Tuesday, February 4, 2025

 💫💫💫
*ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఈ మూడూ ఒకే సత్యాన్ని బోధిస్తాయి కదా! మూడెందుకు?*
🤔🤔
సత్యం ఒకటే అయినా దాన్ని సాధించడానికి దారులు చాలా ఉంటాయి. మనిషి యొక్క మనస్సు రకరకాల దారులు చూస్తూంటుంది. ఒకేదారి అందరికీ నచ్చదు. అందువల్ల ప్రముఖులయిన ఆచార్యులు అలా మూడు మార్గాలు
చూపించారు. మార్గాలు వేరయినా చేరిది ఒకచోటికే. అయితే అద్వైతం మాత్రం వేరే చేరడం అనేది లేదు. అదే నువ్వు అంటుంది. అయినా ఈ విషయం తెలియాలంట ఉపనిషత్తుల పాఠం చదవాలి.

*ద్వైతం, అద్వైతం అనగా ఎమి?*

ఆత్మ పరమాత్మ విడిగా ఉంటే ద్వైతం, భేదం లేదు అంటే అద్వైతం. ఈ రెండు ముక్కలూ అర్థం కావడానికి శంకరుల ప్రస్థాన త్రయం, మధ్వాచార్యుల వారి భాష్యములూ చదవాలి. ఈ జీవితం చాలదు అవి ఒంట బట్టడానికి. అయినా భగవద్గీత చదవండి. కొంత తెలిసినట్టు భ్రమ కలుగుతుంది.

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మూడు మార్గాలను నిర్దేశించాడు వాటినే పరంపరలో ఆచార్యులు మనకి ఉపదేశించారు 


No comments:

Post a Comment