదించుచు బ్రహ్మమున కుపాధి చెప్పుటలో అసంగమేమీ లేదు అని దృఢపరచుచున్నాడు.
అహమర్థపరిత్యాగాదహం బ్రహ్మేతి ధీః కుతః ౹
నైవమంశస్య హి త్యాగో భాగలక్షణయోదితః ౹౹88౹౹
88. 'అహం' ను వదలిన 'అహం బ్రహ్మస్మి' బోధ కలుగుటెట్లు ? అందలి విరుద్ధాంశమును మాత్రమే వదలుట భాగలక్షణచే జరిగినది.
అంతఃకరణ సంత్యాగాదవశిష్టే చిదాత్మని ౹
అహం బ్రహ్మేతి వాక్యేన బ్రహ్మత్వం సాక్షిణీక్ష్యతే ౹౹89౹౹
89. అంతఃకరణమును పరిత్యజింపగా మిగిలిన సాక్షియగు చిదాత్మ యందు అహం బ్రహ్మస్మి అనే వాక్యముచే బ్రహ్మత్వము గుర్తింపబడుచున్నది.
వ్యాఖ్య :- వేదాంతము యొక్క
(ఉపనిషత్తుల యొక్క) ప్రవృత్తి రెండు విధాలుగా ఉంటుంది.
మొదటిది అతద్వ్యావృత్తిరూపం కలది.
'తత్' అంటే బ్రహ్మము గదా !
'అతత్' అంటే,
బ్రహ్మము కానిది -
అజ్ఞానము, అనాత్మ, దృశ్యమాన ప్రపంచము మొదలైనవన్నమాట.
ఈ మిధ్యారూపమైన ప్రపంచాన్ని 'నేతినేతి'
(ఇదికాదు ఇదికాదు) అంటూ నిషేధించటం బ్రహ్మజ్ఞాన సంపాదనకు ఒక ఉపాయం. ఇది అతద్వ్యావృత్తి రూపం.
రెండవది సాక్షాద్విధి ముఖంగా కలిగే ప్రవృత్తి.అంటే, బ్రహ్మమును ప్రతిపాదించు
"సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ"
తై. 2-1-1 ఇత్యాది శ్రుతివాక్యాల ప్రవృత్తిద్వారా బ్రహ్మప్రతిపాదనం చేయటం.
విధిరూపమునను వేదాంతములు అనగా ఉపనిషత్తులు బోధించుచున్నవి అని
'శ్రీ శంకరభగవత్పాదులు' చెప్పిరి.
ఇది రెండవ ఉపాయం తద్వ్యావృత్తి అని ఆచార్యులు అంగీకరించారు.
అయితే, 'అహం' అనే భావమును కూడా నిషేధిస్తే - త్యజిస్తే - ఇక
'అహం బ్రహ్మస్మి' అనే జ్ఞానం ఎట్లా కలుగుతుంది ?
అని శంక.
సమాధానం -
'అహం' అనే పదానికి వాచ్యార్థమైన కూటస్థ చైతన్యాన్ని కూడా పరిత్యజిస్తే
(నేతి నేతి అని నిషేధిస్తే)
'నేను బ్రహ్మను'
(అహం బ్రహ్మస్మి) అనే జ్ఞానం ఎలాకలుగుతుందంటే -
'అహం' అనే శబ్దంలోని ఏకాంశాన్ని మాత్రమే పరిత్యజించాలని భాగత్యాగ లక్షణద్వారా చెప్పబడ్డది.
'తత్' రూపమగు చైతన్యము 'అతత్' రూపమగు అంతఃకరణము కలసి
'అహం' 'నేను' ఏర్పడినది.భాగత్యాగ లక్షణవలన అంతఃకరణమును వదలుట వలన చైతన్య స్వరూపమగు బ్రహ్మముతో ఐక్యము బోధపడుచున్నది.
అంటే , 'అహం' శబ్దాని కున్న జడాంశాన్ని మాత్రమే త్యజించాలి; అంతే తప్ప కుటస్థుని కాదు.ఈ విధంగా 'అహం బ్రహ్మస్మి' జ్ఞానం కలుగుతుంది.
అంతఃకరణముతో కూడినవాడు చేతనుడు అయిన జీవునినుండి జడాంశాన్ని అంటే అంతఃకరణమైన ఉపాధిని పరిత్యజించటంవల్ల చిదాత్మరూపము,సాక్షి అయిన
బ్రహ్మమే మిగిలి ఉండటం వల్ల
'అహం బ్రహ్మస్మి' అనే బ్రహ్మసాక్షాత్కారం కలుగుతుంది.
స్వప్రకాశోఽ పి సాక్ష్యేవ ధీవృత్త్యా వ్యాప్యతేఽ న్యవత్ ౹
ఫలవ్యాప్యత్వమేవాస్య శాస్త్రకృద్భిర్నివారితమ్ ౹౹90౹౹
90. సాక్షియగు చిదాత్మ స్వప్రకాశమేయైనను బుద్ధివృత్తిచే ఇతర విషయముల వలెనే వ్యాప్యమగుచున్నది.
శాస్త్ర కారులు ఫలవ్యాప్తిని మాత్రమే ఇచ్చట నిషేధించిరి.
వ్యాఖ్య:-
దేనినైన గుర్తించునది తెలియునది అంతఃకరణమే గదా ! అది లేనపుడు బ్రహ్మత్వము మాత్రమే ఎట్లు గుర్తింపబడును?
అని సంశయము.
విషయములను గూర్చిన గుర్తింపు ఎట్లు కలుగునో మొదట విచారింతము.
గుర్తింపునందు రెండు దశలున్నవి.
ఒకటి జ్ఞేయవిషయమును గూర్చిన అజ్ఞానము తొలగుట.
రెండవది జ్ఞేయవిషయమును గూర్చిన జ్ఞానము అంతఃకరణమునందు ప్రతిఫలించి చిదాభాసయందు కలుగుట.ఈ వికారము చిదాభాసయందు కలిగినను చిదాభాస అంతఃకరణమునందే ఉన్నది కనుక ఈ రెండూ సామాన్య విషయములందు ఒకటిగనే ఫలించును.
చిదాభాసయందు కలుగే వికారమునకు
ఫలవ్యాప్తి అని పేరు.
బ్రహ్మమును గూర్చిన బోధ కలిగితే, దానిని గూర్చిన అజ్ఞానము తొలగును.అనగా అంతఃకరణమునందు కలిగిన ఈ వికారముచే అంతఃకరణమే నశించును.అజ్ఞాన కార్యము గనుక.
అనగా బ్రహ్మము గూర్చిన
వృత్తి వ్యాప్తి సిద్ధించును.
ఇక చిదాభాసుడు గూడా అంతఃకరణముతో నశించుటచే
ఫలవ్యాప్తి సిద్ధింపదు.
ఆ సాక్షి ఇతర ఘటాది పదార్థాల్లాగా
'నేను స్వయం ప్రకాశరూపుణ్ణి' అనే బుద్ధి వృత్తిచేత వ్యాప్తం కావచ్చు గదా !
పూర్వశాస్త్రకారులేమో ఫలవ్యాప్తి నిషేధించారాయె !
అంటే - ఫలము అంటే బుద్ధి వృత్తియందు ప్రతిబింబితమైనట్టి చిదాభాస.
ప్రత్యగాత్మ స్వప్రకాశమైనది కాబట్టి పూర్వాచార్యులు ఆ చిదాభాసకు సంబంధించిన విషయత్వాన్ని నిషేదించారు.
కానీ , ప్రత్యగాత్మ స్వయంప్రకాశమైనందున బుద్ధివృత్తికి విషయంకాదు అని అంటున్నారు.
సాక్షియగు చిదాత్మ స్వప్రకాశమగుటచే తానే బ్రహ్మము అని గుర్తించును.
'నేను ఉన్నాను' అనే బోధ 'కుండ వున్నది' అనే బోధ వలెనే స్పష్టముగ అంతఃకరణము నందు ఏర్పడును.
కాని జ్ఞేయవిషయము అగుటచే కుండను అంతఃకరణమును,చిదాభాస సహితమైనది గ్రహింపగలదు.
కుండవలె జ్ఞేయవిషయము కాకపోవుటచే చిదాభాస సహితమైన అంతఃకరణము బ్రహ్మమును గ్రహింపలేదు.
చిదాత్మ అనగా ప్రత్యగాత్మ ,
బ్రహ్మమువలెనే స్వప్రకాశము గనుక వాని ఐక్యత, నేను ఉన్నాను అనే బోధ వలెనే,
సిద్ధించును.
ప్రత్యగాత్మయందు ఫలవ్యాప్తి ఉండదని చూపించటానికై ఘటపటాది పదార్థాల్లో వృత్తిని
(అంతఃకరణ పరిణామాన్ని) అందులోని చిదాభాస వలన ఫలాన్ని చూపిస్తున్నారు.

వ్యాఖ్య:- ఘటమును తెలియుట యందు బుద్ధియు దానియందలి చిదాభాసము రెండును వికారము నొందును.
బుద్ధివృత్తి,అందులో ఉన్న చిదాభాస, ఈ రెండూ ఘటాన్ని వ్వాప్తం చేస్తున్నాయి.ఈ రెండింటి వల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నాయి.
మొదటదైన బుద్ధివృత్తివల్ల ఘటమును గూర్చిన అజ్ఞానము నశించిపోతుంది.
జడమగు ఘటమునకు
స్వయం స్ఫురణం అనేది లేదు, అందువల చిదాభాస వికారమువల్ల
ఘటము స్ఫురిస్తోంది.
ఘటపటాది అనాత్మ వస్తు సమూహం కంటే, ఆత్మకున్నట్టి
వైలక్ష్యణ్యాన్ని
చూపిస్తూన్నారు -
బ్రహ్మమును తెలియుటయందు
అజ్ఞాన నివృత్తికై వృత్తివ్యాప్తి అనగా బుద్ధివికారము ఆవశ్యకమగును.
కానీ బ్రహ్మము స్వయంముగనే స్ఫూరిస్తుంది గనుక చిదాభాస వికారమగు ఫలవ్యాప్తి అనావశ్యకము.
జీవాత్మ బ్రహ్మము ఒకటే అనే విషయం అజ్ఞానము చేత ఆవరింపబడి ఉంది.
ఆ బ్రహ్మవిషయకమైన అజ్ఞాన నివృత్తికోసం 'అహం బ్రహ్మస్మి' అనే వాక్యం ద్వారా ఉత్పన్నమయ్యే బుద్ధివృత్తివల్ల వ్యాప్తి అనేది
(బ్రహ్మాకార విషయంలో) అవసరమౌతోంది.
చిదాత్మ స్వయం స్ఫురణరూపం కలది.అది స్ఫురించటానికి చిదాభాస అగత్యము ఉండదు - చిదాత్మ స్ఫురణకోసం,చిదాభాస ఉపయోగ పడదు.
ఈ విషయమై దృష్టాంతం చూపుతున్నారు -
ఘటం మొదలైన
స్వయం స్ఫురణలేని (అప్రకాశ) పదార్థములను చూడాలంటే కన్ను ,దీపము రెండూ అవసరమవుతున్నాయి.
కానీ దీపాన్ని చూడాలంటే కండ్లు మాత్రమే సరిపోతున్నాయి.
అట్లాగే, బ్రహ్మవిషయకమైన అజ్ఞానం నశించటానికి బ్రహ్మాకారమైన బుద్ధివృత్తి మాత్రమే అవసరమవుతుంది -
చిదాభాస యొక్క అవసరం ఉండదు.
No comments:
Post a Comment