వేదములచే పండితులచే ప్రస్తుతింపబడువాడును, మునులకు ధ్యేయమైనవాడును అగు ఆ పరమాత్మయే భక్తులకు హితమును గూర్చుటకై దశరథ పుత్రుడుగా, అయోద్యాపతియైన శ్రీరామచంద్రుడుగా అవతరించెను.
కాశీలో మరణించు ఏ ప్రాణినైనను నేను (శివుడు) రఘువరుని నామ మహిమ చేత ముక్తునిగా జేయుదును. ఈ చరాచరజగత్తునకు ఆయన ప్రభువు. సర్వ హృదయములను ఎఱిగినవాడు. యాదృచ్చికముగనైనను మనుష్యులు ఆయన నామస్మరణ చేసినచో అనేక జన్మల సంచిత పాపములును దగ్ధములగును. భక్తితో ధ్యానించువారు సంసార సముద్రమును గోష్పాదసదృశమైన దానినిగా సులభముగా దాటగలరు. భవానీ! ఆ పరబ్రహ్మయే శ్రీరామచంద్రుడు. ఆయన విషయమున ఎట్టి సందేహములకును తావులేదు. సందేహపడు వాని మనస్సు నుండి జ్ఞానవైరాగ్యాది గుణములన్నియు తొలగిపోవును.
భ్రమ నివారకములైన శివుని మాటలను విని, పార్వతీదేవి యొక్క సందేహములన్నియును తొలగిపోయెను. ఊహాజనిత దారుణ సంశయములు, తరతరములు మటుమాయమయ్యెను. శ్రీరాముని పాదపద్మములయందు ఆమెకు భక్తి విశ్వాసములు ఇనుమడించెను.
~రామచరితమానసం.
No comments:
Post a Comment