Thursday, February 13, 2025

 *ఋగ్వేదం (ప్రథమసూక్తము):*
ఇంతకుముందు మొదటి, రెండవ శ్లోకం చెప్పుకున్నాము.

3. అగ్ని నా రయిమశ్నవత్ పోషమేవ దివే దివే !

యశసం వీర వత్తమమ్ !!

అగ్నినా = అగ్ని ద్వారా; దివే దివే = ప్రతిరోజూ; పోషం ఏవ = పుష్టిని స్తూ వికాసాన్ని అందించే, వీరవత్ తమం యశసం = విక్రాంతివంతమైన, లేక అతిశయ శక్తి వంతులకు తగిన కీర్తిని కలగజేసే; రయిం = (పుష్టిరూప) యశోరూప; ధనాన్ని, అశ్నవత్ = (సాధకుడు) పొందుతాడు; 

అగ్నిని ఆరాధించే సాధకుడు ఈ అగ్ని ద్వారా ప్రతిరోజూ పుష్టినీ, వికాసాన్నీ, శక్తివంతులకు అర్హమైన కీర్తిని ఇనుమడింపజేసే ‘‘ధనాన్ని’’ (స్పందనలను) పొందుతాడు. 

దినదినమూ ప్రవర్థమానమవుతూ పరిపుష్టమయ్యే అత్యంత విక్రాంతివంతమైన అంత: సమృద్ధినీ, యశస్కరమైన బాహ్యసమృద్ధినీ అగ్నణి అయిన అగ్ని వలననే మనం పొందగలుగుతున్నాము. 

నిజమైన వీరుడు దు:ఖాస్తిత్వాన్ని గుర్తించనివాడు. వీరవత్వం అంతే, ఆ వీరత్వాన్ని కలిగి వున్న ఆరూఢభావం అంటే దు:ఖాతీతత్వభావ. దు:ఖాన్ని అధిగమించడమన్నది అంత: సమృద్ధితోనే జరుగుతుంది. శౌర్యాన్ని ఉద్ధవగితలో స్వభావ విజయంగా శ్రీకృష్ణుడు నిర్వచించాడు. త్రిగుణాలకు లోబడ వుండడమన్నదే స్వభావం. దానిని జయించడమే నిజమైన శౌర్యమూ, వీర్యమూను. అంతృ:సమృద్ధి అంటే ఆత్మ తృప్తత్వం. స్వభావం కారణంగా సమృద్ధి అన్నది బయటనుంచి సంక్రమించేదన్న భావన మనందరిదీను. నిజానికి మన అంతస్సులో లేనిది లేనేలేదు. ఆ స్వభావాతీత సమృద్ధి మన అంతరంలో వ్యాప్తమై వున్న తేజేధనం (రయి) వల్ల రిసపుష్టమవుతుంది. అంత: సమృద్ధి వల్ల కలిగిన ప్రఖ్యాతే ప్రఖ్యాతి. 

 

4. అగ్నేయం యజ్ఞ మధ్వరం విశ్వత: పరిభూరసి !

స ఇద్దేవేషు గచ్ఛతి !!

అగ్నీ = హే అగ్నీ, యం యజ్ఞం, అధ్వరం విశ్వత: పరిభూ: అసి = జయాపజయ భావోద్యేగ హింసకు అతీతమైన ఏ సాధనా (క్రియా) యజ్ఞమార్గాన్ని నువ్వు అన్ని వైపులా, చుట్టూ వుండి (అప్రమత్తంగా పర్యవేక్షిస్తూ) వుంటావో; స: ఇత్ = ఆ క్రియా యజ్ఞమే; దేవేషు గచ్ఛతి = దేవతల పరిగణనలోకి చేరగలదు, దానినే మహాత్ములు మెచ్చకుంటారు. 

అగ్ని! (లాభనష్టాలనే మనో) హింసను విడనాడిన ఏ సాధన క్రియా యజ్ఞపథాన్ని చుట్టూ (కంచెలాగా) నిలిచి అంతటా నీవే యై పర్యవేక్షిస్తూ వుంటావో ఆ యజ్ఞమార్గమే మహాత్ముల పరిగణనలోకి చేరుతుంది. 

అగ్ని! నువ్వు యజ్ఞపథాన్ని చుట్టూ కంచెలాగా ఆవరించి ఫలలంపటత్వమనే సతత హింస నుంచి సంరక్షిస్తూ వుంటావు. అటువంటి యజ్ఞమే సృష్టిశక్తులను ప్రీతినిస్తుంది. దానినే ఆ దివ్యశక్తులు సత్కరించి స్వీకరిస్తాయి. 

 

5. అగ్నిర్ హోతా కవిక్రతు: సత్యశ్చిత్ర శ్రవస్తమ: !

దేవో దేవేభి రాగమత్ !!

హోతా = జ్ఞానవిజ్ఞానదాతలైన దేవతాశక్తులను పిలిచేవాడు; కవిక్రతు: = కవిలాగా సృజనాత్మక శక్తితోనూ, ఉపజతోనూ, సాధన క్రియలను నిర్వహించేవాడు; సత్య: = ఎల్లప్పుడూ మార్పుకు అతీతంగా వుండేవాడు; చిత్రశ్రవ: తమ: = కంటికి చిత్రమైన కాంతిశక్తినీ, చెవికి చిత్రమైన నాద శక్తినీ అతిశయంగా అందించేవాడు.. వైవిధ్యమైన చిత్ర ధ్వని చిత్రాలకు గొప్ప నెలవు అని పేరెన్నిక గన్నవాడు; అగ్ని: దేవ: = అటువంటి అగ్నిదేవుడు; దేవేభి: ఆగమత్ = తనసాటి దైవీశక్తులతో సహా రావాలి. 

జ్ఞానవిజ్ఞాన దాతలైన దివ్యశక్తులను ఆవాహనం చేసేవాడు, క్రాంతదర్శీ, క్రాంత శ్రుతీ అయిన కవితల్లజుడిలాగా సృజనాత్మక శక్తితోనూ, ఆత్మదారణా శక్తితోనూ, ప్రజ్ఞాపాటవంతోనూ, క్రియావ్యూహాలను రచించి నిర్వహించేవాడూ, ఎల్లప్పుడూ మార్పుకీ, పరిణామానికీ అతీతంగా నిలిచి వుండేవాడూ, వైవిధ్యభరితమైన వాక్స్పందనలకూ కాంతి స్పందనలకూ శబ్దచిత్రాలకూ మహా ఆలయమని ప్రసిద్ధికెక్కినవాడూ అయిన అగ్నిదేవుడు తన తోటి దైవీ శక్తులతో (ఈ జీవన యజ్ఞనిర్వహనానికి తోడుగా నిలవడానికి) రావాలి. 

No comments:

Post a Comment