'జయ'హో!
**********
'జయ'హో జయలలితా!
నీవి అక్రమాస్తులట!
బంగారం వెండి రత్నాలు
వజ్రాలు చీరలు చెప్పులు
పొలాలు మేడలు కారులు
నవ్వొస్తోంది నాకు!
నీ ఒంటిమీద చీరే
నీదికాదు-అసెంబ్లీ సాక్షిగా!
ఎక్కడున్నావు ఇప్పుడు?
బోసిపోయింది అసెంబ్లీ!
నిన్నుచూసి నేర్చుకుంటారా
నేర్చుకోవాల్సింది ఎవరు?
పార్లమెంటు! అసెంబ్లీలు!!
అక్కడున్నారు వాళ్లంతా!
వాళ్లంతా నీ 'సహ'చరులు!
అక్రమంలేదు!సక్రమంలేదు!
మీ అందరిదీ ఒకే క్రమం!
కుంభకోణాల పరిక్రమం!
నీకంటే నాలుగు ఆకులు
ఎక్కువ చదివారు వాళ్ళు!
మీ అక్రమాలకు సాక్ష్యం
మా బజారులో 'గుగ్గిళ్ళు '
అమ్మేఎనభైయ్యేళ్ళఆదెమ్మ
సైలిల్ మీద ఆకుకూరలు
అమ్మేడెబ్భైయ్యేళ్ళప్పయ్య!
ఒకరా ఇద్దరా ఎందరో!
తిండికి గతిలేక
నలుగురూ కష్టపడ్డా
ఇల్లు గడవనివాళ్లు!
వస్తావా నీకు చూపిస్తాను!
నిన్నుచూసినేర్చుకునేవాళ్ళు
మాపేటల్లో ఎక్కడా లేరు!
వాళ్లంతా కష్టజీవులు
రోడ్ల వసతికూడా లేని
మురికి కూపాల్లో ఉన్నారు!
ఎందుకు? కోర్టులు! కేసులు!
ఇదంతా ఒక నటన!
అందరికీ అన్నీ తెలుసు!
వాళ్ళూ నీలాగే చస్తారు!
దేశాన్నేమీ బాగుచెయ్యరు!
మీరంతా ఇలాగే చావండి!
మేముకూడా చస్తాం కాని
మీ అంత గొప్పగా చావం!
తిన్నా తినకపోయినా మేం
మీ 'దయ'తో చచ్చిపోతాం!
నువ్వు నీ అనుయాయులు
నీ సహచరులు -పెద్దోళ్ళు!!
మాలాగా చస్తే ఎలాగ?
నీకంటే వారసులు లేరు!
వాళ్ళకు వారసులున్నారు!
వారసత్వ రాజకీయాలు!
వాళ్ళుమమ్మల్నిచంపాలిగా
తరతరాలుచస్తుంటారు!
మీరంతా అలాగే చావండి!
మాకష్టంమాకెప్పుడూఉంది!
***********
-తమ్మినేని అక్కిరాజు
16-2-2025
No comments:
Post a Comment