Thursday, February 20, 2025

 *బ్రహ్మ నామాలు:-*
1. సృష్టికర్త. త్రిమూర్తులలో ఒకరు. భట్ట భాస్కర రుద్రాధ్యాయ భాష్యం ప్రకారం ఓమ్‌, స్వాహా, స్వధా, వషట్‌, నమః అనే ఐదూ బ్రహ్మ నామాలు.ఆత్మభువు, సుర జ్యేష్ఠుడు, హిరణ్య గర్భుడు, అబ్జయోని, వేధ, స్వయంభువు మొదలైన చాలా పేర్లు ఉన్నాయి.
2. వేదం. జ్ఞానం. తత్త్వం. అధ్యాత్మం. మూల ప్రకృతి.
3. జగత్తు దేని నుంచి జన్మిస్తున్నదో, దేని చేత మనగలుగుతున్నదో, దేనిలో లయిస్తున్నదో అది, ఆ తత్త్వం.
4. సమస్త జీవరాశిలో వ్యక్తమయ్యే చైతన్యం.
5. సమస్త ప్రపంచానికి నిజ రూపం ఏదో అది.
6. శాస్త్రానికి కారణమైనదీ, తన అనుభూతికి శాస్త్రం కారణంగా కలిగినదీ.
7. సర్వశక్తి సంపన్నం. పరమాత్మ.
8. రెండు కానిదీ, మనస్సుకూ, వాక్కుకూ అందనిదీ, సత్తామాత్రమైన ఆత్మ స్వస్వరూపం.
9. అఖండ, అద్వితీయ సచ్చిదానంద పదార్ధం.
10. ఇది కాదు, ఇది కాదు... స్థూలం కాదు, సూక్ష్మం కాదు- ఇలా చెప్పడానికి ఆస్కారం కలిగిన లక్షణాలకు ఏది లక్షితమో ఆ ఔపనిషద్‌ తత్త్వం.
11. క్షుత్తు, పిపాసలకు, ఇలాంటి ఇతర సహజ లక్షణాలకు అతీతమై, సర్వత్రా నిండి ఉన్న ఆత్మ స్వస్వరూపం.
2. కార్యం గానీ, కారణం గానీ కానిది.
13. వివిధ మతాలకు ఏది లక్ష్యమో అది.
14. విశ్వస్వరూపుడు, విశ్వాధారుడు.
15. నిరుపాధిక చైతన్యం. వ్యష్టి, సమష్టి, స్థూల, సూక్ష్మ, కారణ రూపాలేవీ లేని శుద్ధ చైతన్యం. ఇలా ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి

No comments:

Post a Comment